పది రోజుల నుంచి వేధిస్తున్న ఓ యువకున్ని మహిళా కండక్టర్ చెప్పుతో బుద్ధి చెప్పిన సంఘటన నల్గొండ బస్టాండ్ వద్ద సోమవారం జరిగింది.
నల్గొండ : పది రోజుల నుంచి వేధిస్తున్న ఓ యువకున్ని మహిళా కండక్టర్ చెప్పుతో బుద్ధి చెప్పిన సంఘటన నల్గొండ బస్టాండ్ వద్ద సోమవారం జరిగింది. భువనగిరి ప్రాంతానికి చెందిన రాంబాబు అనే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న యువకుడు కొన్ని రోజుల నుంచి ఆమెను ఫాలో అవుతున్నాడు. ఏ రూట్లో డ్యూటీ వేస్తే ఆ రూట్లో ఆమెను అనుసరిస్తున్నాడు. విషయాన్ని గమనించిన మహిళా కండక్టర్ ఆ యువకుడ్ని నల్గొండ బస్టాండ్ వద్ద చెప్పుతో కొట్టింది. స్థానికులు కూడా జోక్యం చేసుకుని ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు.