రాం గోపాల్ వర్మ మారిపోయాడా?
రాం గోపాల్ వర్మ మారిపోయాడా?
Published Sun, Mar 23 2014 11:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM
బంధాలు, అనుబంధాలు, సెంటిమెంట్లకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూరమని అభిమానులకు తెలిసిందే. అయితే అవన్ని రాంగోపాల్ జీవితంలో గతానికి మాత్రమే పరిమితమని తాజా సంఘటనలు చెబుతున్నాయి. రిలేషన్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని రాంగోపాల్ వర్మ తాజాగా పూర్తిగా మారిన మనిషిగా కనిపిస్తున్నారు. మోహన్ బాబు నటించిన 'రౌడీ' చిత్ర ఆడియో అవిష్కరణ కార్యక్రమంలో వర్మ చాలా భిన్నంగా కనిపించారు... ప్రవర్తించారు కూడా..
ఎప్పుడూ ఎవరిని పొగిడిన దాఖలాలేని ఆయన దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులపై ప్రశంసల వర్షం కురిపించారు. టికెట్ కొనడానికి డబ్బులేని రోజుల్లో దాసరి నారాయణ రావు శివరంజని సినిమాను ఏడుసార్లు చూశాను అని.. దాసరి క్యారెక్టరైజేషన్ప్ స్టడీ చేయడం వల్లనే రియలిస్టిక్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తాననే పేరు తనకు వచ్చిందన్నారు. దాసరి నారాయణను చూసి తాను చాలా స్పూర్తి పొందానన్నారు. అంతేకాకుండా నాకు ఎవరూ ఫ్రెండ్స్ లేరు .. నా మొట్టమొదటి ఫ్రెండ్ మోహన్ బాబు అని ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో వర్మ మాట్లాడటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మోహన్ బాబు లుక్, ఫెర్మార్మెన్స్ నావెల్టీతో 'రౌడీ' చిత్రంలో అన్నగారి పాత్రలో జీవించారని.. నా డైరెక్షన్ లో గొప్పతనం ఏమి లేదని వర్మ అన్నారు. మోహన్ బాబు తనపై నమ్మకాని ఉంచినందుకు ధన్యవాదాలని ఎన్నడూ లేని విధంగా ఆడియో కార్యక్రమంలో ఓ కొత్త వర్మ కనిపించారు.
వర్మ మనసులో దెయ్యాలు, గన్స్ ఉంటాయని ఫిక్స్ అయిన వారు ఆ ఒపినీయన్ మార్చుకోవాల్సిందే. ఎందుకంటే వర్మలో మానవత్వం కూడా ఉందనే కొత్త కోణం కనిపించింది. రౌడీ ఆడియో కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో హాజరుకావడం కూడా సినీ ప్రముఖులను ఆశ్చర్య పరిచింది. అవార్డులకు, సన్మానాలకు ఆమడ దూరముండే ఆయన రౌడీ ఆడియో కార్యక్రమంలో దండలు వేయించుకుని.. శాలువాతో సన్మానం చేసుకోవడం వర్మ ఆలోచన విధానంలో వచ్చిన మార్పే అని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు.
Advertisement
Advertisement