జేసీ..నోరు అదుపులో పెట్టుకో | jc mind your tongue | Sakshi
Sakshi News home page

జేసీ..నోరు అదుపులో పెట్టుకో

Published Sun, Mar 5 2017 11:28 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

జేసీ..నోరు అదుపులో పెట్టుకో - Sakshi

జేసీ..నోరు అదుపులో పెట్టుకో

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరచిపోయి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్‌ అహ్మద్‌ఖాన్, జిల్లా అధ్యక్షుడు ఫైరోజ్ విమర్శించారు.

– ఎమ్మెల్యే సీటు కోసం జగన్‌ ఇంటి చుట్టూ
  తిరిగిన వైనాన్ని మరచిపోయావా?
– తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నాయకులు
 
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి  ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరచిపోయి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్‌ అహ్మద్‌ఖాన్, జిల్లా అధ్యక్షుడు ఫైరోజ్ విమర్శించారు. ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల కోసం తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగిన రోజులను మరచిపోయావా అంటూ ప్రశ్నించారు. జేసీ బ్రదర్స్‌ను రాజకీయాల నుంచి వెలివేయాలని డిమాండ్‌ చేశారు. జేసీ సోదరులను వెనుకేసుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పుతారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement