జేసీ అరెస్ట్‌ దారుణం | Chandrababu Comments On JC Prabhakar Reddy Arrest | Sakshi
Sakshi News home page

జేసీ అరెస్ట్‌ దారుణం

Published Sun, Aug 9 2020 6:00 AM | Last Updated on Sun, Aug 9 2020 6:00 AM

Chandrababu Comments On JC Prabhakar Reddy Arrest - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి అరెస్ట్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతికి నిదర్శనమని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. ఇంకా ఏం పేర్కొన్నారంటే.. 

► విడుదలైన 24 గంటల్లోగా మళ్లీ అరెస్ట్‌ చేయడం కక్ష సాధింపు చర్య. 
► కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వైఎస్సార్‌సీపీ నేతలపై ఒక్క కేసూ నమోదు కాలేదు. 
► బహిరంగ సమావేశాలు పెట్టిన విజయసాయిరెడ్డి లాంటి వారినీ వదిలేశారు. 
► జేసీ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెడుతున్నారు.
► ప్రజాభిమానం ఉన్న నేతలను నియంతృత్వంతో అడ్డుకోలేరు. 
► సీఎం వైఎస్‌ జగన్‌ కక్ష సాధింపు చర్యలు నానాటికీ పెరుగుతున్నాయి. 
► టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారు.
► తమ వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. 
► అక్రమ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement