
ఎన్టీఆర్(Ntr)-ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఇదివరకే మొదలైపోయింది. కాకపోతే తారక్ చిత్రీకరణలో పాల్గొనలేదు. మరోవైపు నిన్నటి నుంచి రిలీజ్ డేట్ వాయిదా గురించి తెగ వార్తలొచ్చాయి. ఇలాంటి సందర్భంగా మూవీ టీమ్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ ఏంటది?
(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన)
'దేవర' తర్వాత తారక్.. 'వార్ 2' మూవీ (War 2 Movie) చేస్తున్నాడు. దీనితో పాటు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాకు ఓకే చెప్పారు. కొన్నిరోజుల ముందు ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ మొదలైంది. ఇప్పుడు ఏప్రిల్ 22 నుంచి తారక్ సెట్స్ లో అడుగుపెడతాడని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
అనుకున్నది అనుకున్నట్లే జరిగితే లెక్క ప్రకారం వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజయ్యే అవకాశముంది. అయితే ఈ తేదీకి రాకపోవచ్చని.. వచ్చే ఏడాది ఏప్రిల్ 9న మూవీ థియేటర్లలోకి రావొచ్చని మరికొన్ని రూమర్స్ వస్తున్నాయి. షూటింగ్ వేగాన్ని బట్టి రిలీజ్ డేట్ పై ఓ అంచనాకు రావొచ్చేమో!
(ఇదీ చదవండి: రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!)
