నవ్వుల పాంచ్‌ మినార్‌ | Raj Tarun Speech at Paanch Minar Teaser Launch Event | Sakshi
Sakshi News home page

నవ్వుల పాంచ్‌ మినార్‌

Published Mon, Apr 14 2025 12:13 AM | Last Updated on Mon, Apr 14 2025 12:13 AM

Raj Tarun Speech at Paanch Minar Teaser Launch Event

రమేశ్‌ కడుముల, రాజ్‌ తరుణ్, రాశీ సింగ్, మారుతి

‘‘పాంచ్‌ మినార్‌’ టీజర్‌ చాలా ఆసక్తిగా ఉంది. చూడగానే ఈ సినిమా మంచి సక్సెస్‌ సాధిస్తుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమా రాజ్‌ తరుణ్‌కి కూడా మళ్లీ బెస్ట్‌ స్టార్ట్‌ అవుతుందని నమ్ముతున్నాను. గోవింద రాజుగారు విజయం సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా తీశారు.  ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహించండి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. రాజ్‌ తరుణ్‌ హీరోగా రాశీ సింగ్‌ హీరోయిన్‌గా రామ్‌ కడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పాంచ్‌ మినార్‌’.

మాధవి, ఎమ్‌ఎస్‌ఎమ్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు దర్శక–నిర్మాతలు మారుతి, సాయి రాజేశ్, ఎస్‌కేఎన్, రైటర్‌ ‘డార్లింగ్‌’ స్వామి అతిథులుగా హాజరై, ఈ సినిమా విజయం సాధించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కచ్చితంగా ఆడుతుందని చెప్పడానికి కారణం మా దర్శకుడి కష్టం... ఆయన విజన్‌’’ అని తెలిపారు.

‘‘రాజ్‌ తరుణ్‌కు మంచి కమ్‌బ్యాక్‌ ఫిల్మ్‌ అవుతుంది’’ అని తెలిపారు రామ్‌ కడుముల. ‘‘పూర్తి వినోదాత్మక చిత్రం ఇది’’ అన్నారు చిత్రనిర్మాత ఎమ్‌ఎస్‌ఎం రెడ్డి, సమర్పకుడు గోవిందరాజు. ‘‘కష్టాల్ని కామిక్‌గా చెప్పే ఏ కథ కూడా నిరుత్సాహపరచదని ‘పాంచ్‌ మినార్‌’ నిరూపించబోతోంది’’ అన్నారు రచయిత అనంత శ్రీరామ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement