
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే రాజ్ తరుణ్‌పై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్నట్లు లావణ్య ప్రకటించినప్పటికీ వివాదం ఇంకా ముదురుతోంది. తాజాగా ఇవాళ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఉంటున్న ఇంటివద్దకు వెళ్లారు. దీంతో మనుషులను తీసుకొచ్చి తమపై దాడి చేశారంటూ లావణ్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో లావణ్య ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
రాజ్ తరుణ్ తల్లిదండ్రుల నిరసన
అయితే తమ ఇంట్లోకి తమను రావనివ్వడం లేదంటూ హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటిబయటే నిరసనకు దిగారు. లావణ్య ఉంటున్న ఇల్లు మా కుమారుడు రాజ్ తరుణ్‌దేనని తెలిపారు. రాజ్ తరుణ్ తన సొంత కష్టంతో ఇంటిని కట్టుకున్నాడని.. లావణ్య తమను ఇక్కడ ఉండనివ్వడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నా కొడుకు సినిమా లు తీసి కట్టుకున్న ఇళ్లని ఆయన పేరేంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు ఉండి కూడా మేము రెంట్‌కు ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రస్తుతం మేము నడవలేని స్థితిలో ఉన్నామని.. లావణ్య మా ఇంటిని పాడు చేస్తోందని ఆరోపిస్తున్నారు.
మా ఇల్లు మాకు కావ్వాలి: లావణ్య
మరోవైపు రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మా ఇల్లు మాకు కావాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇవాళ మధ్యాహ్నం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఒక 15 మందిని తీసుకొచ్చారని ఆరోపిస్తోంది. నన్ను జుట్టు పట్టుకుని ఇంట్లో నుండి బయటకి తీసుకొచ్చారని.. మా ఇంటి ముందు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని అంటోంది. మా తమ్ముడి పై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశారని.. రాజ్ తరుణ్ ప్రోద్బలంతోనే వాళ్ల పేరెంట్స్ మనుషులను తీసుకొచ్చి ఈ దాడి చేయించారంటూ ఆరోపణలు చేస్తోంది. ఇకపై రాజ్ తరుణ్‌ను ఇక వదిలి పెట్టనని.. 15 సంవత్సరాలుగా నేను ఈ ఇంట్లోనే ఉంటున్నానని లావణ్య చెబుతోంది. తాజా పరిణామాలతో సద్దుమణిగిందనుకున్న వివాదం టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.