పెద్దారెడ్డిపై దాడికి కుట్ర.. రాళ్లను సిద్ధం చేసిన జేసీ వర్గీయులు | AP High Court Given Permission Given To Kethireddy Pedda Reddy | Sakshi
Sakshi News home page

కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట.. జేసీకి షాక్‌

Published Fri, May 2 2025 7:41 AM | Last Updated on Fri, May 2 2025 10:25 AM

AP High Court Given Permission Given To Kethireddy Pedda Reddy

సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రకు తెరతీశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వెళ్లనున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో రాళ్లను సిద్ధం చేసి ఉంచారు. పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు ఇది పెద్ద కుట్రగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట.. జేసీకి షాక్‌
మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. 

రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలకు కోర్టు ఆదేశాలు 
గత 10 మాసాలుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. హైకోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లొచ్చు.. ప్రజలను కలుసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలను కోర్టు ఆదేశించింది. అలాగే, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లే క్రమంలో ఐదు వాహనాలకు మించి వెళితే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించింది. ఇక, హైకోర్టు ఆదేశాలతో త్వరలోనే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement