
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
ఉదయం కర్నూలు, మధ్యాహ్నం కళ్యాణదుర్గం, రాజంపేటల్లో ప్రచార సభలు
సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ 3 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. గురువారం తొలుత కర్నూలు సిటీలోని వైఎస్సార్ సర్కిల్‌లో ఎస్వీ కాంప్లెక్స్ రోడ్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు.
ఆపై మధ్యాహ్నం అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్‌లో, అక్కడి నుంచి అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని కోడూరు రోడ్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
