
చింతలపూడిలో టీడీపీ-జనసేన పార్టీలో ముసలం పుట్టింది.
సాక్షి, ఏలూరు జిల్లా: చింతలపూడిలో టీడీపీ-జనసేన పార్టీలో ముసలం పుట్టింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిపించిన టీడీపీని తామే ఓడిస్తామంటూ మాజీ డీసీసీబి చైర్మన్ కరాటం రాంబాబు హెచ్చరించారు.
టీడీపీ నేతలు జనసేన పార్టీ పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని నేతలు వాపోయారు. అన్ని గ్రామాల్లో.. జనసేన పార్టీకి, కేడర్‌కు సరైన ప్రాధాన్యత లభించడం లేదని సమావేశంలో ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయం అని జనసేన శ్రేణులు అంటున్నాయి. వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీ పార్టీని బతికించింది జనసేన పార్టీ అని గుర్తు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు.
