eluru
-
ఏలూరు జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జైలులో ఒక రిమాండ్ మహిళా ఖైదీ ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల కిందటే జైలుకు వచ్చిన ఆమె ఆదివారం ఉదయం చున్నీతో బ్యారక్‌లోని కిటికీకి ఉరి వేసుకుని మృతిచెందడం కలకలం సృష్టించింది. వివరాలు... ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసు (31)తో తెలంగాణలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శాంతికుమారి(29)కి 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. బోసుపై మార్చి 18న గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు.ఖమ్మం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 19న మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. శాంతికుమారి తన ప్రియుడు సొంగా గోపాల్‌తో కలిసి భర్త బోస్ హత్యకు కుట్ర చేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమెను మార్చి 24న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, జడ్జి రిమాండ్ విధించారు. మరోవైపు తన భర్తను చంపేస్తామని కొంతమంది రాజకీయ నాయకులు హెచ్చరించారని, ఆయనపై దాడి జరిగిన రోజే శాంతికుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త మృతికి, తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు తనను కేసులో ఇరికించారని శాంతికుమారి బాధపడుతున్నట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జైలు బ్యారక్‌లో కిటికీకి తన చున్నీతో ఉరి వేసుకుంది. వెంటనే జైలు సిబ్బంది ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించగా, వైద్యులు మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌లోని మార్చురీలో ఉంచారు. ఏలూరు జిల్లా జైలు అధికారుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, శాంతికుమారి ఆత్మహత్య నేపథ్యంలో మహిళా బ్యారెక్ వద్ద విధులు నిర్వహించిన హెడ్ వార్డర్ ఎల్.వరలక్ష్మి, వార్డర్ నాగమణిలను సస్పెండ్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్వీ స్వామి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. -
అంబరాన్నంటిన హోలీ సంబరాలు
-
హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తుండగా ప్రమాదం
-
ఎమ్మెల్యే చింతమనేనికి ఝలక్!
ఏలూరు టౌన్: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత మూడు పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో తమను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తమపై దాడి చేశాడని ఏలూరు త్రీటౌన్ పోలీసులకు శనివారం ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన నాగరాజు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వద్ద కారు డ్రైవర్‌గా ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిని ఏలూరు శివారు సీతారామపురం గ్రామంలోని పద్మావతి కళ్యాణమండపంలో జరుగుతున్న ఓ వివాహానికి కారులో తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చింతమనేని... నాగరాజును ఏరా అంటూ బూతులు మాట్లాడుతూ.. అసభ్యకరంగా తిడుతూ అతని తల్లిని సైతం దూషిస్తూ దుర్భాషలాడుతూ.. రాడ్డుతో దాడి చేశారు.దీంతో, పోలీసు అధికారులు విచారణ చేసి చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన అనుచరులు వట్టి నాగబాబు, కలిదిండి అనిల్ రాజు, మరికొందరిపై చర్యలు తీసుకోవాలని నాగరాజు ఫిర్యాదులో కోరారు. అలాగే.. ఎమ్మెల్యే చింతమనేని తమను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడి చేశారని పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామానికి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్‌బాబు, పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన మట్టా ప్రవీణ్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
లంచం ఇస్తేనే ఆక్వా సాగు.. అటవీ అధికారుల వీడియో వైరల్
-
బ్యూటీ పార్లర్లో మసాజ్‌లు
ఏలూరు టౌన్: ఏలూరు టూటౌన్ ప్రాంతంలోని బ్యూటీపార్లర్‌పై పోలీసులు మంగళవారం దాడులు చేశారు. బ్యూటీపార్లర్‌లో మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో టూటౌన్ సీఐ వైవీ రమణ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. గత కొంత కాలంగా ఎస్ఎస్ బ్యూటీ పార్లర్ పేరుతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నిర్వాహకుడు నాగార్జునతోపాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బ్యూటీ పార్లర్ పేరుతో నిర్వహించే ఈ సెంటర్లో బాడీ మసాజ్ చేస్తున్నారని, ఇతర ప్రాంతాలకు చెందిన యువతులను తీసుకువచ్చి ఇలాంటి పనులు చేయిస్తున్నారని సమాచారం. అదుపులోకి తీసుకున్నవారిలో విజయవాడకు చెందిన ఒక మహిళతోపాటు, యువతులు ఉన్నారు. దాడుల సమయంలో నిర్వాహకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ప్రతీ నెలా పోలీసులు దాడులు చేయకుండా ఒక వ్యక్తికి డబ్బులు చెల్లిస్తున్నానని, ఎందుకు దాడులు చేస్తున్నారంటూ ప్రశ్నించినట్లు సమాచారం. పోలీసులను మేనేజ్ చేసేందుకు రూ.30 వేలు నిర్వాహకుడి నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. పోలీసుల పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. గతంలోనూ అతనిపై ఏలూరు టూటౌన్ పరిధిలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు ప్రతీ నెలా డబ్బులు ఇవ్వాలంటూ పేకాట శిబిరాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారి నుంచి డబ్బులు వసూలు చేయటంలో అతను సిద్ధహస్తుడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏలూరు త్రీటౌన్ పరిధిలోనూ కొంత కాలం క్రితం పేకాట శిబిరాన్ని నిర్వహించగా, పోలీసుల ఒత్తిడితో మానుకున్నట్లు తెలుస్తోంది. -
కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
-
ఏలూరు : అంగరంగ వైభవంగా బాలోత్సవం (ఫొటోలు)
-
ఏలూరులో భారీ అగ్నిప్రమాదం.. 20 గుడిసెలు దగ్ధం
-
ఏలూరు: మంటల్లో దగ్దమైన నివాసాలు.. పలువురికి గాయాలు
సాక్షి, మండవల్లి: ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇళ్లలోకి దోమలు రాకుండా వెలిగించే అగర్బత్తి కారణంగా మంటలు చెలరేగడంతో 20 గుడిసెలు కాలిపోయి.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను వెంటనే కైకలూరు ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని మండవల్లి మండలం భైవరపట్నం ప్రత్తిపాడు స్టేజీ వద్ద 20 ఏళ్లుగా నెల్లూరుకు చెందిన కొంత మంది పిట్టలు కొట్టే వాళ్లు నివసిస్తున్నారు. స్థానికంగా ఉండే ఆక్వా చెరువులపై నాటు తుపాకీలతో పిట్టలను బెదిరిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. కాగా, శుక్రవారం రాత్రి 9.45 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ క్రమంలో అక్కడ గుడిసెలో నిద్రిస్తున్న షారుక్‌ఖాన్, వంశీ, అను, కార్తీక్, విక్కీలతోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒక బాలుడు, మరో మూడేళ్ల చిన్నారి ఉన్నారు.అయితే, పిట్టలను బెదిరించడానికి ఉపయోగించే మందుగుండు సామగ్రికి నిప్పు అంటుకోవడంతోనే పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దఎత్తున మంటలు, పొగతో పక్కనే ఉన్న 20 గుడిసెలకు క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్ధం వచ్చింది. ఎడిసిపడిన మంటల కారణంగా గుడిసెల్లోని వస్తువులు, పక్కనే ఉన్న వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.పత్తాలేని అగ్నిమాపక సిబ్బంది.. పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందుతున్నా వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెంటనే చేరుకోలేదు. ఆకివీడు నుంచి గంటన్నర తర్వాత వచ్చిన వాహనం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. 108 వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులను తరలించాల్సిన దుస్థితి నెలకొంది. -
మాట వినకుంటే ఉద్యోగం ఫట్
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఏళ్ల తరబడి కాంట్రాక్టుల పేరుతో పాతుకుపోయిన వ్యక్తులు రాజకీయ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము చెప్పిందే వేదంగా పనిచేస్తేనే ఉద్యోగంలో ఉంటారంటూ హుకుం జారీ చేస్తూ.. ఏ ప్రజాప్రతినిధి, అధికారీ తమను ఏం చేయలేరంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో దారుణాలు జరుగుతున్నాయని, తమ కుటుంబాల పోషణ, ఉపాధి కోసం భరించాల్సి వస్తోందంటూ మహిళా సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ కోసం కాంట్రాక్ట్ సిబ్బందిగా చేరితే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నామంటూ ఘొల్లుమంటున్నారు. సిబ్బంది అంతా కాంట్రాక్టర్ చేతుల్లో ఉంటారనీ.. తమ పరిధిలోకి రారంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసుల్లో పురోగతి కరువు ఏలూరు నగరానికి చెందిన ఓ దళిత మహిళ ఏలూరు జీజీహెచ్‌లో శానిటేషన్ సిబ్బందిగా చేరింది. కొన్నిరోజులు సాఫీగానే ఉండగా.. కాంట్రాక్ట్ విభాగంలోని కీలక వ్యక్తి, మరికొందరు కన్ను ఆమెపై పడింది. ఆమెను వేధింపులకు గురిచేయటం ప్రా రంభించారు. తమ మాట వినకుంటే రాత్రి డ్యూ టీలు వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పిలిస్తే రావాల్సిందేనంటూ వేధించటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో కేసును పురోగతి లేకుండా వదిలేశారు. ఇదే తరహాలో మరో ఇద్దరు మహిళలు కేసులు పెట్టేందుకు సిద్ధపడగా.. తమను ఎవరూ ఏమీ చేయలేరనీ, కేసులు పెట్టినా తమను టచ్ చేసేవారు లేరంటూ సదరు వ్యక్తులు బెదిరించారు. కుటుంబ పోషణకు ఈ పనిలో చేరామని, బయట తెలిస్తే పరువుపోతుందంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహస్య విచారణ చేయించాలిఏలూరు జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసే ఒక దళిత మహిళపై ఆస్పత్రిలో కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. ఇదే తరహాలో మరో మహిళను వేధించటంతో వారు పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది జరిగి ఏడాదిన్నర గడిచినా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఇప్పటికీ చర్యలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. జీజీ హెచ్లో చాలా కాలంగా పనిచేస్తున్న దళిత సి బ్బందిని సైతం వేధింపులకు గురిచేస్తూ వారిపై తప్పుడు ఆరోపణలు చేయించి ఉద్యోగాల్లో లే కుండా చేస్తున్నారని, అతడిపై రహస్య పోలీస్ వి చారణ చేయిస్తేనే మరిన్ని కీచక పర్వాలు వెలుగులోకి వస్తాయని బాధితులు అంటున్నారు. మాట వినకుంటే ఉద్యోగం ఫట్ జీజీహెచ్‌లో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో పలువురు పేద మహిళలు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించింది. శానిటేషన్‌లో 120 మంది వరకు మహిళలు ఉన్నారు. సెక్యూరిటీ విభాగంలో 56 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వారిలో 30 మంది వరకు మహిళలు ఉన్నారు. ఒక్కో సిబ్బందికి వేతనం రూ.16 వేల వరకూ ఉండగా కటింగ్‌లు పోను రూ.13 వేల వరకు చేతికి అందుతుంది. రెండు, మూడు రోజులు అనారోగ్యంతో విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నిలుపుకునేందుకు వేలల్లో సమరి్పంచుకోవాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులకు నచ్చితే రాత్రి డ్యూటీలు ఉండవని, టైమ్‌కు డ్యూటీకి రాకున్నా పర్వాలేదని, లేకుంటే జీతం కట్.. ఉద్యోగం ఊడటం ఖాయమని పలువురు ఆవేదన చెందుతున్నారు. -
కోడిపందాలో లేడీ బౌన్సర్..!
-
విజయవాడ- ఏలూరు హైవేపై ఘోర ప్రమాదం
సాక్షి, కృష్ణాజిల్లా: విజయవాడ- ఏలూరు హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చి కారు.. మరో కారు ఢీకొట్టింది. ముందు భాగంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఐదుగురి ప్రయాణీకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం తోషిబా విద్యుత్ కంపెనీలో పని చేస్తున్న శివప్రసాద్‌కు చెందిన కారుగా గుర్తించారు. గన్నవరం పిన్నమనేని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.మరో ఘటనలో...మరో ఘటనలో నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారిపై ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి మరో వాహన చోదకుడిని బలితీసుకున్నాడు. పట్టపగలు నడిరోడ్డు పై జరిగిన ఈ ఘటనలో వ్యక్తి మృతి దుర్మరణం చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఏలూరు రోడ్డుపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లి ప్రాంతానికి చెందిన బడుగు సోమయ్య (54) వ్యవసాయం చేస్తుంటాడు. ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె మమతతో కలసి కోర్టు పనుల నిమిత్తమై ద్విచక్రవాహనంపై విజయవాడ వచ్చారు. ఏలూరు రోడ్డు గుణదల నుంచి చుట్టుగుంట వైపు వెళుతుండగా వెనుకగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న సోమయ్య, మమత రోడ్డుపై పడిపోయారు. అంతటితో ఆగకుండా ఆ డ్రైవర్ తన ట్రాక్టర్‌ను ముందుకు నడిపాడు.ఈ ఘటనలో రోడ్డుపై పడి ఉన్న సోమయ్యపై ట్రాక్టర్ ఎక్కడంతో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మమత కొద్ది దూరంలో పడగా ముఖానికి, చేతులకు గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108 సహాయంతో బాధితులను వైద్యం నిమిత్తం గుణదలలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తరువాత సోమయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మమతకు ప్రాణాపాయం లేదని ఆమె కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సాంబశివరావును అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సోమయ్య కుమారుడు బడుగు దీపక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్ సాంబశివరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సాక్షి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కు అనూహ్య స్పందన
-
జనసేన నేతల అశ్లీల నృత్యాలు
-
ఏలూరు జిల్లా గన్నవరంలో తల్లి, కొడుకు దారుణ హత్య
-
పచ్చ బ్యాచ్ హల్చల్... డాక్టర్ హరి భగవాన్ పై దౌర్జన్యం
-
ఏలూరులో విషాదం.. స్కూటీపై క్రాకర్స్ తీసుకెళ్తుండగా పేలుడు..
సాక్షి, ఏలూరు: దీపావళి పండుగ వేళ ఏలూరు విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై బాణాసంచా తరలిస్తుండగా అవి ఆకస్మాత్తుగా పేలడంతో ఓ యువకుడు మృతిచెందాడు. దీంతో, స్థానికంగా విషాదకర ఛాయలు అలుముకున్నాయి.వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలో తూర్పు వీధి గౌరీ దేవీ గుడి వద్ద ప్రమాదం జరిగింది. పండుగ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై బస్తాలో బాణాసంచా తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ క్రమంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ఓ యువకుడు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న మరికొందరు గాయపడ్డారు. ఇక, గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
టీడీపీని మేమే ఓడిస్తాం.. జనసేన నేతల వార్నింగ్
సాక్షి, ఏలూరు జిల్లా: చింతలపూడిలో టీడీపీ-జనసేన పార్టీలో ముసలం పుట్టింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిపించిన టీడీపీని తామే ఓడిస్తామంటూ మాజీ డీసీసీబి చైర్మన్ కరాటం రాంబాబు హెచ్చరించారు.టీడీపీ నేతలు జనసేన పార్టీ పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని నేతలు వాపోయారు. అన్ని గ్రామాల్లో.. జనసేన పార్టీకి, కేడర్‌కు సరైన ప్రాధాన్యత లభించడం లేదని సమావేశంలో ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయం అని జనసేన శ్రేణులు అంటున్నాయి. వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీ పార్టీని బతికించింది జనసేన పార్టీ అని గుర్తు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. -
మంత్రి నాదెండ్ల టూర్.. కూటమిలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి,ఏలూరుజిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవ కేంద్రం వద్ద టీడీపీ, జనసేన నాయకుల మధ్య తోపులాట జరిగింది. చేబ్రోలులో మినుము విత్తనాలను మంత్రి చేతుల మీదుగా అందించడానికి పలువురు రైతులను అధికారులు గుర్తించారు.అయితే ఈ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ,జనసేన నాయకుల మధ్య వాగ్వాదం,తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తం కాకుండా ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. ఇదీ చదవండి: బాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు -
ఏలూరు జిల్లాలో చిరుత సంచారం
-
ఏలూరు జిల్లాలో చిరుత కలకలం
ఏలూరు జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లి శివారులో రెండ్రోజుల చిరుత పులి సంచరించింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను గుర్తించేందుకు స్థానికంగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.అయితే సోమవారం ట్రాప్ కెమెరాలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు గుర్తించారు. ఆ ప్రాంతం పాదముద్రలు సేకరించి రాజమండ్రి ల్యాబ్‌కు పంపించారు. అదే సమయంలో చితరు సంచరిస్తుందని, పరిసర ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. -
మృతదేహాలతో.. వ్యాపారం ? ..
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మార్చురీ దారుణాలకు కేంద్ర బిందువుగా మారింది..అనాథ శవాలే అక్కడి కొందరు సిబ్బందికి ఆదాయ వనరులుగా మారాయి. ఏలూరు జీజీహెచ్‌లో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అవినీతి బాగోతం బహిర్గతమైంది. పదిరోజుల కిత్రం జరిగిన ఓ ఘటనతో తీగ లాగితే.. డొంకంతా కదిలినట్లు..మార్చురీలో సాగుతున్న అక్రమ శవాల వ్యాపారం వెలుగులోకి వచి్చంది. ఈ ఆసుపత్రిలో అనాథ శవాలను భారీ రేటుకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరగా 8–10 అనాథ శవాలను ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం చెన్నై, బెంగళూరులోని ప్రైవేటు మెడికల్ కాలేజీలకు శవాలను భారీ రేటుకు విక్రయిస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్కో శవాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు వరకూ విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని అంబులెన్సుల ద్వారా అనాథ శవాలను తరలించేందుకు కేవలం అంబులెన్స్‌లకే రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తున్నారని సమాచారం. దీనిపై ఏలూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ విచారణ చేపట్టారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశిధర్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు నిర్ణయించారు. ఏడాదిన్నర కాలంలో ఏలూరు జీజీహెచ్‌లోని మార్చురీకి ఎన్ని అనాథ శవాలు పోస్టుమార్టం నిమిత్తం వచ్చాయి ?అనాథ శవాలను ఎవరైనా బంధువులకు ఇచ్చారా ? శవాలను పూడ్చిపెట్టారా ? లేక దహనం సంస్కరాలు చేశారా... ఇలా పలు అంశాలపై విచారణ చేపడుతున్నారు. -
పోలీసులపై చింతమనేని అనుచరులు దాడి
-
మద్యం షాపుల లాటరీ.. చింతమనేని అనుచరుల ఓవరాక్షన్
ఏలూరు జిల్లా: ఏలూరు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపైకి చింతమనేని అనుచరులు జులుం ప్రదర్శించారు. దరఖాస్తుదారుల మినహా ఇతర వ్యక్తులకు లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. చింతమనేని అనుచరులు.. పోలీసులను దాటుకుని లోపలికి దౌర్జన్యంగా వెళ్లేందుకు యత్నించారు.పోలీసులు చింతమనేని అనుచరులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. చింతమనేని అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై దుర్భాషలాడి దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను పోలీసులు నిలువరించడంతో.. చలసాని గార్డెన్లో జిల్లాకు సంబంధించి 144 దుకాణాలకు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. నంద్యాల: మద్యం షాపుల కేటాయింపులో టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఆత్మకూరు పరిధిలో మెజార్టీలు షాపులు కూటమి నేతలకు వచ్చేలా చేసుకున్నారు. 13 మద్యం షాపులకు 11 దుకాణాలను స్కెచ్ వేసి.. కూటమి నేతలు రాబట్టుకున్నారు.నంద్యాల: వ్యాపారి ముత్తుకు టీడీపీ నేతలు బెదిరించారు. లాటరీలో ముత్తుకు జూపాడుబంగ్లా మద్యం షాపు దిక్కింది. దీంతో ఆ మద్యం షాపును తమకు ఇవ్వాలని టీడీపీ నేతలు ముత్తుపై బెదిరింపులకు పాల్పడ్డారు.ప్రకాశం: ఒంగోలులో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. మద్యం టెండర్లు నిలిపేయాలని డిమాండ్ చేశారు. పూర్తి మద్యనిషేధం విధించాలాని నినాదాలు చేశారు.చదవండి: టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ‘‘బడ్జెట్ ప్రవేశపెడితే ఏ స్కీమ్‌కు ఎంత ఇస్తున్నారు, ఇచ్చిన హామీలకు దేనికెంత కేటాయింపులో చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అందుకనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కాలయాపన చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ప్రజలు.. తేడాను గమనిస్తున్నారు.. ‘‘గతంలో ప్రతి ఏడాది మనం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. ఏ పథకానికి ఎంతో బడ్జెట్ కేటాయింపుల్లో స్పష్టంగా చెప్పాం. క్యాలెండర్ ప్రకారం వాటిని విడుదల చేసి అండగా ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకూ, టీడీపీ పాలనకూ మధ్య తేడాను ప్రజలు గమనించారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరికి ఏం మంచి జరిగిందన్నదానిపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ వివరించారు.చంద్రబాబు అబద్ధాలు.. మోసాలుగా మారుతున్నాయి‘‘చంద్రబాబు అబద్ధాలు.. ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయి. చంద్రబాబు మోసాలపై రోజురోజుకూ ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. జగన్ పలావు పెడితే.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు. బిర్యానీ లేదుకదా.. ఉన్న పలావు పోయింది. సూపర్ సిక్సూ లేదు సూపర్ సెవెనూ లేదు. విద్యాదీవెన లేదు.. వసతి దీవెనా.. లేదు. ఇంగ్లీషు మీడియం చదువులూ దెబ్బతిన్నాయి, టోఫెలూ పోయింది. గోరుముద్ద కూడా పోయింది. ప్రజారోగ్య రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. వ్యవసాయం, పెట్టుబడి సాయం కూడా పోయిందిచంద్రబాబు సర్కార్‌లో ప్రతీదీ స్కామే....ఉచిత ఇన్సూరెన్స్ ఆచూకీ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోతున్నాయి. డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్. నాయుకుల దగ్గరకు వెళ్తే కాని పెన్షన్ రాని పరిస్థితి. పేరుకు ఇసుక ఉచితం అన్నారు.. కాని వైఎస్సార్సీపీ హయాంలో కన్నా, ఇప్పుడు ఇసుక రేటు అధికంగా ఉంది. మన హయాంలో ఇసుక సరసమైన ధరకే దొరికేది, ప్రభుత్వానికీ ఆదాయం కూడా వచ్చేది. వైఎస్సార్సీపీ హయాంలో నిల్వలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఇసుక దొరకడం లేదు, రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కపైసా కూడా రావడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్య నియంత్రణకు పెద్ద పీట వేశాం. అమ్మకాలను గణనీయంగా నియంత్రణలో ఉంచాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎక్కువ లిక్కర్ అమ్మాలి అన్న ధోరణితో వెళ్తోంది. ఇలా ప్రతీదీ స్కామే.ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!కేసులకు భయపడొద్దు....రాష్ట్రంలో ఎక్కడిపడితే అక్కడ క్లబ్బులు నడుస్తున్నాయి. మట్కా లాంటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. ఇది తప్పు అని ప్రజలు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. కేవలం నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజల తరఫున పోరాటాల్లో భాగస్వాములు కావాలి. కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. గొంతు నొక్కడానికి, అణచివేయాలన్న ధోరణితో కేసులు పెడుతున్నారు. వీటికి భయపడాల్సిన అవసరం లేదు’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నాలుగు నెలల్లోనే.. అన్నింటా విఫలం: వైఎస్ జగన్అన్యాయమైన పరిపాలన సాగుతోంది..‘‘నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నన్ను హింసించినట్టుగా ఎవ్వరినీకూడా చేసి ఉండరు. అయినా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం. కేసులు పెట్టడం మినహా వీళ్లు చేయగలిగింది ఏమీ లేదు. రెడ్‌బుక్ ఏదైనా పెద్ద విషయమా? అదేదో గొప్ప పని అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే ప్రతి ఒక్కరూ ఒక బుక్ రాసుకుంటారు. న్యాయం, ధర్మం అనేవి ఉండాలి. అన్యాయమైన పరిపాలన ఇవాళ కొనసాగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
దెందులూరు కూటమిలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి,ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు రూరల్ మండలం కొల్లేరు లంక గ్రామం పైడి చింత పాడులో పెన్షన్ పంపిణిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.జనసేన గ్రామ సర్పంచ్ ముంగర తిమోతిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. గ్రామ సర్పంచిని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలు లేదంటూ సచివాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గ్రామంలో తాము చెప్పింది జరగాలంటూ జనసేన సర్పంచిని బండబూతులు తిడుతూ పిడిగుద్దులు గుద్దారు. ఇరు పార్టీల నేతలు బాహబాహికి దిగటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొత్తులో ఉంటూ తమపై దాడి చేయడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
లైంగిక దాడి కేసులో బతికున్నంతకాలం జైలు
ఏలూరు (టూటౌన్): కుమార్తె వరుస అవుతున్న ఇద్దరు బాలికలపై లైంగికదాడికి పాల్పడిన మారుతండ్రికి బతికున్నంతకాలం యావజ్జీవ కా రాగార శిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద సోమవారం తీర్పు చెప్పారు. నిందితుడికి సహకరించిన బాలికల తల్లికి కూడా బతికున్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష వి ధించారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన పుట్ట విజయలక్ష్మి ఫణిరూప (38)కు ఇద్దరు కుమార్తెలున్నారు.విజయలక్ష్మి ఫణిరూప అదే గ్రామానికి చెందిన పుట్ట సతీష్ పవన్‌కుమా ర్ (42)ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో విజయలక్ష్మి ఫణిరూప ఇద్దరు కుమార్తెలపై సతీష్ పవన్‌కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు ఆమె కూడా సహకరించింది. ఇద్దరు బాధితుల్లో ఒక బాలిక 2023 జూలై 12న ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఇంద్ర శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. నిందితులు పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపను జూలై 14న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.విచారణలో పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపలపై నేరం రుజువు కావడంతో వారు బతికున్నంతకాలం జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.18 వేలు జరిమానా విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడికి సహకరించిన షేక్ సత్తార్, బీఎస్కే నాగూర్ హుస్సేన్ వలీ, దూబచర్ల వీణకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. -
వారణాసిలో ఏపీకి చెందిన అన్నదమ్ముల బలవన్మరణం
వారణాసి/ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా ఉంగటూరులోని నారాయణపురానికి చెందిన అన్న దమ్ములు వినోద్, లక్ష్మీనారాయణలు రియల్ ఎస్టేట్,ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపార నిర్వహణకు స్నేహితులు, స్థానికుల వద్ద అప్పులు చేశారు.అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, తమ డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు .అనంతరం ఏపీ నుంచి వారణాసికి వెళ్లారు. అక్కడ ఆంధ్రా ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకుని.. అందులోనే ఉంటున్నారు.ఇదీ చదవండి : ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమఈ తరుణంలో వ్యాపారంలో నష్టాలు, అప్పులు ఇచ్చిన వారిని నుంచి ఒత్తిడి పెరిగిపోతుందని, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. సెల్ఫీ వీడియోపై సమాచారం అందుకున్న వారాణాసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అన్నదమ్ములిద్దరు ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. అన్నదమ్ముల మృతిపై ఏపీలోని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వరద బాధితుల కోసం వంగా గీత సాహసం
కాకినాడ, సాక్షి: వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారంలో ఉన్న నేతలంతా తటపటాయిస్తుంటే.. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జి వంగా గీత (60) మాత్రం సాహసం ప్రదర్శించారు. వరద ఉధృతిని లెక్కచేయకుండా.. ట్రాక్టర్ ప్రయాణం చేసి బాధితుల దగ్గరకు చేరుకున్నారామె. బుధవారం వంగా గీత గోకువాడ, జమ్ములపల్లిలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో.. ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు వరద నీటిని ట్రాక్టర్‌పై దాటి వెళ్లారు. దాదాపు 10 కిలోమీటర్లపాటు ట్రాక్టర్పైనే ఆమె ప్రయాణం చేశారు. ఆమెతో పాటు కొందరు నేతలు వెంట వెళ్లారు. చివరకు.. ముంపు ప్రాంతాలకు చేరుకొని అక్కడి బాధితులను పరామర్శించారు. ‘‘గతంలో లేనంతా ఈసారి ఏలేరు వరద పిఠాపురాన్ని ముంచేసింది. వేలాది ఎకరాల వ్యవసాయ, ఉద్యానవన, సెరీ కల్చర్ పంటలు నీట మునిగాయి. అధికారులకు ప్రభుత్వానికి ముందస్తు అంచనా లేకపోవడం వల్లే ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చింది. ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు 15 టీఎంసీలు ఉన్నప్పుడే మిగులు జలాలను క్రమక్రమంగా విడుదల చేసి ఉంటే ఇంత వరద ముప్పు ఉండేది కాదు. .. ఏలేరులో 6 టీఎంసీల నీరు ఉన్నప్పుడే సాగు నీటికి, విశాఖ అవసరాలకు నీటిని వినియోగించుకున్నాం. వరద బాధితుల వద్దకు వెళ్ళి భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది. అధికారులను పంపించి ఆదుకోవాలి’ అని కోరారామె. ఎన్నికల ఫలితంలో సంబంధం లేకుండా.. తాను ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వంగా గీత చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఇంత సాహసం చేసి తమ దగ్గరకు పరామర్శకు వచ్చిన గీతకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారుపవన్, ఉదయ్‌లపై పిఠాపురం రైతుల ఫైర్ఏలేరు వరదలో తమ పంటలు గత నాలుగు రోజులుగా నీట మునిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌పై పిఠాపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ కనీసం మమ్మల్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే, ఎంపీ రాలేదు. పవన్‌ను గెలిపిస్తే పిఠాపురాన్ని ప్రపంచమంతా చూస్తుందని జబర్దస్త్ నటులు చెబితే ఆనందపడ్డాం. తీరా ఇప్పుడు ఏలేరు వరదలో పిఠాపురం నియోజకవర్గం మునిగిపోతే టీవీలలో ప్రపంచం చూస్తోంది. ఎకరాకు ఇప్పటి వరకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాం. వరద ముంపుతో పూర్తిగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోకపోతే కౌలు రైతులకు ఆహ్మహత్యే శరణ్యం’ అని పిఠాపురం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.చదవండి: తప్పు చేస్తున్నావ్ చంద్రబాబూ.. వైఎస్ జగన్ వార్నింగ్చదవండి: 'టీడీపీ ప్రభుత్వ అసమర్థతతోనే విజయవాడ వరద కష్టాలు' -
పొంగి పొర్లుతున్న వాగులు
-
ఏలూరు జిల్లాలో టీడీపీ అరాచకాలు
-
వందేభారత్‌కు ఏలూరులో హాల్ట్
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయం కల్పించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 25 నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఉదయం 9.49 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని, 9.50 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా 26 నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు సాయంత్రం 5.54 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని, 5.55 గంటలకు బయలుదేరి వెళుతుంది. -
ఏలూరులో దారుణం
-
ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో రోగుల కష్టాలు
-
కోర్టులో విడాకులకు దరఖాస్తు.. భార్యను నరికి చంపిన భర్త
కొయ్యలగూడెం: భర్తే కాలయముడై భార్యను కడతేర్చాడు. కత్తితో విచక్షణా రహితంగా నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సీఐ మధుబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామానుజపురం గ్రామానికి చెందిన రాజనాల సాయి లక్షి్మ(35)కి భర్త సూర్యచంద్రంతో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి విలాష్ సాయి, విశాల్ సాయి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారుగా పది సంవత్సరాల నుంచి వీరు నిత్యం గొడవలు పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సూర్యచంద్రంపై సాయి లక్ష్మి కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపివేశారు. అనంతరం ఇద్దరూ కోర్టులో విడాకుల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. సాయిలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా.. సూర్యచంద్రం ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని సాయి లక్ష్మి మెడపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా తన కుమార్తెను అల్లుడు సూర్యచంద్రం ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని, కొంతకాలంగా తన కుమార్తెను ఆడపడుచు, భర్త, అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నారని తల్లి నాగలక్ష్మి ఆరోపించింది. బిడ్డల్ని కూడా అల్లుడు చూసుకునేవాడు కాదని, కుమార్తె తన వద్దకు వచ్చి నిత్యావసర సరుకులు తీసుకువెళుతూ ఉండేదని తల్లి పేర్కొంది. తన చెల్లెలు మృతి వెనుక సూర్యచంద్రం తల్లిదండ్రులు, చెల్లి, బావ ఉన్నారని అన్న మృతురాలి అన్న సుబ్రహ్మణ్యం ఆరోపించాడు. దీనిపై మృతురాలి తల్లి, అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ సురేష్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వరద సాయం.. తూతూమంత్రం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అసలే ముంపు మండలాలు.. ఆపై గోదావరి ఉగ్రరూపం చూపితే.. వారి బతుకులు ఛిన్నాభిన్నమే. పునరావాస కేంద్రాలు, కొండ గట్లకు చేరుకుని రోజుల తరబడి ఉండిపోతారు. గోదావరి శాంతించాక బురదలోనే ఇళ్ళకు వెళ్ళి బాగుచేసుకుంటారు. తిప్పలుపడి చిన్నపాటి గుడిసెలు ఏర్పాటు చేసుకుంటారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఏటా వరద విలయం కొనసాగుతుండడతో.. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో వరద బాధితులను ఆదుకుంది. ప్రస్తుత ప్రభుత్వం వారిని ఆదుకుంటామన్న ప్రచారం తప్ప పూర్తి స్థాయిలో అందరికీ సాయం అందని పరిస్థితి. రేషన్ కార్డు అర్హతే ప్రామాణికం అంటూ వందల మందికి పరిహారాన్ని ఎగ్గొట్టారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో బాధితులు ఉన్నారు.50 శాతం మందికి అందని సాయంపెద్దవాగు ఉధృతి, గోదావరి వరదకు ఏలూరు జిల్లా వేలేరుపాడులోని 43 గ్రామాలు, కుక్కునూరులో ఒక గ్రామం దెబ్బతింది. అధికారులంతా అక్కడే ఉండాలని ప్రభుత్వం రెండు రోజులు హడావుడి చేసి ఆ తరువాత దాని సంగతి పూర్తిగా మరిచిపోయింది. వేలేరుపాడులోనే పెద్దవాగు దాటికి 12 గ్రామాలు, గోదావరి వరద ఉధృతికి 31 గ్రామాల్లో 18 వేల మందికి పైగా నష్టపోయారు. సుమారు 7200కు పైగా కుటుంబాలు నష్టపోయాయి. అత్యధిక శాతం మంది పునరావాస కేంద్రానికి వెళ్ళగా ఎక్కువ మంది కొండ గుట్లపైనే మకాం ఉన్నారు. వారికి భోజనం, వసతి మొదలుకొని కొవ్వొత్తుల వరకు సరిగా ఏదీ పంపిణీ జరగలేదు. ప్రతి కుటుంబానికీ రూ.3 వేలు సాయం అందిస్తామని ప్రకటించి, రేషన్ కార్డు ఉన్నవారికే సాయం అంటూ అనేక మందికి పరిహారం ఎగ్గొట్టారు. 25 కేజీల బియ్యం, కందిపప్పు, లీటరు నూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో పాటు కూరగాయలు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించి రెండు రోజులు హడావుడి చేశారు. 50 శాతం మందికి అందని పరిస్థితి.జగన్ పాలనలో అందరికీ సాయం..వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు గోదావరి వరద ముంపు మండలాల్లో పర్యటించారు. తక్షణ సాయం, నిత్యావసరాలు, నూరు శాతం అందించాలని ఆదేశించి క్షేత్రస్థాయిలో బాధితులకు భరోసా ఇచ్చారు. నష్టపోయిన కుటుంబాలే కాకుండా మండలాన్ని, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రతి ఇంటికీ పరిహారంతో పాటు నిత్యావసరాలు అందజేశారు. పునరావాస కేంద్రాల్లో రెండు పూటలా భోజనం, టిఫిన్లు, టీ ఏర్పాటుతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించాయి. ఈ సారి పునరావాస కేంద్రాలు సక్రమంగా నిర్వహించకపోవడం, అరకొర సౌకర్యాలు, ఇతర కారణాలతో ఏమీ పట్టించుకోలేదు.రేషన్ కార్డు ఉంటేనే..కళ్ళ ముందే నష్టం కనిపిస్తున్నా రేషన్ కార్డు కావాలని అడ్డగోలు నిబంధన పెట్టి కార్డు లేనివారికి రూ.3 వేల సాయం అందించలేదు. వాస్తవానికి వేలేరుపాడు మండలంలో 7200 కుటుంబాలకు పైగా నష్టపోయారు. అధికారుల అంచనా మాత్రం తక్కువగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం పెద్దవాగు వల్ల 12 గ్రామాల్లో 1647 కుటుంబాలు, గోదావరి వరద వల్ల 3278 కుటుంబాల నిరాశ్రయులయ్యారు. మొత్తం 4925 మంది వరద వల్ల నిరాశ్రాయులైనట్టు అధికారులు చెబుతున్నారు. పరిహారం మాత్రం 4025 కుటుంబాలకే ఇచ్చారు. మిగిలిన వారికి రేషన్‌కార్డులు లేకపోవడంతో పరిహారం తీసుకునే అర్హత లేదని తేల్చేశారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఇల్లు దెబ్బతింటే రూ.95 వేలు, గుడిసె దెబ్బతింటే రూ.10 వేలు పరిహారం అందించారు. ఇప్పుడు ఇంటి నష్టాలకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని పరోక్షంగా తేల్చారు. -
వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులు, బెయిల్ రాకుండా సెక్షన్లు మారుస్తున్నారు : పేర్ని నాని
ఏలూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలకు మంచి చేయడం మాని వైఎస్సార్సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పేర్నినానితోపాటు, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పరామర్శించారు. ఆనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.‘చంద్రబాబు సమావేశాల్లో అమరావతి, అభివృద్ధి, సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారు. కానీ తెరవెనుక జరిగేదంతా మట్టి, ఇసుక దోపిడీ, లే అవుట్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు. అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను జైలులో వేస్తున్నారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారు. టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు తిరగబడితే.. ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పటి వరకూ 71 మంది పేర్లను చేర్చారు. ఇంకా ఉన్నారని చెబుతున్నారు. గన్నవరం వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉన్నవారిని పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేయిస్తున్నారు. .. పోలీసులను అడ్డగోలుగా దిగజార్చి వాడుకుంటున్నారు. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారు. అరెస్టైన వారిలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడి తల్లి చనిపోతే దినం చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఏడాది క్రితం జరిగిన కేసులో ఒక్కొక్కరినీ చేరుస్తూ అరెస్ట్ చేస్తున్నారు.పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జైల్లో ఉన్నవారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పాం. అక్రమంగా అరెస్టైన వారి బెయిల్ కోసం పార్టీ ప్రయత్నిస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా జెండా వదిలిపెట్టేదిలేదని కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేసి టీడీపీ నేతలు సునకానందం పొందుతున్నారు. గతంలో కొడాలి నానికి కేన్సర్ అంటూ ప్రచారం చేశారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ వార్తలు వేసి శునకానందం పొందారు. వైఎస్సార్సీపీ కార్యాలయంపైకి బెజవాడ నుంచి గూండాలు దాడికి వస్తే.. వంశీపై అన్యాయంగా కేసు పెట్టారు. వంశీ న్యాయం కోసం పోరాడుతున్నారు. కచ్చితంగా బెయిల్ తీసుకుని వంశీ వస్తారు. టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రజాపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’అని అన్నారు. -
పోలవరం మట్టిన పందికొక్కుల్లా తినేస్తున్నారు
-
ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్..నా మనవరాలిని కాపాడండి..
-
టీడీపీ వేధింపులకు జనసేన నేత బలి
-
ఏలూరులో బస్సు ప్రమాదం, వేగంగా లారీని ఢీ కొట్టి..
ఏలూరు, సాక్షి: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ప్రయాణికులతో ఓ బస్సు వెళ్తోంది. అయితే ఏలూరు కలపరు టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఈ వేకువజామున బస్సు ఢీ కొట్టింది. వేగానికి బస్సు ముందు భాగంగా.. లారీలోకి చొచ్చుకుపోయింది. బస్సులోనే ఇద్దరు ప్రయాణికులు ఇరుక్కుపోగా.. ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే.. తన క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన ప్రయాణికుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల నుంచి మరింత సమాచారం అందించాల్సి ఉంది. -
ఏలూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్..రైతులకు భారీ నష్టం
-
ఏలూరు జిల్లాలో మంత్రి పార్థసారథికి చేదు అనుభవం
-
నాకు న్యాయం చేయాలి
ఏలూరు టౌన్: ఏలూరు జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న తనను అకారణంగా తొలగించారని అటెండర్ దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని.. లేకుంటే కుటుంబంతో సహా పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు తన భార్య, పిల్లలతో ఏలూరు సర్వజన ఆస్పత్రి వద్ద దుర్గారావు బుధవారం నిరసన తెలిపాడు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే ఉద్యోగాలు ఎలా తీసేస్తారంటూ అధికారులను నిలదీశాడు. తనతోపాటు మరికొందరిని కూడా తొలగిస్తామని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో దుర్గారావు ఔట్సోర్సింగ్ విధానంలో అటెండర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి ఏలూరు జీజీహెచ్ ఆరోగ్యశ్రీ విభాగంలోనే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే దుర్గారావును విధుల్లోంచి తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. తన కుటుంబంతో కలిసి ఆస్పత్రి వద్ద నిరసనకు దిగాడు. ఐదు నెలలుగా జీతాలు సైతం ఇవ్వలేదని, అప్పులు తెచ్చుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపాడు. ఇప్పుడు తనకు ఉద్యోగం కూడా లేకుంటే అప్పుల వాళ్లు తనను బతకనివ్వరని వాపోయాడు. తనకు ఉద్యోగం కావాలని, జీతం కూడా వెంటనే ఇప్పించాలంటూ పురుగుల మందు, పెట్రోల్‌తో ఆందోళనకు దిగాడు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే తనకు సరైన సమాధానం చెప్పడం లేదన్నాడు. ఈ విషయమై ఏలూరు జీజీహెచ్ ఆర్ఎంవో ప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా.. దుర్గారావుతో మాట్లాడి భరోసా ఇచ్చామన్నారు. రెండు, మూడు రోజుల్లోనే జీతాలు చెల్లించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
పాలకుల రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలి..
ఏలూరు (టూటౌన్): కేంద్రంలో, రాష్ట్రంలో వరుసగా అధికారంలోకి వస్తున్న పాలకులంతా రైతాంగ, ఆదివాసీ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎంకేఎస్ కన్వీనర్ సుబోధ్విుత్రా పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం(ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర మహాసభలు శనివారం ఏలూరులో ప్రారంభమయ్యాయి. సుబోధ్ మిత్రా ప్రారంభోపన్యాసం చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో ముందుగా రైతు కూలీ సంఘం పతాకాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆవిష్కరించారు.అనంతరం సుబోధ్ మిత్రా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడువేల గ్రామాలు భూస్వాముల పీడన నుంచి విముక్తి చేసి, పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసుకున్నారని గుర్తు చేశారు. దున్నేవాడిదే భూమి హక్కు కేంద్ర విధానంగా దేశంలో బలమైన రైతాంగ ఉద్యమం సాగాలన్నారు. అటవీ సంరక్షణ చట్టానికి సవరణల పేరుతో అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీలను తరిమేసి గనుల తవ్వకానికి, సహజ సంపదల దోపిడీకి కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలను పాలకులు వేగిరం చేస్తున్నారని, వీటిపై అవిశ్రాంత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ 1937 జూలైలో ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకూ సాగించిన రైతు రక్షణ యాత్రకు నాయకత్వం వహించిన జిల్లా రైతులు కొమ్మారెడ్డి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుల పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి దంతులూరి వర్మ.. గత మహాసభల నుంచి ఇప్పటి వరకు సాగిన రైతాంగ ఉద్యమంలో అమరులైన 750 మందికి జోహార్లు అర్పిస్తూ తీర్మానం చేశారు.ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ రైతుల హక్కుల సాధనకు ప్రాణాలైనా అర్పించి పోరాడాలని పిలుపునిచ్చారు. పాలస్తీనాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న హత్యాకాండలో మరణిస్తున్న వారికి మహాసభ సంతాపం తెలియజేసింది. ఏఐఎఫ్టీయూ(న్యూ) జాతీయ అధ్యక్షుడు గుర్రం విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి జె.కిషోర్‌బాబు, ఏఐకేఎంకేఎస్ ఒడిశా నేత శ్రీకాంత్ మొహంతి, తెలంగాణ నేత ప్రసాదన్న, కర్ణాటక నేత చాగనూరు మల్లికార్జునరెడ్డి, ఆహ్వాన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
-
భారీ భద్రతతో కౌంటింగ్ పై నిఘా
-
ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య..
ఏలూరు: ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్యకు గురైంది. ఆమెకు నిశ్చితార్థం కావడంతో ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె పనిచేస్తున్న కాలేజీకి సమీపంలోనే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఆపై తనూ గొంతు కోసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు యువకుడిని ఏలూరు సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. వివరాలివీ..సర్టిఫికెట్ల కోసమని వచ్చి..ఏలూరు ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కుల రత్నగ్రేస్ (22) సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేసింది. అక్కడే జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. ముసునూరుకు చెందిన తొట్టిబోయిన ఏసురత్నం (23) కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నట్లు సమాచారం. గురువారం మ.12.30 గంటల సమయంలో ఏసురత్నం తన డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చినట్లు తెలిసింది. రత్నగ్రేస్ తను పనిచేస్తున్న కాలేజీ సమీపంలోకి రాగానే.. ఆమెతో మాట్లాడేందుకు వచ్చానంటూ చెప్పి పక్కనే ఉన్న సందులోకి ఏసురత్నం ఆమెను తీసుకెళ్లాడు.పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తేవడంతో ఆమె నిరాకరించింది. ఇద్దరం చనిపోదామని చెబుతూ కత్తి తీసి కోసుకోవాలన్నాడు. కానీ, ఆమె వద్దని వారించడంతో ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఆమె జుట్టు పట్టుకుని గొంత వద్ద ఇష్టారాజ్యంగా పొడిచాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయింది. అక్కడికక్కడే విగత జీవిగా మారిన రత్నగ్రేస్ను చూస్తూ నిందితుడు కూడా పీక కోసుకున్నాడు. రక్తపు మడుగులో ఆమె పక్కనే పడిపోయాడు.ఏలూరు త్రీటౌన్ సీఐ కె. శ్రీనివాసరావు, ఎస్ఐ రామారావు çఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు విజయవాడలో వెంటిలేటర్‌పై ఉన్నట్లు సమాచారం. యువతికి ఈ నెల 26న వివాహ నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. ఆమె పనిచేస్తున్న విద్యాసంస్థలో తనతో పాటు ఫ్యాకల్టీగా పనిచేసే వ్యక్తితో వివాహం నిర్ణయించారని సమాచారం.ఎన్నిసార్లు వారించినా.. నిందితుడు ఏసురత్నం గతంలో తన కుమార్తెను ప్రేమ పేరుతో వేధించేవాడని.. తన కుమార్తెను వేధించవద్దని ఆమె తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతను లెక్కచేయకుండా తనను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడి వేధించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రత్నగ్రేస్, ఏసురత్నం ఇద్దరూ డిగ్రీలో కలిసి చదువుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల ఆమెకు నిశ్చితార్థం కావడంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో 17 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉందని.. ఇంతలో తమ కుమార్తె హత్యకు గురికావటంతో వారు భోరున విలపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఘటన వివరాలు సేకరిస్తున్నట్లు ఏలూరు త్రీటౌన్ ఇన్చార్జి సీఐ శ్రీనివాసరావు చెప్పారు. -
ఏలూరు జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో యువతి గొంతు కోసి..
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.వివరాలు.. ఏలూరు మండలం సత్రంపాడు ఎమ్మార్సీ కాలనీకి చెందిని జక్కుల రత్న గ్రేసి(22) ప్రైవేటు పాఠశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ తొట్టిబోయిన ఏసురత్నం(23) అనే యువకుడు వెంటబడుతున్నాడు. ఈ క్రమంలో ఈనె 26న మరో యువకుడితో గ్రేసికి కుటుంబ సభ్యులు నిశ్చితార్దం జరిపించారు.విషయం తెలుసుకున్న ఏసురత్నం.. కోపంతో యువతిని కలవాలని ఆమె ఇంటి పక్కకు పిలిచి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడిచేశాడు. తీవ్ర రక్తస్రావంతో యువతీ అక్కడికక్కడే మృత్యవాతపడింది. అనంతరం ఏసురత్నం కూడా పీక కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చింతమనేని గూండాగిరి
-
ఏలూరు లో ఘోరం..!
-
ఏలూరులో చల్లారని రగడ...
-
పూర్తయిన ఓటర్ స్లిప్పుల పంపిణీ
-
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
సాక్షి, విజయవాడ: ఏపీలో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో నల్లటి మేఘాలు కమ్మేసి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితలో లోతట్లు ప్రాంతాలన్నీ నిటమునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బైక్‌లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. దురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నెలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిసింది.ఉమ్మడి కృష్ణా జిల్లాలో అకాల వర్షం కురిసింది. నూజివీడు తరువూరు కైకలూరు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు సిటీ, కైకలూరు, కలిదిండి, ఆచంట ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయంగా మారాయి. ఏలూరుజిల్లా పోలవరం మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరి, మొక్క జొన్న పంటంతా వర్షపు నీటిపాలు అయ్యింది. రైతులు పరదాలు కప్పి పంట రక్షించుకుంటున్నారు.కృష్ణాజిల్లా :బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో అకాల వర్షం.ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం.ఉదయం నుండి భానుడి భగభగలతో అల్లాడిన జనం.భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.ఏలూరు జిల్లానూజివీడు డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం.మధ్యాహ్నం మూడు గంటలకు పట్టపగలే కారుమబ్బులు, నల్లని మబ్బులతో కమ్మేసిన ఆకాశం.అకాల వర్షంతో సేద తీరుతున్న నూజివీడు ప్రాంత ప్రజలు.అల్లూరి సీతారామరాజు జిల్లాచింతూరు,కూనవరం, విఆర్ పురం మండలాల్లో ఈదురుగాలల భీభత్సంపలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడిన విద్యుత్తు స్థంభాలు, వృక్షాలు. -
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్.. సునీల్ కుమార్ వాహనంపై దాడి!
సాక్షి, ఏలూరు: ఏపీలో ఎన్నికల వేళ పచ్చ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వాహనాన్ని చుట్టుముట్టి అద్ధాలు ధ్వంసం చేశారు.వివరాల ప్రకారం.. ఏలూరులోని లింగపాలెం మండలం రంగాపురం వద్ద వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడిక దిగాయి. జంగారెడ్డిగూడెం టౌన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకుని నూజివీడు నియోజకవర్గం ముసునూరు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశానికి చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ వర్గీయులే దాడి చేసినట్టు గుర్తించారు.కాగా, రంగాపురం గ్రామం మార్గంలో వెళ్తున్న సునీల్ కుమార్ వాహనాన్ని చూసి టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. సునీల్ కుమార్ వాహనాన్ని చుట్టిముట్టి టీడీపీ శ్రేణులు అద్ధాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పచ్చమూకల దాడి నుంచి సునీల్ కుమార్, అతని అనుచరులు చాకచక్యంగా తప్పించుకున్నారు.అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ..‘టీడీపీ, జనసేన శ్రేణులు నాపై దాడి చేశారు. రెండు కర్రలతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడి నుండి వచ్చేశాను. అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్నారు. హుందాగా రాజకీయాలు చేయాలి. కానీ మా సహనాన్ని పరీక్షించకండి. ఓడిపోతున్నామనే భయంతోనే మాపై దాడులకు పాల్పడుతున్నారు.దెందులూరు నియోజకవర్గంలో అయితే రోజూ అరాచకాలు సృష్టిస్తున్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో 150 కుటుంబాలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారి కోసం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వారి దాడిలో మాకు సంబంధించిన రెండు కార్లు ధ్వసం అయ్యాయి. దీనిపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశాము. వారు కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఇలాంటి చర్యలను నియంత్రించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగే రాజకీయాలు చేయకూడదు. తెలుగుదేశం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. టీడీపీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోంది. ఎన్ని కేసులు ఉంటే అంత గుర్తింపు అన్న రీతిలో లోకేష్ వ్యవహరిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు. -
పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)
-
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
-
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
-
14 ఏళ్ల ముఖ్యమంత్రిపై పవర్ ఫుల్ పంచులు..
-
జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన ఏలూరు..
-
రైతన్నకు మన ప్రభుత్వం చేసిన మంచి.. చంద్రబాబు ఎందుకు చేయలేదు?
-
చంద్రబాబు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పగలవా..!
-
పేదలకు - పెత్తందార్లకు మధ్య యుద్ధం
-
పేదలకు మంచి చేస్తుంటే వాళ్లు తట్టుకోలేక పోతున్నారు.. కూటమి గెలిస్తే పథకాలు ఆపేస్తారంట..!
-
సీఎం జగన్ రాక కోసం ఏలూరులో కిక్కిరిసిన రోడ్లు
-
పేదల గురించి మాట్లాడుతుంటే బాబుకు కోపం వస్తుంది: సీఎం జగన్
సాక్షి, ఏలూరు: బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. జగన్‌కు ఓటేస్తే.. సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ఆగిపోతాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కావు.. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నవని పేర్కొన్నారు. ఇది కులాల మధ్య యుద్దం కాదు.. క్లాస్ వార్ అని తెలిపారు. ఈ యుద్ధంలో ఓ వైపు పేదలు ఉంటే మరోవైపు పెత్తందార్లు ఉన్నారని అన్నారు.ఏలూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. సీఎం జగన్ ప్రచార సభకు ప్రజాభిమానం పోటెత్తింది. జై జగన్ నినాదాలతో ఏలూరు మార్పోగిపోయింది. ఈ సందర్భంగా సభకు హాజరైన జనసమూహాన్ని ఉద్ధేశిస్తూ సీఎం మాట్లాడారు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు.. అయిదేళ్ల భవిష్యత్త్ను నిర్ణయిస్తాయని చెప్పారు.. మంచి చేసిన జగన్ పేదల పక్షాన ఉన్నాడని తెలిపారు. పేదల పక్షాన ఉన్న జగన్‌ను చూసి బాబుకు కోపమొస్తుందని దుయ్యబట్టారు. తాను పేదల గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు కోపం వస్తుందని మండిపడ్డారు.సీఎం జగన్ ప్రసంగం..మన రాష్ట్రంలో దాదాపు 90 శాతం తెల్ల రేషన్‌కార్డు దారులే.కోటి 44 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.వీళ్లందరికీ పథకాలు అందాలంటే మీ జగన్‌కు తోడుగా ఉండాలి.కోటి 5 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్నారు.పొదుపు సంఘాల మహిళలు పేదలు కాదా, వారికి పథకాలు అందొద్దా? పేదలకు పథకాలు అందాలా లేదా?పిల్లల చదవుుల కోసం అమ్మ ఒడి తీసుకొచ్చి ప్రోత్సహించాం.93 శాతం మంది పిల్లలకు విద్యాదీవెనచ వసతి దీవెన అందుతోంది.ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం.అక్కాచెల్లెమ్మల కోసం అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ.మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం.అక్కాచెల్లెమ్మలకు 50శాతం నామినేటెడ్ పదవులిచ్చాం.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం.పెట్టుబడి సాయంతో రైతన్నకు అండగా నిలబడ్డాం.వాహన మిత్రతో ఆటోడ్రైవర్లకు తోడుగా ఉన్నాం.వాలంటీర్ వ్యవస్థతో పౌరసేవలుగ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు.గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం.నాడు, నేడుతో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చాం.సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం.పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం.59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలురద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా?ఇంటికోఉద్యోగం అన్నాడు ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?ఇప్పుడు మళ్లీ కొత్త మోసాలతో వస్తున్నాడు.. నమ్ముతారా?కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటాడు.. నమ్ముతారా?ఇలాంటి మోసగాళ్లు నమ్మొద్దు.. జాగ్రత్తగా ఉండండివాలంటీర్ల సేవలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి.పేదల భవిష్యత్ కోసం ఫ్యాన్ గుర్తు ఓటేయండి. -
Watch Live: ఏలూరులో సీఎం జగన్ ప్రచార సభ
-
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు.ఆ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్ సెంటర్లో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
ప్రగతి గోదావరి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం: పైరు పచ్చని సీమ ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రగతి బాటన పరవళ్లు తొక్కుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అద్భుత అభివృద్ధి సాధించింది. ఆక్వా వర్సిటీ, మెడికల్ కళాశాలలు, ఫిషింగ్ హార్బర్, వాటర్‌గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులెన్నో పశ్చిమ ముంగిట వాలాయి. పోలవరం ప్రాజెక్టు పనులు గాడిన పడ్డాయి. జిల్లా పునర్వి భజనతో ఏలూరు జిల్లా కొత్తగా ఆవిర్భవించింది. ఫలితంగా పాలన పల్లె ముంగిటకు చేరింది. ఆణి‘మత్స్యం’.. ఆక్వా వర్సిటీ తీరంలో మత్స్య ఎగుమతులు, మత్స్యసాగులో శాస్త్రీయ పద్ధతులు పెంచేందుకు నరసాపురం మండలం సరిపల్లి వద్ద మత్స్య యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.332 కోట్లతో 40 ఎకరాల స్థలంలో యూనివర్సిటీ పరిపాలన భవనం, హాస్టళ్లు, వీసీ చాంబర్ పనులు చేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లు యూనివర్సిటీకి ఖర్చు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్ష్మణేశ్వరం గ్రామంలో తుఫాన్ రక్షిత భవనంలో ఆక్వా కోర్సులు ప్రారంభించారు. బియ్యపుతిప్ప వద్ద రూ. 430 కోట్లతో ఫిషింగ్ హార్బర్, రూ.490 కోట్లతో వశిష్టగోదావరి వంతెన, అంబేడ్కర్ కోనసీమ జిల్లా విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు రూ. 1400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు పట్టాలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. సహజసిద్ధ ప్రవాహం మళ్లింపు పోలవరం ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా గాడిలో పెట్టి కరోనా కష్టకాలంలోనూ పనులు వేగంగా సాగేలా చేశారు. ప్రధా నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 48 స్పిల్ వే గేట్ల నిర్మాణం, స్పిల్ చానల్ ఎగువ, దిగువ డ్యాంలు, 2021 జనవరి 11 నాటికి పూర్తి చేసి 6.1 కిలోమీటర్ల గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. సహజసిద్ధ గోదావరి నది ప్రవాహాన్ని ఇంత భారీ ఎత్తున మళ్లించడం చరిత్రలో ఇదే ప్రథమం. తాడువాయిలో 3095 పునరావాస ఇళ్ళను ఒకేచోట మెగా టౌన్షిప్ మాదిరి రూ.488 కోట్లతో నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఏలూరు వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరుతోపాటు, పాలకొల్లు మండలంలో వైద్యకళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏలూరులోని వైద్య కళాశాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రూ.60 కోట్లతో అధునాతన భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమోదంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.525 కోట్లు. ► పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్లతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమ్మిలేరుకు ‘వాల్’జడ ఏలూరు నగరాన్ని తమ్మిలేరు ముంపు నుంచి రక్షించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2006లో తమ్మిలేరు ముంపుతో ఏలూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని రిటైనింగ్‌వాల్ నిర్మించాలని విన్నవించారు. వెంటనే ప్రతిపాదనలు తయారు చేయించి వైఎస్సార్ అనుమతులు మంజూరు చేశారు. ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 2019లో అంచనాలు సవరించి రూ.80 కోట్లతో ఆరు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. రెండో దశలో 2.5 కిలోమీటర్ల మేర రూ.55.50 కోట్లతో నిర్మాణం ప్రారంభించి 90 శాతానికిపైగా పూర్తి చేశారు. ఇతర అభివృద్ధి పనులు ► రూ.220 కోట్లతో నరసాపురంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, మండలాలకు ఉపయోగకరంగా రూ.113 కోట్లతో నిరి్మంచనున్న భారీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు టెండర్ దశకు చేరుకున్నాయి. ► భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో రూ.100 కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ► యనమదుర్రు డ్రెయిన్‌పై నిరి్మంచిన మూడు వంతెనలకు రూ.36 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా త్వరలో పనులు మొదలుకానున్నాయి. ► ఏలూరు జిల్లా చింతలపూడి– జంగారెడ్డిగూడెం మీదుగా రాజమండ్రికి అనుసంధానం చేస్తూ 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. జీలుగుమిల్లి– కొవ్వూరు మధ్య ఎన్‌హెచ్ 365 (బీబీ) రూ.605 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. రూ.124 కోట్ల వ్యయంతో 516 (డీ) జాతీయ రహదారిని కొయ్యలగూడెం– జీలుగుమిల్లి మధ్య అభివృద్ధి చేశారు. -
తెలుగు తేజం రమాదేవి...
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు! ఆమె తెలుగువారు కావడం విశేషం. ఆమే వి.ఎస్.రమాదేవి. అయితే ఆమె కేవలం 16 రోజులే ఆ పదవిలో కొనసాగారు. ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రమాదేవి సివిల్ సర్వెంట్‌గా కేంద్రంలో పలు శాఖల్లో పని చేసి సత్తా చాటారు. కేంద్ర న్యాయ శాఖ స్పెషల్ సెక్రటరీగా, లా కమిషన్ మెంబర్ సెక్రటరీగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పలు హోదాల్లో పని చేశారు. అనంతరం 1990 నవంబర్ 26న 9వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 16 రోజుల అనంతరం డిసెంబర్ 11న రిటైరయ్యారు. ఆమెకు ముందు గానీ, తర్వాత గానీ మరో మహిళ సీఈసీ కాలేదు. అలా ఏకైక మహిళా సీఈసీగా రమాదేవి రికార్డు నెలకొల్పారు. పదవీ విరమణ తర్వాత ఆమె హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక గవర్నర్‌గా చేశారు. కర్ణాటకకు తొలి మహిళా గవర్నర్ కూడా రికార్డు నెలకొల్పారు. ► కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు రెండో సీఈసీ కె.వి.కె.సుందరానిది. ఆయన 8 ఏళ్ల 284 రోజులు పదవిలో కొనసాగారు. ► ఆ తర్వాతి స్థానంలో తొలి సీఈసీ సుకుమార్ సేన్ ఉన్నారు. ఆయన 8 ఏళ్ల 273 రోజులు పదవిలో ఉన్నారు. -
ఏలూరు జిల్లా గణపవరం వద్ద సీఎం వైఎస్ జగన్ రోడ్ షో దృశ్యాలు
-
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమక్షంలో మంగళవారం పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల, శనగపాడు, కొళ్లికూళ్ల గ్రామాలకు చెందిన టీడీపీ, బీజేపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. అదేవిధంగా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామ వైఎస్సార్సీపీ మాజీ అధ్యక్షుడు ఆనంగి శ్రీనివారావు యాదవ్ ఇటీవల టీడీపీలో చేరారు. ఆయన తిరిగి ఉదయభాను సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. – సాక్షి నెట్వర్క్ ► విజయవాడ 11వ డివిజన్‌కు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు 100మందికి పైగా వైఎస్సార్సీపీలో చేరారు. వారికి వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ► పల్నాడు జిల్లా వినుకొండలో కొప్పుకొండ గ్రామ పంచాయతీ బ్రహ్మయ్య పాకాలు గ్రామానికి చెందిన 50 కుటుంబాలవారు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ► కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన 20 కుటుంబాలవారు వైఎస్సార్సీపీలో చేరారు. జనసేనకు చెందిన వీరందరికీ అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం నార్త్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో మెట్రేవు ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు బర్రి రమేష్ తన అనుచరులు సుమారు 25 మందితో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. ► పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో అత్తిలికి చెందిన తూర్పు కాపు సంఘ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో తూర్పు కాపు సంఘ నాయకులు, అత్తిలి రెండో వార్డు మాజీ సభ్యుడు ముల్లు సత్యనారాయణ, కిలాడి అప్పన్న, రెడ్డి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్, మండలంలోని గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన 40 కుటుంబాలవారు టీడీపీ, జనసేన పారీ్టలను వీడి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
తణుకు అర్బన్/మొగల్తూరు/కైకలూరు/ భీమవరం/పెనుగొండ/పాలకొల్లు అర్బన్/పోలవరం రూరల్/బు చ్చిరెడ్డిపాళెం రూరల్: ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో సోమవారం తణుకు 27వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ మెర్ల అనంతలక్ష్మి పద్మావతి, ఆమె కుటుంబ సభ్యులు మెర్ల వెంకట్రావు, మెర్ల రాంబాబు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. అదేవిధంగా టీడీపీకి చెందిన 80మంది కాపు నాయకులు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి కారుమూరి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ నాయకుడు నమ్మి వాసు, మహిళా నాయకురాలు తిరునాల శకుంతల ఆధ్వర్యాన టీడీపీ నాయకులు వర్థినీడి సూర్యచంద్రరావు, ఉజ్జిన సిద్ధయ్య, వీర్ని సూర్యప్రకాశరావు, వారి కుటుంబ సభ్యులతోపాటు ఏరపాటి రమణమ్మ, పాలాటి లక్ష్మి తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. వారిని మంత్రి కారుమూరి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం చింతరేవు ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు తిరుమాని ఏడుకొండలు తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. వారికి నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాదరాజు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహా్వనించారు. ► ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండల ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన మండల గౌరవ అధ్యక్షుడు పోకల దేవేంద్ర గోపాలకృష్ణ, మండల కార్యదర్శి నాగదేశి గణేష్‌బాబు, నాయకులు నర్రా ప్రభు, కారుమంచి యుగంధర్, ముదినేపల్లి మండల టీడీపీ నాయకులు అల్లాడి సతీష్‌బాబు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కైకలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహా్వనించారు. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామానికి చెందిన సుమారు వంద మంది టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో ములపర్రు గ్రామానికి చెందిన కాపు సంఘ నాయకులు, మారెమ్మ గద్దెకు చెందిన శెట్టి బలిజ నాయకులు భారీగా వైఎస్సార్సీపీలో చేరారు. ► పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వాలమర్రులో సర్పంచ్ గంటా సత్యనారాయణ, ఉప సర్పంచ్ దాసరి రమేష్ నాయకత్వంలో దళిత యువకులు సరిపల్లి సుదీప్, సరెళ్ల నివాస్, సరిపల్లి రమేష్, దాయం ఏసురత్నం, సబ్బితి భరత్‌కుమార్, సరెళ్ల శివాజీతోపాటు 30కుటుంబాలవారు పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసం పంచాయతీ పరిధిలోని బంగారంపేటతోపాటు పోలవరానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు దత్తి దేవి, కొవి్వడి పోశయ్య, కోటాబత్తుల రాంబాబు తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పెనుబల్లి గ్రామ టీడీపీ ఉప సర్పంచ్ గుమ్మ భాస్కర్ తన అనుచరులు 200 మందితో, కోవూరు నగర పంచాయతీకి చెందిన గిలకా కల్యాణ్, కనపరెడ్డి వేణు తమ అనుచరులు 200 మందితో కలిసి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పంచేడు గ్రామానికి చెందిన గారితోటి విజయ్, బి.కామేశ్వరరావు కూడా ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
నిమ్మగడ్డ పచ్చ బానిస..అవ్వా, తాతల గోడు తగులుద్ది
-
ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో కంటి పరీక్షలు
-
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గారపాటి చౌదరికి టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్
-
రెబల్ గా మారనున్న బీజేపీ నేత...పొత్తుకు మరో దెబ్బ
-
గారపాటికి షాక్..ఏలూరు బీజేపీలో ముసలం..సిన్ లోకి సుజనా చౌదరి
-
ఏలూరు ఎంపీ సీటుపై బీజేపీలో రగులుతున్న అసంతృప్తి
-
చింతలపూడి వంద పడకల ఆసుపత్రి పనులు వేగవంతం
-
Eluru: జనసేనలో ప్రకంపనలు.. జన సైనికులు నిరసన
సాక్షి, ఏలూరు: టీడీపీ, జనసేన ఉమ్మడి సభ నాడే జనసేనలో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులు నిరసనకు దిగారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభను ఏలూరు జనసేన నాయకులు బాయ్ కాట్ చేశారు. నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు పెట్టకుని నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు సీటు జనసేనకు కేటాయించాలని నినాదాలు చేశారు. మరోవైపు, తాడేపల్లిగూడెం తెలుగు జన విజయకేతనం సభకు కృష్ణాజిల్లా నేతలు డుమ్మా కొట్టారు. సభకు దూరంగా అవనిగడ్డ టీడీపీ శ్రేణులు ఉన్నారు. మండలి బుద్ధప్రసాద్‌కు టిక్కెట్‌పై స్పష్టత ఇవ్వనందుకు సభను టీడీపీ క్యాడర్ బాయ్ కాట్ చేసింది. పెడన టిక్కెట్ టీడీపీకి కేటాయించడంతో జనసేన నేతలు,శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉమ్మడి సభకు పెడన జనసేన నేతలు,కార్యకర్తలు డుమ్మాకొట్టారు. -
ఏలూరులో టీడీపీ జనసేన మధ్య మూడో వ్యక్తి చిచ్చు
-
గోదావరి కుర్రోన్ని ..నేను పక్కా లోకల్: ఏలూరు ఎంపీ ఇంఛార్జ్
-
మీరే సారథులు.. మీ జగన్ సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్
జరగబోయే ఎన్నికల రణ క్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు, మీ అందరికీ తోడు అర్జునుడిలా నేను.. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మన అస్త్రాలుగా మల్చుకుని, కౌరవ సైన్యం మీద యుద్ధం చేద్దాం. ఎన్నికల యుద్ధంలో మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి, అభివృద్ధి మీదే వాళ్ల దాడి ఉంటుంది. పేద వాడి భవిష్యత్, సంక్షేమం, గ్రామ గ్రామాన అభివృద్ధి, సామాజిక వర్గాల అభివృద్ధి మీద, మనందరి ప్రభుత్వం రాబోయే తరం కోసం అమలు చేస్తున్న విద్యా విధానం మీద ఈ పెత్తందారులు దాడి చేస్తున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు–నేడుతో మారుతున్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ దండయాత్ర చేస్తోంది. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి చెండాడటానికి మళ్లీ మనం సిద్ధమవుదాం. మేనిఫెస్టో రిలీజ్ చేయడం, తర్వాత మోసం చేయడం, దాన్ని చెత్తబుట్టలో పడేయడం.. సంప్రదాయంగా వస్తోంది. మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. మేనిఫెస్టోను చూపించి 99 శాతం వాగ్దానాలను అమలు చేసింది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇవన్నీ కనిపిస్తున్నా, కళ్లుండీ ఈర్ష్యతో చూడలేని కబోదులు టీవీ చానళ్లు, పేపర్ల రూపంలో ఉన్నాయి. మనల్ని తిట్టే వాళ్ల నోరు మంచిది కాదు. వాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. అబద్ధాల పునాదుల మీద వారు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా అన్నదే కొలమానంగా తీసుకోవాలి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్‌ను మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమా? పేదల భవిష్యత్‌ను, పేదలని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి ప్రతి ఒక్కరూ సిద్ధమేనా?’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అశేష జనవాహినిని ప్రశ్నించారు. పేదల భవిష్యత్తును, సంక్షేమాన్ని నిర్దేశించే ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి గడపకూ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి, అందులో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చిన తరుణంలో ఈ ఎన్నికల సంగ్రామానికి మీరే సారథులు అని స్పష్టం చేశారు. మంచి కొనసాగాలంటే మళ్లీ మనందరి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభలో పాల్గొని ప్రసంగించారు. రామాయణం, మహాభారతం.. ఈ రెండింటిలో ఉన్న విలన్లంతా.. ఓ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి రూపంలో, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టుల రూపంలో ఉన్నారన్నారు. ఇంత మంది తోడేళ్లలా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకుని రెడీగా ఉన్నారని చెప్పారు. ‘వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుందంటే.. ఇన్ని తోడేళ్ల మధ్య జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు. కానీ ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్‌కు మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ గుండెల్లో ఉంచుకున్నారన్నదే నిజం. జగన్ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఎల్లో పత్రికలు, టీవీలు, పొత్తుల సైన్యం తోడుగా ఉంటే నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న ఆ దేవుడు, నన్ను గుండెల్లో పెట్టుకున్న మీరు. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకంతో పుట్టిన సైన్యం. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారు అంటే వాళ్ల స్పందన, ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న నా అన్నదమ్ములు, అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యమే నిదర్శనం’ అని అన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. 14 ఏళ్లు సీఎంగా ఉండీ ఏం చేశారని అడగండి ► గోదారమ్మ సీమలో నిలబడి మనకు, ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించడానికి మీ వద్దకు వచ్చాను. ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామంలో మనం తెచ్చిన మార్పు, లంచాలు, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ, చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం.. వీటన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేరాఫ్ అడ్రస్. ఈ మాటను ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పడానికి, కావాల్సినన్ని అంశాలు పంచుకోవడానికి, తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు.. 25కు 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు మీ వాడిగా, మీ ముందుకు వచ్చి నా మనసు పంచుకుంటున్నా. నా మాటలు అన్నింటినీ ప్రతి ఇంటికీ తీసుకువెళ్లి ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. ► 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజల కోసం ఏం చేశాడు? అని గ్రామాల్లోకి వెళ్లినప్పుడు అమ్మ, అక్క, అన్న, తమ్ముళ్లను అడగండి. గత 10 ఏళ్లుగా వారి బ్యాంకు అకౌంటు వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. ఆ పదేళ్లు.. అంటే చంద్రబాబు 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో 5 సంవత్సరాలు.. బ్యాంకు అకౌంటు వివరాల్లో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడిందన్నది వారినే చూడమనండి. 1994, 1999, 2014లో ఇచ్చిన టీడీపీ మేనిఫెస్టోలో ఏనాడైనా 10 శాతం అమలు చేశాడా అని అడగండి. ఈ మార్పును ప్రతి ఇంటా వివరించాలి ► మీ బిడ్డ జగన్ 57 నెలల్లో ఏం చేశారనేది ప్రతి ఇంట్లో వివరించండి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామం తీసుకున్నా, అభివృద్ధి కళ్లకు కనిపిస్తుంది. విలేజ్ సెక్రటేరియట్.. పట్టణంలో వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది. సచివాలయాల ద్వారా 540 రకాల సేవలు అందిస్తూ, 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ప్రతి నెలా 1వ తేదీ ఉదయాన్నే ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి.. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు.. ఇలా ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరించి, వారి చేతిలో 3 వేల పెన్షన్ పెడుతున్నది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ► లంచాలు, వివక్షకు నాటి జన్మభూమి కమిటీలు మారుపేరు. ఈ రోజు ఏ గ్రామంలో కూడా అలా లంచాలు, వివక్ష లేకుండా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తెచ్చింది మీ జగనే. డీబీటీ ద్వారా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతున్నదీ మీ జగన్, మీ ప్రభుత్వమే. మీ గ్రామంలో గవర్నమెంట్ బడి, ప్రభుత్వ ఆస్పత్రి మారటానికి నాడు–నేడు చేసినది, చేస్తున్నది మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లిషు మీడియం, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్కులు, చిన్నారుల చేతుల్లో ట్యాబ్‌లు, డిజిటల్ బోధన, క్లాస్ రూముల్లో ఐఎఫ్‌పీలు, సీబీఎస్ఈ, ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగనే. ► రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయి పట్టుకుని నడిపించేదీ మీ వైఎస్సార్సీపీనే. పేదలు, రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద, 22ఏ భూములు 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది మీ జగనే. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ ఈ 57 నెలల్లో అందించిన రూ.2.55 లక్షల కోట్లలో ఏకంగా 75 శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశంలోనే రికార్డు సృష్టించింది మీ జగన్ ప్రభుత్వమే. ► నామినేటెడ్ పోస్టులు, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డులు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు చట్టం చేసి మరీ ఇచ్చింది మీ ప్రభుత్వమే. కేబినెట్లో 68 శాతం మంత్రి పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు దక్కాయి. నలుగురికి డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్ పర్సన్ మొదలు.. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ కనీవినీ ఎరుగని రీతిలో, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందీ మీ బిడ్డ జగన్ పాలనలోనే. 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ► గత ప్రభుత్వ హయాంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే.. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. అందులోనూ 80 శాతం నేను నా.. నా.. అని పిలుచుకొనే నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు కనిపిస్తున్నారు. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులుగా చేయాలని, వారికి గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిందీ మీ జగనే. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నదీ మన ప్రభుత్వమే. అక్కచెల్లెమ్మలు పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు వారికి తోడుగా ఉంటూ.. అమ్మ ఒడి, పిల్లలకు అండగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన, అక్కచెల్లెమ్మలకు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, దిశ యాప్.. మొత్తంగా మహిళా సాధికారత.. ఇవన్నీ మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ► ప్రతి గ్రామంలో ఇవాళ ఒక మహిళా పోలీస్, విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఆ గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్ వచ్చారు. ప్రతి ఇంట్లోనూ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ, వైద్యం చేసి, మందులిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే. 108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు తీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది మీ బిడ్డ హయాంలోనే. ► రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నాలుగు సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, కొత్త ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉన్న చోట విస్తరణ పనులు జరుగుతున్నాయి. పారిశ్రామిక కారిడార్లలో ఉరుకులు పరుగులతో పనులు జరుగుతున్నాయి. పారిశ్రామిక వేత్తలతో పాటు సంస్థలు మన రాష్ట్రం వైపు లైను కడుతున్నాయి. ఈ వాస్తవాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. 2019లో మనం అధికారంలోకి రాకపోయింటే ఇవన్నీ సాధ్యమయ్యేవా? ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిæలంచాలు లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందుతున్నది ఒక్క జగనన్న పాలనలోనే దేశానికే చూపించగలిగాం. ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ ► ఈ ఎన్నికలు ఎంత ముఖ్యం అనేది ప్రతి అవ్వాతాతకు, అక్కాచెల్లెమ్మకు, అన్నదమ్ములందరికీ చెప్పాలి. కేవలం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకొనే ఎన్నికలు కావు. 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించనున్న ఎన్నికలని ప్రతి ఇంట్లో వివరించాలి. ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి ప్రాంతం భవిష్యత్, రైతన్న భవిష్యత్, అక్కచెల్లెమ్మల సంక్షేమం, ఇంటింటా అభివృద్ధి, పిల్లల భవిష్యత్ అన్నీ ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని గమనించండి. చదువు, వైద్యం కోసం పేదవాడు అప్పులపాలు కాకుండా ఉండాలన్నా అది మనందరి ప్రభుత్వమే ఆ పని చేయగలదని ఇంటింటికీ వెళ్లి చెప్పండి. ► అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు అందుకుంటున్న వారు, ఇలా ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలని చెప్పండి. బయటకొచ్చి ప్రతి ఒక్కరూ కనీసం 100 మందితో జరుగుతున్న మంచి గురించి చెప్పాలని వివరించండి. మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, సొంతిల్లు.. ఇవన్నీ కొనసాగాలంటే అక్కచెల్లెమ్మలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పండి. రైతు భరోసా కొనసాగాలన్నా, ప్రతి రైతన్నకూ మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ దొరకాలన్నా, పగటిపూటే ఉచిత విద్యుత్, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర అందాలన్నా.. కేవలం జగనన్న మాత్రమే చేయగలడని.. ప్రతి రైతన్న స్టార్ క్యాంపెయినర్ కావాలని చెప్పండి. -
57 నెలలో మీ బిడ్డ 124 సార్లు బటన్ నొక్కాడు
ఏలూరు, సాక్షి: వచ్చే ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్ణయించేవని..కాబట్టి జరిగిన మంచిని వంద మందికి చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కేడర్‌కు పిలుపు ఇచ్చారు. శనివారం ఏలూరు దెందులూరులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభకు హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానుల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నికలప్పుడు కొందరు పెద్దపెద్ద వాగ్దానాలు చేస్తారు.. మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత చెత్త బుట్టలో పడేస్తారు. అది వాళ్లకు అలవాటైన పనే. అయితే 99 శాతం హామీల అమలుతో మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చేందే మీ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వం. కళ్లుండి.. ఈర్ష్యతో చూడలేని కబోదిలు.. ఏమంటున్నారో అంతా వింటున్నారు. వాళ్లకు ఎక్కువ టీవీ చానెల్స్, పేపర్లు ఉన్నాయి. కాబట్టి తిట్టేవాళ్లు ఎక్కువే. వాళ్ల నోళ్లు మంచివి కావు. .. అబద్ధాల పునాదుల మీద వాళ్ల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఎన్నికలు ఎందుకు ముఖ్యమో.. అవసరమో.. ప్రతీ ఒక్కరికీ మీరే(పార్టీ కేడర్‌ను ఉద్దేశించి..)చెప్పాలి. ‘‘కేవలం ఒక ఎమ్మెల్యే, ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాదు. ప్రతీ ఒక్కరూ ఈ విషయం గమనించండి. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఈ 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలివి’’ ప్రతీ ఒక్కరికీ చెప్పాలని పార్టీ కేడర్‌కు సీఎం జగన్ సూచించారు. ఇప్పటికే రూ. 3 వేలు చేసిన పెన్షన్.. 1వ తేదీ ఉదయాన్నే ఈ 3 వేల పెన్షన్ అందాలన్నా, భవిష్యత్‌లో ఇది పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా.. భవిష్యత్ లో పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, మీ ఊరికే మీ ఇంటికే వైద్యం అందాలన్నా, వైద్యం కోసం ఏ పేదవాడూ అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదన్నా, అది మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ఇంటింటి వెళ్లి చెప్పండి. ఇదిజరగాలి అంటే ఇందుకోసం మన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు అందుకుంటున్న వారు ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పండి. బయటకొచ్చి ప్రతి ఒక్కరూ కనీసం వంద మందితో జరుగుతున్న మంచి గురించి చెప్పాలి. మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. అక్కాచెల్లెమ్మలకు అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం కొనాగాసాలన్నా, సున్నా వడ్డీ రావాలన్నా, ఆసరా తు.చ.తప్పకుండా చెల్లించిన మీ అన్న ప్రభుత్వమే ఇవన్నీ చేయగలదు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఆ అక్కచెల్లెమ్మలే మన స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. కనీసం 100 మందికి అయినా చెప్పి ఓటు వేయించాలి, మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలని చెప్పండి. .. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి మనం ప్రారంభించిన 22 లక్షల ఇళ్ల నిర్మాణంతోపాటు పేద అక్కచెల్లెమ్మలకు సొంతింటి కల నెరవేరాలన్నా, మహిళా సాధికారతకు ఏ మంచిజరగాలన్నా మీ అన్న ప్రభుత్వమే చేయగలదు, మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని చెప్పండి. గవర్నమెంట్ బడులు మారాలన్నా, ఇంగ్లీషు మీడియం చదువులు రావాలన్నా, ప్రతి క్లాస్ రూములో డిజిటల్ బోధనతో మొదలు,ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు రావాలన్నా, పెద్ద చదువులు 100 శాతం ఫీజు రీయింబర్ష్ మెంట్ ఇచ్చే విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వాలన్నా, అంతర్జాతీయ చదువులు అందాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పండి. పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి అండగా ఉండాలని, 100 మందికి చెప్పాలని, మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతి తల్లిదండ్రులకూ చెప్పండి. గ్రామాల్లో ప్రతి రైతన్నకూ చెప్పండి. రైతు భరోసా కొనసాగాలన్నా, ప్రతి రైతన్నకూ మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, సీజన్ ముగిసేలోపే ఆ రైతన్నకు ఇన్ పుట్ సబ్సిడీ దొరకాలన్నా, పగటిపూటే ఉచిత విద్యుత్, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర అందాలన్నా కేవలం జగనన్న మాత్రమే చేయగలడు అని ప్రతి రైతన్నకూ వెళ్లి చెప్పండి. ప్రతి రైతన్న స్టార్ క్యాంపెయినర్ కావాలని, మరో 100 మందికి జరిగిన మంచి చెప్పాలని అడగండి. ఈ 57 నెలల్లో ఏకంగా మీ బిడ్డ 124 సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం, లంచాలు లేవు, వివక్ష లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనందరి ప్రభుత్వం 2.55 లక్షల కోట్లు పేద కుటుంబాలకు పంపింది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని, ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని, మరో 100 మందికి జరిగిన మంచి చెప్పాలని, గడపగడపకూ వెళ్లి కోరండి. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ జగనన్న 124 సార్లు మనకోసం బటన్ నొక్కాడు, జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి.. రెండు బటన్లు నొక్కలేమా అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. జగనన్నకు ఓటు వేయకపోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే దాని అర్థం, ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఈరోజు నెల 1వ తేదీన పొద్దున్నే చిరునవ్వుతో ప్రతి అవ్వాతాత, ప్రతి అన్న తమ్ముడు, చెల్లెమ్మకూ ఇంటి వద్దకే వచ్చి సేవలు అందుతున్నాయి. ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే దాని అర్థం మళ్లీ లంచాలు, మళ్లీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్లీ బతికించినట్లవుతుందని ప్రతి ఇంట్లోకి వెళ్లి చెప్పండి. మన గ్రామంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అంటే జగనన్నను మర్చిపోకూడదు, 124 సార్లు బటన్ నొక్కాడు, ఆయన కోసం రెండు బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఆ ఇంటికే పెన్షన్ రావాలన్నా, డీబీటీ స్కీములు రావాలన్నా జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి, మన వైఎస్సార్ సీపీ కొనసాగాలి. ఈరోజు జగనన్న దేవుడిని, మనల్నే నమ్ముకున్నాడు. జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు, నక్కజిత్తులు చేసే అలవాటు లేదు, మోసం చేసే అలవాటు లేదు, అబద్ధాలు చెప్పే అలవాటు జగనన్నకు లేదని ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ప్రతీ ఒక్కరి.. ప్రతీ రంగం.. అందరి సంక్షేమం ఈ ఎన్నికలతో ముడిపడి ఉందని గుర్తించాలని సీఎం జగన్ కోరారు. రూ.3,000 పెన్షన్ అందాలన్నా.. భవిష్యత్తులో ఇది పెరగాలన్నా.. ఇంటికే అది రావాలన్నా.. వైద్యం ప్రతీ ఒక్కరి చెంతకు చేరాలన్నా.. అప్పుల పాలు కావొద్దన్న.. మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే చేయగలదని ఇంటింటికి వెళ్లి చెప్పాలి’అని కేడర్‌కు సీఎం జగన్ సూచించారు. -
జగన్ ఏనాడూ ఒంటరి కాదు.. కౌరవ సైన్యంపై యుద్ధానికి సిద్ధమా?
ఏలూరు, సాక్షి: ఎన్నికల రణ క్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర అయితే.. నాది అర్జునుడి పాత్ర అని ముఖ్యమంత్రి దెందులూరు సిద్ధం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే.. ఆ ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు ఇదే నిదర్శనం అని పేర్కొన్నారాయన. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పార్టీ కేడర్‌ను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా?. ఇంటింటి చరితను.. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా? అని సీఎం జగన్ కేడర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పేదల భవిష్యత్తులను, పేదల్ని కాటేసే యెల్లో వైరస్ మీద.. కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయంపై సంగ్రామానికి ప్రతీ ఒక్కరూ సిద్ధమేనా? అని సీఎం జగన్ ప్రసంగించారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్ కో రూపంలో ఉన్నారు. ఓ చంద్రబాబు రూపేణా, ఓ ఈనాడు రూపేణా, ఓ ఆంధ్రజ్యోతి రూపేణా, ఓ టీవీ5 రూపేణా, ఓ దత్తపుత్రుడి రూపేణా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టులు.. ఇంత మంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. వాళ్లు.. ఆ తోడేళ్ల మంద వైపు నుంచి చూస్తే ఈ సీన్ చూస్తుంటే జగన్ ఒంటరి వాళ్లలా కనిపిస్తాడు. కానీ, నిజం ఏంటంటే.. ఇక్కడ జగన్ ఏనాడూ ఒంటరి కాదు. నిజం ఏమిటి అంటే ఇక్కడ కనిపిస్తున్నది నిజం. ఇదీ అసలు సీను. ఇన్ని లక్షల హృదయాల్లో కోట్ల మంది హృదయాల్లో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండటం.. ఇదీ నిజం. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు అయితే.. వారి యెల్లో పత్రికలైతే.. వారి యెల్లో టీవీలు అయితే.. నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న దేవుడు.. ఈ ప్రజలు అని సీఎం జగన్ భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇది నాయకుడి మీద నమ్మకం నుంచి పుట్టిన సైన్యం. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే.. ప్రజల ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు ఇదే నిదర్శనం. నా కుటుంబ సైన్యమంతా ఇక్కడ కనిపిస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికల రణ క్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరూ(ప్రజలు).. అర్జునుడిని నేను, చేసిన మంచినంతా అస్త్రాలుగా మల్చుకుని కౌరవ సైన్యం మీద యుద్ధం చేద్దామంటూ పిలుపు ఇచ్చారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే.. మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి మీద, అభివృద్ధి మీద. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మీకోసం ఏం చేశాడు? ఏనాడైనా ఒక్క రూపాయి అయినా వేశాడా? అని దెందులూరు సిద్ధం వేదిక నుంచి ప్రతిపక్ష నేతను సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. ‘‘నా మాటలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. మీ గ్రామాల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇంట్లో అడగండి.. 1995లో సీఎం అయిన చంద్రబాబు.. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు.. 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు.. మీ ఇంటికి గానీ, మీ ఊరికి గానీ, మీ సామాజికవర్గానికి గానీ, మీ కుటుంబ భవిష్యత్ కు గానీ ఏం చేశాడు అని అడగండి. అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా వారి బ్యాంకు అకౌంటు వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. చంద్రబాబు 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో 5 సంవత్సరాలు.. బ్యాంకు అకౌంటు వివరాల్లో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడిందో అడగండి. చంద్రబాబు పాలనలో పేద కుటుంబానికి బ్యాంకు అకౌంటుకు ఇచ్చింది ఎంత అని అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు హయాంలో ఏమున్నాయి అని అడగండి. బాబు పాలనలో ఏనాడైనా ఒక్క రూపాయి అయినా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడగండి. 1994లో గానీ, 1999లో గానీ, 2014లో గానీ చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏనాడైనా 10 శాతం అయినా అమలు చేశాడా అని ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలను అడగండి. మరోవంక.. మీ జగన్ పాలన, మీ బిడ్డ పాలన చూడండి అని మళ్లీ అడగండి. ఈ 57 నెలల మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను వివరిస్తా. ఈ తేడాను ప్రతి ఇంట్లో వివరించండి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా తీసుకోండి. ఏ పట్టణాన్ని తీసుకున్నా ఆ గ్రామానికి వెళ్లి నాలుగు అడుగులు వేస్తే గతంలో లేనిది, మన గ్రామంలోనే ఈరోజు కనిపించేది విలేజ్ సెక్రటేరియట్. ఒక వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది. ఎవరు పెట్టారంటే.. మీ జగన్. మన వైఎస్సార్ సీపీ పార్టీ. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి వార్డు సచివాలయంలో కనీసం అంటే 540 రకాల సేవలు అందిస్తూ, అందులో దాదాపు 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారంటే.. మీ జగన్. మన వైయస్సార్ సీపీ. జరిగిన అభివృద్ధిని కళ్లారా చూస్తూ.. ‘‘మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమలో నిలబడి ఉన్నా. ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామ గ్రామంలో తెచ్చిన మార్పు. లంచాలు, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం. వీటన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేరాఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పడానికి అన్ని అంశాలనూ పంచుకొనేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు.. 25కు 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు మీ వాడిగా మీ ముందుకు వచ్చి నా మనసు పంచుకుంటున్నా. ►ప్రతీ నెలా 1వ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి ప్రతి అవ్వాతాతకు మంచి మనవడిలా, మనవరాలిలా, ప్రతి వితంతు, వికలాంగుడికీ ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి చేతిలో పెడుతున్న 3 వేల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. చేసినది మన వైఎస్సార్ సీపీ. . లంచాలు, వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు.. ఆరోజుల నుంచి ఈరోజు ఏ గ్రామంలో కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారంటే.. మీ జగన్. తెచ్చింది మన వైయస్సార్ సీపీ. డీబీటీ ద్వారా బటన్ నొక్కి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతున్నది ఎవరు అంటే.. మీ జగన్. చేస్తున్నది మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం. ►ఈరోజు ప్రతి గ్రామంలో గవర్నమెంట్ బడి, ప్రభుత్వ ఆస్పత్రి మారటానికి నాడు-నేడు చేస్తున్నది ఎవరు అంటే.. మీ జగన్. వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, గవర్నమెంట్ బడుల్లో పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు కనిపిస్తున్నాయంటే, ఈరోజు డిజిటల్ బోధనతో, క్లాస్ రూముల్లో ఐఎఫ్‌పీలు కనిపిస్తున్నాయంటే, బడులకు వెళ్లినప్పుడు, పిల్లల్ని చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. చేసినది మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే. ►రాష్ట్రంలో రైతన్నను చేయిపట్టుకొని నడిపించే ఆర్బీకేను తీసుకొచ్చింది ఎవరు అంటే మీ జగన్. రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తున్నది ఎవరంటే మీ జగన్. చేస్తున్నది, ఎప్పటి నుంచి మొదలైంది అంటే మన వైయస్సార్ సీపీ వచ్చిన తర్వాతే. పేదలు, రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద 22ఏ భూముల మీద 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్. జరిగింది ఎప్పుడంటే వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఈ 57 నెలల్లోనే అందించిన రూ.2.55 లక్షల కోట్లలో 75 శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం చూపనంతగా ఈ పేద వర్గాల సంక్షేమం, అభివృద్ధి పట్ల, మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ప్రేమ, అభిమానం, కమిట్ మెంట్ చూపింది ఎవరంటే మీ జగన్. జరిగింది మంచి ఎప్పుడంటే.. మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ►నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు చట్టం చేసి మరీ ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. కేబినెట్లో 68 శాతం మంత్రి పదవులు నానానానా అంటూ నేను పిలుచుకొనే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ పిలుచుకొనే నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు దక్కింది మీ బిడ్డ పాలనలో. నలుగురు డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్ పర్సన్ మొదలు.. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి నానానా అని పిలుచుకుంటూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నది ఎప్పుడంటే మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే. ►ఈ ప్రేమ ఉంది కాబట్టే.. రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడనంత వరకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ఇందులో 80 శాతం నానానానా అని పిలుచుకొనే నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు కనిపిస్తున్నారంటే ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే, వైయస్సార్ సీపీ పాలన వచ్చిన తర్వాతే. అక్కచెల్లెమ్మలకు లక్షాధికారిని చేయాలి, గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నది ఎవరంటే మీ జగన్. మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ►నా అక్కచెల్లెమ్మలను ప్రతి రంగంలో ముందడుగు వేయాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి ఇస్తున్నది ఎవరంటే మీ జగన్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే. అక్కచెల్లెమ్మలు పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు అమ్మ ఒడి, పిల్లలకు తోడుగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన, ఓ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. ఓ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మహిళా సాధికారత, దిశ యాప్ అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ►ఆ గ్రామానికి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడంటే కారణం, ప్రతి ఇంట్లోనూ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ,వైద్యం ఇంటికొచ్చి మందులిచ్చే పరిస్థితి ఉందంటే కారణం.. మీ బిడ్డ. జరుగుతున్నది మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. 108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్ష్ మెంట్ తీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది, కదులుతున్నది, అమలు జరుగుతున్నది మీ బిడ్డ హయాంలో, వైయస్సార్ సీపీ పాలనలో. ►కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, కొత్త ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉన్నవి విస్తరణ జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లు ఉరుకులు పరుగులు చేస్తున్నాయి. పారిశ్రామిక వ్యక్తులు, సంస్థలు లైను కడుతున్నాయి. జరుగుతున్నది మీ బిడ్డ పాలనలో, మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నేను చెప్పిన ప్రతి విషయం వాస్తవం అవునా కాదా అని ఆలోచన చేయాలి. ప్రతి ఇంటికీ వాస్తవాలను తీసుకొని పోవాలి. 2019లో మనం అధికారంలోకి రాక ముందు ఏ ప్రభుత్వం అయినా ఇది సాధ్యపడుతుందా? అసాధ్యం అనుకున్న పనులన్నీ సాధ్యం చేయగలిగాం. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయినీ కూడా ఎలాంటి లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే.. కాదు.. అది సాధ్యమే ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని దేశానికే చూపించగలిగాం. ►ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి మంచి మీద, అభివృద్ధి మీద, పేద వాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు దాడి చేస్తున్నారు. ఈరోజు మన పెత్తందార్లంతా కూడా ఎవరి మీద దాడి చేస్తున్నారో ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడునేడుతో మారుస్తున్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ దండ యాత్ర చేస్తోంది. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి, చెండాటానికి మళ్లీ మన వైయస్సార్ సీపీ ప్రజా సైన్యం, మన కేడర్, మన లీడర్లు, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా మరొక్కసారి అడుగుతున్న సిద్ధమేనా?.. అని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగం కొనసాగించారు. -
LIVE : దద్దరిల్లిన దెందులూరు.. YSRCP సిద్ధం సభ లైవ్
ఏలూరు జిల్లా దెందులూరు లో వైఎసార్సీపీ ' సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగం సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్ మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా పేదల భవిష్యత్తును మరింతగా మార్చేందుకు మీరు సిద్ధమా దుష్టచతుష్టం మీద యుద్దానికి మీరు సిద్ధమా రామాయణం, మహా భారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు కానీ నిజం ఏంటంటే .. కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడు జగన్ ఏనాడు ఒంటరి కాదు .. వారికున్న సైన్యం, పొత్తులు, ఎల్లో మీడియా అయితే .. నాకున్న సైన్యం, బలం, దేవుడు ప్రజలే నాకున్న నమ్మకం మీరే ఇక్కడ కనిపిస్తున్న జనమే నాకున్న బలం వచ్చే రణక్షేత్రంలో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే .. అర్జునుడిని నేను చంద్రబాబు, ఎల్లో మీడియా ఏకమై కుట్ర చేస్తున్నారు మనం చేస్తున్న సంక్షేమం, మంచిపై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి మనం 99 శాతం హామీలు నెరవేర్చాం పేదవాడి భవిష్యత్తు సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారు రాబోయే తరం విద్యావిధానాల మీద దుష్ట చతుష్టయం దాడి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ధి, సంక్షేమం మీదనే గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం 175 కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం నా మాటలన్నీ ప్రతి ఇంటికి వెళ్లి పంచుకోవాలని కోరుతున్నా 14 ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు మీకు ఏం చేశారో అడగండి చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాను గమనించండి పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశారో అడగండి చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీమ్ లు ఏమున్నాయో అడగండి చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడమే చంద్రబాబు పని బాబు పాలనలో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా పడిందా ? చంద్రబాబు మేనిఫెస్టో లో 10 శాతం హామీలైనా నెరవేర్చాడా ? మీ బిడ్డ జగన్ పాలనను గమనించండి చంద్రబాబు పాలనకు, జగన్ 57 నెలల పాలనకు తేడాను గమనించండి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైనా తీసుకోండి గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో వచ్చిన మార్పులు గమనించండి ఈ వ్యవస్థను ఎవరు తీసుకోచ్చారంటే జగన్ అని చెప్పండి ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతలకు పింఛన్ అందిస్తున్నాం లంచాలు, వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు పోయాయి ఇవాళ ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా వ్యవస్థలను తీసుకొచ్చాం గ్రామ సచివాలయాల్లో 500 లకు పైగా సేవలందిస్తున్నాం నాడు నేడు ద్వారా ఆస్పత్రులు, స్కూళ్ల రూపురేఖలు మార్చాం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ విధానాన్ని తీసుకొచ్చాం ఆర్బీకే ల ద్వారా రైతులకు అండగా నిలబడ్డాం రైతులకు శాశ్వత భూహక్కులు కల్పించాం రూ. 2లక్షల 55 వేల కోట్లలో 75 శాతం వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం కేబినెట్ లో 68 శాతం మంత్రి పదవులు వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం 4 డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్ తో సహా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అమలు చేశాం 2 లక్షల 13 వేల ఉద్యోగాలిచ్చాం .. ఇందులో 80 శాతం వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం మీ బిడ్డ జగన్ పాలనలోనే ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పేందుకు గర్వపడుతున్నా దిశ యాప్ తో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం అక్కచెల్లెమ్మలకు ఆర్ధిక స్వావలంబన అందించాం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ 15 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్ లు నిర్మాణంలో ఉన్నాయి 2019 కి ముందు ఏ సంక్షేమం జరిగిందో చంద్రబాబును అడగండి కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నాం మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాం ఎన్నికల మేనిఫెస్టో కు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే మేనిఫెస్టో లో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చాం అబద్దాల పునాదులపై ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాయి వచ్చే ఎన్నికలు .. పేదల భవిష్యత్ ను నిర్ణయించేవి రూ. 3 వేల పెన్షన్ అందాలన్నా .. భవిష్యత్ లో పెరగాలన్నా .. మీ జగనే రావాలి ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి చెప్పాలి పేద పిల్లల భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు ఇవి ప్రతి అవ్వాతాత, ప్రతి పేదవాడి భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు ఇవి పేదల సొంతింటి కల నెరవేరాలంటే జగనన్నే కావాలని చెప్పండి 57 నెలల్లో మీ బిడ్డ 124 సార్లు బటన్ నొక్కాడు మంచి చేసిన ప్రభుత్వానికి అండగా నిలవాలని చెప్పండి జగనన్న కోసం మనం బటన్ నొక్కాలని ఇంటింటికి వెళ్లి చెప్పండి మీరు నా కోసం ఒక్కసారి బటన్ నొక్కండి ఒకటి అసెంబ్లీ, ఒకటి పార్లమెంట్ కు ఫ్యాన్ మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు పేదల రక్తం తాగేందుకు వస్తున్న చంద్రగ్రహణాలను సాగనంపండి ప్రతి పక్షాలకు ఓటు వేయడం అంటే మళ్లీ లంచాలకు అవకాశం ఇవ్వడమేనేని చెప్పండి జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదని ప్రతి ఇంటిలోనూ చెప్పండి జగనన్నకు కుట్రలు చేసే అలవాటు లేదని ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్యాకేజీ కోసం రా .. కదలి రా అంటూ బాబు .. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు చంద్రబాబు అండ్ కో .. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ 175 స్థానాల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులే లేరు చంద్రబాబు అండ్ కో పై యుద్దానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ కు ఏపీతో ఏం సంబంధం ? దిగజారుడు పార్టీలన్నీ పేదవాడి భవిష్యత్తునే టార్గెట్ చేసుకుంటున్నాయి వీరితో యుద్దానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా ? ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైఎసార్సీపీ ప్రజలకు మంచి చేయగలిగాం కాబట్టే ఓటు వేయమని అడుగుతున్నా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎసార్సీపీ పార్టీలోని ప్రతీ కార్యకర్తకూ అండగా ఉంటామని చెబుతున్నా మీకు మరింత మంచి చేసే బాధ్యత నాది వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175 కి 175 అసెంబ్లీ స్థానాలు -
నేడు ఏలూరులో ‘సిద్ధం’ సభ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/దెందులూరు: జన బలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేసూ్తనే.. మరోవైపు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తర కోస్తా (ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు)లోని 50 నియోజకవర్గాల నుంచి భారీగా శ్రేణులు, అభిమానులు తరలిరానున్నారు. గోదావరి జిల్లాల రాజకీయ చరిత్రలో ఈ సభ అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ కానుంది. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రాక నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సభా ప్రాంగణం, ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారు. యుద్ధ ప్రాతిపదికన సభా వేదిక, హెలిప్యాడ్ నిర్మాణం, గ్యాలరీలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీరు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆరి్డనేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్యచౌదరి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, వడ్డీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముంగర సంజీవ్‌కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ డి.మేరి ప్రశాంతి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
చంద్రబాబుకు ఇదే నా ఓపెన్ ఛాలెంజ్
సాక్షి, ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ సీఎం చేయని రీతిలో దళారి వ్యవస్థ లేకుండా ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేశారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా వారింటికి సంక్షేమం చేరటంతో ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. ద్వారకాతిరుమల మండలంలో కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడారు. జగనన్నకు ఓటు వేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఎంతమందితో కలిసి వచ్చినా భయపడేది లేదని అన్నారు. ప్రజలు జగనన్నను ముఖ్యమంత్రిగా చేసేందుకు డిసైడ్ అయిపోయారని పేర్కొన్నారు. ‘చంద్రబాబుది విజన్ అయితే.. 2019లో ఎందుకు అది పాయిజన్ అయిందో చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు. అమ్మ ఒడి పథకాన్ని గతంలో ఎందుకు పెట్టలేదు. రెండువేల పైచిలుకు వ్యాధులకు ఆరోగ్య శ్రీలో చికిత్స ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు విజన్ అంటే దోచుకోవడం దాచుకోవడమేనా?. నేను చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. కొవ్వూరు నియోజకవర్గంలో ఏ ఇసుక ర్యాంపు నుంచైనా నాకు నెలకు, సంవత్సరానికి గాని ఎవరైనా ఒక్క రూపాయి అయినా నాకు ఇచ్చారనీ నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను వైదొలుగుతా’ అని తానేటి వనిత తెలిపారు. అలాగే.. గోపాలపురం నియోజవర్గం అనేది తన స్వస్థలమని తెలిపారు. తన తండ్రి బాబాజీ రావు ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ప్రజలకు తాను సుపరిచితురాలనేనని.. తనకు పుట్టింటికి వచ్చినట్లుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
ఏలూరులో సీఎం జగన్ సభకు భారీ ఏర్పాట్లు
-
వైఎస్సార్సీపీలో ఫుల్ జోష్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లాలో ఫుల్‌జోష్‌తో కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా స్థానిక పరిస్థితులు, సమీకరణలకు అనుగుణంగా జిల్లాలో అభ్యర్థుల మార్పులు, చేర్పుల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన పార్టీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం, నూతన అభ్యర్థుల పరిచయ సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపింది. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు, పోలవరం అసెంబ్లీ అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మిలను జిల్లా నాయకులు కార్యకర్తలకు పరిచయం చేశారు. ఎన్నికల శంఖారావం పూరించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నవోత్సాహం కదంతొక్కుతోంది. ఇప్పటికే ప్రజల్లోకి.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జులను మార్చింది. మిగిలిన చోట్ల ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు. పాదయాత్రలు చేస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఐదేళ్లలో తాము చేసిన పనులను వివరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గడపగడపకూ చేకూరిన లబ్ధిని చెబుతున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఈనెల 30వ తేదీకల్లా నియోజకవర్గ స్థాయి సమావేశాలు ముగిసేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న చింతలపూడి ఇన్చార్జి కంభం విజయరాజు, పోలవరం ఇన్చార్జి తెల్లం రాజ్యలక్ష్మి ఇప్పటికే వారం రోజులుగా నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తున్నారు. ఇక ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఆదివారం నుంచి పార్లమెంట్ పరిధిలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. టీడీపీలో అనిశ్చితి ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో రాజకీయ అనిశ్చితి తారాస్థాయికి చేరింది. పొత్తుల గందరగోళం ఒక వైపు, టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయ లోపం మరోవైపు ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏలూరు ఎంపీ టికెట్‌ను ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఆశిస్తున్నా స్పష్టత లేకపోవడం పొత్తుల్లో జనసేనకు ఇచ్చే స్థానాలు తేల్చకపోవడంతో రెండు పార్టీల నేతల్లో రాజకీయ నైరాశ్యం నెలకొంది. ఇక దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ సమన్వయకర్త చింతమనేని ప్రభాకర్ యథావిధిగా హల్చల్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు చింతమనేని వద్దు–ఎవరైనా ముద్దు అనే పేరుతో నిరసన సమావేశం నిర్వహించినప్పటి నుంచి ఆయన తీవ్ర ఆందోళనకు గురై టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలపై నోరుపారేసుకుంటున్నట్లు సమాచారం. కైకలూరు, నూజివీడు, పోలవరంలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్లమెంట్ స్థానానికో సభ నిర్వహిస్తున్నా అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా ముఖ్యనేతలు ఖర్చుకు ముందుకురాని పరిస్థితి. అయితే జనసేన, టీడీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియా వార్ కొనసాగిస్తున్నాయి. ఏ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తాయో పోస్టులు షేర్ చేస్తూ గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. -
ఏలూరులో బైక్ ర్యాలీ తో పాటు మానవహారం
-
తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఏపీలో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. 85 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకినట్టు సమాచారం. శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు. ఏలూరులో కరోనా మరో కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఆరుగురికి ర్యాoడమ్ టెస్టులు చేసిన వైద్యులు.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు వైద్యులు పంపించారు. పాజిటివ్ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రజలు ఆందోళన పడొద్దని డీఎం అండ్ హెచ్ఓ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్లి రాలేదని స్పష్టం చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు కరోనా బారినపడ్డారు. నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తితో ఎంజీఎం సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్ లేనిదే ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. కోవిడ్ పేషెంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. 16 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
ఇళ్లకొచ్చి బెదిరింపులు.. సమాచార దోపిడీలో టీడీపీ, జనసేన
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు అర్బన్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోపిడీ చేస్తున్నాయి. ఆ పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు ఇళ్లకు వచ్చి, వ్యక్తిగత సమాచారం కోరుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారు. ఆధార్ కార్డులు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఓటీపీ వస్తుందని, వెంటనే చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. వారు చెప్పినట్లు చేయని వారిపై దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఏలూరు, తణుకు నగరాల్లో వీరు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో జిల్లావాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో అమరావతి భూముల కుంభకోణంలో పలువురి ఆధార్ కార్డులతో భూములను రిజిస్ట్రేషన్ చేసిన టీడీపీ.. ఇప్పుడు తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లతో ఏం చేయబోతుందనే భయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఏలూరు పత్తేబాదలోని ఓ ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను ఆధార్ కార్డు కావాలంటూ అడిగారు. మీరెవరని ప్రశ్నించగా టీడీపీ నుంచి వచ్చామని, ఆధార్ కార్డు ఇస్తే యాప్‌లో వివరాలను నమోదు చేస్తామని చెప్పారు. ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలంటూ దురుసుగా అడిగారు. మీకెందుకివ్వాలంటూ ఆ మహిళ గట్టిగా నిలదీయడంతో ఆమెను బెదిరిస్తూ వెళ్లిపోయారు. ఏలూరు కొత్తపేటలోనూ ఇదే విధంగా పలు ఇళ్లలో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ చెప్పాలని టీడీపీ, జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారు. స్థానికులు గట్టిగా ఎదురు తిరగడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇలా దెందులూరు, ఉంగుటూరు, తణుకులో కూడా టీడీపీ, జనసేనకు చెందిన పలువురు స్థానిక నాయకులు కొందరు యువకులను ఇళ్లకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తణుకులోనూ ఓటరు లిస్టుతో ఇంటింటికీ వచ్చి వివరాలు అడుగుతూ బాబు గ్యారంటీ కార్డులు అందజేస్తున్నారు. మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం 8, 17 వార్డుల్లో ఇలాగే బెదిరించిన టీడీపీ కార్యకర్తలపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, హెచ్చరించి పంపించారు. వ్యక్తిగత సమాచారం చెప్పొద్దని పోలీసుల హెచ్చరిక ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో అపరిచితులు ఎవరికీ వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డులు, ఓటీపీ నంబర్లు ఇవ్వవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దంటూ తణుకులో మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వారి వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని, ఎవరికీ చెప్పవద్దని వాటి కోసం బలవంతం చేసిన వారిపై ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. వాలంటీర్లపై దుష్ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడిదేం పని? ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారికి అండదండగా ఉంటూ, సంక్షేమ పథకాలను అందిస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు దు్రష్పచారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకొనేందుకు వెళ్లిన వాలంటీర్లపై నానా రకాల ప్రచారం చేశారు. వాలంటీర్లు ప్రభుత్వం నియమించిన వారు. అదే ప్రాంతానికి చెంది, నిత్యం ప్రజల మధ్య ఉండి, వారికి సుపరిచితులైన వారు. అలాంటి వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు మరింత సమర్ధంగా అందేలా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తే తప్పంటూ నానా యాగీ చేశారు. ఇప్పుడు అదే జనసేన, టీడీపీ వారు ఆ ప్రాంతానికి సంబంధం లేని వారిని, అపరిచితులను ఇంటింటికీ పంపి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇవ్వని వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు వస్తున్నారు అపరిచిత వ్యక్తులు ఇళ్లకు వచ్చి ఆధార్ కార్డు కావాలని అడుగుతున్నారు. ఫోన్ నంబర్లకు ఓటీపీలు వస్తాయని అవి చెప్పాలని అడుగుతున్నారు. మీకెందుకని అడిగితే టీడీపీ యాప్‌లో నమోదు చేయాలని అంటున్నారు. వారి తీరుతో మాకు భయంగా ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – బి.మణి, వన్‌టౌన్, ఏలూరు చదవండి: ఇదీ.. జగన్ కమిట్మెంట్ -
ఏలూరులో కదంతొక్కిన విద్యార్థులు
ఏలూరు టౌన్: ‘వన్స్ మోర్ సీఎం వైఎస్ జగన్... జయహో జగన్..’ నినాదాలతో ఏలూరు నగరం మార్మోగింది. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరులో విద్యార్థి సాధికారత ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిర్వహించిన ఈ ర్యాలీలో నగరంలోని పలు కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల దినేష్‌రెడ్డి నేతృత్వంలో ఏలూరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ హాజరయ్యారు. తొలుత ఏలూరు జెడ్పీ కార్యాలయ ప్రాంతం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్దకు ర్యాలీగా వచ్చారు. అక్కడ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్, కోర్టు సెంటర్, ఏలూరు జీజీహెచ్ మీదుగా రామచంద్రరావుపేట వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్న సీఎం జగన్: రాయుడు అంబటి రాయుడు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలు వేస్తూ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ‘ఆడుదాం–ఆంధ్ర’లో ప్రతి విద్యార్థి, యువత పాల్గొని తమ ప్రతిభను చాటాలని సూచించారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెద్దబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి భరత్‌రెడ్డి, ఏలూరు అధ్యక్షుడు ఏలూరు అంజి, జేసీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ వైఎన్వీ శివరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏలూరులో ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో విద్యార్థుల ర్యాలీ
-
యువత ఎంచుకునే రంగలో రాణించాలి: అంబటి రాయుడు
-
ఆయనతో నాకు ఎలాంటి విభేదాలు లేవు: పేర్ని నాని
-
రాష్ట్రంలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తోంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తోందని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళల సాధికారత సీఎం జగన్ ఘనతేనని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో జరిగిన సభలో మంత్రి రజిని మాట్లాడారు. సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. పేదవారిని ప్రజాప్రతినిధులుగా మారుస్తున్నారని అన్నారు. విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని చేరువ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని, ఏలూరులోనూ రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. గతంలో వార్డు మెంబరు కావాలంటే పెత్తందారుల వద్ద ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదని, ఆ స్ధితి నుంచి సీఎం జగన్ బయటకు తీసుకువచ్చి చట్ట సభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్రంలో 25 మంది మంత్రులు ఉంటే వారిలో 17 మంది ఈ వర్గాలకు చెందిన వారే ఉన్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలంతా కలిసి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగనన్నకు విజయం చేకూర్చాలని కోరారు. సీఎం జగన్ బయటకు రాకపోయినా ఆయన కటౌట్‌ను చూసి 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు జనం తరలివస్తున్నారని చెప్పారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ గతంలో సామాజిక న్యాయం కోసం అనేక మంది ఉద్యమాలు చేశారని, వారి ఆశయాలను ఇప్పుడు సీఎం జగన్ నెరవేర్చారని చెప్పారు. దళిత కులంలో పుట్టాలనుకుంటారా.. అనే మాటలు గతంలో ఓ సీఎం నుంచి విన్నామని, కానీ ప్రస్తుతం వెనుకబడిన వర్గాలకు, దళితులకు, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్న సీఎంను చూస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ వల్ల దళిత, బలహీన వర్గాలకు ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ వంటి చదువులు అందుతున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని పేకాటరాయుడు, అవినీతిపరుడు, దళిత ద్రోహి అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సాధికారత సీఎం జగన్‌తోనే సాధ్యమైందన్నారు. 2014లో చంద్రబాబు ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో కేవలం ఆయనకు చెందిన వారికి మాత్రమే పనులు చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం కులం, మతం, పార్టీ చూడటంలేదని, వైఎస్సార్సీపీకి ఓటు వేసినవారికి, వేయనివారికి కూడా న్యాయం చేస్తున్నారని, కలెక్టర్ల సమావేశంలో కూడా ఇవే ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. జగన్ పాదయాత్రలో చెప్పిన పనులు, చెప్పని పనులు కూడా చేశారన్నారు. నాలుగున్నరేళ్లలో దెందులూరులో రూ.2,800 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. నిన్న హైదరాబాద్‌లో ఒక సామాజికవర్గ సమావేశం జరిగిందని, దానిలో ఎస్సీ, బీసీలు ఎవరూ పాల్గొనలేదని చెప్పారు. గతంలో పేదలపై పెత్తనం జరిగేదని, ఇప్పుడు అదే పేదలకు పదవులు వస్తున్నాయని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ వల్ల పేద వర్గాలు చట్టసభల్లో అడుగుపెడుతున్నాయని, ఇందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. అక్రమ కేసులతో దళితులను జైళ్లలో పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. దళితులు, బీసీలు, మైనార్టీలు జైళ్ళలో కాదు చట్టసభల్లో ఉండాలని భావించిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలో 11 వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చామని, దెందులూరు గడ్డ వైఎస్సార్ సీపీ అడ్డాగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కవురు శ్రీనివాస్, జయమంగళ వెంకట రమణ, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, మేకా వెంకట ప్రతాప అప్పారావు, దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, ఎలీజా, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ విగ్రహం చూస్తుంటే అందరికీ ఒక విషయం అర్థం అవుతుంది. సీఎం వైఎస్ జగన్ బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి పరుస్తూ సామాజిక సాధికారత సాధిస్తున్నారు. అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలను నిజం చేస్తున్నారు. అందుకే.. తన ఆలోచనలు, ఆశయాలు కలిగిన వ్యక్తి తాడేపల్లిలో ఉన్నారని అంబేడ్కర్ వేలు ఆ వైపు చూపిస్తున్నారు. – నందిగం సురేష్, ఎంపీ -
సామాజిక సాధికార యాత్ర: నాలుగో రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, తాడేపల్లి: సామాజిక విప్లవ సారథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనకు ప్రజలు అడుగడుగునా జేజేలు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రను హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. జగనే రావాలి.. జగనే కావాలి’ అంటూ అన్ని వర్గాలూ ఒక్క గళమై నినదిస్తున్నారు. గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు చేస్తున్న మంచిని వివరించడానికి సీఎం జగన్ నాయకత్వంలో చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు భారీ స్పందన లభిస్తోంది. ఇక, నాలుగో రోజు సామాజిక సాధికార యాత్ర అల్లూరి జిల్లా పాడేరు, ఏలూరు జిల్లా దెందులూరు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొనసాగనుంది. పాడేరు సమీపంలోని వంతాడపల్లి చెక్ పోస్టు నుంచి సోమవారం ఉదయం 10:30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ►ఉదయం 11 గంటలకు పాడేరు మెడికల్ కాలేజీ పనులను పరిశీలించనున్న పార్టీ నేతలు. ►11:15 గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►11:30 గంటలకు మోదకొండమ్మ తల్లి స్టేడియం నుంచి బైక్ ర్యాలీ. ►మధ్యాహ్నం 12 గంటలకు కిందిబజార్ వద్ద బహిరంగ సభ. నెల్లూరులో ఇలా... ►నెల్లూరు జిల్లా వింజమూరులో చిన్నకేశవ స్వామి టెంపుల్ నుండి బయలుదేరనున్న బస్సుయాత్ర ►జగీరవనంలో 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న పార్టీ నేతలు ►దుత్తలూరు మీదుగా ఉదయగిరి చేరుకోనున్న బస్సుయాత్ర ►హైస్కూల్ గ్రౌండ్లో మధ్యాహ్నం 3:30 గంటలకి బహిరంగ సభ ఏలూరు జిల్లాలో ఇలా.. ►ఏలూరు జిల్లాలో దెందులూరు మండలం సోమవరప్పాడు నుండి బస్సు యాత్ర మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం ►వీరభద్రాపురం గ్రామం వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళుల్పించనున్న నేతలు ►గోపన్నపాలెం వద్ద సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ -
ఏలూరు యాసిడ్ దాడి కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
ఏలూరు టౌన్: ఏలూరులో మహిళపై యాసిడ్ దాడికి తెగబడిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. యాసిడ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎడ్ల ఫ్రాన్సికా కుటుంబానికి సత్వర న్యాయం అందిస్తూ కేవలం 117 రోజుల్లోనే తీర్పు వెలువరించారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి మీడియాకు బుధవారం వెల్లడించారు. ఏలూరు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు బోడ నాగసతీ‹Ùకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, యాసిడ్ దాడికి పాల్పడిన ఏలూరుకు చెందిన బెహరా మోహన్, బూడిద ఉషాకిరణ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.15 వేల చొప్పున జరిమానా విధించారు. యాసిడ్ విక్రయించిన ఏలూరు గడియార స్తంభం ప్రాంతానికి చెందిన కొల్లా త్రివిక్రమరావు (68)కు రూ.1,500 జరిమానా విధించారు. దాడి జరిగిందిలా.. మృతురాలు ఫ్రాన్సికా భర్తకు దూరంగా ఉంటూ నగరంలోని ప్రైవేట్ దంత వైద్యశాలలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. కాగా.. ఫ్రాన్సికా సోదరితో ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన బోడ నాగసతీష్ సన్నిహితంగా ఉండేవాడు. దీనిని ఫ్రాన్సికా వ్యతిరేకించింది. దీంతో కక్ష పెంచుకున్న సతీ‹Ù.. ఫ్రాన్సికాను హతమార్చేందుకు నగరానికి చెందిన మోహన్, ఉషాకిరణ్ అనే వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. వారిద్దరూ ఈ ఏడాది జూన్ 13న రాత్రి 8.30 గంటల సమయంలో ఫ్రాన్సికాపై యాసిడ్‌తో దాడి చేశారు. గాయపడిన ఆమెను ఏలూరు జీజీహెచ్‌లో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని విజయవాడ జీజీహెచ్‌కు, ఆ తరువాత మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తల్లి ధనలక్ష్మి ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సీఐ ఇంద్ర శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. కాగా, ఫ్రాన్సికాను బతికించాలనే తపనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితురాలి చికిత్స కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. అయితే.. 8 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె జూన్ 21న మృతి చెందింది. సత్వర విచారణతో నిందితులకు కఠిన శిక్షలు డీజీపీ కేవీ రాజేంద్రనాద్‌రెడ్డి ఆదేశాలతో కేసు సత్వర విచారణ బాధ్యతను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులుకు అప్పగించారు. నిందితుల్ని అరెస్ట్ చేసి కేవలం 21 రోజుల్లోనే చార్జ్ïÙట్ దాఖలు చేసి, పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. సునీల్‌కుమార్ కేవలం 117 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.శ్రీవాణిబాయ్ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రవేశ పెట్టడంతో కీలకంగా వ్యవహరించిన దిశ సీఐ ఇంద్ర శ్రీనివాస్, విశ్వం, డీఎస్పీ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ దుర్గాప్రసాద్‌ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించారు. -
అనారోగ్యంతో బాధపడుతున్న మణెమ్మను స్వదేశానికి పంపిన దుబాయ్ సీజేఐ!
దుబాయ్‌లో పనిచేసేందుకు వెళ్లింది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మణెమ్మ. అనుకోకుండా ప్రాణాంతక వ్యాధి బారినపడింది. దీంతో తన సొంతూరుకి ఎలా పయనమవ్వాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ) ఏపిఎన్ఆర్టీఎస్ సాయంతో మణెమ్మను సురక్షితంగా స్వదేశంలోని హెల్త్కేర్సెంటర్కి పంపింది. వివారాల్లోకెళ్తే..ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్ మణెమ్మ సెప్టెంబర్ 2022లో దుబాయ్‌లో ఓ ఇంట్లో పనిచేయడానికి వెళ్లింది. కానీ దురదృష్ణవశాత్తు డిసెంబర్ 22న ఆమెకు ప్రాణాంతక వ్యాధి టీబీ ఉందని వైద్య పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి మణెమ్మకు దుబాయ్‌లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఐతే ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో కోలుకుంది. భారతదేశం ప్రయాణించడానికి ఎలాంటి సమస్య లేదని వీల్‌చైర్ ద్వారా నర్సు సాయంతో పంపిచొచ్చని వైద్యులు సూచించారు. దీంతో దుబాయ్ సీజేఐ మణెమ్మను తన వివరాలను చెప్పల్సిందిగా కోరింది. అయితే తనకు కుటుంబసభ్యులు, స్నేహితులు ఎవ్వరూ లేరని చెప్పడంతో ఆమె సొంతూరుకు దగ్గరలో ఉన్న హెల్త్‌కేర్ సెంటర్లు గురించి తెలియజేయమంటూ ఏపిఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటికి ఈ మెయిల్ పంపింది దుబాయ్ సీజేఐ. దీంతో ఏపీఎన్ఆర్టీఎస్ ఈ విషయాన్ని ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి తెలియజేసింది. కలెక్టర్ కార్యాలయం వారు సెయింట్ ఆన్స్ లయోలా ప్రేమ్ నివాస్ రిహాబిలేషన్ సెంటర్లో ఉండటానికి అనుమతివ్వడంతో ఏపీఎన్ఆర్టీఎస్ ఆ విషయాన్ని దుబాయ్ సీజేఐకి తెలిపింది. దుబాయ సీజే మణెమ్మకు నర్సుని తోడుగా ఇచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి పంపగా, అక్కడ నుంచి ఏపీఎన్ఆర్టీసి అంబులెన్స్ సాయంతో లయోలా ప్రేమ్ నివాస్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు మణెమ్మను సురక్షితంగా చేర్చారు. ఈ విషయంలో తమకు సహకరించినందుకు గానూ దుబాయ సీజేఏ ఏపీఎన్ఆర్టీఎస్ వారికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ కూడా మణెమ్మను సురక్షితంగా తరలించడంలో సాయం చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ గారికి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విజయ లక్ష్మి, డిఆర్ఓ మూర్తి, జిల్లా పరిపాలన శాఖ అధికారులకు, దుబాయ్ సీజేఐకి ధన్యవాదాలు తెలిపింది. (చదవండి: యూరప్‌లో వైభవంగా మలయప్ప స్వామి కల్యాణం) -
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు మెరుగైన వైద్యం
-
జనసేన జయప్రకాశ్‌కు 14 రోజుల రిమాండ్
సాక్షి, క్రైమ్: ఎన్నికల్లో డబ్బులు పంచిన కేసులో.. జనసేన ముఖ్యనేత గుండా జయప్రకాశ్ నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. జయప్రకాశ్ వీరవాసరం మండల జెడ్పీటీసీ కాగా.. సదరు కేసుకు సంబంధించి ఆయన్ని హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. వీరవాసరం జెడ్పీటీసీ అయిన గుండా జయప్రకాశ్.. 2019 ఎన్నికల్లో పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. చివరకు జయప్రకాశ్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన శృంగవృక్షం పోలీసులు.. ఏలూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం.. కోర్టుల జయప్రకాశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో.. జనసేన జెడ్పీటీసీ గుండా జయప్రకాశ్ నాయుడ్ని ఏలూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. -
ఏలూరు, ప.గో.జిల్లాలో పంచాయతీ ఉపఎన్నికలు
అమరావతి: ఏలూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలకు 31 వార్డు స్థానాలకు నేడు పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది గత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనంతరం ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈరోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లాలో మొతం 3 సర్పంచ్ స్థానాలకు 21 వార్డులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి 10 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలనుంచి కౌంటిం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం, పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలంలోని వణిదురు సర్పంచ్ స్థానాలకు, అలాగే 21 వార్డులకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం మండలం కావలిపురం సర్పంచ్ పదవికి, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 4 సర్పంచ్ స్థానాలు, 47 వార్డు మెంబర్లకు గాను శ్రీనివాసపురం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 12 వార్డులకు సింగిల్ నామినేషన్లు, మరో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 160 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 11,114 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 120 మంది సిబ్బందిని నియమించారు. -
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
-
రేపు, ఎల్లుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు(సోమవారం), ఎల్లుండి(మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. అల్లూరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. కాగా, ఈ సందర్భంగా వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. రేపు(సోమవారం) అల్లూరి జిల్లా కూనవరం, వీఆర్‌పురం వదర బాధితులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం.. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం సందర్శనకు వెళ్లనున్నారు. అలాగే, రాత్రికి రాజమండ్రి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సీఎం జగన్ సమావేశం అవుతారు. ఎల్లుండి(మంగళవారం) కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తానేలంక, రామాలయంపేటలో వరద బాధితులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అలాగే, అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు సందర్శనకు వెళ్లనున్నారు. ఇది కూడా చదవండి: ‘పోలీసులపై జరిగిన దాడి పవన్‌కు కనిపించడం లేదా?’ -
పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
సాక్షి, ఏలూరు: ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఏలూరులో వాలంటీర్లు. పవన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న వాలంటీర్ల సేవలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ వ్యవస్థను నిర్వీర్వం చేయాలని చూస్తున్నారని ఆగ్రహిస్తూ.. తక్షణమే తమకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇసుకతోట హైవేపై వాలంటీర్లు బైఠాయింపు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా నినాదాలు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఏలూరు జిల్లా వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా నూజివీడు పట్టణం చిన్నగాంధీబొమ్మ సెంటర్లో పవన్ కళ్యాణ్ ఫోటోలను చెప్పులతో కొట్టి నిరసన తెలిపిన వాలంటీర్లు. సంఘీభావం తెలిపిన వైసీపీ శ్రేణులు. కాకినాడ జిల్లా పవన్ కళ్యాణ్ వాఖ్యలకు నిరసనగా జగన్నాధపురం మునసిబ్ గారి సెంటర్ లో వాలంటీర్ల నిరసన. పవన్ కళ్యాణ్ చిత్రపటాలు దగ్ధం వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ విజయనగరం జిల్లా మహిళా సంఘాలకు పడవలసిన ఆసరా డబ్బులు ఇంతవరకు పడలేదని వెలుగు ఏపీఎంపై ఆగ్రహం వ్యక్తపరిచిన మంత్రి బొత్స. సభా వేదికపై మహిళా పోలీస్ చేత దిశా యాప్ ను మహిళా పోలీస్ ద్వారా పరీక్షించిన మంత్రి.. జగనన్న ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ఘనంగా చెప్పిన విద్యాశాఖ మంత్రి బొత్స. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సభా వేదికపై నుండి ఖండిస్తూ మైక్ ఉందని మాట్లాడకూడదు అంటూ ఎద్దేవా బొత్స. స్వార్థం కోసం నీతిమాలిన రాజకీయాలు చేసిన వారికి పగ్గాలు అప్పజెప్పాల?లేదా ప్రజా సంక్షేమం కోరి ఎన్నో పదకాలు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పాల మీరే చెప్పండి?అంటూ ప్రజలను ప్రశ్నించిన మంత్రి.. బాపట్ల జిల్లా ►వాలంటీర్ల పై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వైసిపి రాష్ట్ర కార్యదర్శి అమృతపాణి. ►వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారనడం సరైన పద్ధతి కాదు. ►పవన్ కల్యాణ్ ఒల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ►సంక్షేమ ఫలాలు ప్రజల వద్దకు చేరుస్తున్న వాలంటీర్లను అవమానిస్తే సహించం. ►ప్యాకేజీ స్టార్ సినిమా డైలాగులు బయట వాడితే సరైన బుద్ది చెబుతాం. ►వేటపాలెం మండలం పందిళ్ళ పల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టి లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన చీరాల నియోజవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి కరణం వెంకటేష్. ►జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పర్చూరు వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ ఫైర్ ►వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారన్న పవన్ వ్యాఖ్యలపై ఆమంచి సీరియస్.. ►ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ ►చంద్రబాబు ఆడినట్లు ఆడటం మంచిదికాదని సూచన ►వాలంటీర్లకు బేషరతుగా క్షమాపణలు చెప్పి గౌరవం నిలుపుకోవలని హితవు కృష్ణాజిల్లా ►పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై మండిపడుతున్న వాలంటీర్స్ ►తక్షణమే పవన్ తన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలి ►బేషరతుగా వాలంటీర్స్ కు క్షమాపణ చెప్పాలి ►వాలంటీర్స్ అంటే ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారధులు ►వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ దారుణంగా మాట్లాడుతున్నాడు ►వాలంటీర్ల వల్లే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందనడం చాలా దుర్మార్గం ►వాలంటీర్లలో 60% మంది మహిళలమే ఉన్నాం ►పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్లే ఆడవాళ్లా ►మేం పవన్ కళ్యాణ్ కు మహిళల్లా కనిపించడం లేదా? ►వాహనమెక్కి రోడ్ల వెంట తిరుగుతూ నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు ►చేతనైతే గ్రామాల్లోకి వచ్చి మేం చేస్తున్న సేవలను తెలుసుకో పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా ►నిన్న ఏలూరులో పవన్ కళ్యాణ్ వాలంటీర్లు పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన స్త్రీ , శిశు సంక్షేమ రీజనల్ చైర్మన్ వందనపు సాయి బాల పద్మ. ►రాష్ట్రంలో కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు పవన్ కంటికి కనపడలేదా...?? ►చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పై పవన్ కళ్యాణ్ అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి... ►వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిచేది మేమే... ►వాలంటీర్లు అంటే చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీ లు కాదు... ►మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ►జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామం లో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వాలంటీర్లు ►పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం లో వాలంటీర్స్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం. చదవండి: పవన్ ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయాడు?: మంత్రి అమర్నాథ్ -
టీడీపీ కార్యకర్త వికృత చేష్టలు.. కాలేజీ విద్యార్థినిలతో అసభ్య ప్రవర్తన
సాక్షి, ఏలూరు: ముసునూరు మండలం గోపవరంలో టీడీపీ కార్యకర్త వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. గోపవరానికి చెందిన విద్యార్ధినులతో టీడీపీ కార్యకర్త వడ్లపట్ల మురళి(50) అసభ్యంగా ప్రవర్తించాడు. గోపవరం గ్రామానికి చెందిన 20 మంది విద్యార్ధులు ఏలూరులోని శ్రీ చైతన్య కాలేజ్‌లో చదువుతున్నారు. వీరంతా గత నెల 30వ తేదీన కాలేజ్ బస్సులో ఏలూరు నుంచి గోపవరం వస్తుండగా వడ్లపట్ల మురళి అసభ్యంగా ప్రవర్తించాడు. మురళి చేష్టలపై ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు సమాచారమచ్చింది.. దీంతో గోపవరంలో బస్సును ఆపిన తల్లిదండ్రులు.. మురళిని నిలదీశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త విద్యార్థిని తండ్రితో ఘర్షణకు దిగి గాయపరిచాడు.మురళి చర్యలతో భయపడిన బాధితులు.. తమకు రక్షణ కల్పించాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును ఆశ్రయింంచారు. స్పందించిన ఎమ్మెల్యేక టీడీపీ కార్యకర్త మురళిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. విద్యార్ధినులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మురళి గతంలో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అన్ని కేసులను పరిగణలోకి తీసుకుని అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: విషాదం.. స్కూల్ బస్సు కిందపడి ఒకరు.. ఆర్టీసీ బస్సు ఢీకొని మరో చిన్నారి -
ఎక్కువ దిగుబడినిచ్చే నూతన కొబ్బరి రకాలు
-
భద్రాద్రిలో ఘోర ప్రమాదం.. కిన్నెరసాని వాగులో దూసుకెళ్లి..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బుర్గంపాడు మండల పరిధిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులోని వేలేరు బ్రిడ్జి పై నుంచి కిన్నెరసాని వాగులో పడింది ఓ ట్రాలీ వాహనం. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. వాహనం అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 20 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఏలూరు జిల్లా(ఏపీ) నర్సాపురం మండలం తిరుమల దేవి పేట కు చెందిన వాళ్లు. భద్రాచలం రామాలయం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్లకు బూర్గంపాడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: మళ్లీ వస్తా అని చెప్పి కానరాని లోకాలకు -
రైలు బోగీలో మంటలు
ఏలూరు టూ టౌన్/ఏలూరు టౌన్: ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి రైల్వే ట్రాక్ మెషిన్ సిబ్బంది ప్రయాణించే రైలు బోగీ అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిని రైల్వే లైన్ మరమ్మతుల కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్ మరమ్మతుల కోసం వినియోగించే ఈ బోగీని ఏలూరు రైల్వేస్టేషన్ ట్రాక్ నంబర్ 7లో చివర లూప్లైన్లో నిలిపి ఉంచారు. రాత్రి 7.30–8 గంటల మధ్య ఈ బోగీకి మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఏలూరు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ ఆధ్వర్యంలో రెండు ఫైర్ ఇంజిన్లు అక్కడకు చేరుకుని అదుపు చేశాయి. బోగీలో నిల్వ ఉంచిన 10 వరకు ఆయిల్ డ్రమ్ములను బయటకు లాగి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వీటికి నిప్పు అంటుకుని ఉంటే అదుపు చేయడం కష్టమయ్యేది. ఆ బోగీలో విలువైన బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వైర్లు, ట్రాక్ మరమ్మతులకు వినియోగించే సామగ్రి, కూలర్ వంటివి బయటికి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం రైల్వే ఇంజనీరింగ్ విభాగానికి చెందిన క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మెషిన్ సిబ్బంది ప్రయాణించే ప్రత్యేక రైలు బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ఏలూరు అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ చెప్పారు. శనివారం విపరీతమైన వేడి ఉండటం వల్ల అందులోని వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగిందని మీడియాకు చెప్పారు. ఈ రైలు బోగీలో రైల్వే సిబ్బందితో పాటు డీజిల్ ట్యాంకులు, యంత్ర పరికరాలు ఉంటాయన్నారు. పక్క బోగీలోనే భారీగా డీజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. మంటలు వ్యాప్తి చెందక ముందే అదుపు చేశామని చెప్పారు. బోగీలోని 15 మంది సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని వివరించారు. ఆస్తి నష్టం అంచనా వేయాల్సి ఉందన్నారు. -
చిన్న సమస్యను విపత్తుగా చూపిస్తున్నారు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు: ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయని.. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారని, ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారని, ఈ ఖాళీల గుండా వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. చిన్న సమస్యను పెద్ద విపత్తులాగా చూపిస్తున్నారు ఈఎస్‌ఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్ దారుణంగా దెబ్బతిందని.. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదని, ఎందుకంటే.. రామోజీరావు బంధువులకే నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించారని ప్రస్తావించారు. ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేని గైడ్‌వాల్ వంటి చిన్న సమస్యను పెద్ద విపత్తులాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయినా దీన్నికూడా పాజిటివ్‌గా తీసుకుని తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పనుల పరిశీలన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమగ్రంగా పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు పెంచిన ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు, ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న దిగువ కాఫర్ డ్యాం పనులను కూడా సీఎం దగ్గరుండి పరిశీలించారు. చదవండి: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం జగన్ అధికారులతో సమీక్ష అదే విధంగా గత ప్రభుత్వంలో ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను సీఎం జగన్ పరిశీలించారు. డయాఫ్రం వాల్ ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇసుకను నింపే పనులను, వైబ్రో కాంపాక్షన్ పనులను పరిశీలించిన సీఎం.. డయాఫ్రం వాల్ ప్రాంతంలో పునర్ నిర్మాణాలు, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణలపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జతన్ సమీక్షా సమావేశం నిర్వహించారు పోలవరం ప్రాజెక్టులో తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని అధికారులు వెల్లడించారు. రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మెమోరాండం జారీచేసిందని, దీన్ని కేంద్ర జలశాఖకు లేఖద్వారా తెలిపిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతంలో నిర్మాణాల కోసం అదనంగా రూ.9 వేల కోట్లు ఇందులో భాగంగా ఇచ్చిందని తెలిపారు. కాంపౌండ్‌వారీ బిల్లుల చెల్లింపు వల్ల ప్రాజెక్టు నిర్మాణాలు ఆలస్యం అవుతున్న విషయాన్నిపరిగణలోకి తీసుకుని దానికి కేంద్ర మినహాయింపులు కూడా ఇచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరాయంగా సంప్రదింపులు, చర్చలు జరిపి, ప్రత్యేక దృష్టిపెట్టడంతోనే ఇది సాధ్యమైందని అధికారులు తెలియజేశారు. గైడ్‌వాల్‌లో చిన్న సమస్యను విపత్తు మాదిరిగా చూపిస్తున్నారు: ►గైడ్‌వాల్‌పై సమీక్షా సమావేవంలో ప్రస్తావన. ►గైడ్‌వాల్ డిజైన్లన్నీ కేంద్ర జలసంఘం - సీడబ్ల్యూసీ ఖరారుచేసిందని, వారి ఆమోదంతోనే పనులు చేశామని అధికారులు వెల్లడించారు. ►ప్రస్తుతం వచ్చిన సమస్యను కూడా వారికి నివేదించామని తెలిపారు. ► దీన్ని సరిదిద్దడం పెద్ద సమస్యకాదని, సీడబ్ల్యూసీ పరిశీలన కాగానే వారి సూచనల మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని చెప్పారు. కీలక పనుల్లో గణనీయ ప్రగతి: పోలవరం ప్రాజెక్టులో కీలక పనుల్లో ప్రగతిని అధికారులు సీఎంజగన్‌కు వివరించారు. ► స్పిల్‌వే కాంక్రీట్ పూర్తయ్యింది. ►48 రేడియల్ గేట్లు పూర్తిస్థాయిలో పెట్టారు. ► రివర్ స్లూయిస్ గేట్లు పూర్తయ్యాయి. ► ఎగువ కాఫర్ డ్యాంకూడా పూర్తయ్యింది. ► దిగువ కాఫర్ డ్యాం పూర్తయ్యింది. ► గ్యాప్ -3 వద్ కాంక్రీట్ డ్యాం పూర్తయ్యింది. ► పవర్‌హౌస్‌లో సొరంగాల తవ్వకం పూర్తయ్యింది. ► అప్రోచ్ ఛానల్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. ►ఈసీఆర్ఎఫ్ డ్యాంలో దెబ్బతిన్న గ్యాప్-1 ప్రాంతంలో ఇసుక నింపే కార్యక్రమం పూర్తయ్యింది. ఆప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్‌కూడా పూర్తయ్యింది. ►ఈసీఆర్‌ఫ్ గ్యాప్-2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100శాతం ఇసుక రవాణా పూర్తయ్యింది. ►ఇక వాటిని నింపే పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి. ► నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు తెలిపారు. డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి: సీఎం ► దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ► ఇది పూర్తైతే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు. ► డిసెంబర్ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని అధికారులు తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష ►పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ►కాలనీలు ఓవైపు పూర్తవుతున్న కొద్దీ, సమాంతరంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ► నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు చెప్పారు. ► షెడ్యూలు ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించేలా చూడాలని సీఎం ఆదేశించారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దాలి ► పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిజ్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలి. ►పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలి. ► పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ ఏర్పాటుకూడా చర్యలు తీసుకోవాలి. ►మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. -
పనులు చకచకా.. సీఎం జగన్ పోలవరం పర్యటన దృశ్యాలు
-
నాకు పెళ్లి వద్దు, చదువుకుంటా.. దిశా యాప్ ద్వారా బాలిక ఫిర్యాదు
సాక్షి,ఏలూరు టౌన్: తనకు చదువుకోవాలని ఉన్నా.. పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ ఓ బాలిక దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలిక వద్దకు చేరుకుని.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన బాలికకు ఈనెల 8వ తేదీన వివాహం జరిపించేందుకు ఆమె తల్లిదండ్రులు ముహూర్తం నిర్ణయించారు. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పినా పెద్దలు వినకపోవడంతో.. ఆమె ఆదివారం ఉదయం 9.37 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన దిశ సిబ్బంది సమీపంలోని తడికలపూడి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకన్న, సిబ్బందితో కలిసి 10 నిమిషాల్లోనే బాలిక ఇంటికి చేరుకొని.. ఆమెను విచారించారు. ‘ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను. కనీసం గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాలని ఉంది. నా చదువు పూర్తయ్యాక మా అమ్మ, నాన్న చెప్పినట్లే చేస్తా’ అని ఆ బాలిక పోలీసులతో పాటు తన తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులు కూడా ఆ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. ఆమె చదువును మధ్యలోనే అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. బాలికకు పెళ్లి చేయడం నేరమని వివరించారు. మంచి మార్కులు తెచ్చుకుంటున్న ఆమెను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో బాలిక సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులకు, దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: Odisha Train Accident: ఒక్కరు తప్ప అందరూ సేఫ్ -
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం జగన్
►పోలవరం నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పునరావాసం కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలని పేర్కొన్నారు. ►12, 658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు తెలిపారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్‌గా తీర్చి దిద్దాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పోలవరం వద్ద బ్రిడ్జిని నిర్మించాలని పేర్కొన్నారు. ►దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇది పూర్తయితే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్ కల్లా డయాఫ్రం వాల్ పనుల పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ► పోలవరం ప్రాజెక్టులో చిన్న సమస్యలను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారని.. వరద నీటి ప్రవాహం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ►ఈఎస్‌ఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయా ఫ్రం వాల్ దెబ్బతినడంతో ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఇది మాత్రం ఎల్లో మీడియాలో కనిపించలేదని ఎందుకంటే.. రామోజీ బంధువులకే నామినేషన్ పద్దతిలో పనులు అప్పగించారని సీఎం తెలిపారు. ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌లో ఏమాత్రం సంబంధం లేని గైడ్‌వాల్.. ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ► పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను పరిశీలించారు. ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంపు, ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న దిగువ కాఫర్ డ్యాం పనులను కూడా సీఎం దగ్గరుండి పరిశీలించారు. అదే విధంగా గత ప్రభుత్వంలో ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పరిశీలించారు. ►దిగువ కాఫర్ డ్యాం వద్ద పూర్తయిన పనులను సీఎం జగన్ పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-2 వద్ద కోతకు గురైన డయాఫ్రమ్ వాల్ పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పోలవరం పనులపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరుపుతున్నారు. ► పోలవరం పనుల పురోగతిపై అధికారులు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ తిలకిస్తున్నారు. వరదల సమయంలో ఎగువ కాఫర్ డ్యాం పెంచిన ఎత్తు తీరును, పూర్తైన పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరిస్తున్నారు. కాసేపట్లో పోలవరం పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. ► పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు. ► సీఎం జగన్ కాసేపట్లో పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడ పోలవరం పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ►పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రికార్డు సమయంలో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేసింది. కాఫర్ డ్యామ్ ఎత్తు 44 మీటర్లకు పెంచారు. 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యింది. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇందుకోసం సీఎం జగన్ మంగళవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్ట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్షా నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఫలించిన సీఎం జగన్ కృషి. పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911 కోట్లు మంజూరు చేసింది. బిల్లుల చెల్లింపులో విధించిన పరిమితుల తొలగింపునకు అంగీకారం తెలిపింది. 2013-14 ధరలు కాకుండా తాజా ధర మేర నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాసింది. కేంద్ర ఆర్థికమంత్రి ఆమోదించినట్లు లేఖలో స్పష్టం చేసింది. రూ. 10 వేల కోట్లు అడ్‌హక్‌గా ఇచ్చి ప్రాజెక్ట్ పూర్తికి సహాకారం అందించాలని కోరారు. సీఎం జగన్ విజ్ఙప్తిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. నిధులు విడుదల చేయాలని జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చారు. చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే! -
పేదలకు విద్య, వైద్యం, అందించాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పం
-
వికటించిన టీడీపీ పచ్చ డ్రామా.. బాబు ప్లాన్ అట్టర్ ప్లాప్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజల సంక్షేమం పట్టకుండా.. దేన్నైనా రాజకీయం చేయడమే అలవాటుగా మార్చుకున్న టీడీపీ నేతలు మరోసారి పచ్చ డ్రామాకు తెరతీశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఇరగవరంల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని తడిసిన ధాన్యంతో హడావుడి చేయాలని ప్రయత్నించి అభాసుపాలయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాలతో చేపట్టిన ఈ పచ్చ డ్రామాను పోలీసులు భగ్నం చేశారు. చంద్రబాబు పర్యటించే తణుకు, ఇరగవరం మండలాల్లో ప్రతి 30 అడుగుల దూరంలో నలుగురు రైతులను టీడీపీ నేతలు ఉంచారు. వారందరికీ తలొక ఐదు కిలోలు తడిసిన ధాన్యాన్ని ఇచ్చారు. చంద్రబాబు వచి్చనప్పుడు ఆ ధాన్యం చూపించి పూర్తిగా నష్టపోయామని కన్నీరు పెట్టుకుని చెప్పాలని వారికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. తడిసిన ధాన్యంపై ఎండుగడ్డి కప్పి.. చంద్రబాబు పర్యటించిన తణుకు, ఇరగవరంల్లో తడిసిన ధాన్యం లేకపోవడంతో పాలకొల్లు, దువ్వ మండలాల్లో సేకరించడానికి టీడీపీ గుర్తుతో ఉన్న ఒక ట్రాక్టర్‌ను ఆ పార్టీ నేతలు నాలుగు గ్రామాల్లో తిప్పారు. అక్కడ కొంత తడిసిన ధాన్యాన్ని పోగు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా దానిపై ఎండుగండి కప్పి తణుకు మీదుగా ఇరగవరానికి ట్రాక్టర్‌ను తరలించారు. చంద్రబాబు శుక్రవారం ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్లు పర్యటించి తణుకు బహిరంగ సభలో ప్రసంగించేలా టూర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త మైగాపుల నాగేశ్వరరావు అలియాస్ నాగయ్యకు చెందిన ట్రాక్టర్లో తడిసిన ధాన్యాన్ని తీసుకువచ్చారు. ఇరగవరం మండలం నుంచి తణుకులో చంద్రబాబు ప్రవేశించే రోడ్డుపై ముందస్తుగా కుప్పపోసి పెట్టారు. తణుకు పోలీసులు చంద్రబాబు భద్రతలో భాగంగా ఆ రోడ్డును తనిఖీ చేశారు. ఈ క్రమంలో ‘తణుకు రూరల్ మండలంలో తడిసిన ధాన్యం లేదు కదా ఇదంతా ఏంటి’ అని ట్రాక్టర్ యజమానిని పోలీసులు ప్రశి్నంచారు. టీడీపీ నేత రాధాకృష్ణ సూచనల మేరకు దువ్వ, ఇతర ప్రాంతాల నుంచి తడిసిన ధాన్యాన్ని తెచ్చామని ట్రాక్టర్ యజమాని చెప్పాడు. తణుకు, ఇరగవరం మండలాలకు చెందిన ధాన్యం కాకపోవడంతో పోలీసులు, అక్కడే ఉన్న రైతులు ఇది సరికాదని ట్రాక్టర్ యజమానిని హెచ్చరించారు. దీంతో రోడ్డుపై పోసిన ధాన్యాన్ని ట్రాక్టర్లోకి టీడీపీ నేతలు లోడ్ చేశారు. ట్రాక్టర్‌కు పరి్మట్, లైసెన్స్ లేకపోవడంతో పోలీసులు వాహనాన్ని రవాణా శాఖాధికారులకు అప్పగించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల సరికొత్త డ్రామా.. పోలీసులు ట్రాక్టర్‌ను పట్టుకున్నప్పుడు అదే సమయంలో అటుగా వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతులపై దౌర్జన్యం చేస్తారా అంటూ పోలీసులపై చిందులు తొక్కారు. ఇది ఇక్కడి ధాన్యం కాదని, ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ కుప్పలు పోయడం సరికాదని పోలీసులు రామానాయుడికి గట్టిగా చెప్పారు. దీంతో నిమ్మల అక్కడ నుంచి జారుకున్నారు. రైతుల నుంచి స్పందన కరువు బాబు యాత్రకు రైతుల నుంచి స్పందన కరువైంది. జనాలను తరలించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నా ఫ్లాప్ షోగానే మిగిలింది. కనీసం పదుల సంఖ్యలో కూడా రైతులు కనిపించలేదు. గోటేరులో ఇద్దరు టీడీపీ సానుభూతిపరులతో మాట్లాడించారు. వారిలో కూడా ఒక రైతు ‘ఎవరొచ్చినా మాకేం ఉపయోగంలేదు.. అని చెప్పి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయం -
ధనవంతులకు ఉపయోగపడేలా ఎయిర్‌పోర్టులు కట్టాను: చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు రూరల్: సమస్యలు చెప్పుకోవడానికి రైతులు తన వద్దకు వస్తుంటే రాకుండా అడ్డుకుని భయపెడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి తాను వస్తుంటే.. రైతులను రానీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌పోర్టులు, పోర్టులు అభివృద్ధి చేసి ధనవంతులకు బాగా ఉపయోగపడ్డానని గుర్తు చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయితే కోస్తాలో ఆక్వా కల్చర్, రాయలసీమలో హార్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఆక్వా జోన్ పరిమితి లేకుండా ఆక్వా సాగుదారులందరికీ రూ.1.50కే కరెంట్ ఇస్తానని తెలిపారు. రాష్ట్రంలో రైస్ మిల్లర్లు దళారులుగా మారారని ధ్వజమెత్తారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. పరిహారం ఇవ్వాలని అడిగినా అసమర్థ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. చదవండి: ‘వరం’ పోయిందని కడుపు మంట సంక్షోభంలో ఉన్న రైతులను పరామర్శించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రతి ఎకరాకూ రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం వస్తుందని చెబుతుంటే తన మీద విమర్శలు, ప్రతిదాడి చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తాను 72 గంటల సమయం ఇచ్చినా రైతుల సమస్య పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం కల్లాల్లోని ధాన్యం కొనే వరకు రైతుల తరఫున పోరాడతానని చెప్పారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని వెల్లడించారు. -
ఇంజనీరింగ్ విద్యార్థిని బంధించి.. బలాత్కరించి.. చంపబోయాడు
ఏలూరు టౌన్:ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ఇంజనీరింగ్ విద్యార్థినిని నిర్బంధించి.. ఆమె వంటిపై వేడి నూనె పోసి గాయపర్చి.. ఆపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఎస్పీ డీ.మేరీప్రశాంతి ఆదేశాలతో 24 గంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బాధితురాలికి సత్వర న్యాయం అందించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సోమవారం సాయంత్రం స్థానిక త్రీటౌన్ స్టేషన్లో ఏలూరు దిశ డీఎస్పీ కేవీ సత్యనారాయణ మీడియాతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 12 రోజులు నిర్బంధించి లైంగిక దాడి దుగ్గిరాల గ్రామానికి చెందిన బాధితురాలు కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. నిందితుడు సదర్ల అనుదీప్ అదే గ్రా మానికి చెందిన వ్యక్తి. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5న అనుదీప్ కాకినాడ వెళ్లి బాధితురాలిని కలుసుకున్నాడు. ఇద్దరూ చెన్నై వెళ్లి వేలంగిణి మాత చర్చికి వెళ్లారు. నిందితుడు అనుదీప్ తాను వేసుకున్న క్రీస్తు మాలను ఈస్టర్ రోజున తీశాడు. కాగా, బాధితురాలిని 10వ తేదీ రాత్రి ఏలూరులోని దుగ్గిరాల జోసఫ్ నగర్లో గల నాన్నమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. అదేరోజు రాత్రి తన కోరిక తీర్చాలని బాధితురాలిపై ఒత్తిడి చేయగా ఆమె ఒప్పుకోలేదు. మరుసటి రోజు మరోసారి కోరిక తీర్చాలంటూ బలవంతం చేసేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అనుదీప్ వేడిగా మరిగించిన నూనెను ఆమె వంటిపై పోయటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత 12 రోజుల పాటు ఆమెను ఇంట్లోనే బంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు చంపేందుకు ప్రయత్నించటంతో బాధితురాలు అతని నుంచి తప్పించుకుని అతని ఫోన్ లాక్కొని తండ్రికి ఫోన్ చేయగా.. వారు వచ్చి ఆమెను ఏలూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో చేర్పించారు. నిందితుడిపై హిస్టరీ షీట్ బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా అనుదీప్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని దిశ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. సోమవారం నిందితుడు అనుదీప్‌ను ఏలూరు కొత్త బస్టాండ్ సమీ పంలో అరెస్ట్ చేశామని చెప్పారు. నేరం జరిగిన ప్రాంతంలో దర్యాప్తు చేయటంతో పాటు, ఆధారాలను సేకరించి ల్యాబ్‌కు పంపామని తెలిపారు. బాధితురాలికి సత్వర న్యాయం చేసే దిశగా త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఎస్పీ మేరీప్రశాంతి ఆదేశాల మేరకు నిందితుడు అనుదీప్ పై హిస్టరీ షీట్ తెరుస్తున్నట్టు చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవని, మైనర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక దాడులకు పాల్ప డినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అమెరికాలో ఏలూరు వాసి మృతి.. స్వదేశం రప్పించేందుకు సన్నాహాలు
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో మరణించిన ఏలూరు జిల్లాకు చెందిన 'వీర సాయేష్' అకాల మరణంపై APNRTS సోషల్ మీడియా ద్వారా సాయేష్ కుటుంబ సభ్యుల వివరాలను కనుగొంది. వారు అందించిన ఫోన్ నంబర్లకు APNRTS 24/7 హెల్ప్ లైన్ టీమ్ ఫోన్ చేసి సంబంధిత వివరాలన్నింటినీ సేకరించింది. అమెరికా నుంచి సాయేష్ భౌతిక కాయాన్నిరాష్ట్రప్రభుత్వం ద్వారా స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. అయితే, సాయేష్ కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని భారతదేశం తీసుకురావడానికి తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ద్వారా సహాయం అందుతోందని తెలియజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం కావాలంటే APNRTS ద్వారా తీసుకుంటామన్నారు. APNRTS బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. గమ్యస్థాన విమానాశ్రయం నుండి సాయేష్ పార్థివదేహాన్ని వారి కుటుంబానికి చేర్చడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. సాయేష్ భౌతికకాయం ఒహియో రాష్ట్రంలో స్థానిక లాంఛనాలు పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో స్వదేశం చేరుకునే అవకాశం ఉంది మేడపాటి పేర్కొన్నారు. -
ఆ విషయంలో నన్ను క్షమించండి: సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించారు.తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తనకు జరిగిన ప్రమాదంపై ఎమోషనలయ్యారు సాయి ధరమ్ తేజ్. బైక్‌పై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. 'ఊహించని ప్రమాదంతో బైక్ పైనుంచి కిందపడ్డా. ఆ ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు నన్ను క్షమించండి. నాకు స్పృహ వచ్చాక మొదట చూసింది మా అమ్మను, తమ్మున్ని. వారికి సారీ చెప్పేందుకు కూడా నాకు మాట రాలేదు. బాధ ఒక మనిషిని ఎంత మార్చగలదో అప్పుడే అర్థమైంది. జీవితంలో ఎదురైన సవాలును స్వీకరించా. మీ అందరితో ఎలాగైనా మాట్లాడని గట్టిగా నిర్ణయించుకున్నా. మీ ప్రేమను పొందాలనేదే నా లక్ష్యం. మీ లక్ష్యం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే అసలు తగ్గొద్దు. మీ తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా చేయండి. అలాగే ప్రయాణించేటప్పుడు దయచేసి హెల్మెట్ వాడండి.' అని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన మొదటి చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
కాలుష్య కాసారంతో నిండిపోతున్న కృష్ణ కెనాల్ కాలువ...
-
ఏలూరు: దురంతో ఎక్స్‌ప్రెస్‌కు అడ్డుగా బొలెరో.. ఢీ కొట్టిన రైలు
సాక్షి, ఏలూరు: దురంతో ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా.. జిల్లా పరిధిలోని భీమడోలు వద్ద పట్టాలపై అడ్డంగా ఉన్న ఓ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ క్రమంలో వాహనం తుక్కుతుక్కు కాగా, రైల్ ఇంజిన్.. ముందుభాగం పాక్షికంగా దెబ్బతింది. మరో ఇంజిన్ మార్చాల్సి రావడంతో ప్రయాణికులు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏం జరిగిందంటే.. గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్ రాక సందర్భంగా భీమడోలు జంక్షన్ వద్ద గేట్ వేశారు. అయితే.. బొలెరోలో వచ్చిన కొందరు గేట్‌ను ఢీ కొట్టి మరీ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో రైలు దగ్గరగా రావడంతో.. బొలెరోను అక్కడే వదిలేసి పారిపోయారు. ఇక రైలు ఢీ కొట్టడంతో వాహనం ధ్వంసమైంది. మరో ఇంజిన్ మార్చాల్సి రావడంతో పలువురు ప్రయాణికులు.. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నారు. ఇక ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టి.. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
ఏలూరులో YSRCP ఘన విజయం
-
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు
-
Sakshi Premier League: చాంప్స్ ఎన్ఆర్ఐ, సర్ సీఆర్ రెడ్డి కాలేజీలు
చేబ్రోలు: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో జూనియర్ విభాగంలో ఎన్ఆర్ఐ కాలేజి (విజయవాడ), సీనియర్ విభాగంలో సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి (ఏలూరు) జట్లు చాంపియన్స్‌గా నిలిచాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం ఎస్పీఎల్ టోర్నీ ఘనంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరై విన్నర్స్, రన్నరప్ జట్లకు నగదు పురస్కారాలు, ట్రోఫీలను అందజేశారు. చాంపియన్ జట్లకు రూ. 25 వేలు... రన్నరప్ జట్లకు రూ. 15 వేలు చొప్పున నగదు పురస్కారం లభించింది. జూనియర్ విభాగం ఫైనల్లో ఎన్ఆర్ఐ కాలేజి 35 పరుగులతో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి (విశాఖపట్నం)పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్ఆర్ఐ జట్టు నిర్ణేత 20 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు సాధించింది. రూపేష్ (60 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రేవంత్ (45 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో మెరిశారు. అనంతరం సాయి గణపతి కాలేజి 16.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఎన్ఆర్ఐ జట్టు బౌలర్లలో తరుణ్ 4 వికెట్లు, రేవంత్ 2 వికెట్లు పడగొట్టారు. రేవంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. సీనియర్ విభాగం ఫైనల్లో సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ (సీకామ్) డిగ్రీ కాలేజి (తిరుపతి) జట్టును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. మొదట సీకామ్ కాలేజి 19.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. శివ కార్తీక్ (51 బంతుల్లో 42 పరుగులు; 3 ఫోర్లు) రాణించాడు. సీఆర్ రెడ్డి కాలేజి బౌలర్ మనోజ్ నాలుగు, వికెట్లు పడగొట్టాడు. అనంతరం సర్ సీఆర్ రెడ్డి కాలేజి 15.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 117 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ గగన్ కుమార్ (47 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), సంజయ్ (27 బంతుల్లో 23; 3 ఫోర్లు) రాణించారు. జూనియర్ విభాగంలో ఎన్ఆర్ఐ కాలేజి ఆటగాడు రేవంత్... సీనియర్ విభాగంలో సీఆర్ రెడ్డి కాలేజి ఆటగాడు మనోజ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కించుకున్నారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గాల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. మొత్తం 8 మంది అభ్యర్థులు 15 నామినేషన్లు దాఖలు చేయగా నామినేషన్ల పరిశీలన అనంతరం ఏడుగురు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ (వైఎస్సార్సీపీ), వంకా రాజకుమారి, వీరవల్లి చంద్రశేఖర్, దేవరపల్లి ఆదాం, గోరింక దాసు, పసల వెంకటాచలం (స్వతంత్ర) అభ్యర్థుల నామినేషన్లను పరిగణనలోకి తీసుకున్నట్టు అరుణ్‌బాబు తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నల్లి రాజేష్ నామినేషన్ మూడు సెట్లూ నిబంధనల మేరకు లేకపోవడంతో తిరస్కరించామన్నారు. 1 నుంచి సొసైటీల్లో తనిఖీలు ఏలూరు(మెట్రో): జిల్లాలోని కో–ఆపరేటివ్ సొసైటీల్లో అమలవుతున్న పనులకు సంబంధించి జిల్లాలోని సీనియర్ అధికారులతో వచ్చేనెల 1 నుంచి 31 వరకు రికార్డులు తనిఖీ చేయిస్తామని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాలోని సొసైటీ సీఈఓలు, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్లు, వ్యవసాయ పరపతి సంఘాల కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సొసైటీల బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. కొన్ని సొసైటీల్లో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై విచా రణ చేపట్టి నివేదికను సమర్పించాలని ఆదేశించా రు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా సహకార అధికారి టి.ప్రవీణ, డీసీసీబీ జనరల్ మేనేజర్ కె.శ్రీనివాస్, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ శ్రీదేవి పాల్గొన్నారు. -
ఆగని ఆగ్రహ జ్వాల
చింతలపూడి: ఈనాడులో తప్పుడు వార్తలు ప్రచురించిన రామోజీరావు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడు పట్టాభిని పోలీసులు కొట్టారంటూ పాత ఫొటోలతో ఈనాడులో అసత్య వార్తలు ప్రచురించినందుకు నిరసనగా ఎమ్మెల్యే ఎలీజా ఆధ్వర్యంలో స్థానిక బోసుబొమ్మ సెంటర్లో శుక్రవారం ఈనాడు పత్రులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై పచ్చ మీడియా విషపు రాతలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక రోజూ అవాస్తవాలను ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టాలని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయతను పోగొట్టాలని విషం కక్కుతున్నారని అన్నారు. ఈనాడు పత్రికను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కొప్పుల నాగేశ్వరరావు, సచివాలయాల మండల కన్వినర్ త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, నగర పంచాయతీ సచివాలయాల కన్వీనర్ ఎన్.దుర్గారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎస్‌వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో.. ఫైర్‌స్టేషన్ సెంటర్లో వైఎస్సార్ సీపీ నాయకులు ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న రామోజీరావు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్, ఈడా చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి, కో–ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రీజ నల్ కో–ఆర్డినేటర్ డీవీ రామాంజనేయులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నూజివీడులో..ఈనాడు రాసే వార్తలన్నీ తప్పుడు రాతలేనని మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ ధ్వజమెత్తారు. పట్టణంలోని చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో ఈనాడు పత్రులను దహనం చేసి నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, వైఎస్సార్సీపీ నాయకులు షేక్ యూనస్పాషా (గబ్బర్) తదితరులు పాల్గొన్నారు. భీమడోలులో.. భీమడోలు మండల వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ సెంటర్లో ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. రామోజీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ సేవాదళ్ నియోజకవర్గ కన్వీనర్ తుమ్మగుంట రంగ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ముళ్లగిరి జాన్సన్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వంపై విషం కక్కేలా ఈనాడు వార్తలను ప్రచురించడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రావిపాటి సత్యశ్రీనివాస్, నియోజకవర్గ జగన్ సేవాదళ్ కన్వీనర్ తుమ్మగుంట రంగ తదితరులు పాల్గొన్నారు. గాలాయగూడెంలో.. దెందులూరు: గాలాయగూడెంలో సర్పంచ్ చిలకా వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. -
ప్రగతి బాటలు
సాక్షి, భీమవరం: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా రోడ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానమైన భీమవరం–యండగండి రహదారి పనులను సుమారు రూ.15.9 కోట్ల వ్యయంతో సీఆర్ఎఫ్ పథకంలో చేపట్టారు. పనులు వేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే దాదాపు గరగపర్రు గ్రామం వరకు రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. జిల్లాలో ప్రధాన రహదారి : భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లేందుకు ప్రధానమైన ఈ రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఆర్టీసీ బస్సులతో పాటు సరుకు రవాణా వాహనాలు తిరుగుతుంటాయి. ఈ రోడ్డుకు ఇరువైపులా పంట కాలువ, మురుగు కాలువలు ఉండటంతో తరచూ గోతులు పడుతున్నాయి. రహదారిని పూర్తిస్థాయిలో పటిష్టంగా నిర్మించాలనే డిమాండ్ ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నామమాత్రపు మరమ్మతులతో సరిపెట్టేశారు. ఈ నేపథ్యంలో భీమవరం నుంచి పిప్పర వరకు రోడ్డు సమస్య పరిష్కారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా భీమవరం నుంచి యండగండి వరకు సుమారు 8.56 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.15.9 కోట్లు సీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసింది. దీంతో ఆర్అండ్బీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇరువైపులా రోడ్డును విస్తరించడంతో పాటు తారుతో పటిష్టంగా నిర్మాణ పనులు చేపట్టారు. భీమవరం నుంచి గరగపర్రు వరకు దాదాపు రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. గరగపర్రు నుంచి యండగండి వరకు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే రోడ్డు రెండువైపులా విస్తరించి మొదటి పొర కంకర వేసి చదును చేశారు. మరో పొర కంకరతో చదును చేసి తారురోడ్డు వేయాల్సి ఉంది. రహదారి పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. -
జిల్లాలో ఐదు ఎంఎస్ఎంఈ క్లస్టర్లు
ఏలూరు(మెట్రో): జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఐదు ఎంఎస్ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎంఎస్ఎంఈలతో పాటు భారీ పరిశ్రమల ఏర్పాటుకు రుణాలిచ్చేలా బ్యాంకర్లు సహకరించాలన్నారు. వెమ్ టెక్నాలజీస్ నుంచి స్వాధీనం చేసుకున్న పెదపాడు మండలం వట్లూరు, భోగాపురం గ్రామాల్లోని 350 ఎకరాల స్థలంలోని 25 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 2022–23 సంవత్సరంలో సింగిల్ డెస్క్ పథకం ద్వారా ఇప్పటివరకు 244 దరఖాస్తులు రాగా 230 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామన్నారు. ఐడీపీ తదితర పథకాల ద్వారా 20 యూనిట్లకు ప్రతిపాదనలు రాగా రాయితీల కింద రూ.2.77 కోట్ల మంజూరుకు సమావేశం ఆమోదం తెలిపింది. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న పెద్ద లే అవుట్లలో అనువైన స్థలాలను గుర్తించి గార్మెంట్ తదితర ఉత్పత్తిదారులను సమన్వయం చేసుకొని ముడిసరుకు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేలా కాటేజ్ ఇండస్ట్రీస్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులకు నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పి.ఏసుదాసు, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సెపక్‌తక్రాలో సత్తా
ద్వారకాతిరుమల : మండలంలోని రామసింగవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని పాకనాటి బాల భవ్యశ్రీ రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీల్లో సత్తా చాటింది. పాఠశాల హెచ్ఎం ఎల్.వెంకటేశ్వరరావు విద్యార్థినితో పాటు, వ్యాయామ ఉపాధ్యాయుడు పాకా సతీష్‌ను అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఉరవకొండలో ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన 63వ రాష్ట్రస్థాయి సెపక్తక్రా పోటీల్లో, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అండర్–14 బాలికల జట్టు ప్రథమ స్థానం సాధించిందన్నారు. జట్టు విజయంలో బాల భవ్యశ్రీ ముఖ్యపాత్ర పోషించిందని తెలిపారు. విద్యార్ధినికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు సతీష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ
నరసాపురం: వైఎన్ కళాశాల విద్యార్థులు అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీల్లో బహుమతులు సాధించారు. యూపీకి చెందిన చారు క్యాసిల్ పౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీల్లో కళాశాల డిగ్రీ విద్యార్థులు ఆర్.జ్యోతిరత్నం, ఎన్.బాలమురళీకృష్ణ, ప్రి.ప్రసూన, కె.గణేష్‌లు పతకాలు సాధించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ ఏపీవీ అప్పారావు చెప్పారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఆన్లైన్లో జరిగిన ఇలాంటి అంతర్జాతీయ పోటీల్లో విద్యార్థులు పాల్గొని బహుమతులు గెలవడం అభినందనీయమన్నారు. తోటి విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరత్నం, కళాశాల డీన్ గంధం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో టీవీ చానల్స్
ఏలూరు (టూటౌన్): డిజిటల్ టెలివిజన్ చానల్స్‌కు రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ ఏలూరు బిజినెస్ ఏరియా, సిటీ ఆన్లైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా డిజిటల్ టెలివిజన్ చానల్స్ ప్రసారం చేయడం అభినందనీయమని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. ఉల్కా టీవీ బ్రాండ్ పేరుతో ఉన్న సిటీ ఆన్లైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సేవలను బీఎస్ఎన్ఎల్ ఐపీ నెట్వర్క్ ద్వారా అందించే కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ ఒకే కనెక్షన్‌తో మూడు రకాల సేవలు అందిచడం గొప్ప విషయమన్నారు. ఏలూరు బిజినెస్ ఏరియా జీఎం ఎల్.శ్రీను మాట్లాడుతూ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చానల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. సిటీ ఆన్లైన్ మీడియా డైరెక్టర్ రాఘవరావు, ఐబీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మూడు అడుగులు పైకి
ఆధునిక సాంకేతికత సాయంతో ఇప్పుడు ఇళ్లను పైకి లేపడం కూడా సాధ్యమైంది. ఆకివీడు మాదివాడలో అత్తిలి శ్రీనుకు చెందిన భవనాన్ని 2000లో నిర్మించారు. అప్పటి రోడ్డు లెవల్‌కు భవనం నిర్మించారు. ఇటీవల సీసీ రోడ్డు నిర్మాణంతో భవనం పల్లం అవడంతో వర్షపు నీరు లోపలికి వస్తుంది. దీంతో యజమాని శ్రీను బీహార్‌కు చెందిన కార్మికుల సాయంతో భవనాన్ని ఎత్తు చేసేందుకు నిర్ణయించారు. మూడు అడుగుల ఎత్తుకు భవనం పైకి లేపి, కింద భాగంలో కాంక్రీట్ వేస్తారు. ఈ విధంగా పైకి లేపి ఎత్తు చేసినందుకు అడుగుకు రూ.600 ఖర్చు అవుతుందని చెప్పారు. భవనం పైకి లేపేందుకు పునాదులలో జాకీలు అమర్చారు. – ఆకివీడు -
దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు
జంగారెడ్డిగూడెం: గుర్తుతెలియని వ్యక్తి దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రి ధర్మవరపు గోపి తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం జేపీ సెంటర్ సమీపంలో ఒక భవనం రెండో ఫ్లోర్లో ధర్మవరపు గోపి, భార్య, కుమారుడు సంజయ్‌తో ఉంటున్నారు. గోపి ఓ ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగి కాగా, అతని భార్య టీచర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు సంజయ్‌ను అదే స్కూల్లో చదివిస్తున్నారు. శుక్రవారం ఉదయం సంజయ్ స్కూల్‌కు వెళ్లడం ఆలస్యం కాగా.. తల్లి స్కూల్‌కు వెళ్లిపోయింది. గోపి సంజయ్‌ను స్కూల్ వద్ద దింపేందుకు ఇంటికి వెళ్లాడు. అయితే సంజయ్ ఇంటి వద్ద స్పృహ తప్పి పడిపోయి ఉండటాన్ని గమనించి వెళ్లి చూడగా, చేతి మణికట్టు, మెడపై కోసిన గాయాలు కనిపించాయి. వెంటనే సంజయ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బ్లేడ్‌తో దాడి చేసి చేతిపై మెడపై కోశాడన్నారు. తప్పించుకునేందుకు తాను ప్రతిఘటించానని, చేతికి అందిన వస్తువులు అతనిపై విసిరివేయడంతో గుర్తుతెలియని వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడన్నారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గోపి తెలిపారు. -
బాస్కెట్‌బాల్‌లో ప్రతిభ
పెనుమంట్ర : ఇటీవల నూజివీడులో జరిగిన అంతర్జిల్లా అండర్–14, అండర్–17 బాస్కెట్‌బాల్ పోటీలలో మార్టేరుకు చెందిన శ్రీవేణుగోపాల ఉన్నత పాఠశాలకు చెందిన బాలురు, శ్రీబాసంతీదేవి బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధులు విశేష ప్రతిభ కనబరిచినట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెల్లబోయిన శివజ్యోతి, ఎస్టీ గణపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్టేరు వేణుగోపాల ఉన్నత పాఠశాలకు చెందిన జుత్తిగ అనీష్, మారుమూడి కృపాల్, పెనుగొండ కిరణ్ అండర్–14 విభాగంగలో పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచారని, అదేవిధంగా అండర్–17 విభాగంలో నక్కా సందీప్, గెద్దాడ శివసాయి, నీలాపు వినయ్, అప్పారి మోహన్రామ్శెట్టి పశ్చిమ గోదావరి జట్టుకు రజత పథకం అందించారని పీఈటీ కర్రి కృష్ణారెడ్డి తెలిపారు. అండర్–14 బాలికల విభాగంలో వాసంతీదేవి బాలికోన్నత పాఠశాలకు చెందిన బి జ్యోష్ని గోల్డ్ మెడల్ సాధించినట్లు పీడీ వారధి వెంకటరమణ తెలిపారు. విద్యార్ధులను మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు తదితరులు అభినందించారు. -
ఏలూరు జిల్లాలో వెల్లివిరిసిన విద్యార్థుల ప్రతిభ
-
ఏలూరు జిల్లాలో బస్సు బీభత్సం
-
ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. వాహనాలపైకి దూసుకెళ్లి..
సాక్షి, ఏలూరు: జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆగిఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సినిమాను మించిన లవ్‌స్టోరీ.. విజయవాడ నుంచి పారిపోయి.. -
టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కైకలూరు నియోజకర్గ టీడీపీలో కల్లోలం రేగింది. ప్రస్తుతం ఇన్చార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీకి రాజీనామా చేసి అధికార వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకోనుండటంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కేడర్ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనస్త్రాలు సంధించింది. మరోవైపు ఇన్చార్జిగా ఎవరినైనా కొంతకాలం పెట్టి పార్టీని నడపడానికి సన్నాహాలు చేస్తున్నా, ఇన్చార్జి పదవికి ముఖ్యులంతా ముఖం చాటేస్తుండటంతో తెలుగుదేశం పార్టీ డైలామాలో పడింది. ఇప్పటికే టీడీపీ రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ గురువారం వైఎస్సార్సీపీలో చేరనున్నారు. హడావుడిగా టీడీపీ నేతల భేటీ దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో జయమంగళ వెంకటరమణ క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. బీసీ నేతగా నియోజకవర్గంలో పట్టు ఉండటంతో 1998లో కైకలూరు జెడ్పీటీసీగా గెలుపొందారు. అనంతరం 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో పార్టీ అంతర్గత వెన్నుపోట్లతో టికెట్ కోల్పోయారు. మళ్ళీ 2019లో చివరి నిమిషంలో టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలో వెన్నుపోటు రాజకీయాలతో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో అనేక హామీలు, పార్టీపరంగా రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పినప్పటికీ ఆయనను పూర్తిగా విస్మరించారు. దీంతో టీడీపీ తీరుపై విరక్తి చెంది పార్టీకి రాజీనామా ప్రకటించడంతో టీడీపీ అంతర్మథనంలో పడింది. బుధవారం హడావుడిగా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసంలో ఏర్పాటు చేశారు. అది కాస్తా రసాభాసగా సాగింది. నేతలతో వాగ్వాదం: దీంతో కేడర్‌ను కాపాడుకోడానికి మాగంటి బాబు, ఏలూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, బొర్రా చలమయ్యలు సమావేశానికి హాజరయ్యారు. ప్రారంభంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు జానీకి కనీసం వేదికపై చోటు ఇవ్వకపోవడంతో నిలదీశారు. అతనికి మద్దతుగా రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి జె.ఎస్.మాల్యాద్రి వేదికపై నాయకులను ప్రశ్నించారు. దీంతో గన్ని వీరాంజనేయులు సర్ధిచెప్పారు. సమావేశం అనంతరం జానీ, మాల్యాద్రిలు మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావుకు ఈ విషయాన్ని చెప్పారు. ఈ నేపధ్యంలో కమ్మిలి విఠల్, జానీ, మాల్యాద్రిల మధ్య మాటల యుద్ధం జరిగింది. పోటీ కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిక వైఎస్సార్సీపీలోకి చేరుతున్న జయమంగళ ప్రధాన అనుచరులను పొమ్మనలేక పొగబెడుతున్నారని జానీ, మల్యాద్రి మండిపడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తే ఇప్పుడు గెంటేయడానికి ప్రయత్ని స్తున్నారన్నారు. ఇలాగైతే టీడీపీలో విడిగా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు మాట్లాడుతూ.. మీది నాతో మాట్లాడే స్థాయి కాదని, నా మాటలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావుతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు జానీ, మాల్యాద్రి కొనసాగుతున్న రాజీనామాల పర్వం తెలుగుదేశం పార్టీకి కైకలూరు నియోజకవర్గంలో కాలం చెల్లే పరిస్థితి దాపరించింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పారీ్టకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని మంగళవారం ప్రకటించిన విషయం విధితమే. అదే బాటలో టీడీపీ రైతు అధికార ప్రతినిధి సయ్యపురాజు గుర్రాజు పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకు లేఖ పంపారు. జయమంగళతో పాటు వైఎస్సార్సీపీలోకి వెళుతున్నట్లు స్థానికలతో చెప్పారు. గుర్రాజు బాటలోనే మరికొందరు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి త్వరలో రానున్నట్లు సమాచారం. డీఎన్నార్‌ను కలిసిన జయమంగళ వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా కృషి చేస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ స్పష్టం చేశారు. కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)ను బుధవారం ఆయన మర్వాదపూర్వకంగా కలిశారు. డీఎన్నార్‌కు జయమంగళ పూలమాల వేసి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ముందుగా డీఎన్నార్ మాట్లాడుతూ జయమంగళ వెంకటరమణ టీడీపీ పాలనలో అణచివేతకు గురైన బీసీ నాయకుడన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి సీఎం జగన్ మోహన్‌రెడ్డికి జయమంగళ పేరును ఎమ్మెల్సీగా సూచించామన్నారు. కొల్లేరు అభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. జయమంగళ రాకతో కొల్లేరు ప్రజలకు మరింత చేరువగా పథకాలను అందిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మాట విని టిక్కెట్టును కామినేని శ్రీనివాస్‌కు త్యాగం చేశానన్నారు. తనకు మొదటి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కొల్లేరు కాంటూరు కుదింపుపై అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. నేడు సీఎం జగన్ కొల్లేరు రీసర్వే, రెగ్యులేటర్ల నిర్మాణం, పెద్దింట్లమ్మ వారధి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. భవిష్యత్తులో డీఎన్నార్ భారీ మెజారి్టఈతో ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి కృషి చేస్తానని చెప్పారు. కొల్లేరులంక గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి వైఎస్సార్సీపీ చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తానని చెప్పారు. గురువారం మధ్యాహ్నం సీఎం జగన్ మోహన్‌రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు జయమంగళ తెలిపారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే డీఎన్నార్ కుమారులు వినయ్, శ్యామ్‌కుమార్, టీడీపీకి రాజీనామా చేసిన రాష్ట్ర నాయకుడు సయ్యపురాజు గుర్రాజు ఉన్నారు. -
సిరులు కురిపిస్తున్న ఆయిల్‌పామ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో ఆయిల్‌పామ్ రైతు పంట పండుతున్నది. గతేడాది కంటే ఈ ఏడాది ధర తగ్గినప్పటికీ సాగు విస్తీర్ణం మాత్రం ఏలూరు జిల్లాలో గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్రంలో పామాయిల్ సాగు తొమ్మిది జిల్లాల్లో ఉండగా.. అందులో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని సాగు విస్తీర్ణం మొత్తంతో పోలి్చతే జిల్లాలోనే సుమారు 50 శాతం ఉండటం విశేషం. గడిచిన నాలుగేళ్లలో ఏటా సగటున నాలుగు వేల ఎకరాల చొప్పున పామాయిల్ సాగు పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం.. ఉమ్మడి పశి్చమలో 1988లో ఆయిల్‌పామ్ సాగు జిల్లాకు పరిచయమైంది. 1992లో టీఎంఓపీ పథకం ద్వారా దీన్ని ప్రారంభించి పెదవేగి ఆయిల్‌ఫెడ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో 1996 నుంచి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడం ప్రారంభమైంది. అధిక ఆదాయంతో పాటు అంతర పంటలకు అవకాశం ఉన్న ఆయిల్‌పామ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించడంతో మెట్ట ప్రాంతంలో రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపారు. ఆయిల్‌పామ్ కంపెనీల ద్వారా మొక్కలను సబ్సిడీపై రైతులకు అందించి హెక్టారుకు రూ.5,250 చొప్పున మొదటి నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చుల పేరుతో రైతుకు జమ చేస్తున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 2,16,192 ఎకరాల్లో ఈ ఏడాది ఆయిల్‌పామ్ సాగవుతోంది. పామాయిల్ మొక్క ఇవ్వడం మొదలుకుని దిగుమతి వచ్చేవరకు అన్నీ ఆయిల్‌పామ్ కంపెనీలు చూస్తుండడం, సాగుకు సబ్సిడీలు ఉండడం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో మెట్ట ప్రాంతంలో ప్రధాన పంటగా మారిపోయింది. ప్రతి ఏటా ముడిచమురు, పామాయిల్ ధరలను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం, ఆయిల్‌ఫెడ్ కంపెనీలు కలిసి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో (ఓఈఆర్) ప్రకారం ధర నిర్ణయిస్తాయి. గతేడాది అంతర్జాతీయంగా పామాయిల్‌కు విపరీతమైన డిమాండ్ ఉండడంతో రికార్డు స్థాయిలో టన్ను ధర రూ.23 వేలకు చేరింది. ఆయిల్‌పామ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. ఈ ఏడాది అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ప్రస్తుతం టన్ను రూ.13,400గా ఉంది. మార్కెట్ ధరలతో నిమిత్తం లేకుండా సాగు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రధానంగా ఎకరాకు 10 టన్నుల దిగుబడి రావడం, ఐదో సంవత్సరం నుంచే దిగుబడి వస్తుండటంతో సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఐదో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమై ప్రతి మొక్క 30 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. నీటి వనరులు మినహా ఎలాంటి నిర్వహణ ఖర్చులూ ఉండకపోవడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో... ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో 2,16,190 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులో ఉంది. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా ఉందని, 3.12 లక్షల ఎకరాలు పామాయిల్ సాగుకు అనుకూలమైన ప్రాంతంగా ఉందని ఉద్యాన శాఖాధికారులు నిర్ధారించారు. దీనిలో 2.16 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. కామవరపుకోట, చింతలపూడి, టి.నర్సాపురం, ద్వారకాతిరుమల మండలాల్లో ఇది అధికం. జిల్లాలో నవభారత్ ఆగ్రో, 3 గోద్రేజ్ ఆర్గో వెట్ కంపెనీలు, ఏపీ ఆయిల్‌ఫెడ్, పతంజలి ఫుడ్స్, ఫుడ్స్ అండ్ ప్యాడ్స్ తదితర కంపెనీల ద్వారా మొక్క సరఫరా నుంచి కొనుగోలు వరకు కొనసాగుతోంది. ప్రతి కంపెనీకి కొన్ని మండలాలు కేటాయించి, వాటి పరిధిలో మొక్క సరఫరా నుంచి కొనుగోలు వరకు ఉద్యానవన శాఖ పర్యవేక్షణలో కంపెనీయే నిర్వహించేలా చూస్తున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా ప్రోత్సాహం ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. సాగుకు సంబంధించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి, ఇతర సాంకేతిక పరమైన పరిష్కారాల కోసం ఆయిల్‌ఫెడ్ పరిశోధనా స్థానం కూడా ఉంది. సాగులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. – ఎ.దుర్గేష్, ఇన్చార్జి డీడీ -
ఏలూరులో టీడీపీకి భారీ షాక్
సాక్షి, ఏలూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఆ పార్టీకి కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, కైకలూరు టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసేశారాయన. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నచ్చి.. వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించేశారు. కైకలూరులో బహిరంగ సభ నిర్వహించి ప్రజా సమక్షంలోనే ఆయన తన రాజీనామా ప్రకటన చేయడం గమనార్హం. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. 2014లో చంద్రబాబు మాటలు విని మోసపోయా. ఎంత కష్టపడినా నన్ను ఒక బలిపశువును చేశారు టీడీపీలో అంతా గ్రూపు రాజకీయాలే నడుస్తున్నాయి. అందుకే టీడీపీని వీడుతున్నా. నియోజకవర్గ అభివృద్ధి,కొల్లేటి వాసుల జీవన ప్రమాణాల మెరుగు కోసమే పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నా. నాతో పాటు వచ్చే నేతలను వైఎస్సార్సీపీలోకి తీసుకెళ్తా అని ప్రకటించారు జయమంగళ వెంకటరమణ. -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా గుట్టు రట్టు
-
'కొల్లేరు సమస్యపై సీఎం జగన్‌ను కలుస్తా.. ఆ తర్వాత రాజకీయ నిర్ణయం'
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు ప్రాంత సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం సమరి్పస్తానని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ ఇన్చార్జి జయమంగళ వెంకటరమణ చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కొల్లేరు మూడో కాంటూరు వరకు కుదింపు, ఆక్వా జోన్ పరిధిలో మరిన్ని చెరువులు చేర్చటం, ఈబీసీలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించడం తదితర అంశాలతో ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తానని, ఆయన స్పందననుబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కైకలూరు నియోజకవర్గంలో టీడీపీలో ఐదుగురిని బరిలో నిలిపి వారితో పనిచేయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. వైఎస్సార్ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే 250 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించారని, అది సరైన విధానమని తెలిపారు. నియోజకవర్గంలో ఐదుగురు నాయకులు ఉండటం వల్ల చివర్లో ఒకరికి టికెట్ వస్తే మిగిలినవారు వెన్నుపోటుదారులుగా మారుతున్నారని విమర్శించారు. 1999 నుంచి తెలుగుదేశం పార్టీలో సేవ చేస్తున్నానని, ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నానని వివరించారు. ఓ పౌరుడిగా ముఖ్యమంత్రిని కలిసే హక్కు ఉంటుందని, తాను గతంలో నలుగురు సీఎంలను కలిసి కొల్లేరు సమస్యలను విన్నవిస్తే అందరూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తనపై ఇటీవల హత్యాయత్నం జరిగితే రక్షణ కావాలని ప్రభుత్వానికి లేఖ రాశానని, అందుకే గన్‌మెన్‌ను కేటాయించారని ఆయన తెలిపారు. చదవండి: సైన్యం సన్నద్ధం -
నవ్వుల వెనుక పడ్డ బాధలెన్నో.. ‘గెటప్’ శ్రీను రియల్ లైఫ్ స్టోరీ
కళారంగంపై మక్కువ.. హాస్యంలో వినూత్న పంథా.. వైవిధ్య గెటప్‌లతో నటన.. అతడికి సినిమా అవకాశాలు తెచ్చి పెట్టింది.. చిన్నతనం నుంచి సరదాగా చేసిన కామెడీ నటుడిగా నిలబెట్టింది.. వలస కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్లిన యువకుడు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. అతడే శ్రీకాకుళం జిల్లా ఆకివీడు మండలం కొల్లేరు తీర గ్రామమైన కాళింగగూడెంకు చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్ ఉరఫ్ గెటప్ శ్రీను. బుల్లితెర నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ రంగంలో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. శ్రీకాకుళం నుంచి వలస కూలీలుగా కాళింగగూడెం వచ్చిన బొడ్డుపల్లి రామస్వామి, దాలమ్మ దంపతుల కుమారుడు గెటప్ శ్రీను. గ్రామంలోని పంట కాలువ పక్కన చిన్న పూరింట్లో అతడి బాల్యం గడిచింది. సిద్ధాపురం హైస్కూల్లో పదో తరగతి వరకు, దుంపగడప ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివాడు. తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్లేవాడు. చిన్నతనం నుంచి హాస్యధోరణితో ఉండే శ్రీను తోటి కూలీల మాటలను, నడకను అనుకరిస్తూ హాస్యం పండించేవాడు. తన హావభావాలతో నవ్విస్తూ అందరినీ ఆకట్టుకునేవాడు. పాఠశాలలో, కళాశాలలో, స్నేహితుల వద్ద అతడు సరదాగా చేసిన కామెడీ హాస్యనటుడిని చేసింది. చిన్నతనం నుంచి డ్యాన్స్‌లోనూ ప్రతిభ కనబర్చేవాడు. చిరంజీవిపై అభిమానంతో సినిమాల్లో రాణించాలని కలలుగన్నాడు. యాంకర్ నుంచి హీరో వరకూ.. ఇంటర్‌తో చదువుకు ఫుల్స్టాప్ పెట్టిన గెటప్ శ్రీను యాంకర్‌గా బుల్లితెరలోకి ప్రవేశించి జబర్దస్త్ అనంతరం పలు కార్యక్రమాలు, టీవీ షోలు, స్టేజ్ షోల్లో రాణించాడు. తరచూ హాస్యం, విభిన్న గెటప్‌లతో ఆకట్టుకుంటూ గెటప్ శ్రీనుగా, జూనియర్ కమల్‌హాసన్‌గా పేరు తెచ్చుకున్నాడు. సినీ హాస్యనటుడు వేణు సహకారంతో తెలుగబ్బాయి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ఇస్మార్ట్ శంకర్, రంగస్థలం, లైగర్, గాడ్‌ఫాదర్, జాంబిరెడ్డి, పొలిమేర తదితర 70 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న భోళాశంకర్ తదితర చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే రాజు యాదవ్ చిత్రంలో హీరోగా నటనతో మెప్పించాడు. బోరు కొట్టించకుండా.. గెటప్ శ్రీను కళారంగంలో రాణిస్తూ ఆర్థికంగా స్థిరపడి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాడు. అందరూ నటిస్తారని, అందుకు భిన్నంగా, మనసును హత్తుకునేలా నటించాలన్నదే తన లక్ష్యమని గెటప్ శ్రీను చెబుతున్నాడు. బుల్లితెరపై బోరు కొట్టించకుండానే వెండి తెరపై ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్నానని, సినిమాల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగడమే తన లక్ష్యమని అంటున్నాడు. తరచూ గెటప్ శ్రీను స్వగ్రామం కాళింగగూడెం వస్తుంటాడు. స్థానికంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో సత్కారాలు కూడా అందుకున్నాడు. -
ఏలూరు జిల్లాలో దారుణం.. నిద్రిస్తున్న తల్లీ కూతుర్ని కిరాతకంగా..
సాక్షి, ఏలూరు: జిల్లాలోని ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామం హరిజనవాడ ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీ కూతురును దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మృతులను సొంగా జేసు మరియమ్మ(33), సొంగా అఖిల (14) గా గుర్తించారు. సీఐ అంకబాబు, ముసునూరు ఎస్సై కుటుంబరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరియమ్మ భర్త నుంచి ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుంది. కూతురితో కలిసి జీవిస్తోంది. మీర్జాపురానికి చెందిన వ్యక్తితో మరియమ్మ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. చదవండి: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురి మృతి! -
బస్సులో టాయిలెట్‌కు వెళ్లి.. ఎగ్జిట్ డోర్ తీసి ఒక్కసారిగా..
సాక్షి, ఏలూరు: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తూ టాయిలెట్‌కు వెళ్లిన అనంతరం పొరపాటున ఎగ్జిట్ డోర్ తీసి అడుగు బయటపెట్టిన ఓ ప్రయాణికుడు రోడ్డు మీద పడిపోవడంతో మృతి చెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై లక్ష్మణబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఆకురాతి నన్నయ్య (59) ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో బంధువుల ఇంటికి ప్రయాణమాయ్యరు. ఈ నెల 11న రాత్రి హైదరాబాద్‌లోని ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కారు. ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారుజామున ఏలూరు సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. నన్నయ్య కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సు వెనుక బాగంలోని టాయిలెట్ రూములోకి వెళ్లారు. అనంతరం బయటకు వస్తూ లోపలికి వెళ్లే తలుపు అనుకుని బస్సు వెనుక భాగంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తీసి ముందుకు వెళ్లటంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. దీంతో పెద్ద శబ్దం రాగా, డ్రైవర్ విషయాన్ని గమనించి బస్సును నిలిపివేశారు. జాతీయ రహదారి పెట్రోలింగ్ పోలీసుల సహకారంతో నన్నయ్యను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఏలూరు రూరల్ ఎస్సై లక్ష్మణబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం బస్సులో ప్రయాణించే వారికి ఎగ్జిట్ డోర్‌పై అవగాహన కల్పించాల్సి ఉండగా, నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని అంటున్నారు. చదవండి: (పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి) -
బైకులపై ఇంటింటికి వెళ్తున్న హరిదాసులు