
సాక్షి, ఏలూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఆ పార్టీకి కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, కైకలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేసేశారాయన. అంతేకాదు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నచ్చి.. వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించేశారు. కైకలూరులో బహిరంగ సభ నిర్వహించి ప్రజా సమక్షంలోనే ఆయన తన రాజీనామా ప్రకటన చేయడం గమనార్హం. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ..
ఇచ్చిన మాటకు కట్టుబడే ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. 2014లో చంద్రబాబు మాటలు విని మోసపోయా. ఎంత కష్టపడినా నన్ను ఒక బలిపశువును చేశారు టీడీపీలో అంతా గ్రూపు రాజకీయాలే నడుస్తున్నాయి. అందుకే టీడీపీని వీడుతున్నా. నియోజకవర్గ అభివృద్ధి,కొల్లేటి వాసుల జీవన ప్రమాణాల మెరుగు కోసమే పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నా. నాతో పాటు వచ్చే నేతలను వైఎస్సార్‌సీపీలోకి తీసుకెళ్తా అని ప్రకటించారు జయమంగళ వెంకటరమణ.
Comments
Please login to add a commentAdd a comment