JAYAMANGALA Venkata Ramana
-
టీడీపీకి షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి సీనియర్ నేత
సాక్షి, తాడేపల్లి : టీడీపీకి మరో షాక్ తగలింది. టీడీపీ సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీలో చేరారు. అయితే, 2009లో వెంకటరమణ టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఇక, వెంకటరమణతో పాటుగా టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వెంకటరమణ మాట్లాడుతూ.. 1999లో వ్యాపారాలు వదులుకుని టీడీపీలో చేరాను. దివంగత నేత వైఎస్సార్‌తోనూ నాకు సత్సంబంధాలు ఉన్నాయి. 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా బీఫారమ్ ఇచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందాను. 2014లో నన్ను నామినేషన్ వేయమని చంద్రబాబు చెప్పారు. వేశాక విత్ డ్రా చేసుకోమని బలవంతం చేశారు. ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఎమ్మెల్సీ ఇస్తామని నమ్మించారు. చెప్పుకింద తేలులాగ నన్ను తొక్కిపెట్టారు . నన్ను నమ్ముకున్న కార్యకర్తలను కూడా తొక్కేశారు. మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థిగా గెలిచిన నన్ను లెక్కచేయలేదు. పొత్తులో భాగం అని చెప్పి కామినేని శ్రీనివాసరావుకి టిక్కెట్ ఇచ్చి, నన్ను మోసం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో ఉండకూడదనుకున్నాను. ఇచ్చినమాట నిలపెట్టుకునే వ్యక్తి సీఎం జగన్. బీసీల అభివృద్ధిని జగనే చేయగలడు. సీఎం జగన్ ఏం చెప్పినా చేయడానికి సిద్దం. కారుమూరి నాగేశ్వరరావు నాకు మంచి స్నేహితుడు. పార్టీ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం. పదవులు శాశ్వతం కాదు, మనం చేసే పనులే ముఖ్యం అంటూ కామెంట్స్ చేశారు. -
ఏలూరులో టీడీపీకి భారీ షాక్
సాక్షి, ఏలూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఆ పార్టీకి కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, కైకలూరు టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసేశారాయన. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నచ్చి.. వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించేశారు. కైకలూరులో బహిరంగ సభ నిర్వహించి ప్రజా సమక్షంలోనే ఆయన తన రాజీనామా ప్రకటన చేయడం గమనార్హం. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. 2014లో చంద్రబాబు మాటలు విని మోసపోయా. ఎంత కష్టపడినా నన్ను ఒక బలిపశువును చేశారు టీడీపీలో అంతా గ్రూపు రాజకీయాలే నడుస్తున్నాయి. అందుకే టీడీపీని వీడుతున్నా. నియోజకవర్గ అభివృద్ధి,కొల్లేటి వాసుల జీవన ప్రమాణాల మెరుగు కోసమే పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నా. నాతో పాటు వచ్చే నేతలను వైఎస్సార్సీపీలోకి తీసుకెళ్తా అని ప్రకటించారు జయమంగళ వెంకటరమణ. -
కైకలూరు టీడీపీలో ఎమ్మెల్సీ రగడ
విజయవాడ : ఎన్నికల సమయంలో..అప్పటి కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు బుధవారం స్థానిక సీతారామ ఫంక్షన్ హాలులో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ... ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు కైకలూరు ఎమ్మెల్యే సీటు కేటాయించారని తెలిపారు. ఆ సమయంలో జయమంగళకు ఎమ్మెల్సీ సీటును ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు ప్రకటించే ఎమ్మెల్సీ జాబితాలో తొలిగా జయమంగళ పేరు ఉండాలని ఈ సందర్బంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై జిల్లాలోని మంత్రులను కలిసి ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవాలని వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ, మత్స్య సహకార సంఘాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బలే ఏసురాజు, కలిదిండి, ముదినేపల్లి మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు నున్న రమాదేవి, భూపతి నాగకల్యాణి, బండి లక్ష్మి, పోసిన కుమారి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
పోలీసు మెట్లెక్కుతున్న ‘టీడీపీ’ నేతలు
* భార్యతో జయ ‘మంగళం’ వెంకటరమణ * ఆత్మ రక్షణ కోసం వంశీ పాకులాట * నాగుల్‌మీరాకు ‘సన్’స్ట్రోక్ సాక్షి, విజయవాడ : జిల్లాల్లో అంతంతమాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జిల్లాలో టీడీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతున్న మూడు నియోజకవర్గాల నేతలు ప్రస్తుతం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజలకు నీతులు చెప్పే నేతలే పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతుండటంతో ప్రజలు నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇటువంటి నేతల్ని ఎన్నుకుని చట్టసభలకు ఏవిధంగా పంపగలమని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జులు, వారి కుటుంబ సభ్యుల కారణంగానే పార్టీ ప్రతిష్ట మంటగలిసిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో ఆ పార్టీ గల్లంతవడం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. భార్యతో వెంకటరమణకు మంగళం... కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ పదిహేను సంవత్సరాలకుపైగా భార్య సునీతతో కాపురం చేసి ముగ్గురు పిల్లలకు తండ్రైన తరువాత వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. భార్య సునీత తాజాగా పెనమలూరు పోలీసుస్టేషన్లో మరోసారి ఫిర్యాదు చేశారు. తనను, పిల్లలను అనేక రకాలుగా వేధిస్తున్నారని, డ్రైవర్లు, సిబ్బంది వద్ద తమను చులకన చేసి మాట్లాడతున్నారని పలు టీవీ చానల్స్‌లో సునీత కన్నీళ్ల పర్యంతమయ్యారు. తనకు, పిల్లలకు రక్షణ కల్పించాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారామె. ఆడవాళ్ల చట్టాలు బలంగా ఉన్నాయని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ వెంకట రమణ బహిరంగంగానే చెబుతున్నారు. భార్య, బిడ్డల్ని పట్టించుకోకుండా వదిలివేసిన వ్యక్తిని అసెంబ్లీకి ఏ విధంగా పంపుతామని కైకలూరు నియోజకవర్గవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రాణరక్షణ కోసం వంశీ ఆందోళన.. తనకు ప్రాణరక్షణ కల్పించాలంటూ గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వల్లభనేని వంశీమోహన్ పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన ఐజీ సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఇప్పటికే డీజీపీ ప్రసాదరావు, సీపీ బత్తిన శ్రీనివాసులు, డీసీపీ రవిప్రకాష్‌లను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. సీతారామాంజనేయులు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారనడానికి తన వద్ద ఆధారాలున్నాయని, తనను కాపాడాలంటూ పోలీసు అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. అయితే వంశీకి అనేక మంది ఫ్యాక్షనిస్టులతో విభేదాలున్నాయని, కేవలం ఐజీ నుంచి ప్రాణభయం అనుకుంటే పొరపాటేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల్లో పోటీకంటే కూడా తన ప్రాణాలను కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని సన్నిహితులే గుసగుసలాడుకుంటున్నారు. తన రక్షణే చూసుకోలేనివాడు రాబోయే రోజుల్లో తమకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని గన్నవరం నియోజకవర్గవాసులు ప్రశ్నిస్తున్నారు. నాగుల్‌మీరాకు సన్‘స్ట్రోక్’ తెలుగుదేశంలో సౌమ్యుడిగా గుర్తింపు పొందిన విజయవాడ పశ్చిమ నియోకవర్గ ఇన్చార్జి నాగుల్‌మీరాకు ఊహించని దెబ్బ తగిలింది. ఆయన కుమారుడు మౌలాలి (మున్నా) వ్యభిచారం కేసులో ఇరుక్కోవడంతో నాగుల్ మీరా ఇబ్బందుల్లో పడ్డారు. రెండు రోజుల కిందట మున్నాను వ్యభిచారం కేసులో టాస్క్‌పోర్సు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మున్నాను బయటకు తీసుకురావడానికి నాగుల్ మీరా పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగారని పార్టీలో ప్రచారం జోరందుకుంది. పోలీసులు తన కుమారుడిని అరెస్టు చేయడం తప్పదని తెలుసుకున్న మీరా ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడేందుకు తెగ ప్రయత్నించారు. మున్నా టీడీపీలో క్రియాశీలక కార్యకర్త అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన కుమారుడినే సక్రమమార్గంలో పెంచలేని నాగుల్‌మీరా ప్రజలకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ముగ్గురు నేతల విషయంలో చంద్రబాబు ఏ చర్యలు తీసుకుంటారోనని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. లేదా ఇక్కడ కూడా రెండు కళ్ల సిద్ధాంతం అవలంభించి అయోమయం సృష్టిస్తారా.. అని పార్టీ కార్యకర్తలు చలోక్తులు విసురుకుంటున్నారు. -
భార్య ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే వెంకటరమణ
-
వరకట్న వేధింపుల కేసులో టిడిపి ఎమ్మెల్యే