
పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులతో కళాశాల యాజమాన్యం
నరసాపురం: వైఎన్ కళాశాల విద్యార్థులు అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీల్లో బహుమతులు సాధించారు. యూపీకి చెందిన చారు క్యాసిల్ పౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీల్లో కళాశాల డిగ్రీ విద్యార్థులు ఆర్.జ్యోతిరత్నం, ఎన్.బాలమురళీకృష్ణ, ప్రి.ప్రసూన, కె.గణేష్‌లు పతకాలు సాధించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ ఏపీవీ అప్పారావు చెప్పారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో జరిగిన ఇలాంటి అంతర్జాతీయ పోటీల్లో విద్యార్థులు పాల్గొని బహుమతులు గెలవడం అభినందనీయమన్నారు. తోటి విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరత్నం, కళాశాల డీన్ గంధం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.