
పిల్లలకు మార్కులు, ర్యాంకులే లక్ష్యం కాదని, వారిలో మానసిక వికాసానికి ఆటలు, పాటలు అవసరమేనని జాయింట్ కలెక్టర్ పీ ధాత్రిరెడ్డి అన్నారు

స్థానిక సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్‌లో హేలాపురి బాలోత్సవం 5 వ పిల్లల సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి

ముందుగా ఎన్‌సీసీ లెఫ్టినెంట్ కల్నల్ రిబేష్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు

బాలోత్సవం జెండాను ఉష గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత ఉష బాలకృష్ణ ఆవిష్కరించారు

ఈ సందర్భంగా రంగు రంగుల దుస్తుల్లో, రకరకాల వేషధారణలో విద్యార్థులు, వారి పక్కన వారి తల్లిదండ్రులు, బంధువులు, ఆటలు, పాటలు, సరదాలు, పోటీలు, కేరింతలతో తొలిరోజు పిల్లల సంబరాలు అంబరాన్ని తాకాయి

















