(ఫైల్ ఫోటో)
సాక్షి, క్రైమ్: ఎన్నికల్లో డబ్బులు పంచిన కేసులో.. జనసేన ముఖ్యనేత గుండా జయప్రకాశ్ నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. జయప్రకాశ్ వీరవాసరం మండల జెడ్పీటీసీ కాగా.. సదరు కేసుకు సంబంధించి ఆయన్ని హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.
వీరవాసరం జెడ్పీటీసీ అయిన గుండా జయప్రకాశ్.. 2019 ఎన్నికల్లో పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది.
చివరకు జయప్రకాశ్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన శృంగవృక్షం పోలీసులు.. ఏలూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం.. కోర్టుల జయప్రకాశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో.. జనసేన జెడ్పీటీసీ గుండా జయప్రకాశ్ నాయుడ్ని ఏలూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment