Jaya Prakash
-
చంద్రబాబు పార్టీని ప్రమోట్ చేయడానికి జయప్రకాష్ తంటాలు
-
జనసేన జయప్రకాశ్‌కు 14 రోజుల రిమాండ్
సాక్షి, క్రైమ్: ఎన్నికల్లో డబ్బులు పంచిన కేసులో.. జనసేన ముఖ్యనేత గుండా జయప్రకాశ్ నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. జయప్రకాశ్ వీరవాసరం మండల జెడ్పీటీసీ కాగా.. సదరు కేసుకు సంబంధించి ఆయన్ని హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. వీరవాసరం జెడ్పీటీసీ అయిన గుండా జయప్రకాశ్.. 2019 ఎన్నికల్లో పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. చివరకు జయప్రకాశ్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన శృంగవృక్షం పోలీసులు.. ఏలూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం.. కోర్టుల జయప్రకాశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో.. జనసేన జెడ్పీటీసీ గుండా జయప్రకాశ్ నాయుడ్ని ఏలూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. -
తహసీల్దార్‌ను బంతాట ఆడుకున్న బీద సోదరులు..
కావలి: కావలి టీడీపీ నాయకులు బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రల అడ్డమైన దోపిడీకి ఉద్యోగాన్ని పోగొట్టుకున్న దగదర్తి తహసీల్దార్ డి.జయప్రకాష్ కేవలం రెండు రోజుల్లో ఆర్డీఓగా పదోన్నత పొందాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇందుకు సంబంధించిన ఫైలు చాలా కాలంగా ఉంది. అయితే ప్రాధాన్యతల వారీగా రాష్ట్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ ఫైలుపై సంతకాలు చేయాల్సి ఉంది. ఇంతలో టీడీపీ నాయకుల భూ దందాలో చిక్కుకుని బలైపోయారు. అసలు భూములు కథ ఏమిటంటే.. దగదర్తి మండలంలో ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉండటం, ఆ ప్రాంతానికి చెందిన వారు ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలసలు పోవడం, సంపన్నులు తమ ఆస్తులు పెంచుకునే క్రమంలో మండలంలోని భూములపై కన్ను పడటం, వలస వెళ్లిపోయిన మండలానికి చెందిన ప్రజలు ఆర్థికంగా స్థిరత్వం పొందడంతో వారి గ్రామాల్లో ని భూములపై ఆసక్తి కనపరిచారు. అలాగే మండలంలో విమానాశ్రయం నిర్మించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం, పరిశ్రమలు స్థాపనకు మండలంలోని భూములను గుర్తించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ కూడా జరిగేసరికి 2014 సంవత్సరం వచ్చింది. అప్పుడే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కావలి నియోజకవర్గంలో అధికార టీడీపీ నాయకులుగా బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలు అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో తమ అదుపులోకి తెచ్చుకున్నారు. బీద సోదరులు తమ ఆక్వా సామ్రాజ్యాన్ని అల్లూరు మండలంలోని సముద్రతీరం వెంబడి వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో విస్తరించుకున్నారు. అక్కడికి ఆగక విస్తరణను దగదర్తి మండలంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు వరకు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఒక పక్క విమానాశ్రయ భూములు, మరో పక్క పరిశ్రమలకు భూములు అంటూ టీడీపీ ప్రభుత్వం దగదర్తి మండలంలో భూసేకరణకు తెరతీసింది. ఇవన్నీ ముందస్తుగానే తెలిసిన బీద సోదరులు దగదర్తి తహసీల్దార్‌గా తమ కనుసన్నల్లో ఉన్న వారినే నియమించుకోసాగారు. విలేజ్ అసిస్టెంట్ నుంచి.. రెవెన్యూ శాఖలో విలేజ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరని డి.జయ ప్రకాష్, ప్రమోషన్లతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) అయిన, ప్రస్తుతం తాహసీల్దార్ వరకు చేరుకున్నారు. మరో రెండు రోజుల్లో ఆర్డీఓగా ప్రమోషన్ ఉత్తర్వులను అందుకోవాల్సి ఉండగా, టీడీపీ నాయకులతో కలిసి చేసిన భూదందాల పాపంలో పాలు పంచుకుని వాటాలు మింగడంతో సస్పెండ్ ఉత్తర్వులు అందుకున్నారు. 2019 ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న డి.జయప్రకాప్‌ను, ఎన్నికల బదిలీల్లో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లను బదిలీ చేసినా ఆయన్ను చేయలేదు. ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉండటంతో డి.జయప్రకాస్ సేవలు దగదర్తి తాహసీల్దార్‌గానే అందిస్తారని టీడీపీ నాయకులు బీద మస్న్రావు, బీద రవిచంద్ర చేసిన ఒత్తిళ్లకు ఉన్నత స్థాయి అధికారులు తలొగ్గి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికల సంఘం ఆ పప్పులు ఉడకవని హెచ్చరించడంతో డి.జయప్రకాష్‌ను కోనేరు రంగారావు కమిటీలో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇంతలో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశాలతో కావలి సబ్ కలెక్టర్ చామకూరు శ్రీధర్ కొన్ని భూదందా ఫిర్యాదులపై చేసిన విచారణలో దగదర్తి తాహసీల్దార్ హోదాలో డి.జయప్రకాష్ చేసిన అక్రమాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్ అయ్యారు. దీంతో ఆర్డీఓ హోదాలో ఉద్యోగ విరమణ చేయాల్సిన డి.జయప్రకాష్, టీడీపీ నాయకులు అక్రమాల దందాల్లో భాగస్వామ్యం కావడంతో ఆ ఉత్తర్వులు అందుకోకుండానే తాహసీల్దార్‌గానే పదవీ విరమణ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా తమ అక్రమాలకు తాహసీల్దార్ హోదాలో ఉన్న డి.జయప్రకాష్‌ను అన్ని రకాలుగా వాడుకున్న టీడీపీ నాయకులు బీద సోదరులు కనీసం సస్పెండ్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆయన్ను పలకరించలేదు. దీంతో ఆయన పలువురి వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి క్షోభకు గురి అవుతాన్నట్లు సమాచారం. తహసీల్దార్‌ను బంతాట ఆడుకున్నారు ఈ నేపథ్యంలో రెండేళ్ల (జనవరి 2017) క్రితం దగదర్తి తహసీల్దార్‌గా డి.జయప్రకాష్‌ను నియమించుకున్నారు. దగదర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామాల్లోని ప్రభుత్వ భూములు తమకే చెందాలని ఆసక్తి చూపసాగారు. అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్నులు లాబీయింగ్‌తో భూములు కాజేయడానికి స్కెచ్‌లు వేయసాగారు. ఈ క్రమంలో బీద సోదరులు ఒక పక్క, దగదర్తి మండలానికి చెందిన టీడీపీ నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు, మాలేపాటి రవీంద్రనాయుడు మరో పక్క తహసీల్దార్ డి.జయప్రకాష్‌ను బంతాట ఆడుకున్నారు. ఆయన కూడా ఆర్థికంగా లాభదాయకమైన ఈ రకమైన ఆటకు సిద్ధపడే వారు చెప్పిన పనులన్నీ చేశారు. పనిలో పనిగా ఆయన కూడా చిలకొట్టుడు కొట్టేవారు. ఇలా తహసీల్దార్ రెండు రకాలుగా సంపాదించారు. టీడీపీ నాయకులు చెప్పినట్లు ప్రభుత్వ రికార్డుల్లో భూమి హక్కుదారులుగా పేర్లు చేర్చితే వారి వద్ద చేతులు తడుపుకోవడం, ఇతరులు వచ్చి అమ్యామ్యాలు ఇస్తే ఆ పేర్లును తొలిగించేవారు. ఇలా భూములకు హక్కుల కల్పించే విషయంలో టీడీపీ నాయకులు, తహసీల్దార్ కలిసి భారీ దందానే చేశారు. పనిలో పనిగా బీద సోదరులు తమకు అవసరమైన భూములకు రికార్డులు సృష్టించుకోగలిగారు. అందుకే భూమి హక్కులదారుల విషయంలో దగదర్తి మండలంలో తహసీల్దార్, కావలి సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) కార్యాలయాల్లో, హైకోర్టు, లోకాయుక్తా తదితర న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. గత రెండేళ్లుగా దగదర్తి తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న డి.జయప్రకాష్, ఏ రోజు కూడా తన కార్యాలయంలో పని వేళల్లో తన సీట్లో కూర్చొని విధులు నిర్వర్తించలేదు. కార్యాలయ పని వేళలు దాటిన తర్వాత మాత్రమే సీట్లో కూర్చొని టీడీపీ నాయకులు చెప్పిన వ్యవహారాలు చక్కబెట్టేవారు. అలాగే డాబాల్లో, లాడ్జీల్లో రికార్డులు వెంట పెట్టుకుని వచ్చి టీడీపీ నాయకులు చెప్పిన అడ్డమైన భూమి యాజమాన్య హక్కులు కల్పించే పనులు చేస్తుండేవారు. పనిలో పనిగా టీడీపీ నాయకులు చేసే గ్రావెల్ దందాకు కూడా తహసీల్దార్ సంపూర్ణంగా సహకరించారు. -
49 ఏళ్ల బుడతడు..!
శ్రీకాకుళం, హిరమండలం: చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు శివ్వాల జయప్రకాష్. అతడి వయసు 49 సంవత్సరాలు. ఇదేమిటని అనుకుంటున్నారు? నిజమేనండి.. ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్‌కార్డులో అధికారులు వేసిన వయసు ఇది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కిత్తాలపాడు గ్రామానికి చెందిన జయప్రకాష్ 2009లో జన్మించాడు. అంటే.. నేటికి తొమ్మిదేళ్లు. కానీ అధికారులు ఏకంగా 40 ఏళ్లు పెంచేశారు. కాగా బాలుడి తండ్రి వయస్సు 35 ఏళ్లుగా పేర్కొనడం గమనార్హం. దీని వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపకార వేతనాలు, ఇతరత్రా రాయితీలకు ఆ కుటుంబం దూరమవుతోంది. రేషన్ కార్డులో వయస్సు సరి చేయాలలని ఎంతమంది అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని బాధిత కుటుంబం సభ్యులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తప్పిదాన్ని సరి చేయాలని వారు కోరుతున్నారు. -
18న తెరపైకి ఆగమ్
ఆగమ్ చిత్రం 18న తెరపైకి రానుంది. యువ నటుడు ఇర్ఫాన్ హీరోగా నటించిన చిత్రం ఇది. ఆయనకు జంటగా నటి దీక్షిత నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో జయప్రకాశ్, రియాజ్‌ఖాన్, విజయ ఆనంద్ శ్రీరామ్, రవిరాజా, అరుళ్, ఎస్.ప్రేమ్ నటించారు. జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కోటేశ్వరరాజు, హేమారాజు నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ ఆనంద్ శ్రీరామ్ కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. చిత్ర హీరో ఇర్ఫాన్ చిత్రం గురించి తెలుపుతూ తాను 12 ఏళ్లుగా నటిస్తున్నానన్నారు. ఇన్నాళ్లుగా గుర్తింపు తెచ్చి పెట్టే పాత్ర కోసం ఎదురు చూస్తున్న తనకు ఆగమ్ చిత్రంతో లభించిందన్నారు. ఇందులో నటనకు అవకాశం ఉన్న చాలా బలమైన పాత్రను పోషించానని తెలిపారు. చిత్రంలో చాలా ముఖ్యమైన సామాజిక సమస్య గురించి చర్చించినట్లు వెల్లడించారు. కలామ్ కల అయిన 2020 విజన్‌ను తెరపై ఆవిష్కరించే చిత్రం ఆగమ్ అన్నారు. మన దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో అవినీతి, మేధస్సు దోపిడీ అన్నారు. మన యువత మేధస్సును విదేశీయుల ఎలా ఆకర్షించి దోచుకుంటున్నారన్న అంశాలను చిత్రంలో వివరించినట్లు చెప్పారు. మార్చి 18వ తేదీన ఒక చరిత్ర ఉందన్నారు. మహాత్మాగాంధీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరుబాట పట్టి ప్రపంచాన్ని తిరిగి చూసేలా చేసిన రోజు మార్చి 18 అని అలాంటి రోజున ఆగమ్ చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందని ఇర్ఫాన్ అన్నారు. చిత్రం సందేశంతో కూడిన, కమర్షియల్ అంశాలతో జనరంజకంగా ఉంటుందని దర్శకుడు విజయ్ ఆనంద్ శ్రీరామ్ తెలియజేశారు. జిల్ జంగ్ జక్ చిత్రం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందించారు. -
ఏటీఎం చోరీకి విఫలయత్నం
జిన్నారం: మండలంలోని బొంతపల్లి గ్రామంలో గల యాక్సెక్ బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని డబ్బును చోరీ చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దుండగులు ఏటీఎంకు సంబంధించిన స్క్రీన్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఏటీఎం స్క్రీన్ కింది భాగంలో ఉన్న డబ్బాను సైతం ధ్వసం చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ డబ్బు తీసుకునే మార్గం కనిపించక అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం ఏటీఎంకు వచ్చిన కొంత మంది స్థానికులు మిషన్ పగలి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో జిన్నారం ఎస్ఐ జయప్రకాశ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బ్యాంక్ సిబ్బందితో పాటు, ఏటీఎం నిర్వహకులు కూడా ధ్వంసమైన ఏటీఎం మిషన్‌ను పరిశీలించారు. ఏటీఎం మిషన్‌లో ఉన్న డబ్బు మాత్రం చోరీ కాలేదని బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. ఏటీఎం నిర్వహకులు రవికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ జయప్రకాశ్ తెలిపారు. -
తొలి అడుగు
మొదలైన కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ పనులు ముందుగా గోదావరి నీటి మళ్లింపునకు మట్టి, ఇసుక కట్టల ఏర్పాటు ఏటూరునాగారం, న్యూస్‌లైన్ : ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై బ్యారేజీ నిర్మాణ పనులు మొదలయ్యూయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కంతనపల్లి ప్రాజెక్టు పనులకు తొలి అడుగు పడింది. బ్యారేజీ నిర్మాణం మొదటి దశలో రూ.1800 కోట్లతో టెండర్ దక్కించుకున్న ఎస్ఈడబ్ల్యూ, రిత్విక్ కంపెనీలు సంయుక్తంగా పనులు ప్రారంభించాయి. గోదావరి నదిపై 172 గేట్లతో 3.5 కిలో మీటర్ల పొడువుతో బ్యారేజీని నిర్మించనున్నారు. బ్యారేజీ నిర్మాణం ప్రదేశంలో నీటిని మూడు పాయలుగా విభజించేందుకు రెండు రోజులుగా మట్టికట్టలు, ఇసుక కట్టలను నిర్మిస్తున్నారు. నీటి ప్రవాహాన్ని మళ్లించడం వల్ల పనులు చేసుకునే వీలు కలుగుతుంది. నీటిని మళ్లించిన తర్వాత బ్యారే జీ నిర్మాణ ప్రదేశంలో ఉన్న బండరాళ్లను తొలగించనున్నారు. వర్షాకాలం రానుండడంతో ముందస్తుగా కావాల్సిన ఇసుకను తరలిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణ పనులకు ఉపయోగించే యంత్రాలను అవతలి ఒడ్డుకు తరలించేందుకు కూడా మట్టితో రోడ్డు పనులు చేపట్టారు. అంతేకాకుండా యంత్రాలు, నిర్మాణ పనులు చేసే సిబ్బంది కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. పనులను సైట్ ఇన్చార్జ్ జయప్రకాశ్ పర్యవేక్షిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
నాగోలు/అత్తాపూర్, న్యూస్‌లైన్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఎల్బీనగర్ పరిధిలో ఆర్టీసీ బస్సు బీటెక్ విద్యార్థిని బలిగొనగా...రాజేంద్రనగర్‌లో వేగంగా వచ్చిన కారు యువకుడి ప్రాణం తీసింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... హస్తినాపురానికి చెందిన కె.ఎలమంద, అంజలి దంపతులు కుమారుడు జయప్రకాశ్ (20) బండ్లగూడలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు సాగర్రింగురోడ్డుకు వచ్చాడు. ఉప్పల్ నుం చి మెహిదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ28జెడ్ 2000) ఎక్కేందుకు ప్రయత్నిస్తూ అదుపుతప్పి వెనుక చక్రాల కిందపడి మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు ఢీకొని యువకుడు... అనంతపురం జిల్లాకు చెందిన ఓబులేషు(25) డీసీఎంవ్యాన్పై క్లీనర్. వ్యాన్‌పై ఈనెల 7న కొత్తపేట మార్కెట్‌కు పుచ్చకాయలను తీసుకొచ్చా డు. డీసీఎంను ట్రాన్స్‌పోర్టు ఆఫీసు వద్ద పెట్టి ఓబులేషు స్వగ్రామానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం తిరిగి వచ్చి రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ ప్రధాన రహదారి ముందు బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరానికి వస్తున్న ఇన్నోవా కారు (ఏపీ10టీవీ 2210) వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన ఓబులేషును స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.