ఏటీఎం చోరీకి విఫలయత్నం | ATM stolen unsuccessful | Sakshi
Sakshi News home page

ఏటీఎం చోరీకి విఫలయత్నం

Published Mon, Oct 6 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

ATM stolen unsuccessful

 జిన్నారం: మండలంలోని బొంతపల్లి గ్రామంలో గల యాక్సెక్ బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని డబ్బును చోరీ చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దుండగులు  ఏటీఎంకు సంబంధించిన స్క్రీన్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఏటీఎం స్క్రీన్ కింది భాగంలో ఉన్న డబ్బాను సైతం ధ్వసం చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ డబ్బు తీసుకునే మార్గం కనిపించక అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 సోమవారం ఉదయం ఏటీఎంకు వచ్చిన కొంత మంది స్థానికులు మిషన్ పగలి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో జిన్నారం ఎస్‌ఐ జయప్రకాశ్  సంఘటనా స్థలాన్ని  సందర్శించారు. బ్యాంక్ సిబ్బందితో పాటు, ఏటీఎం నిర్వహకులు కూడా ధ్వంసమైన ఏటీఎం మిషన్‌ను పరిశీలించారు. ఏటీఎం మిషన్‌లో ఉన్న డబ్బు మాత్రం చోరీ కాలేదని బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. ఏటీఎం నిర్వహకులు రవికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ జయప్రకాశ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement