49 ఏళ్ల బుడతడు..! | Mistakes In Ration Cards Srikakulam | Sakshi
Sakshi News home page

49 ఏళ్ల బుడతడు..!

Published Fri, Nov 2 2018 8:11 AM | Last Updated on Fri, Nov 2 2018 8:11 AM

Mistakes In Ration Cards Srikakulam  - Sakshi

వయసు తప్పుగా నమోదు చేసిన రేషన్‌కార్డు

శ్రీకాకుళం, హిరమండలం: చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు శివ్వాల జయప్రకాష్‌. అతడి వయసు 49 సంవత్సరాలు. ఇదేమిటని అనుకుంటున్నారు? నిజమేనండి.. ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్‌కార్డులో అధికారులు వేసిన వయసు ఇది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కిత్తాలపాడు గ్రామానికి చెందిన జయప్రకాష్‌ 2009లో జన్మించాడు. అంటే.. నేటికి తొమ్మిదేళ్లు. కానీ అధికారులు ఏకంగా 40 ఏళ్లు పెంచేశారు. కాగా బాలుడి తండ్రి వయస్సు 35 ఏళ్లుగా పేర్కొనడం గమనార్హం.

దీని వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపకార వేతనాలు, ఇతరత్రా రాయితీలకు ఆ కుటుంబం దూరమవుతోంది. రేషన్‌ కార్డులో వయస్సు సరి చేయాలలని ఎంతమంది అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని బాధిత కుటుంబం సభ్యులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తప్పిదాన్ని సరి చేయాలని వారు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement