రేషన్ కార్డుల కోసం వైఎస్సార్సీపీ ధర్నా
కంచిలి: పేదలకు రేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం ఎంపీపీ లోలాక్షి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రేషన్ కార్డులను అర్హులైన నిరుపేదలకు అందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలకే వాటిని పరిమితం చేయటం తగదని విమర్శించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నిరుపేదలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.