
చంద్రబాబు ఎత్తుగడకు రామకృష్ణుడు చిత్తు
దివ్యతో మాజీ ఆర్థిక మంత్రి యనమలకు చెక్
అదితితో అశోక్ గజపతిరాజు ఔట్
కంభంపాటికీ అవకాశాలు మూసుకుపోయినట్లే
ఎమ్మెల్యేలు బుచ్చయ్య, చినరాజప్ప వంటివారికి నిరాశ
లోకేశ్‌కు నచ్చలేదంటే.. సీనియర్లకు భవిష్యత్తు లేనట్లేనా!
టీడీపీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరికీ వరుసగా తలుపులు మూసుకుపోతున్నాయి. మంత్రి లోకేశ్ అభీష్టం మేరకు.. తనకు బాగా సన్నిహితులైనవారిని కూడా సీఎం చంద్రబాబు దూరం పెట్టేస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం సీనియర్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు.
యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, కంభంపాటి రామ్మోహనరావు వంటి వారిని ఇప్పటికే దాదాపు రిటైర్ చేశారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాగంటి బాబు వంటి పలువురు నేతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలుగా ఉన్నా కొందరి పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకు పారీ్టలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధి
మిగిలిన సీనియర్లకూ అదే గతి..
చంద్రబాబు సమకాలీకుడైన అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారనే సాకుతో ఆయనకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. కేంద్ర మంత్రిగా, రాష్ట్రంలో పలుసార్లు మంత్రిగా పనిచేసిన అశోక్ అనుభవం, రాజకీయ నైపుణ్యాలను పట్టించుకోలేదు. దీంతో ఆయన ఇప్పుడు పారీ్టకి దూరంగా ఉంటున్నారు. అదితి కుమార్తె ఎమ్మెల్యేగా విజయనగరానికి పరిమితమయ్యారు.
⇒ కంభంపాటి రామ్మోహనరావు ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. ఢిల్లీలో చంద్రబాబు తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు అవసరం లేకపోవడంతో కంభంపాటి ప్రాధాన్యత తగ్గిపోయింది. మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆయన ప్రయత్నించినా పరిగణనలోకి తీసుకోలేదు.
⇒ గోరంట్ల బుచ్చయ్యచౌదరి చిరకాల స్వప్నం మంత్రికావడం. కానీ, క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. సొంత నియోజకవర్గంలో ఆయన చెప్పినవారికి పోస్టింగ్‌లూ ఇవ్వడం లేదు.
⇒ మాజీ హోం మంత్రి చినరాజప్పదీ ఇదే పరిస్థితి. ఉమ్మడి పశ్చిమలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాగంటి బాబుకు అసలు సీటే ఇవ్వలేదు. ఇలా టీడీపీలో చాలామంది సీనియర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
⇒ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్లకు లోకేశ్ జమానాలో తమకు అవకాశాలు వస్తాయా? అనే అనుమానాలు బలంగా మెదులుతున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో బలమైన హామీలు పొందిన పిఠాపురం వర్మ వంటివారికీ నిరాశా నిస్పృహలు తప్పడం లేదు.
యనమల.. సాగనంపారిలా..
టీడీపీలో అత్యంత సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. స్పీకర్, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే, ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అవినీతి వ్యవహారాలపై లీకులిచి్చ.. తద్వారా యనమల రాజకీయ భవిష్యతుకు చంద్రబాబు తెరదించారనే తీవ్ర చర్చ పార్టీ ముఖ్యుల్లో జరుగుతోంది. 2 నెలల కిందట రాజ్యసభకు వెళ్లే చాన్స్‌ను, 2 వారాల కిందట ఎమ్మెల్సీగా కొనసాగించడానికి వచి్చన అవకాశాన్ని నిరాకరించి రామకృష్ణుడికి దారులను శాశ్వతంగా మూసేయడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారనేది పరిశీలకుల విశ్లేషణ.
తన కూతురు దివ్య, అల్లుడు వెంకట గోపీనాథ్ అవినీతిని సాకుగా చూపి.. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ వ్యూహాత్మకంగా పావులు కదిపారని యనమల తన అంతరంగీకుల వద్ద వాపోతున్నారని సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు ముందు దివ్య, గోపీనాథ్ అవినీతిపై ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. దివ్య తొలిసారి ఎమ్మెల్యే అయినా అవినీతి, అక్రమాలలో స్మార్ట్‌గా దూసుకుపోతూ తన పేరు బయటకు పొక్కకుండా అనుభవజు్ఞరాలిగా సెట్ చేసుకుంటున్నారంటూ పరోక్షంగా రామకృష్ణుడిని తాకేలా తూర్పారపట్టారు.
స్వపక్షీయులకు చెందిన మద్యం షాపులు, బెల్టు షాపులు, అనుమతుల్లేని బార్‌లు, పేకాట క్లబ్బుల నిర్వాహకుల ద్వారా నెలకు రూ.కోటి, మట్టి, గ్రావెల్ దందా ద్వారా రూ.రెండు కోట్లు వెనకేసుకుంటున్నారని, తుని సమీపంలో విమానాశ్రయం ప్రతిపాదనలో భాగంగా 700 ఎకరాలలో సుమారు 300 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్‌కు గాను ఇప్పటికే రూ.12 కోట్లు వెనకేసుకున్నారనేది పబ్లిక్ టాక్. రామకృష్ణుడు, దివ్య ఎక్కడా సీన్‌లో కనిపించకుండా వారి దగ్గరి బంధువు యనమల రాజేష్ ద్వారా అన్నీ నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. హైదరాబాద్‌లో ఐఆర్‌ఎస్ అధికారైన దివ్య భర్త వెంకట గోపీనాథ్ ప్రతి శని, ఆదివారాలు తునిలో ఉంటూ అవినీతికి మార్గ నిర్దేశం చేస్తున్నారని చెబుతున్నారు.
2014–19 మధ్య డిప్యుటేషన్‌పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పని చేసినప్పుడు నిధులు దారిమళ్లించడంతో పాటు అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. యనమలను పక్కన పెట్టేయడంలో బాబు, లోకేశ్ తప్పులేదని సమర్థించుకునేందుకు ఇప్పటికీ టీడీపీ అనుకూలురు, వారి సోషల్ మీడియాలో పై అంశాలతో కూడిన వీడియోలు హల్చల్ చేయిస్తుండటం గమనార్హం. యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా, మరో కుమార్తె భర్త పుట్టా మహే‹Ùయాదవ్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తుచేస్తూ.. పార్టీ ఏమైనా యనమల కుటుంబ ప్యాకేజీనా అనే కామెంట్లను టీడీపీ వారిచేతే గుప్పిస్తున్నారు. ఇక పార్టీ ఉన్నత స్థాయి ప్రణాళికల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే అనుమానాలు యనమల వర్గీయుల్లో బలంగా ఉన్నాయి.