IPL 2025: ఆర్సీబీపై గుజరాత్‌ ఘన విజయం | IPL 2025: RCB VS Gujarat Titans Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: ఆర్సీబీపై గుజరాత్‌ ఘన విజయం

Published Wed, Apr 2 2025 7:13 PM | Last Updated on Wed, Apr 2 2025 11:02 PM

IPL 2025: RCB VS Gujarat Titans Live Updates And Highlights

Photo Courtesy: BCCI

ఆర్సీబీపై గుజరాత్‌ ఘన విజయం
170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్‌ బట్లర్‌ (39 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్‌ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్‌), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (18 బంతుల్లో 30 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) గుజరాత్‌ను గెలిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్‌ (40 బంతుల్లో 54; ఫోర్‌, 5 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్‌ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో సిరాజ్‌ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్‌ 2, అర్షద్‌ ఖాన్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఇషాంత్‌ శర్మ తలో వికెట్‌ పడగొట్టారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
12.3వ ఓవర్‌: 107 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. సాయి సుదర్శన్‌ 49 పరుగులు చేసి హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్‌
ఛేదనను నిదానంగా ప్రారంభించిన గుజరాత్‌ ఆతర్వాత గేర్‌ మార్చి లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. 11.5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్‌ నష్టానికి 104 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (47), జోస్‌ బట్లర్‌ (39) ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. 

గేర్‌ మార్చిన బట్లర్‌
అప్పటివరకు నిదానంగా ఆడిన బట్లర్‌ రసిక్‌ సలామ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో గేర్‌ మార్చాడు. ఆ ఓవర్‌లో బట్లర్‌ 2 సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదాడు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 75/1గా ఉంది. బట్లర్‌ 26, సాయి సుదర్శన్‌ 32 పరుగులతో ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలవాలంటే 66 బంతుల్లో 95 పరుగులు చేయాలి. 

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
4.4వ ఓవర్‌: 170 పరుగుల ఛేదనలో గుజరాత్‌ 32 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (14) ఔటయ్యాడు. సాయి సుదర్శన్‌ (15), జోస్‌ బట్లర్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

టార్గెట్‌ 170.. నిదానంగా ఆడుతున్న గుజరాత్‌
170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ నిదానంగా ఆడుతుంది. మూడు ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 15 పరుగులు మాత్రమే చేసింది. శుభ​్‌మన్‌ గిల్‌ 7, సాయి సుదర్శన్‌ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

లివింగ్‌స్టోన్‌ హాఫ్‌ సెంచరీ.. గుజరాత్‌ టార్గెట్‌ ఎంతంటే..?
టాస్‌ ఓడి గుజరాత్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్‌ (40 బంతుల్లో 54; ఫోర్‌, 5 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 

మధ్యలో జితేశ్‌ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్‌) కూడా ఓ మోస్తరుగా బ్యాట్‌ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్‌ 14, విరాట్‌ కోహ్లి 7, పడిక్కల్‌ 4, పాటిదార్‌ 12, కృనాల్‌ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో సిరాజ్‌ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్‌ 2, అర్షద్‌ ఖాన్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఇషాంత్‌ శర్మ తలో వికెట్‌ పడగొట్టారు. 

చివరి ఓవర్‌లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌ బాది చివరి బంతికి ఔటైన టిమ్‌ డేవిడ్‌

ఏడో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
సిరాజ్‌ బౌలింగ్‌లో బట్లర్‌ క్యాచ్‌ పట్టడంతో లివింగ్‌స్టోన్‌ (54) ఔటయ్యాడు.

లివింగ్‌స్టోన్‌ హాఫ్‌ సెంచరీ
రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు బాది లివింగ్‌స్టోన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

ఆరో వికెట్‌ డౌన్‌
14.2వ ఓవర్‌: 104 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్‌ కోల్పోయింది. సాయి కిషోర్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి కృనాల్‌ పాండ్యా (5) ఔటయ్యాడు. లివింగ్‌స్టోన్‌ (24), టిమ్‌ డేవిడ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
12.4వ ఓవర్‌: 94 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్‌ కోల్పోయింది. సాయి కిషోర్‌ బౌలింగ్‌లో తెవాటియాకు క్యాచ్‌ ఇచ్చి జితేశ్‌ శర్మ (33) ఔటయ్యాడు. లివింగ్‌స్టోన్‌కు (19) జతగా కృనాల్‌ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు. 

10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 73/4
10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 73/4గా ఉంది. లివింగ్‌స్టోన్‌ (8), జితేశ్‌ శర్మ (23) క్రీజ్‌లో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ 
6.2వ ఓవర్‌: ఆర్సీబీ కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఆ జట్టు 42 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ క్రీజ్‌లో ఉన్నారు. 

పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. 35 పరుగులకే 3 వికెట్లు డౌన్‌
4.4వ ఓవర్‌: టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టిన అనంతరం ఫిల్‌ సాల్ట్‌ (14)  క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. రజత్‌ పాటిదార్‌కు (6) జతగా లివింగ్‌స్టోన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
ఆర్సీబీ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్‌లో విరాట్‌ను ఆర్షద్‌‌ ఖాన్‌​ ఔట్‌ చేయగా.. మూడో ఓవర్‌లో సిరాజ్‌ అద్భుతమైన బంతితో పడిక్కల్‌ను (4) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

ఆర్సీబీ​కి షాక్‌.. రెండో ఓవర్‌లోనే విరాట్‌ ఔట్‌
ఆర్సీబీకి రెండో ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (7) అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ప్రసిద్ద్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓ‍వర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 12/1గా ఉంది. పడిక్కల్‌ (4), సాల్ట్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి ఓవర్‌లోనే సాల్ట్‌ బతికిపోయాడు..!
సాల్ట్‌కు తొలి ఓవర్‌లోనే లైఫ్‌ లభించింది. సిరాజ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ జోస్‌ బట్లర్‌ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. అంతకుముందు తొలి బంతికే సాల్ట్‌ ఔట్‌ కావాల్సింది. అయితే బంతి ఫీల్డర్లు లేని చోట ల్యాండైంది.

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 2) గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్సీబీ తలపడనున్నాయి. ఆర్సీబీ హోం గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం గుజరాత్‌ ఓ మార్పు చేయగా.. ఆర్సీబీ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తుంది. గుజరాత్‌ తరఫున రబాడ స్థానంలో అర్షద్‌ ఖాన్‌ జట్టులోకి వచ్చాడు. రబాడ వ్యక్తిగత కారణాల చేత ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట​్‌కీపర్‌), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.

కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. గుజరాత్‌ రెండింట ఓ మ్యాచ్‌ గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆర్సీబీ.. కేకేఆర్‌, సీఎస్‌కేపై విజయాలు సాధించగా.. గుజరాత్‌.. పంజాబ్‌ చేతిలో ఓడి, ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement