ఉగ్రదాడిలో మీ హస్తం లే‍కపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్‌ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్‌ | Pakistan Ex Cricketer Danish Kaneria Lashes Out On Pak PM Shehbaz Sharif Over Pahalgam Terrorist Attack, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

Pahalgam Incident: ఉగ్రదాడిలో మీ హస్తం లే‍కపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్‌ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్‌

Published Thu, Apr 24 2025 9:35 AM | Last Updated on Thu, Apr 24 2025 10:58 AM

Pahalgam Terrorist Attack: Former Pak Cricketer Danish Kaneria Lashes Out On PM Shehbaz Sharif

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం జరిగిన భయానమైన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిని యావత్‌ ప్రపంచం ఖండించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే-తోయిబా ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. లష్కరే-తోయిబాకు పాకిస్తాన్‌ ఆశ్రయం​ ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా స్పందించాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర నిజంగా లేకపోతే ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించాడు. దాడి తర్వాత పాక్‌ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయిని నిలదీశాడు. పాక్‌ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, పెంచి పోషిస్తుందని ఆరోపించాడు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని ట్విటర్‌ వేదికగా పాక్‌ ప్రభుత్వంపై అసహనాన్ని ప్రదర్శించాడు.

దీనికి ముందు కూడా కనేరియా ఓ ట్వీట్‌ చేశాడు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు స్థానిక కశ్మీరీలను ఎందుకు టార్గెట్‌ చేయరని ప్రశ్నించాడు. హిందువులే లక్ష్యంగా ఎందుకు దాడులకు తెగబడతారని నిలదీశాడు. ఉగ్రవాదం కారణంగా యావత్‌ ప్రపంచం మూల్యం చెల్లించుకుంటుందని వాపోయాడు.

తాజాగా కనేరియా మరో ట్వీట్‌ కూడా చేశాడు. నేను ఏదైనా ట్వీట్ చేసినప్పుడల్లా కొంతమంది భారతీయ ముస్లింలు ఎందుకు బాధపడతారని ప్రశ్నించాడు.

44 ఏళ్ల కనేరియా పాక్‌ తరఫున క్రికెట్‌ ఆడిన రెండో హిందు ఆటగాడు. గతంలో అతని కజిన్‌ అనిల్‌ దల్‌పత్‌ పాక్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కనేరియా 2000-2019 మధ్యలో పాక్‌ తరఫున 61 టెస్ట్‌లు ఆడి 261 వికెట్లు పడగొట్టాడు. 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. 

కనేరియా హిందువన్న కారణంగా పాక్‌ క్రికెట్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అతను టీమ్‌లో ఉండటం చాలామంది పాక్‌ క్రికెటర్లకు నచ్చేది కాదని ఆ దేశ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ స్వయంగా చెప్పాడు. కనేరియా స్పాట్‌ ఫిక్సంగ్‌ కేసులో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. 

పాకిస్తాన్‌ మరియు ఆ దేశ క్రికెట్‌ బోర్డుతో విభేదాల కారణంగా కనేరియా ఆ దేశాన్ని విడిచి వెళ్లాడు. ప్రస్తుతం అతను యూకేలో తలదాచుకుంటున్నాడు.

కాగా, పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ కూడా స్పందించాడు. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ విచారం​ వ్యక్తం చేశాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement