
ఆలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
శ్రీకాకుళం క్రైమ్ : ఇటీవల జలుమూరు మండలం యలమంచిలి ఎండల కామేశ్వరస్వామి ఆలయ గోడలపై అన్యమత రాతలు వంటి ఘటనలతో పాటు ఆలయాల్లో చోరీలు జరగకుండా నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ పరిధిలోని ఆలయాల కమిటీ సభ్యులతో ఎస్‌ఐ ఎం.హరికృష్ణ సమావేశం నిర్వహించారు. ఆలయాలకు నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఆలయానికి కమిటీలుండాలని, అందులో యువకులుంటే ఇద్దరు రాత్రిపూట ఆలయం వద్దే నిద్రపోయేలా చూడాలని, లేదంటే సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలని ఎస్‌ఐ సూచించారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
ఎచ్చెర్ల: లావేరు మండలం రావివలస సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పిన్నింటి రాము, మరో వ్యక్తి సుభద్రాపురం నుంచి విశాఖ వైపు కారులో వెళ్తుండగా హైవే పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికీ కాళ్లు విరగడంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

ఆలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి