
బెల్ట్ దుకాణాలపై పోలీసుల దాడి
పోలాకి: ‘మద్యం సిండికేట్ మాయాజాలం’ పేరుతో ఈ నెల 25వ తేదీన ‘సాక్షి’లో ప్రచరితమైన కథనానికి పోలీసులు స్పందించారు. పోలాకి మండలంలో పలుగ్రామాల్లో బెల్ట్ నిర్వాహకుల ఇళ్లలో సోదాలు చేశారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. జడూరు జంక్షన్‌లో ఒక దాబాలో 19 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకు ని, దాబా యజమాని బాబిసాహుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంజిత్ తెలిపారు. అయితే తూతూ మంత్రంగా కాకుండా ఎకై ్సజ్ అధికారులతో కలసి బెల్ట్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎన్‌పీటీఈఎల్ కోర్సు పరీక్షల నిర్వహణ
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థులకు శనివా రం ఎన్‌పీటీఈఎల్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. 2768 మంది విద్యార్థులకు విడత ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 65 మంది పరీక్ష రాశారు. ఆదివారం, మే 3, 4, 5 తేదీల్లో మిగతా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్మినిస్ట్రేటివ్, ఎగ్జామినేషన్, ఐటీ ఇన్‌ఫ్రా బృందాలు పరీక్షలు పర్యవేక్షించా యి. ఈ పరీక్షలు విద్యార్థుల వృత్తి నైపుణ్యాల కు దోహద పడతాయని శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ కొక్కిరాల వెంకటగోపాలధన బాలాజీ చెప్పారు.
28న మహిళా క్రికెట్ జట్ల
ఎంపికలు
శ్రీకాకుళం అర్బన్: మహిళా క్రికెట్ జట్ల ఎంపికలకు రంగం సిద్ధమైంది. జిల్లా స్థాయి అండర్ –15, అండర్–19, సీనియర్స్ వయో విభాగా ల్లో ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రికె ట్ సంఘం అధ్యక్షులు పీవైఎన్ శాస్త్రి, కార్యద ర్శి హసన్ రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ సంయుక్తంగా పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఎంపికల ప్రక్రియను నిర్వహించనున్నారు.

బెల్ట్ దుకాణాలపై పోలీసుల దాడి

బెల్ట్ దుకాణాలపై పోలీసుల దాడి