
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పాతబస్తీలోని పలువురు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
వివరాల ప్రకారం.. తెలంగాణలో భూదాన్ భూములు, మహేశ్వరం భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. భూదాన్ భూములను అక్రమంగా ఆక్రమించి లే-అవుట్ చేసి మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా అనే వ్యక్తులు అమ్మకాలు జరిపారు. దాదాపు వంద ఎకరాల భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగి.. పాతబస్తీలో మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిస్, శర్పాన్, సుకుర్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇక, గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమాయ్ కుమార్‌ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.