ఇలాంటి వ్యక్తి తనను చూసి ఓట్లు వెయ్యమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతేనే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందని.. దానిని చంద్రబాబు నాయుడు తప్పుపట్టడం దారుణమన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో అబద్ధాల పుట్టని.. అమలుకు వీలుకాని హామీలను ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని అన్నారు.