Begampet
-
తెలంగాణకు త్వరలోనే సూర్యోదయం రాబోతుంది : ప్రధాని మోదీ
-
Hyderabad: నూతన భవనంలోకి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్
-
నూతన భవనంలోకి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ త్వరలోనే నూతన భవనంలోకి మారనుంది. బేగంపేటలోని పైగా ప్యాలస్‌లో 14 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తోంది అమెరికా దౌత్య కార్యాలయం. 2008, అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌లో అమెరికా జెండా తొలిసారి ఎగిరింది. పైగా ప్యాలస్‌లోని కాన్సులేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అక్కడ ఇదే చివరి వార్షికోత్సవం కానుంది. త్వరలోనే సుమారు 300 మిలియన్ డాలర్లతో నిర్మించిన కొత్త భవనంలోకి మారనున్నారు. ఈ క్రమంలో పైగా ప్యాలస్‌లో కాన్సులేట్ స్టాఫ్ తుది వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి నూతన భవనంలో అమెరికా జెండాను ఎగురవేయనున్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలతో అగ్రరాజ్య సంబంధాలను పర్యవేక్షిస్తోంది. ఇదీ చదవండి: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. -
లిస్బన్ క్లబ్ ఘటన.. డీజీపీ ఆరా
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని లిస్బన్ క్లబ్ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి ఆరా తీశారు. క్లబ్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న హరిణి అనే యువతిని అసాంఘిక కార్యకలాపాలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం, దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు 100కు ఫోన్ చేసిన తరువాత అక్కడికి వచ్చిన పోలీసులు తనను కాపాడకపోగా, దాడి చేసినవారికి వత్తాసు పలికారని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. పంజాగుట్ట సీఐతో మాట్లాడిన డీజీపీ.. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కేసుకు సంబంధించిన నివేదిక త్వరగా అందించాలని ఆదేశించారు. బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమైతే సదరు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న ఇదివరకే తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు మహిళలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు సయీద్ తప్పించుకున్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. చదవండి : బట్టలూడదీసి పబ్ డ్యాన్సర్‌ను కొట్టారు..! -
బట్టలూడదీసి పబ్ డ్యాన్సర్‌ను కొట్టారు..!
హైదరాబాద్: ఆమె పొట్టకూటి కోసం నగరానికి వచ్చింది. ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులను పోషించుకునేందుకు ఓ బార్లో డ్యాన్సర్‌గా చేరింది. తోటి డ్యాన్సర్లు, నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం చేయాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి చేశారు. దానికి ఒప్పుకోకపోవడంతో ఆ యువతి ఒంటిపైనున్న బట్టలూడదీసి విచక్షణారహితంగా దాడి చేశారు. బీర్ సీసాలను పగలగొట్టి చేయి, ఛాతీపై తీవ్ర గాయాలు చేశారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు... గుంటూరు జిల్లా సంగడికుంట కాలనీకి చెందిన జి.హరిణి(26) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలసి నగరానికి వచ్చింది. యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో ఉంటూ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకు యత్నించింది. సరైన అవకాశాలు రాకపోవడంతో ఐదునెలల క్రితం బేగంపేటలోని లిస్బన్ క్లబ్లో డ్యాన్సర్‌గా చేరింది. మొదట్లో బాగానే సాగినప్పటికీ కొద్దిరోజుల నుండి తోటి డ్యాన్సర్లు, ఓ మధ్యవర్తి వ్యభిచారం చేయాలని ఆమెపై ఒత్తిడి చేయసాగారు. తాను అసాంఘిక కార్యకలాపాలు చేయనని, పొట్టకూటి కోసమే డ్యాన్సర్‌గా చేస్తున్నానని హరిణి స్పష్టం చేసింది. దీంతో ఆమెపై వారు కోపం పెంచుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 1 గంటకు పబ్ మూసేయగానే మధ్యవర్తి సయ్యద్ మాజీద్ హుస్సేన్ అలియాస్ సయీద్(30), తోటి డ్యాన్సర్లు ఎర్రబెల్లి సంధ్య అలియాస్ రితిక(24), జెక్క శ్రావణి అలియాస్ స్వీటీ(20), ఎస్.రేఖ అలియాస్ మధు(25), కొడాలి విజయారెడ్డి అలియాస్ విజ్జు(24)లు ఓ కస్టమర్ వద్దకు వెళ్లాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీనికి హరిణి ఒప్పుకోకపోవడంతో ఒంటిపై బట్టలు ఊడదీసి విచక్షణారహితంగా దాడి చేశారు. బీర్ సీసాలను పగలగొట్టి చేయి, ఛాతీపై తీవ్ర గాయాలు చేశారు. ఆ యువతి అరుస్తూ వారి నుండి తప్పించుకుని బయటకు వచ్చి ‘100’కు ఫోన్ చేసింది. దీంతో వారు మరింత రెచ్చిపోయి పోలీసులకు ఫోన్ చేస్తావా.. అంటూ ఆమె సెల్‌ఫోన్‌ను గుంజుకొని పగలగొట్టారు. పట్టించుకోని పోలీసులు సమాచారం తెలుసుకున్న పంజగుట్ట ఎస్సై, సిబ్బంది అక్కడకు చేరుకుని తనను కాపాడకపోగా, దాడి చేసినవారికి వత్తాసు పలికారని బాధితురాలు ఆరోపించింది. ‘‘అమ్మాయిని కాపాడండి.. స్టేషన్‌కు తీసుకువెళ్లండి..’అని పబ్‌లోని కస్టమర్లు అన్నప్పటికీ పట్టించుకోకుండా, స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చెయ్యి, అప్పుడు చూద్దాం’అన్నారని బాధితురాలు వాపోయింది. పోలీసుల ముందే నిందితులు తనను పచ్చిబూతులు తిట్టారని, కొట్టడానికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. 10 రోజులక్రితం ఇదే తరహా ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని, పైగా చాలా చులకనగా మాట్లాడారని బాధితురాలు తెలిపింది. పొట్టకూటి కోసం నగరానికి వచ్చామని, తన తండ్రికి కళ్లు కనిపించవని, తల్లి పొలం పనులకు వెళుతోందని రోదిస్తూ తెలిపింది. పబ్‌లో కూడా వేతనం ఉండదని, డ్యాన్స్ చేస్తుండగా కస్టమర్లు ఇచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపింది. ఆమె ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటాం: ఏసీపీ బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమైతే సదరు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని నలుగురు మహిళలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రధాన నిందితుడు సయీద్ తప్పించుకున్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
క్లబ్ డ్యాన్సర్ బట్టలు విప్పి అసభ్యకరంగా..
సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని లెస్బెన్ పబ్‌లో శుక్రవారం రాత్రి ఓ డ్యాన్సర్‌పై దాడి జరిగింది. నడిరోడ్డుపై తనను వివస్త్రన చేసి, దాడికిపాల్పడ్డారని క్లబ్ డ్యాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. సినిమా చాన్స్‌ల కోసం హైదరాబాద్ వచ్చిన యువతి, ఆర్థిక సమస్యల కారణంగా లెస్బెన్ పబ్‌లో డాన్సర్‌గా పని చేస్తోంది. ఆ పబ్‌కొచ్చే కస్టమర్లు తాగిన మైకంలో తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని, కోరిక తీర్చాలంటూ వేధించేవారని తెలిపింది. అవన్నీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుని వెళ్లిపోయేదాన్నని చెప్పింది. ఓ రాత్రి కస్టమర్‌తో గడిపితే రూ.10వేలు ఇస్తారని పబ్ నిర్వాహకులు ఒత్తిడి చేసేవారని క్లబ్ డ్యాన్సర్ వాపోయింది. 'ఇటువంటి అసాంఘీక కార్యక్రమాలకు అంగీకరించలేదు. దీంతో వారంతా నాపై కక్ష్య కట్టారు. తరచూ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారు. పబ్‌లో బ్లేడ్లతో ఒళ్లంతా గాయాలు చేసే వారు. నిన్న క్లబ్ ముగిసిన తర్వాత ఒంటి గంటకు నలుగురు అమ్మాయిలు, మరోవ్యక్తితో కలిసి దాడి చేశారు. ఒంటిపై బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించారు. వాళ్లకు ప్రముఖ రాజకీయ నాయకులు తెలుసంటూ బెదిరించారు. సయ్యద్ అనే వ్యక్తి వీళ్లందరికి బాస్. పంజాగుట్ట పీఎస్‌లో వారిపై ఫిర్యాదు చేశాను. నాపై దాడి చేసిన వారు కూడా పంజాగుట్ట పీఎస్‌కు వచ్చి వెళ్ళిపోయారు. క్లబ్లో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. సాయంత్రానికల్లా దాడి చేసిన వాళ్లందరిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు' అని క్లబ్ డ్యాన్సర్ పేర్కొంది. -
మై ఎడ్యూ ఫెయిర్-2015
సమయం: ఈ రోజు ఉదయం 11 గంటలకు వేదిక: గ్రీన్‌పార్క్, బేగంపేట్ ఫోన్: 9176938884 -
బిగ్ ఎఫ్ఎంలో మంచు లక్ష్మి సందడి
సనత్‌నగర్: బేగంపేట్‌లోని బిగ్ ఎఫ్ఎం స్టూడియోలో గురువారం సినీనటి, నిర్మాత మంచు లక్ష్మి సందడి చేశారు. తాను నిర్మాత, నటిగా తెరకెక్కుతున్న ‘దొంగాట’ చిత్ర విశేషాలను నటుడు అడవి శేష్‌తో కలిసి ఆమె శ్రోతలతో పంచుకున్నారు. ఈ చిత్రంలో లక్ష్మి స్వరపరిచిన‘ ఏందిరో మీ అబ్బాయిల గోల’ పాట పాడి శ్రోతలను అలరించారు. ఆమె మాట్లాడుతూ తాను పాడిన పాట ఆదరణ పొందడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి మోహన్‌బాబు కూడా మెచ్చుకోవడమే గాక, తనను పాడేలా ప్రోత్సహించిన గాయకుడు కుంచె రఘుకు ఫోన్ చేసి ధన్యవాదాలు కూడా చెప్పారని ఆమె చెప్పారు. -
‘నా కుమారుడిని చంపేశారు’
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని బేగంపేట్ బ్రాహ్మణ్‌వాడీకి చెందిన రూపాని లక్ష్మమ్మ ఆరోపించారు. గత నెల 17న రాత్రి 10.30 గంటలకు రంగారెడ్డి జిల్లా ధారూర్ లక్ష్మీనగర్‌తండాకు చెందిన పెంటయ్య కుమారుడు విస్లావత్ రాము వచ్చి తన కొడుకు లక్ష్మణ్ (22)ను బైక్‌పై తీసుకెళ్లినట్లు తెలిపారు. అదే రోజు రాత్రి బేగంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగిందని రాముతో పాటు అతడి వెంట ఇద్దరు వ్యక్తులు వచ్చి తెలిపారన్నారు. అయితే రాత్రి వేళ తన కొడుకును ఎందుకు తీసుకువెళ్లావని రామును ప్రశ్నిస్తుండగా, అతడితో వచ్చిన ఇద్దరు తాము కానిస్టేబుళ్లమంటూ బెదిరింపులకు పాల్పడ్డారని వివరించారు. తన కుమారుడ్ని హత్య చేశారని, నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నెల రోజులు గడుస్తున్నా కనీసం తమ ఫిర్యాదును కూడా స్వీకరించడం లేదని వాపోయింది. ఇంతవరకు పోస్టుమార్టమ్ నివేదిక కూడా తమకు చూపించలేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం: ఎస్సై నర్సింగ్‌రావు రూపాని లక్ష్మమ్మ ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశామని ఎస్సై నర్సింగ్‌రావు అన్నారు. నిందితులను విచారించామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చి రెండు రోజులే అయ్యిందని, వారు వస్తే తప్పకుండా అందజేస్తామని అన్నారు. -
బేగంపేటలోని ఓ షాప్‌లో అగ్నిప్రమాదం
-
బేగంపేటలోని చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం
బేగంపేట శ్యామ్‌లాల్ బెల్డింగ్ సమీపంలోని మోచీ చెప్పుల దుకాణంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దాంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చెప్పుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బర్త్‌డే వేడుకలు హైదరాబాద్ బేగంపేటలో ఘనంగా నిర్వహించారు. సనత్‌నగర్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ వేడుకల్లో నియోజకవర్గం కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి- వృద్దులకు చీరలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్తీకరణ బిల్లును పార్లమెంట్లో ఓడించేందుకు జాతీయ నాయకుల మద్దతును జగన్ కూడగట్టగిలిగారని ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర సమైక్యత కోసం జగన్ చేస్తున్న కృషి మరువలేనిదనది వెంకటరావు అన్నారు. -
బేగంపేటలో విద్యార్థులపై దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థులపై కారు దూసుకెళ్లిన సంఘటన మరువక ముందే హైదరాబాద్‌లో ఈరోజు అటువంటి ప్రమాదమే జరిగింది. బేగంపేట్‌లోని పీజీ కాలేజ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ముగ్గురు విద్యార్థులపై దూసుకెళ్లింది. విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. విజయవాడలోని రామవరప్పాడులో ఈ నెల 7వ తేదీ గురువారం బస్సు కోసం నిల్చున్న విద్యార్థులపై కారు దూసుకుపోవడంతో నలుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినులు జ్యోతి, సింధూజ, చందుశ్రీ, పీజీ విద్యార్థి సురేష్ మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగి వారం రోజులు కూడా కాకుండానే బేగంపేటలో అదే విధంగా కారు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.