వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బర్త్‌డే వేడుకలు హైదరాబాద్ బేగంపేటలో ఘనంగా నిర్వహించారు. సనత్‌నగర్ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ వేడుకల్లో నియోజకవర్గం కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి- వృద్దులకు చీరలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్తీకరణ బిల్లును పార్లమెంట్లో ఓడించేందుకు జాతీయ నాయకుల మద్దతును జగన్ కూడగట్టగిలిగారని ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర సమైక్యత కోసం జగన్ చేస్తున్న కృషి మరువలేనిదనది వెంకటరావు అన్నారు.