సాక్షి, హైదరాబాద్: తన కుమారుడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని బేగంపేట్ బ్రాహ్మణ్‌వాడీకి చెందిన రూపాని లక్ష్మమ్మ ఆరోపించారు. గత నెల 17న రాత్రి 10.30 గంటలకు రంగారెడ్డి జిల్లా ధారూర్ లక్ష్మీనగర్‌తండాకు చెందిన పెంటయ్య కుమారుడు విస్లావత్ రాము వచ్చి తన కొడుకు లక్ష్మణ్ (22)ను బైక్‌పై తీసుకెళ్లినట్లు తెలిపారు. అదే రోజు రాత్రి బేగంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగిందని రాముతో పాటు అతడి వెంట ఇద్దరు వ్యక్తులు వచ్చి తెలిపారన్నారు. అయితే రాత్రి వేళ తన కొడుకును ఎందుకు తీసుకువెళ్లావని రామును ప్రశ్నిస్తుండగా, అతడితో వచ్చిన ఇద్దరు తాము కానిస్టేబుళ్లమంటూ బెదిరింపులకు పాల్పడ్డారని వివరించారు. తన కుమారుడ్ని హత్య చేశారని, నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నెల రోజులు గడుస్తున్నా కనీసం తమ ఫిర్యాదును కూడా స్వీకరించడం లేదని వాపోయింది. ఇంతవరకు పోస్టుమార్టమ్ నివేదిక కూడా తమకు చూపించలేదన్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం: ఎస్సై నర్సింగ్‌రావు
రూపాని లక్ష్మమ్మ ఫిర్యాదును స్వీకరించి ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేశామని ఎస్సై నర్సింగ్‌రావు అన్నారు. నిందితులను విచారించామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చి రెండు రోజులే అయ్యిందని, వారు వస్తే తప్పకుండా అందజేస్తామని అన్నారు.
‘నా కుమారుడిని చంపేశారు’
Published Sat, Nov 1 2014 11:12 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement