విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థులపై కారు దూసుకెళ్లిన సంఘటన మరువక ముందే హైదరాబాద్లో ఈరోజు అటువంటి ప్రమాదమే జరిగింది.
హైదరాబాద్: విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థులపై కారు దూసుకెళ్లిన సంఘటన మరువక ముందే హైదరాబాద్లో ఈరోజు అటువంటి ప్రమాదమే జరిగింది. బేగంపేట్‌లోని పీజీ కాలేజ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ముగ్గురు విద్యార్థులపై దూసుకెళ్లింది. విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
విజయవాడలోని రామవరప్పాడులో ఈ నెల 7వ తేదీ గురువారం బస్సు కోసం నిల్చున్న విద్యార్థులపై కారు దూసుకుపోవడంతో నలుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినులు జ్యోతి, సింధూజ, చందుశ్రీ, పీజీ విద్యార్థి సురేష్ మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగి వారం రోజులు కూడా కాకుండానే బేగంపేటలో అదే విధంగా కారు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.