JEE Main results
-
పొరపాట్లు దిద్దుకున్నా 100 పర్సంటైల్ సాధించా
పదో తగరతి: 9.7 జీపీఏఇంటర్ ఫస్టియర్: 465 మార్కులుజేఈఈ మెయిన్ తొలి సెషన్ మార్కులు: 276జేఈఈ మెయిన్ రెండో సెషన్ మార్కులు: 300సాక్షి, ఎడ్యుకేషన్: ‘జనవరి సెషన్లో చిన్న పొరపాట్ల వల్ల 100 పర్సంటైల్ కొద్దిలో కోల్పోయా. పొరపాట్లను సరిదిద్దుకొని.. మ రింత ప్రాక్టీస్ చేసి 100 శాతం మార్కులే లక్ష్యంగా ఏప్రిల్ సెషన్ రాశా. ఇష్టంతో చదివితే ఎలాంటి మానసిక ఒత్తిడి ఉండదు’ అని జేఈఈ–మెయిన్ ఫలితాల్లో 300 మార్కులతో టాపర్‌గా నిలిచి న వంగల అజయ్‌రెడ్డి అన్నాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీ–ముంబైలో సీఎస్ఈలో చేరడమే తన లక్ష్యమన్న అజయ్ ‘సాక్షి’తో తన విజయ ప్రస్థానాన్ని పంచుకున్నాడు.అన్నయ్య స్ఫూర్తి.. వ్యక్తిగత ఆసక్తితో..: ఐఐటీల్లో బీటెక్ చేయాలనే సంకల్పానికి మా అన్నయ్య అక్షయ్‌రెడ్డి స్ఫూర్తి ఎంతో ఉంది. ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐఐటీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తే కెరీర్ బాగుంటుందని చెప్పేవాడు. దీంతో నాకు కూడా ఐఐటీపై ఆసక్తి పెరిగింది. అదే లక్ష్యంగా తొమ్మిదో తరగతి నుంచే జేఈఈ దిశగా అడుగులు వేశా.కర్నూలు నుంచి హైదరాబాద్‌కు..: ఐఐటీలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాక కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వచ్చా. నాన్న వెంకటరమణారెడ్డి ఎంతో ప్రోత్సహించారు. తొమ్మిదో తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోర్సులో చేరా. బేసిక్స్‌తో మొదలు పెట్టి జేఈఈకి అవసరమైన అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకున్నా.ఒత్తిడి లేదు..: టెన్త్ అయ్యాక ఇంటర్, జేఈఈకి ఏకకాలంలో ప్రిపరేషన్ సాగించా. రోజుకు 14 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించా. కానీ ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదు. కాలేజీలో స్టడీ మెటీరియల్, వీక్లీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు రాస్తూ ఎప్పటికప్పుడు పొరపాట్లను సరిదిద్దుకొని ప్రిపేర్ అవడంతో విజయం చేకూరింది.జనవరిలో సెషన్లో లోపాలతో..: జేఈఈ మెయిన్ జనవరి సెషన్లో 276 మార్కులు (99.996 పర్సంటైల్) వచ్చాయి. కాలిక్యులేషన్స్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం, సమాధానాలు గుర్తించడంలో పొరపాట్లే అందుకు కారణమని గుర్తించా. ఫిజిక్స్‌లో 90 మార్కులే రావడంతో ఆ సబ్జెక్ట్‌పై మరింత దృష్టి పెట్టా. ఇంటర్ పరీక్షల తర్వాత పూర్తి సమయం కేటాయించి ప్రతి సబ్జెక్ట్‌లో ప్రతి కాన్సెప్ట్‌పై కూలంకషంగా అధ్యయనం చేయడంతో.. ఏప్రిల్ సెషన్లో ఆశించిన ఫలితం పొందగలిగా. మూడు సబ్జెక్ట్‌లలోనూ నూటికి నూరు శాతం మార్కులు వచ్చాయి.హార్డ్‌వర్క్, వ్యూహం ఉండాలి..: జేఈఈ మెయిన్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమయ్యేందుకు కష్టపడేతత్వంతోపాటు వ్యూహం ఉండాలి. ప్రతి టాపిక్ అధ్యయనానికి తగిన సమయం కేటాయించుకోవాలి. రివిజన్ స్ట్రాటజీ, బలహీనతలను గుర్తించడం ఎంతో ముఖ్యం. దీనివల్ల ఏ టాపిక్‌లో వెనుకబడ్డామో తెలుసుకొని వాటిని పరిష్కరించుకునే సంసిద్ధత పొందొచ్చు.ఐఐటీ బాంబేలో సీఎస్ఈలో చేరడం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నాను. అందులో మంచి ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో సీఎస్ఈ బ్రాంచ్‌లో బీటెక్‌లో అడుగు పెట్టడమే లక్ష్యం. ఐఐటీలో ఈసీఈలో చేరడమే లక్ష్యం: సాయి మనోజ్ఞ(Sai Manojna)⇒ ‘సాక్షి’తో జేఈఈ మెయిన్ మహిళల విభాగం టాపర్ సాయి మనోజ్ఞ⇒ రోజుకు 12 గంటలు ప్రిపరేషన్‌కు సమయం కేటాయించా⇒ గ్రాండ్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు రాస్తూ తప్పులు సరిదిద్దుకున్నాపదో తరగతి (ఐసీఎస్ఈ): 588 మార్కులుఇంటర్: 987 మార్కులుజేఈఈ మెయిన్ జనవరి సెషన్: 295 మార్కులుజేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్: 300 మార్కులు‘జేఈఈ మెయిన్ జనవరి సెషన్లోనూ 100 పర్సంటైల్ సాధించా. కానీ మార్కులు తగ్గడంతో 300 మార్కులు లక్ష్యంగా ఏప్రిల్ సెషన్‌కు హాజరయ్యా. నిర్దిష్ట ప్రణాళికతో ఆ మార్కులు సాధించగలిగా’ అని జేఈఈ మెయిన్ మహిళల విభాగం ఏపీ టాపర్, గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయిమనోజ్ఞ చెప్పింది. ఐఐటీలో ఈసీఈలో బీటెక్ చేయడమే తన లక్ష్యమన్న మనోజ్ఞ ‘సాక్షి’తో తన ప్రిపరేషన్ తీరుతెన్నులను పంచుకుంది.కాన్సెప్ట్స్‌పై అవగాహనతో..: జేఈఈ మెయిన్ పరీక్షలో విజయానికి.. ఆయా సబ్జెక్ట్‌లలో కాన్సెప్ట్‌ల పై, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే సమయంలో ఫార్ములా లను అన్వయించే విధానంపై పట్టు సాధించా. ఇది ఎంతో ఉపయోగపడింది. పరీక్షలో ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చేందుకు తోడ్పడింది. టెన్త్ నుంచే జేఈఈ దిశగా..: ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో పదో తరగతి నుంచే ప్రిపరేషన్ సాగించా. ఇంటర్‌కు ఐసీఎస్ఈ నుంచి బోర్డ్ సిలబస్ వైపు మారా. ఇందులో ఉండే అంశాలు జేఈఈ సిల బస్‌కు అనుగుణంగా ఉండటం, బోధన, పుస్తకాలు ఎక్కువగా లభించడమే అందుకు కారణం.ప్రిపరేషన్ ఇలా..: జేఈఈలో విజయం సాధించేందుకు ఇంటర్ తొలిరోజు నుంచే రోజుకు కనీసం 12 గంటలు ప్రిపరేషన్‌కు సమయం కేటాయించేదాన్ని. గ్రాండ్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చాయి. ఆ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడల్లా ఏయే అంశాల్లో ఎందుకు మార్కులు తగ్గాయో తెలుసుకొని వెంటనే వాటిని సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ సాగించా. ఒక టాపిక్‌ను చదివేటప్పుడు అందులో ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడుగుతారో ఊహించి అభ్యాసం చేశా. ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయం కేటాయించుకొని ఆ సమయంలో ఆ సబ్జెక్ట్‌లోని టాపిక్‌ను పూర్తిచేయడం నాకు ఎంతో ఉపయోగపడింది.జనవరి సెషన్లో 295 మార్కులు: జేఈఈ మెయిన్ జనవరి సెషన్లో కూడా నాకు 100 పర్సంటైల్ వచ్చింది. కానీ మార్కులు 295 మాత్రమే వచ్చాయి. దీంతో 300కు 300 మార్కులు సాధించాలనే లక్ష్యంతో ఏప్రిల్ సెషన్‌కు హాజర య్యా. బోర్డ్ పరీక్షలు ముగిశాక పూర్తి సమయం రివిజన్‌కు, మోడల్ టెస్ట్‌లకు కేటాయించా. వాటి ఫలితంగానే ఇప్పుడు 300 మార్కులు వచ్చాయి. ఐఐటీలో ఈసీఈ చేస్తా..: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కూడా ప్రిపరేషన్ సాగిస్తున్నా. అందులో మంచి ర్యాంకుతో ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) బ్రాంచ్‌లో బీటెక్‌లో చేరడమే నా లక్ష్యం. ఆ తర్వాత అదే రంగంలో ఉన్నతవిద్య, ఉద్యోగం దిశగా అడుగులు వేయాలనుకుంటున్నా. నా విషయంలో నాన్న కిశో ర్ చౌదరి, అమ్మ పద్మజల ప్రోత్సాహం ఎంతో ఉంది. నాన్న ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకులుగా ఉండటంతో ఇంజనీరింగ్‌పై ఆసక్తి పెరిగింది. -
జేఈఈ మెయిన్ ఫలితాలు.. 110 మందికి షాక్!
జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం అర్థరాత్రి విడుదల చేసింది. 2.50 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్టు వెల్లడించింది. 24 మంది 100 పర్సంటైల్ సాధించినట్టు తెలిపింది. అయితే 110 మంది ఫలితాలను ప్రకటించకుండా ఎన్టీఏ నిలిపివేసింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వీరి ఫలితాలను ప్రకటించలేదని ఎన్టీఏ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫోర్జరీ పత్రాలు ఉపయోగించడం పాటు రకరకాలుగా మోసాలకు పాల్పడినట్టు ఆరోపించింది.వ్యక్తిగత వివరాల్లో వ్యత్యాసం కారణంగా మరో 23 మంది ఫలితాలను కూడా ప్రకటించలేదు. ఫొటోలు, బయోమెట్రిక్ డేటాలో తేడాల కారణంగా ఈ 23 మంది రిజల్ట్ విడుదల కాలేదు. వీరు గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్ సమర్పించాలని ఎన్టీఏ (NTA) సూచించింది. వీటిని పరిశీలించిన ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. తాము ఎటువంటి తప్పుచేయలేదని అభ్యర్థులు నిరూపించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షలు దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో జనవరి- ఏప్రిల్‌లో జరిగాయి. సెషన్ 1 పరీక్ష సమయంలో 39 మంది అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్టు ఎన్టీఏ గుర్తించింది. సెషన్ 2లో ఇదే రకమైన ఆరోపణలతో 110 మందిని గుర్తించడంతో మొత్తం 149 మందిని అనుమానిత జాబితాలో చేర్చింది. వీరిలో 133 మంది ఫలితాలు విడుదల చేయకుండా ఎన్టీఏ నిలిపివేసింది. తాము నిబంధలను ఉల్లంఘించలేదని నిరూపించుకున్న తర్వాతే వీరి పరీక్షా ఫలితాలను వెల్లడిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. నిష్పాక్షికత, పారదర్శకత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని కుండబద్దలు కొట్టింది.సరైన పత్రాలతో తమను సంప్రదించండిఫలితాలు విడుదలకాని అభ్యర్థులు సరైన పత్రాలతో తమను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది. కరెక్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఎథికల్ కండక్ట్ కలిగివుంచాలని వెల్లడించింది. పరీక్షల్లో అర్హత సాధించడానికి అనైతిక మార్గాలు అనుసరించకుండా అడ్డుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు తమకు సహకరించాలని కోరింది. చదవండి: 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు వీరేఅక్రమాల నివారణకు చర్యలుదేశంలో అత్యంత పోటీ ఉండే జేఈఈ పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. పలు రకాలుగా భద్రత ఏర్పాటు చేస్తోంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఏఐ- ఆధారిత వీడియో ఎనలిటిక్స్, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెడుతోంది. పరీక్షల్లో డిజిటిల్ అక్రమాలను నిరోధించేందుకు ఎగ్జామ్స్ సెంటర్ల వద్ద 5జీ జామర్లను అమరుస్తోంది. అంతేకాదు కొత్తగా అందుబాటులోకి వచ్చిన పరీక్షా కేంద్రాల్లో థర్డ్ పార్టీ ఏజెన్సీలతో ముందుగానే తనిఖీలు నిర్వహించింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 1100 మందికి పైగా పరీక్షా నిర్వాహకులు, భాగస్వాములకు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చింది. ఢిల్లీలోని సెంట్రల్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాల్లోని కదలికలను గమనిస్తూ అలర్ట్ చేసింది. -
JEE Main Result 2025: టాప్ ర్యాంకర్లు వీరే
జాయింట్ ఎంటన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 ఫలితాలు శుక్రవారం అర్థరాత్రి విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఈసారి రెండు విడతల్లో కలిపి 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించి సత్తా చాటారు. వీరిలో నలుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉండడం విశేషం. రాజస్థాన్ నుంచి అత్యధికంగా ఏడుగురు 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణ (3), మహారాష్ట్ర (3), ఉత్తరప్రదేశ్(3) ఇద్దరు పశ్చిమ బెంగాల్, గుజరాత్ (2), ఢిల్లీ(2), ఏపీ (1), కర్ణాటక (1) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది.రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఎండీ అనాస్, ఆయుష్ సింఘాల్ (Ayush Singhal) మొదటి రెండు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఇద్దరు మాత్రమే బాలికలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దేవదత్త మాఝీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ (Sai Manogna Guthikonda) మాత్రమే టాపర్లలో చోటు సంపాదించారు. మెయిన్ ఫలితంతో పాటు, అడ్వాన్స్డ్ 2025 కటాఫ్ మార్కులు, ఆలిండియా ర్యాంక్ లిస్ట్, రాష్ట్రాల వారీగా టాపర్ల జాబితాను కూడా ఎన్టీఏ విడుదల చేసింది. వివిధ కారణాలతో 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసింది.100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు1. ఎండీ అనాస్ - రాజస్థాన్2. ఆయుష్ సింఘాల్ - రాజస్థాన్3. ఆర్కిస్మాన్ నంది - పశ్చిమ బెంగాల్4. దేవదత్త మాఝీ - పశ్చిమ బెంగాల్5. ఆయుష్ రవి చౌదరి - మహారాష్ట్ర6. లక్ష్య శర్మ - రాజస్థాన్7. కుశాగ్ర గుప్త - కర్ణాటక8. హర్ష్ ఎ గుప్తా - తెలంగాణ9. ఆదిత్ ప్రకాష్ భగడే - గుజరాత్10. దక్ష్ - ఢిల్లీ11. హర్ష్ ఝా - ఢిల్లీ12. రజిత్ గుప్తా - రాజస్థాన్13. శ్రేయాస్ లోహియా - ఉత్తరప్రదేశ్14. సాక్షం జిందాల్ - రాజస్థాన్15. సౌరవ్ - ఉత్తరప్రదేశ్16. వంగాల అజయ్ రెడ్డి - తెలంగాణ17. సానిధ్య సరాఫ్ - మహారాష్ట్ర18. విశాద్ జైన్ - మహారాష్ట్ర19. అర్నవ్ సింగ్ - రాజస్థాన్20. శివన్ వికాస్ తోష్నివాల్ - గుజరాత్21. కుశాగ్రా బైంగహా - ఉత్తరప్రదేశ్22. సాయి మనోజ్ఞ గుత్తికొండ - ఆంధ్రప్రదేశ్23. ఓం ప్రకాష్ బెహెరా - రాజస్థాన్24. బని బ్రతా మాజీ - తెలంగాణఅడ్వాన్స్డ్కు 2.50 లక్షల మందిదేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రెండో సెషన్‌ను ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో నిర్వహించారు. 10,61,849 మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, 9,92,350 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది ఈ పరీక్షరాశారు. జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి, రెండో విడత పరీక్ష ఫలితాల ఆధారంగా 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఏప్రిల్ 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2న పరీక్ష ఉంటుంది.జేఈఈ మెయిన్ రెండో సెషన్దరఖాస్తులు: 10,61,849 పరీక్ష రాసిన వారు: 9,92,350 జనరల్: 372,675ఓబీసీ: 374,860ఈడబ్ల్యూఎస్: 112,790ఎస్సీ: 97,887ఎస్టీ: 34,138 -
జేఈఈ మెయిన్ ఫలితాలపై గందరగోళం
సాక్షి, అమరావతి: జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(మెయిన్) సెషన్–2 ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విద్యార్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులకు ఎటువంటి అప్డేట్ ఇవ్వని ఎన్టీఏ.. ఫలితాల విడుదలలో దోబూచులాడింది. సాయంత్రం తుది ఆన్సర్ కీ విడుదల చేసినట్టే చేసి, కొద్దిసేపటికే వెబ్సైట్ నుంచి తొలగించింది. ఫలితాల విడుదల, ఆన్సర్ కీలపై అప్డేట్ లేకుండా విద్యార్థులను గందరగోళానికి గురిచేయడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. -
17న జేఈఈ మెయిన్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్) ఫలితాలు ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. ఈ నెల 1న ప్రారంభమైన రెండో విడత మెయిన్స్ పరీక్షలు 9వ తేదీతో ముగిశాయి. మొత్తం 12 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది వరకూ పరీక్ష రాశారు. తొలి విడత పరీక్షలు జనవరిలో జరిగాయి. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేశారు. రెండు విడతల మెయిన్స్ పూర్తవడంతో విద్యార్థులకు ర్యాంకులు కేటాయించనున్నారు. వీటి ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. 23 నుంచి అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్దేశవ్యాప్తంగా మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరుగనుంది. మెయిన్స్ ఫలితాలు వెలువడిన తర్వాత ఈ నెల 23 నుంచి అడ్వాన్స్‌డ్‌కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలు పెడతారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తారు. -
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు విద్యార్థి పి రవిశంకర్ ఆరో ర్యాంక్ సాధించగా.. హిమవంశీకి ఏడో ర్యాంక్, పల్లి జయలక్ష్మికి 9వ ర్యాంక్ వచ్చింది. కాగా ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ఫైనల్ కీని మాత్రమే రిలీజ్చేసిన ఎన్టీఏ.. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. -
6న జేఈఈ మెయిన్ తుది ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 తుది ఫలితాలు ఈ నెల 6న వెలువడనున్నాయి. అభ్యర్థుల స్కోరుతోపాటు ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను జూలై 25 నుంచి 30 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 6.29 లక్షల మంది హాజరయ్యారు. కంప్యూటరాధారితంగా నిర్వహించిన ఈ పరీక్షల ప్రాథమిక కీని ఎన్టీఏ బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఈ నెల 5 (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయడానికి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఒక్కొక్క ప్రశ్నకు ఇచ్చిన కీపై ఆధారాలతో రూ.200 చొప్పున ఫీజు చెల్లించి చాలెంజ్ చేయొచ్చని వెల్లడించింది. పేపర్–1.. బీఈ, బీటెక్, పేపర్ 2ఏ.. బీఆర్క్, పేపర్ 2బీ.. బీప్లానింగ్ పరీక్షల ప్రాథమిక కీలను వేర్వేరుగా ఎన్టీఏ https://jeemain.nta.nic.in లో పొందుపరిచింది. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి ఎన్టీఏ తుది నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవి అయితే ప్రాథమిక కీని సవరించి తుది కీని విడుదల చేస్తుంది. కాగా తుది కీ అనంతరం ఈ నెల 5 అర్ధరాత్రి లేదా 6న జేఈఈ మెయిన్ స్కోరు, ర్యాంకుల వారీగా తుది ఫలితాలను విడుదల చేయనుంది. 7 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు కాగా జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ అభ్యర్థులు ఈ నెల 7 నుంచి 11లోపు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 28న అడ్వాన్స్డ్ పేపర్–1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ తుది ఫలితాలను సెప్టెంబర్ 11న ప్రకటించనున్నారు. -
గంట గంటకో ర్యాంక్.. వేల నుంచి లక్షల్లోకి..
తణుకు టౌన్: జేఈఈ మెయిన్ 2021 ఫలితాల్లో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ విద్యార్థికి వెబ్సైట్లో గంటకో ర్యాంకు కనిపిస్తోంది. దీంతో అతడు జేఈఈ మెయిన్‌లో తనకు వచ్చిన కచ్చితమైన ర్యాంక్ ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నాడు. వివరాల్లోకెళ్తే.. తణుకు రూరల్ మండలం దువ్వకు చెందిన ముదునూరి పృథ్వీరాజు జేఈఈ మెయిన్ (అప్లికేషన్ నంబర్ 210310578634)లో నాలుగు సెషన్స్‌కు హాజరయ్యాడు. తాజాగా ప్రకటించిన ఫలితాలను వెబ్సైట్ నుంచి ప్రింట్ తీసుకున్నాడు. వెబ్సైట్లో చూసినప్పుడు వేర్వేరు సమయాల్లో వేర్వేరు పర్సంటైల్‌తో, వేర్వేరు ర్యాంకులు కనిపిస్తున్నాయి. దీంతో పృథ్వీరాజు, అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పృథ్వీకి ఫిబ్రవరిలో 23.98, మార్చిలో 64.99, జూలైలో 91.26, ఆగస్టు సెషన్లో 93.361 పర్సంటైల్ వచ్చింది. నాలుగో సెషన్లో మరింత మెరుగైన పర్సంటైల్ వస్తుందని భావించాడు. దీంతో మరోసారి వెబ్సైట్లో పరిశీలించగా ఈసారి 87.36 పర్సంటైల్ వచ్చినట్టు చూపించింది. దీంతో ఆందోళనకు గురైన అతడు మరో గంట తర్వాత చూడగా 64.99 పర్సంటైల్ వచ్చినట్టు చూపింది. నాలుగో సెషన్లో ఫిజిక్స్ పర్సంటైల్ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గంటల వ్యవధిలోనే పర్సంటైల్ మారిపోవడంతో ర్యాంక్ కూడా వేలల్లో నుంచి లక్షల్లోకి మారిపోయిందని ఆందోళన చెందుతున్నాడు. కాగా, పర్సంటైల్ 93.361 ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో జనరల్‌లో 43,204 ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 16,025 ర్యాంకు వచ్చాయి. పర్సంటైల్ 87.36 ఉన్నప్పుడు జనరల్‌లో 45,289, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 14,323గా ర్యాంకులు ఉన్నాయి. పర్సంటైల్ 64.99గా ఉన్నప్పుడు జనరల్ విభాగంలో 3,39,234, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 43,805గా ర్యాంకులు ఉన్నాయి. ఈ విషయమై స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించగా.. తాడేపల్లిగూడెంలోని నిట్‌లో సంప్రదించాలని తెలిపినట్టు తల్లిదండ్రులు చెప్పారు. -
జేఈఈ మెయిన్‌లో రాష్ట్ర విద్యార్థుల జయభేరి
సాక్షి, అమరావతి/కదిరి అర్బన్/రాజంపేట రూరల్/ఒంగోలు మెట్రో/గుంటూరు ఎడ్యుకేషన్: దేశంలోనే ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐ టీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐటీలు), తదితరాల్లో ప్రవేశానికి నిర్వహించిన జా యింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–2021 మెయిన్ తుది ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం అర్ధరాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఏన్టీఏ) విడుదల చేసిన తుది ఫలితాల్లో జాతీయ స్థాయి టాప్–1 ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచారు. 100 పర్సంటైల్ స్కోర్ సాధించడంలో నూ ముందంజలో నిలిచారు. జాతీయ స్థాయిలో మొత్తం 44 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించ గా.. ఇందులో 18 మంది టాప్–1లో చోటు దక్కించుకున్నారు. వీరిలో నలుగురు ఏపీకి చెందిన వారే కావడం విశేషం. దుగ్గినేని వెంకట ఫణీష్, కాంచనపల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్, పసల వీర శివ టాప్–1 జాబితాలో ఉన్నారు. ఇక వరద మహంత్ నాయుడు, సత్తి కార్తికేయ, లక్ష్మీ సాయి లోకేష్ రెడ్డి జాతీయస్థాయి టాప్ స్కోరర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. బాలికల కేట గిరీలో చిచిలి మనస్వితరెడ్డి రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచింది. మొత్తం 9.39 లక్షల మంది హాజరు నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్ పరీక్షకు 9,39, 008 మంది హాజరయ్యారు. నాలుగు సెషన్లలోనూ అత్యధికంగా చివరి సెషన్ పరీక్ష రాసినవారు 7, 67,700 మంది ఉన్నారు. 2.52 లక్షల మంది విద్యా ర్థులు 4 సెషన్లలోనూ పరీక్ష రాశారు. వీరికి ఆయా సెషన్లలో సాధించిన స్కోర్‌లో ఏది ఎక్కువగా ఉం టే దాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. మూడో సెషన్ ఫలితాల వరకు 100 పర్సంటైల్ సాధించిన వారు 36 మంది ఉండగా.. నాలుగో సెషన్లో మ రో 8 మందికి ఈ స్కోర్ లభించింది. టాప్–1 ర్యాంకు సాధించినవారిలో ఒకే రకమైన మార్కులు వచ్చిన వారికి వేర్వేరు టైబ్రేకింగ్ విధానంలో మెరి ట్ను నిర్ధారించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభా గాల్లో వరుసగా అత్యధిక స్కోర్ సాధించినవారిని ముందు వరుసలోకి తీసుకున్నారు. ఈసారి జేఈఈని 12 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించా రు. తెలుగులో 270 మంది మాత్రమే పరీక్ష రాశారు. అత్యధికం ఆంగ్లానికే ప్రాధాన్యమిచ్చారు. నాలుగో సెషన్లో నిర్వహించిన బీఆర్క్, బీ ప్లానిం గ్ ఫలితాలను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది ఎంపిక జేఈఈ మెయిన్ ఫలితాల్లో మెరిట్లో నిలిచిన టాప్ 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ఇప్పటికే ఐఐటీ ఖరగ్‌పూర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మెయిన్ కటాఫ్ 87.8992241గా ఉంది. ఈసారి కటాఫ్ గత ఏడాదికంటే తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా అక్టోబర్ 3న అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుంది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా మాది వైఎస్సార్ జిల్లా రాజంపేట. నాన్న యుగంధర్ నాయుడు గుంతకల్లు ఏపీఎస్పీడీసీఎల్లో ఏఏవోగా పనిచేస్తున్నారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 100 పర్సంటైల్ సాధించాను. తెలంగాణ ఎంసెట్‌లో రెండో ర్యాంక్, ఏపీఈఏపీసెట్‌లో నాలుగో ర్యాంక్ వచ్చాయి. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతా. – దుగ్గినేని వెంకట ఫణీష్ ర్యాంకర్ల మనోగతం.. అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా.. మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. నాన్న కరణం కొండలరావు ప్రైవేటు స్కూల్ డైరెక్టర్ కాగా, తల్లి శివకుమారి గృహిణి. విజయవాడలో ఇంటర్ చదివాను. జేఈఈ మెయిన్‌లో 100 పర్సంటైల్ సాధించాను. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నాను. ఏపీ ఈఏపీ సెట్లో 27వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో 42వ ర్యాంకు లభించాయి. – కరణం లోకేష్ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకే లక్ష్యం మాది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద ఇర్లపాడు. మాతల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యా యులు. మెయిన్‌లో నాలుగు సెషన్లలోనూ నూరు శాతం పర్సంటైల్ సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించడమే నా లక్ష్యం. – లక్ష్మీసాయి లోకేష్ రెడ్డి ఐఐటీ–బాంబేకే నా ప్రాధాన్యం మాది అనంతపురం జిల్లా కదిరి. మా నాన్న అనిల్ కుమార్ కొండకమర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్. మెయిన్‌లో ఓబీసీ కేటగిరీలో నాకు రెండో ర్యాంక్ వచ్చింది. నేను 8వ తరగతి వరకు కదిరిలో, 9, 10 తరగతులు గుడివాడలో, ఇంటర్మీడియెట్ హైదరాబాద్‌లో చదివాను. ఐఐటీ– బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవడమే నా లక్ష్యం. – పునీత్ కుమార్ -
నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించిన తొలి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఇందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అవసరమైన చర్యలు చేపట్టింది. వాస్తవానికి ఆదివారం రాత్రే ఫలితాలను విడుదల చేయాల్సిన ఉన్నా సాంకేతిక సమస్యలతో నిలిపేశారు. గత నెలలో నిర్వహించిన మొదటి విడత పరీక్షలకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా 6,61,761 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు అంచనా.. ఇక తెలంగాణ నుంచి 73,782 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 70 వేల మంది వరకు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి 4 విడతల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో తొలుత జరగ్గా.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా నిర్వహించనున్నారు. నాలుగింటిలో ఎందులో ఎక్కువ స్కోర్ వస్తే దానినే పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకు ఖరారు చేస్తామని వెల్లడించింది. -
ఎస్ఆర్ విద్యార్థుల విజయభేరి
సాక్షి, కాజీపేట: జేఈఈ(మెయిన్స్)లో ఎస్ఆర్ విద్యాసంస్ధల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి విజయభేరి మోగించారు. ఈ సందర్భంగా హన్మకొండలోని ఎస్ఆర్ విద్యాసంస్థల కార్యాలయంలో విద్యార్థులను శనివారం ఆ సంస్థల చైర్మన్ వరదారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జేఈఈ(మెయిన్స్) ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలకు చెందిన ఎం.చేతన్ (ఏపీపీ నెంబర్ 200310022672) జాతీయ స్ధాయిలో రిజర్వేషన్ కేటగిరిలో 39వ ర్యాంకు, డి.సాయిరోహిత్‌రెడ్డి (ఏపీపీ నెంబర్ 2003189958) రిజర్వేషన్ కేటగిరిలో 115వ ర్యాంకు, పి.సంతోష్‌వ్యాస్ (ఏపీపీ నెంబర్ 200310009430) రిజర్వేషన్ కేటగిరిలో 141వ ర్యాంకు సాధించారని తెలిపా రు. జేఈఈ(అడ్వాన్స్డ్)కు 916 మంది పైగా ప్రవేశానికి అర్హత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్: 4 మార్కులు కలపనున్న ఎన్టీఏ
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, ఎన్ఐటీ తదితర ప్రఖ్యాత ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘జేఈఈ మెయిన్స్’ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 24 మంది విద్యార్థులు ఈ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఎనిమిది మంది తెలంగాణకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. ఆ తరువాత స్థానంలో ఐదుగురు విద్యార్థులతో ఢిల్లీ ఉంది. రాజస్తాన్ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, హరియాణా నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కరు చొప్పున 100 పర్సంటైల్ సాధించారు. కోవిడ్–19 కారణంగా రెండు సార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్‌ను సెప్టెంబర్ 1 నుంచి 6 తేదీల మధ్య, పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలను అమలు పరుస్తూ, నిర్వహించారు. జేఈఈ మెయిన్స్ కోసం 8.58 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 74% మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. కెమిస్ట్రీలో ఒక ప్రశ్న తొలగింపు జేఈఈ మెయిన్స్ ఫైనల్ ఆన్సర్ కీని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. దీనిలో రోజు వారీగా, సెషన్ వారీగా ప్రశ్న ఐడీ, సరైన సమాధానం ఐడీలను విడుదల చేసింది. 3వ తేదీన ఉదయం సెషన్లో ఇచ్చిన కెమిస్ట్రీ ప్రశ్నల్లో ఒక ప్రశ్న తప్పుగా ఉండడంతో దాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రశ్నకు సంబంధించి ఆ సెషన్లో పరీక్ష రాసిన వారికి 4 మార్కులు కలపనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. చదవండి: తెలంగాణ విద్యార్థులే టాప్! -
11న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ తుది ఫలితాలు ఈనెల 11న విడుదలయ్యే అవకాశముంది. కోవిడ్ కారణంగా వాయిదాపడ్డ రెండో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఈనెల 1 నుంచి 6 వరకు జరిగిన సంగతి తెలిసిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 8,58,395 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో 82,748 మంది రిజిస్టర్ చేసుకోగా 52 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. – జేఈఈ మెయిన్స్ జవాబుల ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం రాత్రి అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. దీనిపై అభ్యంతరాల దాఖలుకు గురువారం వరకు ఆన్లైన్లో అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు డెబిట్, క్రెడిట్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. – ప్రశ్నలకు సంబంధించిన జవాబుల కీని ’జేఈఈఎంఏఐఎన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్లో పొందుపర్చారు. – అభ్యర్థులు భవిష్యత్తు అవసరం దృష్ట్యా ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్‌ను భద్రపర్చుకోవాలి. ప్రక్రియ మొదలైంది: రమేష్ పోఖ్రియాల్ జేఈఈ మెయిన్స్ ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్పోఖ్రియాల్ సోషల్ మీడియాలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. 10వతేదీ వరకు అభ్యంతరాల దాఖలుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో 11న ఫలితాలు ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. ఫలితాలు వెలువడ్డాక ఇలా... – ఫలితాలు ప్రకటించాక కటాఫ్ మార్కుల ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులలో మెరిట్లో ముందున్న 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు అనుమతిస్తారు. వీరికి ఐఐటీల్లో ప్రవేశం కల్పిస్తారు. మిగతావారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ), గవర్నమెంటు ఫండెడ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్(జిఎఫ్‌టిఐ) తదితర సంస్థల్లో ప్రవేశాలకు అర్హులు. – జేఈఈ అడ్వాన్సుకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ పరీక్షను ఈసారి ఢిల్లీ ఐఐటీ ఈనెల 27వ తేదీన నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రోచర్ కూడా విడుదలైంది. గత ర్యాంకులను బట్టి అంచనా.. – జేఈఈ మెయిన్స్ కీ విడుదల కాగానే అభ్యర్థులు తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను అంచనా వేసే వీలుంది. గతంలో ఏ ర్యాంకు వరకు సీట్ల కేటాయింపు చేశారో జేఈఈ వెబ్సైట్లోనే ఉన్నందున దీని ఆధారంగా ఒక అంచనాకు రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. – క్వాలిఫైయింగ్ కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు ర్యాంకుల జాబితాలో ఉంటారు. వీటిని రాష్ట్ర, ఆల్ ఇండియా ర్యాంకులుగా ఇస్తారు. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
-
నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఒకటో తేదీ (నేటి) నుంచి ఆరో తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను, 2 నుంచి 6వ తేదీ వరకు బీటెక్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 660 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 8,58,273 మంది హాజరుకానున్నారు. ఇక రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌లో 27 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 67,319 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్‌టికెట్‌లో పేర్కొన్న పరీక్ష ప్రారంభ సమయం కంటే అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేయనున్నారు. తర్వాత వచ్చే వారిని అనుమతించరు. మధ్యాహ్నం పరీక్షకు కూడా ఇదే నిబంధన వర్తించనుంది. విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్‌తోపాటు ఏదేని గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఇక పరీక్షలకు మహారాష్ట్ర నుంచి అత్యధికంగా విద్యార్థులు హాజరుకానున్నారు. ఆ తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. దీంతో 12వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లను ఐఐటీ ఢిల్లీ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 27న జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించిన ఐఐటీ ఢిల్లీ వాటి ఫలితాలను అక్టోబర్ 5న ప్రకటిస్తామని తాజాగా వెల్లడించింది. మరోవైపు ఐఐటీల్లో బీఆర్క్, బీప్లానింగ్‌లో ప్రవేశాల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టును (ఏఏటీ) అక్టోబర్ 8న నిర్వహిస్తామని, 11న ఫలితాలు వెల్లడిస్తామని వివరించింది. మొత్తానికి ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను అక్టోబర్ 6 నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా!) -
జేఈఈలో జాతీయ టాపర్‌గా జితేంద్ర
గుర్ల (చీపురుపల్లి): బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) – మెయిన్స్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి లండ జితేంద్ర జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. విజయనగరం జిల్లా గుర్ల మండలం లవిడాం గ్రామానికి చెందిన జితేంద్ర జేఈఈ మెయిన్స్‌లో 100 శాతం పర్సంటైల్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మొదటి ర్యాంకు సాధించగలనని ముందు నుంచి ఆశతో ఉన్నానని, ఊహించినట్టే ఫలితాలు వచ్చాయని తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకున్నాడు. తమది రైతు కుటుంబమని, ఈ విజయానికి తన తల్లిదండ్రులు వెంకటరమణ, మంగమ్మ, చిన్నాన్న కామునాయుడు, పిన్ని ఆదిలక్ష్మి, ఉపాధ్యాయులే కారణమని తెలిపాడు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు కష్టపడి చదవడం వల్ల పరీక్షల్లో రాణించగలిగానని వివరించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేయాలన్నదే తన లక్ష్యమన్నాడు. బీటెక్ పూర్తి చేశాక మంచి ఉద్యోగం సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. కాగా, జితేంద్ర 1 నుంచి 5వ తరగతి వరకు చీపురుపల్లిలో, 6 నుంచి 10వ తరగతి వరకు రాజమండ్రిలో, ఇంటర్మీడియెట్ విజయవాడలో చదివాడు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించడంతో ఇంటర్లో ఉచితంగా సీటు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌కు కూడా ఉచితంగానే శిక్షణ లభించింది. కాగా, జితేంద్ర సోదరి హేమ ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్ చదువుతోంది. -
టాప్ తొమ్మిదిలో ఇద్దరు..
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించి జేఈఈ మెయిన్ పరీక్ష పలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిసారు. ఈ ఏడాది జనవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన జేఈఈ మెయిన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన వారు 9 మంది ఉండగా... ఇందులో తెలుగు విద్యార్థులు నలుగురు ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందిన రొంగల అరుణ్ సిద్దార్ధ, చాగరి కౌశల్‌కుమార్‌రెడ్డి, ఏపీకి చెందిన లంధ జితేంద్ర, తాడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్ ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 9,21,261 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా... 8,69,010 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అడ్వాన్స్‌లోనూ కష్టపడతా జేఈఈ మెయిన్‌లో వంద పర్సంటైల్ రావడం ఆనందంగా ఉంది. జేఈఈ అడ్వాన్స్‌లోనూ ఇదే తరహాలో కష్టపడి అత్యుత్తమ పర్సంటైల్ సాధిస్తా. బెస్ట్ ఐఐటీలో చదవడమే నా లక్ష్యం. – అరుణ్ సిద్దార్ధ ఆవిష్కరణలంటే ఇష్టం మెయిన్‌లో మంచి స్కోర్ వచ్చింది. ఇప్పుడు నా లక్ష్యం జేఈఈ అడ్వాన్స్పరీక్షే. ఐఐటీ బాంబేలో చదవాలని ఉంది. కానీ అడ్వాన్స్ ర్యాంకు బట్టి వచ్చే ఐఐటీలో చేరతా. కొత్త ఆవిష్కరణలంటే ఇష్టం. – చాగరి కౌశల్‌కుమార్‌రెడ్డి -
720 మార్కులకు జేఈఈ పరీక్ష!
♦ మూడు గంటల చొప్పున రెండు విభాగాలుగా ఆరు గంటల పాటు పరీక్ష ♦ జేఈఈ మెయిన్ నిపుణుల కమిటీ సిఫారసు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షా విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2017 నుంచి వీటన్నింటికీ ఒకే పరీక్షను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా 720 మార్కులకు ప్రవేశ పరీక్షను నిర్వహించాలని జేఈఈ మెయిన్ నిపుణుల కమిటీ (సీఈపీ) సిఫారసు చేసింది. మూడు గంటల చొప్పున సమయం ఉండేలా 360 మార్కులను 2 పార్టులుగా మొత్తం ఆరు గంటల పాటు పరీక్ష నిర్వహించాలని సూచించింది. అందులో వచ్చే మార్కుల ఆధారంగా 40 వేల మందికిపైగా అభ్యర్థులకు ఆలిండియా ర్యాంకులను కేటాయించాలని... వాటి ఆధారంగానే ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలు చేపట్టాలని ప్రతిపాదించింది. వెయిటేజీలన్నీ రద్దు! ప్రస్తుతం 360 మార్కులకు జేఈఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ మార్కులకు 60 శాతం వెయిటేజీ, విద్యార్థి ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి... నార్మలైజ్ చేసి ఆలిండియా ర్యాంకులను ఖరారు చేస్తున్నారు. ఈ విధానం 2016-17 విద్యా సంవత్సరంలో మాత్రమే అమల్లో ఉండనుంది. ఇక 2017-18 నుంచి వెయిటేజీ, నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలని రూర్కీ ఐఐటీ డెరైక్టర్, నిపుణుల కమిటీ అధ్యక్షుడు అశోక్ మిశ్రా కేంద్రానికి సిఫారసు చేశారు. అంతేకాదు ఈ పరీక్ష నిర్వహణ, ప్రవేశాలు చేపట్టేందుకు నేషనల్ అథారిటీ ఫర్ టెస్టింగ్ (ఎన్ఏటీ- న్యాట్)ను ఏర్పాటు చేయాలని సూచించారు. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ అంటూ వేర్వేరు పరీక్షలు కాకుండా న్యాట్ పేరుతో ఒకే పరీక్ష ఆధారంగా ర్యాంకులిచ్చి ప్రవేశాలు చేపట్టాలని ప్రతిపాదించారు. కేంద్ర కేబినెట్ త్వరలోనే ఈ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశముందని జేఈఈ వర్గాలు వెల్లడించాయి. వికలాంగులకు ఒక్క మార్కు వచ్చినా అడ్వాన్స్‌డ్‌కు అర్హులే! ప్రస్తుత (2016-17) విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్ ఫలితాల్లో టాప్ 2 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కటాఫ్ మార్కులను ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించింది. జనరల్ అభ్యర్థులకు 100 మార్కులు, ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌కు 70 మార్కులు, ఎస్సీలకు 52 మార్కులు, ఎస్టీలకు 48 మార్కులు కటాఫ్‌గా పేర్కొంది. ఈ నిర్ణీత మార్కులకంటే ఎక్కువ వచ్చినవారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. తాజాగా మంగళవారం వికలాంగుల కటాఫ్ మార్కును గౌహతి ఐఐటీ వెల్లడించింది. వికలాంగులు జేఈఈ మెయిన్‌లో ఒక్క మార్కు సాధించినా అడ్వాన్స్డ్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.