Sri Rama Navami
-
భద్రాచలం : వైభవోపేతంగా రామయ్యకు పట్టాభిషేకం (ఫొటోలు)
-
పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జగదభిరాముడికి సోమవారం పట్టాభిషేక మహోత్సవం çవైభవోపేతంగా జరిగింది. సీతారాముల కల్యాణం మరుసటి రోజున పుష్యమి నక్షత్రం సందర్భంగా మిథిలా స్టేడియంలో రామయ్యకు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 10 గంటలకు శంఖ, చక్ర, ధనుర్బాణాలు ధరించిన సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను పల్లకీ సేవగా బయటికి తెచ్చారు. మేళతాళాలు, కోలాటం, భజంత్రీలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ సింహాసనంపై కొలువుదీర్చారు. వైదిక మంత్రాలతో వశిష్టుడు, వామనుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, విజయుడు, సుయజ్ఞుడును వేద పండితులు వరింప జేసుకున్నారు. సప్త సముద్రాలు, సకల నదుల జలాలు పట్టాభిషేకం జరిగే ప్రధాన మండపానికి ముందు మూడు ఉప మండపాల్లో మూడు కలశాలను ఏర్పాటు చేశారు. ఒక మండపంలో సముద్ర, నదీ జలాలను ఆవాహన చేశారు. మరో కలశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతోపాటు రామ పరివారాన్ని ఆవాహన చేశారు. మరో కలశంలో అష్టదిక్పాలకులను, పట్టాభిషేకానికి ఉపయోగించే వస్తువులతోపాటు ఆది దేవతలను ఆవాహన చేస్తూ చతుర్వేద హవన పురస్కృతంగా మండపత్రయ ఆరాధన నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామార్చన చేశారు. అటు రాజదండం, ఇటు రాజఖడ్గం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తాన బంగారు సింహాసనంపై స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్ర కిరీటాలను స్వామివారికి ప్రదానం చేశారు. లక్ష్మీదేవిని ఆవాహన చేసిన రాజముద్రికను కుడి చేతి వేలికి తొడిగారు. ఆ తర్వాత పూర్తి రాజ లాంఛనాలతో సామ్రాట్ కిరీటాన్ని శ్రీరాముడికి అలంకరించారు. రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకం సీతాదేవికి, రామ మాడను లక్ష్మణుడికి అలంకరించారు.స్వర్ణఛత్రం నీడలో ఎడమ వైపు రాజఖడ్గం, కుడి వైపున రాజదండంతో శ్రీరాముడిని అలంకరించారు. తలపై సామ్రాట్ కిరీటంతో గరుత్మంతుడు, వైనేతుడులు అందించే చామరల సేవను ఆస్వాదిస్తూ భక్తులకు రామయ్య దర్శనం ఇచ్చారు. అనంతరం మండపత్రయంలో మంత్రించిన జలాలను శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తికి మంగళహారతి ఇచ్చారు. చివరగా ముత్యాల దండతో ఆంజనేయుడి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.పట్టువ్రస్తాలు సమర్పించిన గవర్నర్ పట్టాభిషేక వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకోగా పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం గవర్నర్ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ తంతును తిలకించడానికి పట్టణంలోని నలుమూలల నుంచి తెలుగు భక్తులు, ఉత్తరాది ప్రజలతో పాటు రాజకీయ నాయకులు వందల సంఖ్యలో విచ్చేసి దర్శన భాగ్యాన్ని పొందారు. పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన పద్మనగర్ ప్రాంతంలో గల శ్రీరామ మందిరంలో సీతారామ కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీరామ మందిర్ ట్రస్ట్ నేతృత్వంలో 36వ వార్షికోత్సవ వేడుకలు గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 11.45 గంటలకు సీతారాములకు కల్యాణం వేద పండితులు గాజుల చంద్రశేఖర్, ద్యావణపెల్లి ఆనందం, వడిగొప్పుల శంకర్, గెంట్యాల గంగాధర్, శ్యావు మహారాజ్ పంతులు భద్రాచలంలో జరిపించే విధంగా మందిరం ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో మంగళవాయిద్యాల మధ్య కల్యాణ తంతు ఘనంగా నిర్వహించారు. మాజీ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయక మంత్రి కపిల్ పాటిల్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు హర్శల్ పాటిల్, మాజీ స్థానిక కార్పొరేటర్లు సంతోష్ శెట్టి, సుమిత్ పాటిల్, స్థానిక మీనా బాలకిషన్ కల్యాడపు, పద్మ భూమేశ్ కల్యాడపు, అఖిల పద్మశాలీ సమాజ్ అధ్యక్షుడు పొట్టబత్తిని రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కల్యాడపు బాలకిషన్, కోశాధికారి యెల్లే సాగర్, కార్యాధ్యక్షుడు గాజెంగి రాజు, మాజీ అధ్యక్షుడు యేముల నర్సయ్య, కొంక మల్లేశం, సుంక శశిధర్, నిష్కం భైరి, భీమనాథిని శివప్రసాద్, బాలె శ్రీనివాస్, ట్రస్టీలు ఎస్.మల్లేశం, పాశికంటి లచ్చయ్య, పద్మశాలీ సమాజ్ యువక్ మండలి అధ్యక్షుడు వాసం రాజేందర్, మందిర కార్యవర్గ సభ్యులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల పదాధికారులు, పట్టణ వ్యాప్తంగా కామత్‌ఘర్, బాలాజీనగర్, బండారి కంపౌండ్, కన్నేరి, పాంజలాపూర్, నయీబస్తీ నుంచి తెలుగు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణతంతు అనంతరం భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కానుకలు సమర్పించుకున్నారు. అనంతరం చేపట్టిన అన్నదానం కార్యక్రమంలో సుమారు 12 వేల మంది భక్తులు హాజరయ్యారని శ్రీరామ మందిర ధర్మదాయ విశ్వస్త సంస్థ ట్రస్టీ డాక్టర్ అంకం నర్సయ్య తెలిపారు. పల్లకి ఊరేగింపు..సాయంత్రం 6 గంటలకు స్వామి వారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో 108 గంగా జలాలతో కూడిన కలశాలను మహిళలు తలపై పెట్టుకొని రామ నామం జపిస్తూ పద్మనగర్ పుర వీధులు రామ మందిరం నుంచి కన్నేరి, పీటీ హైసూ్కల్, పాయల్ టాకీజ్, ధామన్‌కర్ నాక, బాజీ మార్కెట్, బాలాజీ మందిరం, దత్తా మందిరం నుంచి తిరిగి రామ మందిరాన్ని రాత్రి 10 గంటల వరకు జరిగింది. ఊరేగింపులోని ప్రతి పురవీధిలో డీజే సౌండ్ సిస్టమ్‌ల మధ్య నృత్యాలు చేస్తూ స్వామివారి పల్లకికి స్వాగతం పలికారు. అలాగే చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భజన మండలి వారి శ్రీరామనామ కీర్తలను ఆలకించారు. స్వామివారిని దారి మధ్యలో భక్తులు మంగళ హారతులు పట్టి, టెంకాయలను కానుకలు సమర్పించు కున్నారు. రాత్రి ఊరేగింపులో పాల్గొన్న సుమారు వేయి మందికి నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ మైన సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. హనుమాన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. ప్రతి సంవత్సరం మాదిరిగానే హనుమాన్ మాలధారణ ధరించిన భక్తులు 56 అడుగుల భక్తాంజనేయ స్వామి మందిరంలో సీతారాముల కల్యాణం గురుస్వామి కోడూరి మల్లేశం, అధ్యక్షుడు గుండేటి నాగేశ్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. 41 రోజుల పాటు మాలధారణ ధరించిన దీక్షాస్వాములు వారం రోజులుగా హోమాలు, అభిõÙకాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వాములకు ప్రత్యేక అలంకరణలతో పాటు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. చైత్రశుద్ధ నవమి, అభిజిత్ లగ్న ముహూర్తమున సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచి, తంతు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి భక్తులు కానుకలు, ఒడిబియ్యం సమర్పించుకున్నారు. అనంతరం జరిగిన అన్నదానంలో సుమారు 2 వేల మంది పాల్గొన్నారని వడ్లకొండ రాము తెలిపారు. -
Rama Navami 2025: రామాయణం మానవజాతికి దిక్సూచి
‘భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. రామాయణాది పౌరాణికాలు మానవజాతికి దిక్సూచి లాంటివి. మనిషి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని అలవర్చుకోవాలని రామాయణం మనకు నేర్పుతుంది. ఇందులో ప్రతి పాత్ర ఆదర్శవంతమే’ అని జస్టిస్ బి.ఎన్.కృష్ణ ఉద్ఘాటించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆంధ్ర మహాసభ, వేంకటేశ్వర పూజా మందిరం ట్రస్ట్ సంయుక్తంగా, శనివారం సాయంత్రం దాదర్ హిందూ కాలనీలోని ఆచార్య బి.ఎన్.వైద్య సభాగహంలో నిర్వహించిన రామాయణం నృత్యరూపక కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలుగులో ప్రదర్శించిన ఈ నృత్యరూపకం కనులపండువగా సాగింది. దర్శకత్వంతో పాటు కళాకారుల అభినయం అద్భుతంగా ఉంది’ అని కొనియాడారు. తొలుత ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ సభకు స్వాగతం పలికారు. ముందుగా పరిచయాత్మకంగా జరిగిన వేదిక కార్యక్రమంలో స్థానిక లోక్‌సభ సభ్యులు అనిల్ దేశాయ్, ఎమ్మెల్సీ సునీల్ శిందే పాల్గొన్నారు. అనిల్ దేశాయ్ మాట్లాడుతూ ఆంధ్ర మహాసభ గత తొమ్మిది దశాబ్దాలుగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అసామాన్యమైన సేవలందిస్తోందని, తెలుగువారికి, మరాఠీయులకు పురాతన కాలం నుంచి అవినాభావ సంబంధాలున్నాయని, ఆంధ్ర మహాసభ అభివృద్ధి పనుల కోసం ఎంపీ ల్యాడ్స్ నుంచి తప్పకుండా సహాయం అందిస్తానని సభాముఖంగా ప్రకటించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేశ్, అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ తదితరులు అనిల్ దేశాయ్‌ని, సునీల్ శిందేని ఘనంగా సన్మానించారు. కనువిందు చేసిన నృత్యరూపకం తర్వాత జగన్నాథాచార్యులు రచించగా, సూర్యారావు సంగీత దర్శకత్వంలో, సూర్యనారాయణ గాత్ర సహకారంతో, భాగవతుల వెంకట రామశర్మ దర్శకత్వంలో ప్రదర్శించిన రామాయణం నృత్యరూపకం సభికుల్ని అక్షరాలా మంత్ర ముగ్ధుల్ని చేసింది. సంగీతం, గానానికి అనుగుణంగా నటీ నటుల అభినయం వీక్షించిన రసికుల్ని అబ్బురపరిచింది. రామాయణంలోని సీతా స్వయంవరం, పరుశరామ గర్వభంగం, మందర కైకేయి సంవాదం, శూర్పణక నాసికా ఖండనం, సీతాపహరణ దశ్యం, వాలి వధ, రామ రావణ యుద్ధం, చివరికి శ్రీరామ పట్టాభిõÙకం తదితర ప్రధాన ఘట్టాల్ని కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించారు. ఆయా ఘట్టాల్లో సభికులు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆయా సందర్భాల్లో ఎంతో భావోద్వేగాలకు గురయ్యారు. దశాబ్దాల తర్వాత ఇంతటి అద్భుతమైన నృత్యరూపకాన్ని చూశామని ప్రేక్షకులు కొనియాడారు. విజయవాడకు చెందిన శ్రీనత్య అకాడమీ వారు ప్రదర్శించిన ఈ నృత్యరూపకంలో రాముడిగా, బి.ఎన్.ఎన్.సౌమ్య, సీతగా అలకనందాదేవి, రావణుడిగా సీహెచ్ రామకృష్ణ అనితరసాధ్యంగా నటించారు. తతిమ్మ నటీనటులు కూడా తమతమ పాత్రల్లో జీవించారు. ప్రముఖ రచయిత్రి తురగా జయశ్యామల, రవీంద్ర దంపతులు రూపకం తీరుకు ఆనందించి అప్పటికప్పుడే ఆర్థిక సహాయం అందించారు. రూపకం ప్రదర్శనానంతరం అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ, చక్కటి కార్యక్రమాలకు ప్రేక్షకాదరణ ఉంటుందని రుజువైందని, భవిష్యత్తులో కూడా వివిధ ప్రక్రియలకు సంబంధించిన నాణ్యమైన కార్యక్రమాల నిర్వహణకు ఆంధ్ర మహాసభ కట్టుబడి ఉందని ప్రకటించారు. తెలుగేతర నేలపై తెలుగు భాషా సంస్కృతుల్ని పరిరక్షించడమే కాకుండా, వాటి వికాసానికి కూడా మహాసభ తప్పకుండా ప్రయతి్నస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేశ్, కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తలు బోగ సహదేవ్, ద్యావరిశెట్టి గంగాధర్, సంగం ఏక్నాథ్, అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, పరిపాలన విభాగ ఉపాధ్యక్షుడు తాల్ల నరేశ్, సాహిత్య విభాగ ఉపాధ్యక్షుడు బొమ్మకంటి కైలాశ్, సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గాజెంగి వేంకటేశ్వర్, సంయుక్త కార్యదర్శి అల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేశ్, చిలుక వినాయక్, కూచన్ బాలకృష్ణ, శేర్ల ప్రహ్లాద్, మహిళా శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, కార్యదర్శి పిల్లమారపు పద్మ, ఉపాధ్యక్షురాలు వి.శ్యామల రామ్మోహన్, సభ్యులు బోగ జ్యోతిలక్షి్మ, వీరబత్తిని రాజశ్రీ, తాళ్ల వనజ, పూజా మందిరం ట్రస్ట్ చైర్మన్ జి.హరికిషన్, కార్యదర్శి నూకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గాజెంగి వేంకటేశ్వర్ సభకు వందన సమర్పణ చేశారు. -
భద్రాద్రిలో వైభవంగా రాములోరి పట్టాభిషేకం
-
హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర
హైదరాబాద్: నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఆదివారం సాయంత్రవేళ అంబర్ పేటలో శోభాయాత్ర ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ..శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హిందువులందరూ ఉత్సవాలను శోభాయామానంగా నిర్వహించడం శుభపరిణామం. దేశంలోని లక్షలాది గ్రామాల్లో అనేక దేవాలయాల్లో యువకులు ఏకమై శోభాయాత్రలు, సీతారాముల కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయం. అయోధ్యలో రామమందిర నిర్మాణం తరువాత భక్తులలో మరింత పట్టుదల, భక్తిశ్రద్ధలు పెరిగాయి. ఇది మంచి శుభపరిణామం’ అని అన్నారు కిషన్ రెడ్డి. -
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
నేడు (ఏప్రిల్ 06) శ్రీరామనవమి. ఈ పండగను పురస్కరించుకుని బుల్లితెర సెలబ్రిటీలు, వెండితెర నటీనటులు సాంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబయ్యారు. ట్రెడిషనల్ లుక్‌లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. యాంకర్ లాస్య అయితే కుటుంబంతో కలిసి అయోధ్య రాములవారిని దర్శించుకుంది. తారల పోస్టులు మీరు చూసేయండి.. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Shobha Shetty (@shobhashettyofficial) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
శ్రీరాముడి మాటలు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి
-
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర
-
భద్రాచలంలో రమణీయంగా సీతారాముల కళ్యాణం (ఫొటోలు)
-
Sri Rama Navami: అయోధ్యకు ఐదు లక్షల మంది భక్తులు.. భద్రత కట్టుదిట్టం
అయోధ్య: నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు(Sri Ramanavami celebrations) అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ భక్తుల సందడితో కళకళలాడుతున్నాయి. శ్రీరాముడు జన్మించిన యూపీలోని అయోద్యలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామదర్బారుకు ఈ రోజు ఉదయానికే ఐదు లక్షల మంది భక్తులు చేరుకున్నారు.శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాలక్ రాముణ్ణి దర్శించుకునే వేళలను పొడిగించారు. ఈరోజు బాలరాముడు భక్తులకు 18 గంటలపాటు దర్శనమివ్వనున్నాడు. ఉదయం 5 గంటలకు తెరుచుకున్న ఆలయ తలుపులు రాత్రి 11 గంటల వరకూ తెరచివుంచనున్నారు. వీవీఐపీ దర్శనాలను(VVIP visits) కూడా నిలిపివేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య వంశస్థుడైన శ్రీరామునికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్దనున్నాడు. (ఆ సమయంలో సూర్య కిరణాలు శ్రీరాములవారి నుదుటను తాకనున్నాయి)ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయ ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్యలోని సుమారు ఎనిమిది వేల ఆలయాలు, మఠాలను శ్రీరామనవమి సందర్భంగా అందంగా తీర్చి దిద్దారు. రామనగరి అయోధ్యలో ఈరోజు సాయంత్రం సరయూ తీరంలో రెండున్నర లక్షల దీపాలను వెలిగించనున్నారు.ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్ -
Sri Rama Navami: బెంగాల్ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్
కోల్‌కతా: నేడు (ఆదివారం ఏప్రిల్ 6) శ్రీరామ నవమి(Sri Rama Navami). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శోభా యాత్రలను నిర్వహించేందుకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో గతంలో శ్రీరామ నవమి సందర్భంగా అల్లర్లు చోటుచేసుకున్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రమంతటా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బెంగాల్‌తో పాటు, యూపీ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.పశ్చిమబెంగాల్(West Bengal)లోని కోల్‌కతాలో 50కి పైగా శ్రీరామనవమి శోభాయాత్రలు నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో వివిధ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఐదు వేల మంది అదనపు పోలీసులను మోహరించారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలతో ఊరేగింపులను పర్యవేక్షించనున్నారు. మహారాష్ట్రంలోని ముంబైలో శ్రీరామనవమి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ శోభాయాత్రలు నిర్వహించనున్నాయి. ఈ నేపధ్యంలో ముంబైలో 13,500 మందికి పైగా పోలీసు సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో మోహరించారు.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కూడా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. డ్రోన్లు, సీసీటీవీలను ఉపయోగించి ఊరేగింపులపై నిఘా సారించారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ పోలీసు అధికారులకు రాష్ట్రంలోని అన్ని మతపరమైన ప్రదేశాలలో పోలీసు బలగాలను మోహరించాలని సూచించారు. కాగా శ్రీరామ నవమి వేళ శాంతియుతంగా ఊరేగింపులు నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.బెంగాల్లో జరిగే శ్రీరామ నవమి ఊరేగింపులో అత్యధికంగా ప్రజలు పాల్గొనాలని బీజేపీ ఎమ్మెల్యే పవన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. కాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి, సామరస్యాలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం హై అలర్ట్ జారీ చేసింది. బీహార్ రాజధాని పట్నాలో 53 శోభాయాత్రలు నిర్వహించనున్న దృష్ఠ్యా పోలీసులు(Police) గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉత్సవ సమయంలో డీజే ప్లే చేయడాన్ని నిషేధించారు. దీనిని ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇది కూడా చదవండి: Tamil Nadu: బీజేపీ బలోపేతానికి ‘పంబన్’ వారధి? -
వెండితెర శ్రీరామచంద్రులు వీళ్లే.. (ఫొటోలు)
-
Ramayanam: విరాధుడి వధ
దశరథుడు కైకకు ఇచ్చిన మాటను అమలు చేయడానికి సీతా సమేతంగా రాముడు వనవాసానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు వారికి తోడుగా బయలుదేరాడు. అయోధ్యను విడిచి సీతా రామ లక్ష్మణులు అడవుల వైపు సాగారు. అడవుల్లో అక్కడక్కడా మజిలీలు చేస్తూ, ముందుకు సాగుతూ, కొన్నాళ్లకు వారు దండకారణ్యం చేరుకున్నారు. దండకారణ్యం మానవ సంచారానికి అంత అనుకూలంగా ఉండని కీకారణ్యం. సీతా రామ లక్ష్మణులు ఆ అడవిలో ముందుకు సాగుతున్నారు. గుబురుగా పెరిగిన చెట్ల కొమ్మలు అడుగడుగునా అడ్డు వస్తున్నాయి. కొనదేలిన రాళ్లు కాళ్లకు గుచ్చుకుంటున్నాయి. అడపా దడపా క్రూర మగాల గంభీర రావాలు దూరం నుంచి వినిపిస్తున్నాయి. అంతలోనే ఆకాశం మేఘావతమైంది. ఆకాశంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరుపులు మెరవసాగాయి. కష్టాన్ని తట్టుకుంటూ అప్పటి వరకు నడక సాగిస్తూ వచ్చిన సీత అలసిపోయింది.‘నాథా! దాహం వేస్తోంది. దగ్గర్లో తటాకం ఏదైనా కనిపిస్తుందేమో చూడండి’ అందామె. దగ్గరలో నీటి జాడ కానరాలేదు. సీతా రామ లక్ష్మణులు ముగ్గురూ మాట్లాడుకుంటూ ముందుకు నడక సాగించారు. కొంత దూరం నడిచాక కనుచూపు మేరలో ఒక చెరువు కనిపించింది. దగ్గరకు వెళ్లే కొద్ది, దాని చుట్టూ దట్టమైన ముళ్ల కంచెలు అడ్డుగా ఉన్న సంగతి అర్థమైంది. లక్ష్మణుడు కత్తితో ముళ్ల కంచెలను కత్తిరించి, తోవ ఏర్పాటు చేశాడు. రాముడు కొంత దూరంలో చెట్టుకు ఆనుకుని నిలబడ్డాడు. సీత కూడా భర్త పక్కనే నిలబడింది. నీటి కోసం లక్ష్మణుడు చెరువులోకి దిగబోయాడు. అదే సమయంలో భీకర ధ్వని వినిపించింది. ఆ ధ్వని క్రూరమగాల గర్జనలా లేదు. అంతకు మించిన తీవ్రతతో కర్ణభేరులు అదరగొట్టే ధ్వని అది. ఉలిక్కిపడిన లక్ష్మణుడు తన వెనుకనే ఉన్న సీతా రాములకు ఆపద ఏమైనా రాలేదు కదా అనే అనుమానంతో వెనక్కు చూశాడు. దూరాన చెట్టుకు ఆనుకుని రాముడు కనిపించాడు. తన వెనుక సీత ఉన్న వైపు రాముడు చూశాడు. అటువైపు భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. గుహలాంటి నోరు తెరిచి, వికటాట్టహాసం చేస్తూ వాడు సీతను ఒడిసి పట్టుకుని ఉన్నాడు. సీత ఎంతగా వదిలించుకుంటున్నా, ఏమాత్రం పట్టు సడలించకుండా రాముడి వైపు ముందడుగు వేశాడు. రాముడు లక్ష్మణుడి వైపు చూశాడు. ఇద్దరూ రాక్షసుడి వైపు విభ్రాంతులై చూశారు. వాడి చేతికి చిక్కిన సీత పడుతున్న యాతన చూసి రామ లక్ష్మణులు దిగ్భ్రాంతులయ్యారు.సీతను పట్టుకుని ఆ రాక్షసుడు మరింత ముందుకు వచ్చాడు.‘నా పేరు విరాధుడు’ అని వికటాట్టహాసం చేశాడు ఆ రాక్షసుడు.రామ లక్ష్మణులు బదులు పలకక వాడి వైపు తీక్షణంగా చూశారు.‘ఏం అలా చూస్తున్నారు? నా పేరు ఎప్పుడూ వినలేదా? చూడబోతే మీరు ఇదివరకు ఈ ప్రాంతానికి వచ్చిన వారిలా లేరే! పైగా మీ వేషాలు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఒకవైపు నారవస్త్రాలు ధరించి, విల్లంబులు, ఆయుధాలు కూడా ధరించి ఉన్నారు. ఈమెను చూడబోతే సర్వాలంకృతగా అంతఃపుర స్త్రీలా కనిపిస్తోంది. మీరు మోసకారుల్లా ఉన్నారు. ఈ స్త్రీని ఏ అంతఃపురం నుంచి పట్టుకువచ్చారు? అంతఃపుర స్త్రీని పట్టుకొస్తే పట్టుకొచ్చారు గాని, బుద్ధి ఉన్నవారెవరైనా సుకుమారులైన స్త్రీలను అడవికి పట్టుకొస్తారా?’ అని గద్దించాడు.రామ లక్ష్మణులు బదులివ్వకపోవడంతో విరాధుడు మళ్లీ ఇలా అన్నాడు: ‘అడవి జంతువులను తిని మొహం మొత్తింది. ఇన్నాళ్లకు నరమాంసం దొరికింది. అయితే ముందు మీరెవరో చెప్పండి. మీరెవరో తెలియకుండా నేను మిమ్మల్ని తినను’ అన్నాడు. ‘అసలు నువ్వెవరివో చెప్పు. నువ్వెవరివో తెలియకుండా నిన్ను చంపము’ అన్నాడు లక్ష్మణుడు.‘మీరెవరని అడిగితే బదులివ్వకుండా, నన్నే నువ్వెవరివని అడుగున్నారే? ఒక్క పిడికిటి పోటు యమపురికి పోయే మీతో ఇంత మట్లాడటం అనవసరం’ అని రెచ్చిపోయాడు విరాధుడు.అప్పుడు రాముడు ‘మేము రామ లక్ష్మణులం. ఈమె నా పత్ని జానకి. ఈమెను ఏ అంతఃపురం నుంచి పట్టుకు రాలేదు. స్వయంవరంలో శివధనుర్భంగం చేసి పెళ్లాడాను’ అన్నాడు. అప్పుడు విరాధుడు ‘నా తండ్రి జయుడు, నా తల్లి శతహ్రద. నన్ను విరాధుడంటారు. తపస్సు చేసి బ్రహ్మ ద్వారా వరాలు పొందాను. ఎలాంటి ఆయుధాలైనా నన్నేమీ చేయలేవు. ఈమెను ఇక్కడ విడిచిపెట్టి, మీ దారిన మీరు వెళ్లండి’ అని పలికాడు.రాముడు కుపితుడయ్యాడు. ‘ఓరీ, రాక్షసాధమా! భూమ్మీద బతకాలని ఉంటే నా సీతను వదిలి వెనక్కు వెళ్లిపో!’ అన్నాడు.‘నన్ను చంపుతానంటున్నారుగా! వ్యర్థప్రలాపాలు దేనికి? చూపించండి మీ ప్రతాపం’ అన్నాడు. అక్కడితో ఆగకుండా, తన భుజాన ఉన్న శూలాన్ని రాముడి మీదకు విసిరాడు.రాముడు నాలుగు బాణాలను వెనువెంటనే సంధించి, ఆ శూలాన్ని గాల్లోనే ముక్కలు చేశాడు. విరాధుడు రెచ్చిపోయి, సీతను అక్కడే వదిలేసి, రామ లక్ష్మణులిద్దరినీ చెరో చేత్తో ఒడిసి పట్టుకుని, అడవిలో పరుగులు తీశాడు.లక్ష్మణుడు వాడి మెడ మీదకు చేరి, ఒడిసి పట్టుకున్నాడు.‘అన్నా! వీడి చెరో భుజాన్నీ ఇద్దరం ఒకేసారి నరికేద్దాం’ అన్నాడు.ఇద్దరూ ఒకేసారి విరాధుడి రెండు భుజాలను ఒక్కసారే నరికేశారు. వాడు పెడబొబ్బలు పెడుతూ కుప్పకూలాడు. అయినా, అతడి ప్రాణం పోలేదు. ‘తపశ్శక్తితో ఈ రాక్షసుడు మరణించేలా లేడు. నేను వీడి కంఠాన్ని తొక్కి పడతాను. నువ్వు గొయ్యి తవ్వు. అందులో వీణ్ణి పూడ్చేద్దాం’ అన్నాడు రాముడు. లక్ష్మణుడు గొయ్య తవ్వుతుండగా, విరాధుడి గొంతు మీద రాముడు కాలు పెట్టాడు. వెంటనే విరాధుడి ప్రాణం పోయింది.∙సాంఖ్యాయన -
Rama Navami 2025: పిబరే రామరసం..
‘రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమఃరాజా సర్వస్య లోకస్య దేవానం మఘ వానివ’శ్రీరాముడి వ్యక్తిత్వం ఏమిటో తెలిపే ఈ శ్లోకాన్ని మారీచుడి నోట పలికించాడు వాల్మీకి. రాముడు అంటే మూర్తీభవించిన ధర్మం. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధుజీవనుడు. అతడి పరాక్రమానికి తిరుగు లేదు. దేవతలకు దేవేంద్రుడు ప్రభువు అయినట్లుగానే, సకల చరాచర సృష్టికి ప్రభువైన పరమాత్ముడు శ్రీరాముడు. శ్రీమహావిష్ణువు దాల్చిన దశావతారాలలో రామావతారం పూర్ణావతారం. వేదవిహితమైన ధర్మం భౌతిక నేత్రాలకు గోచరించదు. ఆచరణీయమైన ధర్మం ఆకారం దాల్చాలనే కోరికతో శ్రీరాముడి రూపంలో భూమిపై అవతరించిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. వాల్మీకి రచించిన రామాయణం మనకు ఆదికావ్యం. ‘ఆయనం’ అంటే గమనం అని అర్థం. రాముడి గమనమే రామాయణం. భూమ్మీద నరుడిగా జన్మించి, ధర్మాన్ని ఆచరించి– ఇదీ ధర్మం అని సర్వలోకాలకు చాటిచెప్పాడు శ్రీరాముడు.రామాయణ గాథ మన దేశంలో పామరులకు కూడా తెలుసు. శ్రీరాముడు భారతీయులకు ఆరాధ్యదైవమే కాదు, ఆదర్శదైవం కూడా! ఆసేతు హిమాచలం మన దేశంలో రామాలయాలు లేని ఊళ్లు ఉండవు. అయోధ్య నగరంలో పుట్టిన రాముడు పితృవాక్య పరిపాలన కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. రాముడు వనవాసంలో ఉండగానే, సీతాపహరణం జరిగింది. సీతను అపహరించిన రావణుడి జాడ వెదుక్కుంటూ, దండకారణ్యంలో సంచరిస్తున్న శ్రీరాముడిని హనుమంతుడు తొలిసారిగా కలుసుకున్నాడు. ఆనాటి నుంచి ఆయనకు నమ్మినబంటు అయ్యాడు. రామలక్ష్మణులను తన ప్రభువు సుగ్రీవుడి వద్దకు తీసుకుపోయి, అతడితో మైత్రి కుదిర్చాడు. సుగ్రీవాజ్ఞతో సీతను వెదకడానికి వానరవీరులు నలుదిక్కులకూ బయలుదేరారు. దక్షిణంవైపు బయలుదేరిన బృందంలో ఉన్న హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకకు చేరుకుని సీతమ్మవారి జాడ కనుగొన్నాడు. ఆమెకు కనిపించి, ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత లంకాదహనం చేసి మరీ రామదండు ప్రతాపం ఎలాంటిదో రావణుడికి రుచి చూపించాడు. లంక నుంచి తిరిగి వచ్చి, శ్రీరాముడికి సీతమ్మవారి క్షేమ సమాచారాన్ని తెలిపాడు. వానరసైన్యంతో లంకకు చేరుకున్న రాముడు చివరకు రావణుడిని వధించి, సీతను అయోధ్యకు తీసుకువచ్చి, పట్టాభిషిక్తుడయ్యాడు. స్థూలంగా ఇదీ రామాయణం. రామాయణం దేశ విదేశాల్లోని పలు భాషలలోకి అనువదితమైంది. రామాయణానికి సంబంధించి వేర్వేరు భాషలలో వేర్వేరు కథలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రామాయణాలు ఉన్నా, వాల్మీకి విరచితమైన రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు. శ్రీరాముడి ధర్మనిరతికే కాదు, ఉదాత్తతకు, స్వదేశాభిమానానికి కూడా రామాయణంలో ఉదాహరణలు ఉన్నాయి. రావణ సంహారం తర్వాత లంకాపుర వైభవాన్ని తిలకించి, లక్ష్మణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎటు చూసినా స్వర్ణకాంతులతో ధగధగలాడుతూ కనిపించింది లంకానగరం. ‘అన్నా! ఈ లంకానగరం స్వర్ణకాంతులతో ఎంత శోభాయమానంగా ఉందో కదా!’ అన్నాడు లక్ష్మణుడు. అందుకు బదులుగా శ్రీరాముడు చిరునవ్వు చిందిస్తూ–‘అపి స్వర్ణమయీం లంకామ్ లక్ష్మణ కానన రోచతేజననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అని పలికాడు.అంటే, ‘లక్ష్మణా! ఈ లంకానగరం ఎంతగా బంగారు కాంతులతో ధగధగలాడుతున్నా, ఇది నాకు రుచించడం లేదు. కన్నతల్లి, పుట్టిననేల స్వర్గం కంటే గొప్పవి’ అని పలికాడు. రావణుడిని సంహరించి, యుద్ధంలో జయించినా, రాముడు లంకను స్వాధీనం చేసుకోలేదు. విభీషణుడిని లంకకు పట్టాభిషిక్తుడిని చేసి, సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చేశాడు. శ్రీరాముడి స్వదేశాభిమానానికి ఇది మచ్చు తునక. రామ రావణ యుద్ధంలో రావణుడు మరణించాక, ‘నా అన్న అయినా, ఇతడు పాపాత్ముడు. ఇటువంటి పాపాత్ముడికి అంత్యక్రియలు చేయడం కూడా పాపమే’ అని నిష్ఠురంగా పలికాడు విభీషణుడు. అప్పుడు శ్రీరాముడు విభీషణుడికి హితవు చెప్పాడు.‘మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనంక్రియాతాం అన్య సంస్కారో మయాప్యేష యథాతవ’ అని పలికాడు. అంటే, ‘వ్యక్తులు మరణించిన తర్వాత వారితో వైరం ఉండకూడదు. ఇతడికి అంత్యక్రియలు చెయ్యి. ఇతడు నీకులాగానే నాకు కూడా గౌరవార్హుడే!’ అన్నాడు. ఇది శ్రీరాముడి ఔదార్యానికి ఉదాహరణ. శ్రీరాముడు ఇంతటి ఉదాత్తుడు, ధర్మనిరతుడు కావడం వల్లనే ప్రజలకు ఆరాధ్య దైవమయ్యాడు. శ్రీరామ నవమి వేడుకలుశ్రీరాముడు చైత్ర శుక్ల నవమి నాడు జన్మించాడు. రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి చేరుకున్నాక ఇదే తిథినాడు పట్టాభిషిక్తుడయ్యాడని, సీతారాముల కల్యాణం కూడా చైత్ర శుక్ల నవమి రోజునే జరిగిందని చెబుతారు. అందుకే శ్రీరామ నవమి రోజున దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లోనూ, ఊరూరా ఏర్పాటు చేసే మంటపాల్లోను సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేసవి ప్రారంభంలో వచ్చే పండుగ కావడంతో శరీరానికి చలవ చేసే వడపప్పును, పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తెలంగాణలోని భద్రాచలంలోను, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలోను శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకల్లో నైవేద్యంగా గోధుమరవ్వ హల్వా, పూరీలు, గోధుమపిండితో తయారు చేసే ‘పింజిరి’ అనే మిఠాయి, పాయసం, ఉడికించిన శనగలు నైవేద్యంగా సమర్పిస్తారు. భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాల గురించి తెలుగు ప్రజలకు తెలుసు. శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య సహా దేశ విదేశాల్లో పలుచోట్ల విశేషమైన రామాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా పురాతనమైనవి కూడా ఉన్నాయి. అయోధ్య సహా కొన్ని అరుదైన రామాలయాల గురించి తెలుసుకుందాం.అయోధ్య బాల రామాలయంశ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో నిర్మించిన బాల రాముడి (బాలక్ రామ్) ఆలయం గత ఏడాది జనవరి 22న ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయంలో నెలకొల్పిన బాల రాముడి విగ్రహానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. అయోధ్య బాల రామాలయంలో ఈ ఏడాది శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించడానికి లక్షలాదిగా భక్తులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. జనక్‌పూర్ సీతా రాముల ఆలయాలుసీతమ్మవారి జన్మస్థలమైన జనక్‌పూర్ నేపాల్‌లో ఉంది. ఇక్కడ పురాతన జానకీమాత ఆలయం ఉంది. ఇదే పట్టణంలోని కులదేవీ ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా రామాలయం ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా జనక్‌పూర్‌లోని జానకీమాత ఆలయంలో సీతారాముల కల్యాణ వేడుకలు వారం రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. సీతారాముల విగ్రహాలకు అభిషేకాలు జరిపి, మైథిలీ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా కల్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారు. లక్షలాది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. మైథిలీ సంస్కృతికి అద్దంపట్టేలా పలు సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఓర్ఛా రాజారామ్ ఆలయంమధ్యప్రదేశ్లోని ఓర్ఛా పట్టణంలో పురాతన రాజారామ్ ఆలయం ఉంది. ఓర్ఛా మహారాజు మధుకర్ షా జు దేవ్ పదహారో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. రాజప్రాసాదాన్ని తలపించేలా అడుగడుగునా రాజసం ఉట్టిపడే ఈ ఆలయంలో శ్రీరాముడు సింహాసనంపై సీతాసమేతంగా ఆసీనుడై తన పరివారంతో కొలువుదీరి భక్తులకు కనువిందు చేస్తాడు. సీతారాముల సింహాసనానికి çకుడివైపు లక్ష్మణుడు, ఎడమ వైపు సుగ్రీవుడు, కిందన ప్రార్థిస్తున్న భంగిమలో హనుమంతుడు, జాంబవంతుడు ఉంటారు. ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.నాసిక్ కాలారామ్ ఆలయంనాసికా త్రయంబకేశ్వరం శైవక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. గోదావరి నది పుట్టిన చోటు ఇక్కడే ఉంది. ఇదే పట్టణంలో పురాతనమైన రామాలయం కూడా ఉంది. దీనిని స్థానికులు ‘కాలారామ్’ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో రాముడి విగ్రహాన్ని నల్లరాతితో మలచడం వల్ల ‘కాలారామ్’ అనే పేరు వచ్చింది. ఆలయ ప్రవేశమార్గంలో నల్లరాతితో మలచిన హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయం రాష్ట్రకూటుల నాటిదని చరిత్రకారుల అంచనా. సుమారు ఏడో శతాబ్దినాటి ఈ ఆలయంపై దండయాత్ర జరిగినప్పుడు విగ్రహాలను ఒక బావిలో పడవేశారు. తర్వాత వాటిని బయటకు తీసి, పునఃప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణానికి పద్దెనిమిదో శతాబ్ది తొలినాళ్లలో సర్దార్ రంగారావు ఓఢేకర్ నిధులు సమకూర్చారు. శ్రీరామ నవమినాడు ఈ ఆలయంలో ఘనంగా వేడుకలు జరుగుతాయి.కుంభకోణం రామస్వామి ఆలయంతమిళనాడులోని కుంభకోణంలో పదహారో శతాబ్ది నాటి రామస్వామి ఆలయం ఉంది. తంజావూరు నాయక రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం దేశంలోని పురాతన రామాలయాల్లో ఒకటి. అచ్యుతప్ప నాయకుని హయాంలో మొదలైన దీని నిర్మాణం రఘునాథ నాయకుని కాలంలో పూర్తయింది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. జమ్ము రఘునాథ ఆలయంజమ్ము నగరంలో తావి నదీ తీరానికి ఉత్తరాన రఘునాథ స్వామి ఆలయం ఉంది. పద్దెనిమిదో శతాబ్దిలో నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణంలో రఘునాథుడిగా శ్రీరాముడు కొలువైన ఆలయం ప్రధానమైనది. ఇదే ప్రాంగణంలో సూర్యభగవానుడి ఆలయం, శ్రీమహావిష్ణువు ఆలయం కూడా ఉన్నాయి. రఘునాథ స్వామి ఆలయంలో సీతా రామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు కొలువై కనిపిస్తాయి. ఏటా శ్రీరామ నవమి రోజున ఈ ఆలయంలో సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు.సైదాపూర్ రామ్‌కుండ్ మందిరంపాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ శివార్లలోని సైదాపూర్‌లో పురాతనమైన రామ్‌కుండ్ మందిరం ఉంది. వనవాస కాలంలో సీతా రామ లక్ష్మణులు ఇక్కడ కొంతకాలం గడిపారని చెబుతారు. పదహారో శతాబ్దిలో అంబర్ పాలకుడు మాన్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. కొండపై ఉన్న ఈ ఆలయానికి చేరువలో ఉన్న తటాకాన్ని ‘రామ్ కుండ్’ (రామ కుండం) అని పిలుస్తారు. ఈ తటాకానికి చేరువలోనే భక్తుల బస కోసం ధర్మసత్రాన్ని కూడా మాన్ సింగ్ కాలంలోనే నిర్మించారు. ఇస్లామాబాద్ నగరాభివృద్ధిని పర్యవేక్షించే రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (కేపిటల్ డెవలప్మెంట్ అథారిటీ) 2006లో ఈ ఆలయాన్ని పర్యాటక ఆకర్షణగా మలచేందుకు చర్యలు చేపట్టి, విగ్రహాలను తొలగించింది. అప్పటి నుంచి ఇక్కడ పూజాదికాలు నిలిచిపోయాయి. అయితే, దీనిని సందర్శించుకోవడానికి పర్యాటకులను మాత్రం అనుమతిస్తున్నారు.అమృత్సర్ రామతీరథ్ మందిరంపంజాబ్లోని అమృత్సర్ శివార్లలో రామతీరథ్ మందిరం ఉంది. ఈ ప్రదేశంలోనే సీతమ్మవారు వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందిందని, ఇక్కడే లవకుశులు జన్మించారని స్థలపురాణం చెబుతోంది. రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి ఇక్కడే రచించాడని కూడా స్థలపురాణ కథనం. ఈ ఆలయం ప్రస్తుతం కనిపిస్తున్న రూపంలో 2016లో దీనిని పునర్నిర్మించారు. ఈ ఆలయం ఎదుట తటాకం, ఆలయ ప్రాంగణంలోని ఎనభై అడుగుల భారీ ఆంజనేయ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా సీతారామ కల్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది.∙ -
రాజన్నతో ముడి.. హిజ్రాల సందడి
వేములవాడ: రాజన్నను వరుడిగా భావించి వివాహమాడటం.. వేములవాడలో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణోత్సవానికి సామాన్య భక్తులతోపాటు అధిక సంఖ్యలో హిజ్రాలు, జోగినులు హాజరవుతుంటారు. కానీ కల్యాణోత్సవానికి హాజరైన హిజ్రాలు, జోగినులు శివుడినే వరుడిగా భావించి వివాహమాడుతుంటారు. మంగళసూత్రం ధరించి, తలంబ్రాలు పోసుకుంటూ సంతోషంగా గడుపుతారు. రాష్ట్రంలో వేములవాడ రాజన్న సన్నిధిలో మాత్రమే శ్రీరామనవమి సందర్భంగా ఆవిష్కృతమయ్యే ఈ ఆచార, వ్యవహారాలపై ప్రత్యేక కథనమిది. నవమి రోజే ఏడడుగులు ఏటా శ్రీరామ నవమి రోజు జరిగే శ్రీసీతారాముల కల్యాణంలో శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు పాల్గొంటారు. వీరంతా సంప్రదాయబద్ధంగా పట్టుచీరలు, ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబై కల్యాణానికి హాజరవుతారు. తమను తాము.. రాజరాజేశ్వరస్వామికి భార్యలుగా భావించి.. వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు. నెత్తిన జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకలు జరుపుకోవడం విశేషం. ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను.. ఆత్మవివాహం(స్వయంపరిత్యాగం)గా పరిగణిస్తుంటారు. వేడుక వెనుక భక్తి భావన ఈ వేడుక ద్వారా శివపార్వతులు, జోగినులు, హిజ్రా సమాజం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటారు. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలనే ఆలోచన ఈ ఉత్సవానికి ప్రధాన సంకేతంగా నిలుస్తోందని భావిస్తుంటారు. వారి ఆత్మాభిమానం పెంచేందుకు, భగవంతుని కటాక్షానికి హిజ్రాలు కూడా పాత్రులనే భావనను చాటి చెప్పేలా ఈ ఉత్సవం సాగుతోంది. భక్తికి లింగ భేదం లేదని, దేవునికి ప్రతి ఒక్కరూ సమానమేనని ఈ వేడుకలు నిరూపిస్తున్నాయి. వారం రోజులపాటు వేములవాడలో వేడుకగా జరిగే ఈ తంతును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. సమాజంలో మార్పుకిది సంకేతం హిజ్రాలను అనాదిగా సమాజం అంగీకరించక, వారిని అటకెక్కించిన తీరు తెలిసిందే. కానీ వేములవాడ రాజన్న ఆలయంలో హిజ్రాలకు ప్రత్యేక గౌరవం కల్పించడం విశేషంగా భావిస్తారు. ఇక్కడ హిజ్రాలు దేవునితో ఆత్మీయబంధం కలిగి, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం పొందుతున్నారు. హిజ్రాలకు దేవతల మన్నింపు, ఆశీస్సులు లభిస్తున్నాయని భావించడంతో.. భక్తుల మధ్య వారికి గుర్తింపు పెరుగుతోంది. సామాజికంగా హిజ్రాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. కానీ ఈ కల్యాణోత్సవం ద్వారా వారికి భక్తిపూర్వకమైన గుర్తింపు లభిస్తోంది. తాము సమాజంలో ఒంటరి కామని, గుర్తింపు ఉందని హిజ్రాలు స్వయంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఇటీవల హిజ్రాలకు ప్రభుత్వం కొన్ని హక్కులు, వసతులు కల్పించినా, సాధారణ ప్రజానీకంలో ఇప్పటికీ వారిపై వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి. -
శోభాయాత్రకు సర్వం సిద్ధం
అబిడ్స్: శ్రీరామ నవమి శోభాయాత్రకు పలు శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా చారిత్రాత్మక సీతారామ్‌బాగ్ ఆలయం నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. సీతారామ్‌బాగ్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర కోఠి హనుమాన్‌టేక్డీ వరకు కొనసాగుతుంది. సీతారామ్‌బాగ్ నుంచి భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుక నిర్వహించనున్నారు. ధూల్‌పేట మాగ్రా నుంచి ఆనంద్‌సింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి పాల్కీ యాత్ర నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ధూల్‌పేట్ గంగా»ౌలి నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర కొనసాగుతుంది. మూడు ప్రాంతాల నుంచి కొనసాగే శోభాయాత్రలు మంగళ్‌హాట్ ప్రధాన రోడ్డులోని అనిత టవర్ వద్ద కలుస్తాయి. పాల్కీ యాత్రకు ఎమ్మెల్సీ కవిత పూజలు ధూల్‌పేట మాగ్రా నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ నవమి పాల్కీ యాత్రను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు.మధ్యాహ్నం 12 గంటలకు పూజలు నిర్వహించి యాత్రలో పాల్గొంటారని నిర్వాహకులు ఆనంద్‌సింగ్, పప్పుమాత్రేలు తెలిపారు. రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి శోభాయాత్ర ఆదివారం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది. గంగా»ౌలి నుంచి రాజాసింగ్ ఈ శోభాయాత్రను ప్రారంభిస్తారు. శోభాయాత్ర కొనసాగే రూట్.. శ్రీరామ నవమి శోభాయాత్ర, పాల్కీ శోభాయాత్ర, రాజాసింగ్ శోభాయాత్రలు మంగళ్‌హాట్‌లో కలుసుకొని పురానాపూల్, జుమ్మేరాత్‌బజార్, చుడీబజార్, భేగంబజార్ ఛత్రి, సిద్దిఅంబర్‌బజార్, గౌలిగూడ,పుత్లీబౌలి, కోఠి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగుతాయి. ఊరేగింపులో శ్రీరాముడితో పాటు పలు దేవుళ్ల విగ్రహాలుంటాయి.సీసీ కెమెరాలతో పోలీసుల నిరంతర పర్యవేక్షణనగర పోలీసులు 20 వేల మంది పోలీసులతో శోభాయాత్రకు భారీ ఎత్తున బందోబస్తు చేస్తున్నారు. సీతారామ్‌బాగ్ నుంచి యాత్ర కొనసాగే హనుమాన్ టేక్డీ వరకు వేలాది మంది పోలీసులతో బందోబస్తు చేపడుతారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, నగర జాయింట్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్లు బందోబస్తును స్వయంగా పర్యావేక్షిస్తారు. సౌత్‌వెస్ట్‌జోన్ డీసీపీ చంద్రమోహన్, ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి, సెంట్రల్‌జోన్ డీసీపీ శిల్పవల్లీలు శోభాయాత్రకు తమ తమ పోలీస్స్టేషన్ల సిబ్బంది, అదనపు బలగాలతో బందోబస్తు చేపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్రను పర్యావేక్షిస్తారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు.. శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ శాఖతో పాటు జీహెచ్ఎంసీ, ఆర్ అండ్‌బీ, విద్యుత్, వాటర్‌బోర్డు, ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మూడు లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు వాటర్‌బోర్డు జనరల్ మేనేజర్ జాన్ షరీఫ్ తెలిపారు. వాహనాల దారి మళ్లింపు శ్రీరామ నవమి శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా పోలీసులు దారిమళ్లిస్తున్నారు. సీతారామ్‌బాగ్‌కు వచ్చే వాహనాలను మల్లేపల్లి, నాంపల్లి మీదుగా దారిమళ్లిస్తారు. బోయిగూడ కమాన్ నుంచి దారుసలాం ఆగాపూరా మీదుగా, పురానాపూల్ నుంచి వాహనాలను జియాగూడ కార్వాన్ వైపు, బేగంబజార్ నుంచి వచ్చే వాహనాలను గోషామహాల్, ఇతర ప్రాంతాలకు దారిమళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భద్రాచలం : కనుల పండువగా శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం (ఫొటోలు)
-
సీతారాముల కల్యాణము చూతము రారండి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామ నవమి రోజున ఆగమ శాస్త్ర పద్ధతిని అనుసరిస్తూ భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మిథిలా స్టేడియంలో నేడు సీతారాముల కల్యాణం జరగనుంది. ఆ వివాహ వేడుక వివరాలు.. భజంత్రీలు, కోలాటాలతో స్వాగతం..ఉదయం 9:30 గంటల తర్వాత శంఖు, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతమ్మతో కూడిన రాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో వెలుపలకు తీసుకొస్తారు. కల్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలుకుతారు. జై శ్రీరామ్ నినాదాల నడుమ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి స్వామి, అమ్మవార్లు చేరుకుంటారు. మండప శుద్ధికల్యాణ మండపానికి చేరుకున్న సీతారాములు, లక్ష్మణుడిని అక్కడ వేంచేపు చేస్తారు. కల్యాణ వేడుకలకు ఎలాంటి విఘ్నాలు రాకుండా ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహిస్తారు. పుణ్యాహవచన మంత్రాలతో కల్యాణ వేడుకలకు ఉపయోగించే స్థలం, వస్తువులు, ప్రాంగణం, వేడుకలో పాల్గొనే వారిని మంత్ర జలంతో శుద్ధి చేస్తారు.రాముడి ఎదురుగా సీతమ్మ..శ్రీయోద్వాహము నిర్వహించి అప్పటివరకు మండపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చుండబెడతారు. శ్రీరాముడు సింహాసనంపై ఆసీనులు కాగా సీతమ్మ గజాసనంపై ఆసీనులవుతారు. సీతారాముల వంశగోత్రాల ప్రవరలు చెబుతారు.సీతారాములు ఎదురెదురుగా కూర్చున్న తర్వాత ద్వాదశ దర్భలతో తయారుచేసిన యోక్త్రంతో సీతమ్మకు యోక్త్రా బంధనం చేస్తారు. ఇలా చేయడం వల్ల గర్భస్థ దశలో కలిగే దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. మరోవైపు శ్రీరాముడు గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నాడనే దానికి సూచనగా యజ్ఞోపవీతధారణ చేస్తారు. యజ్ఞోపవీతధారణ, యోక్త్రాబంధన కార్యక్రమాలు జరిగిన తర్వాత శ్రీరాముడి పాదప్రక్షాళనతో వరపూజ నిర్వహిస్తారు.అలంకరణలుకల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపజేస్తారు. అనంతరం రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చలహారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమాడను ధరింపజేస్తారు. సీతారాములకు తేనె, పెరుగు కలిపిన మధుపర్కంతో నివేదన చేస్తారురాష్ట్ర ప్రభుత్వం తరఫున, శృంగేరీ పీఠంలతో పాటు భక్తరామదాసు, తూము నర్సింహదాసు వంశస్తుల తరఫున వధూవరులకు పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది.కన్యాదానంవేదమంత్రాలను ఉచ్ఛరిస్తూ కన్యాదానం సందర్భంగా భూదానం, గోదానం చేస్తారు. అనంతరం మహాసంకల్పం, చూర్ణిక పఠనం గావిస్తారు. మంగళాష్టకాలు జపిస్తూ శ్రీరాముడికి సంబంధించి ఎనిమిది శ్లోకాలను, సీతమ్మకు సంబంధించి ఎనిమిది శ్లోకాలను పఠిస్తారు. ఈ మంగళాష్టకంలో వధూవరులకు సంబంధించిన ఏడు తరాల వివరాలను, ఘనతలను తెలియజేస్తారు. అభిజిత్ లగ్నంలో..చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది, సాధారణంగా నవమి రోజున అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటుఇటుగా రావడం పరిపాటి. ముహూర్త లగ్నం రాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు తాళిబొట్లు ఉన్న మంగళసూత్రానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం మూడు బొట్లు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది.భద్రాచల వీధుల్లో వధూవరుల ఊరేగింపు..తలంబ్రాల కార్యక్రమం ముగిసిన సీతారాములకు తర్వాత తాత్కాలిక నివేదన చేయిస్తారు. నివేదన అనంతరం సీతమ్మ చీరకు, రామయ్య పంచె/«ధోతితో కలుపుతూ బ్రహ్మముడి వేస్తారు. అనంతరం మంగళ హారతి అందిస్తారు. బ్రహ్మముడి అనంతరం కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్తారు. తలంబ్రాలు..ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. సాధారణంగా తలంబ్రాలు పసుపురంగులో ఉంటాయి. కానీ భద్రాచల రామయ్య కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి. ఇక్కడ తలంబ్రాల తయారీలో పసుపుతో పాటు గులాల్ను కూడా ఉపయోగించడం తానీషా కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము!ఆలయ నిర్మాణం సహా సీతారాములకు ఆభరణాల తయారీమ్యూజియంలో కంచర్ల గోపన్న ఆభరణాలుభద్రాచలం: హస్నాబాద్ (పాల్వంచ) తహసీల్దార్‌గా పనిచేసిన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీసీతారాముల ఆలయం నిర్మించాడని తెలిసిందే. అయితే, ఆయన ఆలయాన్ని నిర్మించడమే కాకుండా.. సీతారామ లక్ష్మణులకు పలు ఆభరణాలను ఆ సమయంలోనే తయారు చేయించాడు. వీటిని ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ప్రధాన ఉత్సవాలైన ముక్కోటి, శ్రీరామనవమి రోజుల్లో ఈ ఆభరణాలను మూలవరులు, ఉత్సవ విగ్రహాలకు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.భద్రశిల మహత్మ్యం భద్రగిరిపై శ్రీ సీతారామచంద్రస్వామి వారి కరుణా కటాక్షాల కోసం భద్ర మహర్షి కఠోర తపస్సు చేశాడు. రామాలయం ప్రాంగణంలో గర్భగుడి వెనుక ఇప్పటికీ భద్రుని శిల.. చరిత్రకు నిదర్శనంగా దర్శనమిస్తోంది. ఆ మహర్షి కఠోర తపస్సుకు సంతుష్టుడైన శ్రీరామన్నారాయణుడు.. శంఖుచక్రాలతో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడి అవతారంలో సాక్షాత్కరించిన తపో భూమి భద్రాచలమని భక్తులు భావిస్తారు. ఇంతటి చారిత్రక నేపథ్యం గల ఈ శిలను తాకేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తారు. భద్రుడికి గుడి కట్టించి పూజలు సైతం నిర్వహిస్తున్నారు. అందుకే ఈ క్షేత్రం తొలుత భద్రగిరి, అనంతరం భద్రాచలంగా ప్రఖ్యాతి గాంచింది. అదరహో... శిల్పకళా నైపుణ్యంజగదభిరాముడికి భద్రాచలంలో జరిగే కల్యాణం ఎంతో ప్రత్యేకమైంది. ఈ కల్యాణం నిర్వహించే మండపం మొత్తాన్ని శిలతోనే నిర్మించారు. దీనిపై రామాయణ ఇతివృత్తాలకు చెందిన అనేక అపురూప శిల్పాలను చెక్కారు. ఈ శిల్పాలను నాటి మద్రాస్, ప్రస్తుత చెన్నైకి చెందిన గణపతి స్థపతి నేతృత్వంలో చెక్కారు. శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా అలంకరించి కల్యాణాన్ని ఇదే వేదికపై జరుపుతారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని.. మొదట్లో ఆలయంలోని పొగడ చెట్టు ముందున్న రామకోటి స్తూపం వద్ద నిర్వహించేవారు. ఆ తర్వాత చిత్రకూట మండపంలో వేదిక నిర్మించి కల్యాణం జరిపేవారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో.. రామాలయానికి సమీపంలో 1960 మే 30న ప్రస్తుత కల్యాణ మండపానికి అప్పటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళితో శంకుస్థాపన జరిగింది. దీన్ని 1964 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డితో ప్రారంభించి.. అదే రోజు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఆ తర్వాత మహాసామ్రాజ్య పట్టాభిషేకం సందర్భంలో.. 1988లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కల్యాణ మండపం ప్రాంగణంలో.. స్టేడియం మాదిరిగా గ్యాలరీలు ఏర్పాటు చేసి మిథిలా స్టేడియంగా నామకరణం చేశారు. ఈ స్టేడియంలో ప్రస్తుతం 35 వేలమంది భక్తులు కూర్చుని స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉంది.సుదర్శన చక్ర దర్శనం.. సర్వ పాపహరణంభద్రగిరిపై కొలువుదీరిన మూలమూర్తులకు ఎంతటి ప్రత్యేకత ఉందో.. ప్రధాన ఆలయంపైనున్న గోపురంపై సుదర్శన చక్రానికీ అంతే ప్రత్యేకత ఉంటుంది. భక్త రామదాసు రామాలయాన్ని ప్రత్యేక రాతి శిల్పాలతో నిర్మించాక.. ఆలయ శిఖరంపై విమాన ప్రతిష్ట కోసం సుదర్శన చక్రం తయారు చేయించాలని నిర్ణయించారు. ఇలా సుదర్శన చక్రాన్ని ఎంతమందితో తయారు చేయించినప్పటికీ అది భిన్నం (ముక్కలు) అయిపోయేదట. భక్త రామదాసు చివరకు రామయ్య తండ్రిని ప్రార్థించగా.. స్వామివారు స్వప్నంలో కనిపించి మానవుడు నిర్మించిన ఏదీ ఇందుకు పనికిరాదని, గోదావరి నదిలో సుదర్శన చక్రం ఆవిర్భవించి ఉందని చెప్పినట్లు పురాణం చెబుతోంది. దీంతో నాలుగు వందల మంది గోదావరి నదిలో దానికోసం వెతికినా.. కనిపించలేదు. రామదాసు భక్తి శ్రద్ధలతో సీతారామచంద్రస్వామి వారిపై కీర్తనలు ఆలపించగా.. సుదర్శన చక్రం గోదావరి నదిలో దొరికిందట. ఇలా గోదావరి నదిలో దొరికిన సుదర్శన చక్రాన్ని ఆలయ గర్భగుడిపై భక్త రామదాసు ప్రతిష్టించారు.రాములోరి మొదటి కల్యాణం గర్భగుడిలోనే..నేడు తెల్లవారుజామున రెండు గంటలకే పూజలు మొదలుభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సాధారణ రోజుల్లో తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పుతారు. ఆ తర్వాత తిరువారాధన, మంగళాశాసనం, అభిషేకం తదితర పూజలు నిర్వహిస్తారు. కానీ శ్రీరామనవమిని పురస్కరించుకుని గర్భగుడిలో ఉన్న సీతారాములను రాత్రి రెండు గంటల సమయంలోనే మేల్కొల్పుతారు. ఆ తర్వాత నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు చేపడతారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల సమయంలో భద్రాచలం ఆలయం గర్భగుడిలో ఉన్న మూల విరాట్లకు శాస్త్రోక్తంగా లఘు కల్యాణం జరుపుతారు. 40 నిమిషాల వ్యవధిలోనే ఈ తంతును ముగిస్తారు.ఆ రోజుల్లో పొగడ చెట్టు నీడలో..శ్రీరామదాసు కాలంలో భద్రాచలం ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టు నీడలో సీతారాముల కల్యాణం నిర్వహించేవారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరగడంతో పొగడ చెట్టు నుంచి బేడా మండపంలోకి పెళ్లి వేదికను మార్చారు. గోదావరిపై వంతెన నిర్మాణం పూర్తయ్యాక భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. బేడా మండపంలో అంతమంది వీక్షించే పరిస్థితి లేకపోవడంతో ఆలయ ప్రాంగణం నుంచి బయట కల్యాణం జరిపించాలని నిర్ణయించారు. దీంతో ఉత్తర ద్వారానికి ఎదురుగా నవమి కల్యాణం కోసం ప్రత్యేకంగా మండపాన్ని 1964లో నిర్మించారు. సుమారు రెండు దశాబ్దాలపాటు ఎత్తైన కల్యాణ మండపంలో పెళ్లి తంతు జరుగుతుండగా చుట్టూరా భక్తులు చేరి చూసేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1988లో కల్యాణ మండపం చుట్టూ భక్తులు కూర్చుని చూసేందుకు వీలుగా మిథిలా స్టేడియాన్ని నిర్మించారు.పెళ్లి పెద్దలుగా..శ్రీరామదాసు కాలం నుంచి భద్రాచలంలో నిత్య పూజలు, శ్రీరామనవమి, పట్టాభిషేకం తదితర వేడుకలు నిర్వహించేందుకు తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన వేద పండితులను భద్రాచలం తీసుకువచ్చారు. ఇలా తీసుకువచ్చిన వారిలో కోటి, అమరవాది, పొడిచేటి, గొట్టుపుళ్ల, తూరుబోటి ఇంటిపేర్లు గల కుటుంబాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆ కుటుంబాలే వంశపారంపర్యంగా, వంతుల వారీగా నవమి వేడుకల బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. శ్రీరామ నవమికి మిథిలా స్టేడియంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలలో కీలక పాత్ర పోషించేది ఆచార్య. ఇతని చేతుల మీదుగానే కల్యాణం మొత్తం జరుగుతుంది. ఆయనకు సూచనలను అందించే వ్యక్తిని బ్రహ్మగా పేర్కొంటారు. వీరిద్దరికి సహాయకులుగా ఇద్దరు చొప్పున నలుగురు రుత్వికులు ఉంటారు. పూజా సామగ్రి అందించేందుకు నలుగురు పరిచారకులు ఉంటారు. ప్రస్తుతం ఆలయంలో ప్రధాన అర్చకులైన ఇద్దరు వీరందరికీ అధర్వులుగా వ్యవహరిస్తారు. మొత్తంగా 12 మంది సీతారాముల పెళ్లి వేడుకలో కీలకంగా వ్యవహరిస్తారు. వీరందరిని ఉత్సవాలలో భాగస్వామ్యం చేస్తూ కల్యాణ తంతు శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిగేలా స్థానాచార్యులు స్థలశాయి పెద్దన్న పాత్రను నిర్వర్తిస్తారు. -
రామయ్య వస్తున్నాడయ్యా
తండ్రి మాటను జవదాటని తనయుడు... సోదరులను అభిమానించే అన్న... భార్య దూరమైనా ఆమె కోసమే జీవించిన ఏక పత్నీవ్రతుడు... ప్రజల క్షేమం కోరిన రాజు... ధర్మం తప్పని మహనీయుడు... ఇలా అన్నీ సుగుణాలున్నాయి కాబట్టే రాముడు ఆదర్శ్రపాయుడు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...రామాయణాన్ని ఒక్క సినిమాగా చెప్పడం కష్టం అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి. అందుకే రెండు భాగాలుగా ఆయన ‘రామాయణ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుగుణాల సుందరాంగుడు రాముడి పాత్రకు హ్యాండ్సమ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ని ఎంపిక చేసుకున్నారు. సుగుణవతి, సౌందర్యవతి సీతమ్మ పాత్రకు సాయి పల్లవిని తీసుకున్నారు. రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటిస్తున్నారు. దాదాపు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్ కూడా ఓ నిర్మాత. రాముడి పాత్ర నాకో కల: రణ్‌బీర్ కపూర్ ‘‘ఇలాంటి అద్భుత చిత్రంలో భాగం కావడం గౌరవంలా భావిస్తున్నాను. ఈ చిత్రం తొలి భాగం షూటింగ్ పూర్తి చేశాను. త్వరలో రెండో భాగం చిత్రీకరణ ఆరంభిస్తాం. రాముడి పాత్రను ఎంతో వినయ విధేయతలతో చేస్తున్నాను. ఈ పాత్ర నాకో కలలాంటిది. ఈ సినిమాలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి గురించి చెప్పే సినిమా. అలాగే కుటుంబం, భార్యా–భర్తల అనుబంధాన్ని తెలియజేసే చిత్రం’’ అని రణ్‌బీర్ కపూర్ ఓ సందర్భంలో పేర్కొన్నారు.ఇక నితీష్ తివారీ అయితే ‘‘ఈ అద్భుత ఇతిహాసాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి పదేళ్ల క్రితమే అన్వేషణ మొదలుపెట్టాను. మన పవిత్రమైన చరిత్రకు దృశ్యరూపం ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఫొటోలను అధికారికంగా విడుదల చేయలేదు. షూటింగ్ స్పాట్లో రణ్‌బీర్–సాయి పల్లవిల ఫొటోలు లీక్ అయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి, మలి భాగం 2027 దీపావళికి విడుదలవుతాయి.ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ రాముడికి పరమ భక్తుడు ఆంజనేయుడు. తన జీవితం మొత్తం రాముడి సేవకే అంకితం చేశాడు. శ్రీరాముడు అంటే ఆంజనేయుడికి ఎంత భక్తి అంటే... తన ఛాతీ చీల్చితే అందులో సీతారాములే ఉంటారనేంతగా... రాముడి జీవితంలో ఎంతో కీలకమైన ఆంజనేయుడి పాత్ర కీలకంగాప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జై హనుమాన్’. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘హను–మాన్’కి ఇది సీక్వెల్. గతేడాది జనవరిలో అయోధ్యలో శ్రీరాముడి ప్రా ణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రం పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ఆ శ్రీరాముడి ఆశీస్సులతో మాటిస్తున్నా... మీరందరూ జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ‘జై హనుమాన్’తో అద్భుతమైన అనుభూతిని అందిస్తా’’ అని పేర్కొన్నారు ప్రశాంత్ వర్మ.శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి? అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్’ని రూపొందిస్తున్నారని తెలిసింది. ఇక హనుమంతుడి పాత్రను ప్రముఖ కన్నడ స్టార్, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి పోషిస్తున్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఆయన హనుమంతుడి లుక్‌కి మంచి స్పందన లభించింది. తొలి భాగంలో కనిపించిన తేజ సజ్జా ఈ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య రానా, రిషబ్‌తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘జై జై హనుమాన్’ అని పోస్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. దాంతో ఈ చిత్రంలో రానా నటిస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ‘హను–మాన్’ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ‘జై హనుమాన్’ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.శ్రీరామ్ జై హనుమాన్ ‘శ్రీరామ్ జై హనుమాన్’ పేరిట రామాయణం నేపథ్యంలో ఓ కన్నడ చిత్రం రూపొందుతోంది. ‘‘ఇప్పటి వరకూ రామాయణం ఆధారంగా పలు చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల్లో చెప్పని కొత్త విషయాలను ఈ చిత్రంలో చెప్పనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘రామాయణం గురించి ఎవరికీ తెలియని అంశం’ అని అర్థం వచ్చే ట్యాగ్‌లైన్ ఈ చిత్రం పోస్టర్ మీద ఉంది. కాగా అయోధ్యలో శ్రీరాముడిప్రా ణ ప్రతిష్ఠ జరిగిన ముహూర్తానికి ఈ చిత్రం పోస్టర్‌ను రిలీజ్ చేశారు.అయితే నటీనటుల గురించి, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. అవధూత్ దర్శకత్వంలో కేఏ సురేష్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు... ఇంకా తెలుగులో ‘జర్నీ టు అయోధ్య’ అనే చిత్రం ప్రకటన వెలువడింది. ఇంకా రామాయణం నేపథ్యంలో మరికొన్ని చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. – డి.జి. భవాని -
Sri Rama Navami టెంపుల్ స్టైల్లో ప్రసాదాలు ఇలా చేసుకోండి!
అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ శ్రీరామ నవమి. ఈ రోజున శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం వేడుకలను ఉత్సాహంగా జరుపు కుంటారు. శ్రీరామనవమి అనగానే ముందుగా గుర్తొచ్చేవి చలిమిడి, వడపప్పు పానకం. వేడిని తగ్గించి, శరీరానికి చలువనిచ్చే ఆరోగ్యకరమైన వంటకాలతోపాటు, చక్కెర పొంగలి, పాయసం లాటివాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేక నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.మండువేసవిలో వచ్చే పండుగ శ్రీరామనవమి ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వలన శరీరంలో ఉండే ఖనిజాలు (పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం) చెమట రూపంలో బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. బెల్లం పానకం తాగడం వలన తిరిగి ఈ ఖనిజాలను పొందవచ్చు. ఎండ తాపాన్ని తట్టుకునే శక్తిని బెల్లంలో ఉండే ఇనుము ఇస్తుంది. అంతేకాదు, వేసవిలో తగ్గుతూ పెరుగుతూ ఉండే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. అలాగే పెసరపప్ప కూడా శరీరానికి చలువనిస్తుంది. చలిమిడి కావాల్సినవి: బియ్యం, బెల్లం, కొబ్బరి తురుము, యాలకులు, నెయ్యి తయారీ: నానబెట్టిన ఉంచుకున్న తడి బియ్యాన్ని వడగట్టుకుని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. బియ్యపిండిని ఒక గిన్నెలో తీసుకుని పచ్చికొబ్బరి తురుము, చక్కర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నెయ్యి, పాలు పోసి ముద్దలా కలపాలి. అంతే చలిమిడి రెడీ. వడపప్పు కావలసినవి: పెసరపప్పు – కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు– పదితయారి: పెసరపప్పును కడిగి పప్పు మునిగేటట్లు నీటిని పోసి నాననివ్వాలి. రెండు గంటల పాటు నానిన తర్వాత నీటిని వడపోసి కొబ్బరి పలుకులు కలపాలి. దేవుడికి నైవేద్యంగా పెట్టే వడపప్పును ఇలాగే చేయాలి. రుచికోసం నానిన పెసరపప్పులో అరకప్పు మామిడి తురుము, చిటికెడు ఉప్పు కలిపిపోపు పెట్టుకోవచ్చు.పానకంకావలసినవి: బెల్లం – 100 గ్రా, మిరియాలు – పది ( పొడి చేయాలి), ఏలకులు - ఆరు (పొడిచేయాలి)తయారి: బెల్లంలో ఒక గ్లాసు నీటినిపోసి కరగనివ్వాలి. ఒక గంట తర్వాత బెల్లం నీటిని పలుచని తెల్లని వస్త్రంతో వడపోయాలి. వడపోసిన బెల్లం నీటిలో మిరియాల పొడి, ఏలకుల పొడి కలిపితే పానకం రెడీ. చక్కెర పొంగలి కావలసినవి: బియ్యం -కప్పు, శనగపప్పు -గుప్పెడు, పాలు-మూడు కప్పులు, చక్కెర - ఒకటిన్నర కప్పు, ఏలకులు -పది, (పొడి చేయాలి), జీడిపప్పు, కిస్మిస్– ఒక్కొక్కటి పది, నెయ్యి-మూడు టీ స్పూన్లుతయారి: ముందుగా బాణలిలో నెయ్యివేసి, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన ఉంచాలి. బియ్యం, శనగ పప్పు కడిగి అందులో పాలుపోసి, జీడిపప్పు వేయించగా మిగిలిన నేతిని కూడా బియ్యం -పాలలో వేసి ప్రెషర్ కుకర్‌లో ఉడికించాలి. కుకర్‌లో ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి పాయసం మిశ్రమంలో చక్కెర, ఏలకుల పొడి వేసి, చక్కెర కరిగే వరకు కలిపి జీడిపప్పు, కిస్మిస్తో గార్నిష్ చేసి మూత పెట్టాలి. పది నిమిషాలకు అన్నానికి తీపి బాగా పట్టి రుచిగా ఉంటుంది. -
వేములవాడ ఆలయంలో వివాహం చేసుకున్న ట్రాన్స్ జెండర్స్, హిజ్రాలు (ఫొటోలు)
-
దర్గాలో సీతారామ కల్యాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని హజ్రత్ నాగుల్ మీరా మౌలా చాన్ దర్గా షరీఫ్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ దర్గాలో సీతారాములకు శాస్తోక్త్రంగా కల్యాణం జరిపించడమే కాదు ఆ మరుసటి రోజు కోదండ రాముడికి ఘనంగా పట్టాభిషేకం కూడా చేస్తారు. ఇల్లెందు పట్టణానికి చెందిన సత్యనారాయణ ఈ దర్గాకు మాలిక్‌గా ఉన్నారు. 1960వప్రాంతంలో నాగుల్‌మీరా ఆయన కు కలలో కనిపించి సత్యనారాయణపురం సమీపంలోని అడవుల్లో తాను ఉన్నానని చె΄్పారు. అప్పటి నుంచి ఈ గుట్టపై ఓ చెట్టు కింద పుట్టలో కొలువై ఉన్న నాగుల్‌మీరాను ఆయన పూజించడంప్రారంభించారు. కాలక్రమంలో ముస్లింలతో పాటు హిందువులు, క్రిస్టియన్లు ఈ దర్గాకు రావడం మొదలైంది. 1972 నాటికి ఈ అడవిలో దర్గా వెలిసింది. గడిచిన పాతికేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా వరంగల్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ నుంచి కులమతాలకు అతీతంగా ఇక్కడికి భక్తులు రావడం మొదలైంది. ఈ క్రమంలో 2008లో కొందరు భక్తులు తమిళనాడు నుంచి సీతారాముల పంచలోహ విగ్రహాలను దర్గా ఆవరణలో ప్రతిష్టించి పూజించడంప్రారంభించారు. దర్గా ఆవరణలో ఒకవైపు మహ్మదీయ సంప్రదాయ ప్రకారంప్రార్థనలు నిర్వహిస్తూనే మరోవైపు హిందూ సంప్రదాయంలో శ్రీరాముడికి పూజలు చేసే ఆనవాయితీ మొదలైంది.నవమి కల్యాణంశ్రీరామనవమి సందర్భంగా నాగుల్‌మీరా దర్గా ఆవరణ లో తొలిసారిగా 2013లో శ్రీరాముడికి కల్యాణం, ఆ మరుసటి రోజు పట్టాభిషేకం జరిపించారు. వేదపండితులు శాస్తోక్త్రంగా ఈ వేడకలు నిర్వహించగా భక్తులు కులమతాలకు అతీతంగా ఈ వేడుకలను కనులారా వీక్షించారు. హిందూ – ముస్లిం భాయి భాయి అనే స్ఫూర్తికి మరోసారిప్రాణప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి ప్రతి నవమికి ఇక్కడ కల్యాణం, పట్టాభిషేక వేడుకలను కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. పట్టాభిషేకం ప్రత్యేకంశ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆలయాల్లో శ్రీరాముడి కల్యాణం జరిపిస్తారు. అంతటితో వేడుకలు ముగిస్తారు. భద్రాచలం తరహాలోనే సత్యనారాయణపురం దర్గాలో కూడా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని తొమ్మిది మంది వేదపండితులు శాస్తోక్త్రంగా జరిపిస్తూ శ్రీరాముడికి కిరీటధారణ చేస్తారు.దమ్మక్క వారసుల తలంబ్రాలుపోకల దమ్మక్క అనే గిరిజన మహిళ తొలిసారిగా భద్రాచలంలో సీతారాములకు పూజాదికాలు నిర్వహించింది. భద్రాద్రి రాముడికి తొలిసారిగా పూజలు అందించిన పోకల దమ్మక్క వారసుల్లో కొందరు నవమి సందర్భంగా దర్గాలో జరిగే కల్యాణ తంతుకు తొలి తలంబ్రాలు పంపిస్తారు. అదే విధంగా సత్యనారాయణపురం గ్రామంలోని రామాలయంలో జరిగే శ్రీరాముడి కల్యాణానికి దర్గా నుంచి ముత్యాల తలంబ్రాలు పంపే విధానం కూడా మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో ఈ ఆలయప్రాంగణంలో శ్రీరాముడికి గుడిని నిర్మించాలని సంకల్పించారు. ఈ దర్గాప్రాంగణంలోనే చర్చి, మసీదు, గురుద్వారాలను కూడా నిర్మిస్తామని భవిష్యత్తులో సకల మతాల సమ్మేళనానికి ఈ దర్గాను వేదికగా మారుస్తామని ఇక్కడి భక్తులు అంటున్నారు.– సూరం శ్రావణ్‌రెడ్డి, సాక్షి, ఇల్లెందు రూరల్ -
భద్రాద్రి రామా.. కనవేమి ఈ కష్టాలు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా ఘనతకెక్కిన భద్రాచలంలో రాములోరి భక్తులకు సీతమ్మ కష్టాలు తప్పటం లేదు. శతాబ్దాలుగా పెద్దగా అభివృద్ధికి నోచుకోకపోవటంతో ప్రధాన ఉత్సవాల సమయంలో తరలివచ్చే లక్షల మంది భక్తులకు మౌలిక వసతులలేమి తీవ్ర సమస్యగా మారుతోంది. శ్రీరామ నవమి వంటి ఉత్సవాల సమయంలో సామాన్య భక్తులకు కనీసం తలదాచుకొనేందుకు చోటు లేక గోదావరి ఇసుక తిన్నెలు, కరకట్ట వెంట సేద తీరాల్సి వస్తోంది. 17వ శతాబ్దంలో కుతుబ్‌షాహీల కాలంలో భద్రగిరిపై కంచర్ల గోపన్న నిర్మించిన ఆలయం ప్రధాన గోపురానికి కొద్దిపాటి మార్పులు తప్ప పూర్తిస్థాయిలో దేవస్థానాన్ని ఆధునీకరించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక యాదగిరిగుట్ట ఆలయంతో పాటు భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించింది. ప్రముఖ అర్కిటెక్ట్ ఆనందసాయి ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లాన్ సైతం సిద్ధం చేశారు. కానీ, అభివృద్ధి పనుల శంకుస్థాపనకు కూడా నోచుకోలేదు. అదే సమయంలో యాదగిరిగుట్ట ఆలయ పునఃనిర్మాణం మాత్రం పూర్తయింది. మాస్టర్‌ప్లాన్‌లో మళ్లీ కదలిక పదేళ్లుగా మూలన పడిన మాస్టర్ ప్లాన్‌ను కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీ మేరకు మళ్లీ బయటికి తీసింది. ఈ నెల 6న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పట్టువ్రస్తాలు సమర్పించడానికి సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధిలో ప్రధానమైన మాడ వీధుల విస్తరణకు భూ, ఇళ్ల నిర్వాసితుల పరిహారం కోసం ప్రభుత్వం రూ.34 కోట్లు విడుదల చేసింది. ఈ అభివృద్ధి పనులకు 6న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశముంది. మాస్టర్‌ప్లాన్‌లో ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు సౌకర్యాలు, మౌలిక వసతులకు చోటు కల్పించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. వసతులు కల్పిస్తే మరింత ఆదరణ ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేస్తే భద్రాచలంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయి. భద్రాచలంలో ఏటా ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వీటికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతోపాటు భద్రాచలం ఏజెన్సీలో ప్రకృతి అందాల వీక్షణకు పర్యాటకులు వస్తున్నారు. కానీ, సరిపడా వసతులు లేక వారు ఇబ్బందులు పడుతున్నా రు.ఉత్సవాల సమయంలో భద్రాచలంలోని వసతి గదులు ముప్పావు భాగం విధుల కోసం వచ్చే సిబ్బందికే సరిపోతా యి. కాటేజీలు దాతలకు, వీఐపీలకే పరిమితం. దీంతో రెండురోజుల వసతి కోసం ప్రైవేటు లో రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వెచ్చించలే ని సామాన్య భక్తులు గోదావరి ఇసుక తిన్నెలు, కరకట్ట ప్రాంతాల్లో సేద తీరుతున్నారు. ప్రధాన ఆలయం, గోదావరి, ఉపాలయాలను కలిపి స్పెషల్ కారిడార్ రూపొందిస్తే భక్తులు, పర్యాటకుల రాక పెరుగుతుందని స్థానికులు అంటున్నారు. ‘భద్రాచలం టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ స్పెషల్ అథారిటీ’ని ప్రకటించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. 1964లో సీతారాముల కల్యాణం కోసం నిర్మించిన మిథిలా స్టేడియం నేడు సరిపోవటంలేదు. ఈ స్టేడియాన్ని పునఃనిర్మించి, గోదావరి నుంచి మోతెగడ్డ ద్వీపంలోని శివాలయానికి బోటింగ్ సౌకర్యం కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అలాగే, పర్ణశాల ఆలయ అభివృద్ధిపైనా దృష్టి సారించాలని, కరకట్టపై సోలార్ షెడ్ నిర్మిస్తే భక్తులకు నీడతో పాటుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని సూచిస్తున్నారు. శ్రీరామ నవమికి పటిష్ట భద్రత క్యూఆర్ కోడ్‌తో భద్రగిరి సమస్త సమాచారం భద్రాచలం అర్బన్/కొత్తగూడెంటౌన్: భద్రాచలంలో ఈనెల 6న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు 200 మంది సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు వెల్లడించారు. ఈనెల 6న శ్రీసీతారాముల కల్యాణం, 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో భక్తుల భద్రత కోసం పోలీసు శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పార్కింగ్ స్థలాలు, ఆలయం, కల్యాణ మండపం, లడ్డూ, తలంబ్రాల కౌంటర్లను చేరుకోవడంతో పాటు తాగునీటి వసతి ఎక్కడ ఉందో సులువుగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ రూపొందించామని వెల్లడించారు. అంతేకాక ఆన్లైన్ లింక్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. వీటి ద్వారా భక్తులు సులభంగా తమకు అవసరమైన ప్రాంతాలకు చేరుకోవచ్చని చెప్పారు. రెండు రోజులపాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విధించే ఆంక్షలకు భద్రాచలం పట్టణవాసులు సహకరించాలని ఎస్పీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. -
వేములవాడలో ట్రాన్స్ జెండర్స్ వివాహం.. ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం (ఫొటోలు)
-
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర (ఫొటోలు)
-
Sri Ramanavami Asthanam: తిరుమల : కమనీయం.. శ్రీ సీతారాముల కల్యాణం (ఫొటోలు)
-
Bhadrachalam Sri Rama Navami: భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు (ఫొటోలు)
-
అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు..(ఫొటోలు)
-
తిరుపతిలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు..
-
ముస్తాబైన భద్రాచలం
-
భద్రగిరికి కళ్యాణ శోభ.. ఎదుర్కోలు వేడుకలో సీతా, రాముడు (ఫొటోలు)
-
రాముడి చిత్రమ్.. వెండితెర పైనా రామ నామం
అంతా రామమయం... ఈ జగమంతా రామమయం... ఈరోజు దాదాపు ఎక్కడ చూసినా రామ నామమే. వెండితెర పైనా రామ నామం వినపడబోతోంది. రాముడిపై ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. త్వరలో కొన్ని చిత్రాలు రానున్నాయి. ఈ శ్రీరామ నవమి సందర్భంగా ఆ శ్రీరాముడి చిత్రాల గురించి తెలుసుకుందాం. ► 1980లలో రాముడంటే బుల్లితెర వీక్షకులు చెప్పిన పేరు అరుణ్ గోవిల్. ‘రామాయణ్’ సీరియల్లో రాముడిగా అంత అద్భుతంగా ఒదిగిపోయారాయన. ఇప్పటికీ రాముడంటే చాలామంది అరుణ్∙పేరే చెబుతారు. రాముడి కథాంశంతో ఇటీవల విడుదలైన ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’లో ఆయన నటించారు. ‘‘ఒక కాలాతీత కథలో మళ్లీ నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. మన సాంస్కృతిక వారసత్వం’’ అని పేర్కొన్నారు అరుణ్ గోవిల్. రామ జన్మభూమిపై రజనీష్ బెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరిలో విడుదలైంది. ► రాముడు ఆజానుబాహుడు.. అందగాడు... వీరం, కరుణ, ప్రేమ... ఇలా సకల గుణాలూ ఉన్నవాడు. ఎన్ని ఉన్నా అసలు రాముడంటే సౌమ్యంగా కనిపించాలి. రణ్‌బీర్ కపూర్ దాదాపు అలానే ఉంటారు. అందుకే దర్శకుడు నితీష్ తివారీ తన ‘రామాయణ్’ చిత్రానికి రాముడిగా రణ్‌బీర్ కపూర్‌ని ఎన్నుకున్నారు. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న సాయి పల్లవిని సీత పాత్రకు ఎంపిక చేసుకున్నారు. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ చిత్రం షూట్ంగ్ ఈ మధ్యే ముంబైలో ఆరంభించారు. ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా ఓ నిర్మాత కాగా ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ మరో నిర్మాత. ఈ చిత్రంలో రావణుడి పాత్రను కూడా యశ్ చేస్తారట. నేడు ఈ చిత్రం గురించి ఆధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ్’ రిలీజవుతుందని సమాచారం. ► ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ వస్తున్న కంగనా రనౌత్‌ది కథానాయికల్లో సెపరేట్ రూట్. స్వతహాగా రాముడి భక్తురాలైన కంగనా ఇప్పటికే రామ మందిరం నేపథ్యంలో ‘అపరాజిత అయోధ్య’ చిత్రాన్ని, ‘సీత: ది ఇన్కార్నేషన్’ చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇవి పట్టాలెక్క లేదు. గత ఏడాది తన ‘తేజస్’ చిత్రం విడుదల సందర్భంగా అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని సందర్శించారు కంగనా రనౌత్. ఆ సమయంలో అయోధ్యపై తాను కథ సిద్ధం చేశానని పేర్కొన్నారామె. ‘‘ఇది ఆరువందల ఏళ్ల పోరాటం. ఇప్పుడు రామ మందిరం సాధ్యమైంది. అయోధ్యపై కథ రాయడానికి నేను చాలా పరిశోధించాను’’ అని కూడా చెప్పారు కంగనా రనౌత్. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియజేయలేదు. ► తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హను మాన్’ గడచిన సంక్రాంతికి విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి రెండో భాగంగా ‘జై హనుమాన్’ రానుంది. ‘జై హనుమాన్’ కథ రాయడానికి ఓ పాన్ ఇండియా స్టార్ స్ఫూర్తి అన్నట్లుగా ప్రశాంత్ వర్మ ఓ సందర్భంలో పేర్కొన్నారు. రెండో భాగం ప్రధానంగా హనుమంతుడి నేపథ్యంలో సాగుతుందని టాక్. వార్తల్లో ఉన్న ప్రకారం హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తారట. ‘హను మాన్’ చిత్రం చూసి, ప్రశాంత్ వర్మకు రణ్వీర్ ఫ్యాన్ అయ్యారని సమాచారం. ఇటీవల ఈ ఇద్దరి మధ్య ‘జై హనుమాన్’ గురించి చర్చలు జరిగాయని, రణ్‌వీర్‌కు స్క్రిప్ట్ కూడా నచ్చిందని భోగట్టా. కాగా.. ప్రశాంత్–రణ్వీర్ కాంబినేషన్లో రూపొందనున్నది ‘జై హనుమాన్’ కాదు.. వేరే చిత్రం అనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ తెరకెక్కించడం ఖాయం. ఈ చిత్రం నటీనటుల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇవే కాదు.. రాముడిపై ఇటు దక్షిణాది అటు ఉత్తరాదిన మరిన్ని చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు శ్రీ సీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే, రామ నవమి సందర్భంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్రకు నేడు విరామం ఇచ్చారు. తిరిగి రేపు(గురువారం) బస్సుయాత్ర షెడ్యూల్ ప్రకారం ప్రారంభమవుతుంది. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్..‘తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపిస్తారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు’ తెలిపారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి… — YS Jagan Mohan Reddy (@ysjagan) April 17, 2024 -
Sri Rama Navami 2024: వెండితెర శ్రీరామచంద్రులు వీరే
శ్రీరాముడితో తెలుగు తెరకు మంచి అనుబంధమే ఉంది. ఇప్పటికే రాముడు, రామాయణంపై పదుల సంఖ్యల్లో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ మొదలు ప్రభాస్ వరకు పలువురు స్టార్ హీరోలు రాముడి పాత్రలు పోషించి మెప్పించారు. రేపు(ఏప్రిల్ 17) శ్రీరామనమవి. ఈ సందర్భంగా రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలు, రాముడిగా మెప్పించిన హీరోలపై ఓ లుక్కేయండి. ♦తొలిసారి టాలీవుడ్ తెరపై రాముడి పాత్ర పోషించింది యడవల్లి సూర్య నారాయణ. ‘పాదుకా పట్టాభిషేకం’సినిమాలో సూర్యనారాయణ రాముడిగా నటించాడు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1932లో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో వచ్చిన రెండో టాకీ మూవీ ఇది. ఇదే టైటిల్‌తో 1945లో మరో సినిమా తెరకెక్కింది. ఇందులో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు రాముడిగా నటించి మెప్పించారు ♦ ఆ తర్వాత 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాలో ఏఎన్నార్ శ్రీరాముడి పాత్ర పోషించి ప్రేక్షకుల మనసును దోసుకున్నాడు. ♦ శ్రీరాముడు పాత్రను ఎంతమంది పోషించినా.. అందరికి గుర్తిండేది మాత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. వెండితెర రాముడు అనగానే అందరికి గుర్తొచ్చే రూపం ఎన్టీఆర్. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంతో తొలిసారి రాముడు గెటప్‌లో కనిపించాడు ఎన్టీఆర్. ఆత ర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్దం సినిమాల్లో కూడా రాముడిగా కనిపించి మెప్పించాడు. ♦ఎన్టీఆర్ రాముడిగా నటించడమే కాదు.. రామాయణం నేపథ్యంతో వచ్చిన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకుడిగా ‘శ్రీరామ కల్యాణం’, శ్రీరామ పట్టాభిషేకం సినిమాలు చేశాడు. శ్రీరామ పట్టాభిషేకంలో ఆయనే శ్రీరాముడి పాత్రలో కనిపిస్తే.. సీతారామ కల్యాణంలో మాత్రం హరనాథ్ రాముడి గెటప్ వేశాడు. ♦ 1968లో వచ్చిన ‘వీరాంజనేయ’ సినిమాలో కాంతారావు రాముడిగా కనిపించాడు. 1976లో దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సీతా కల్యాణం’లో రవికుమార్ రాముడిగా నటించి ఆకట్టుకున్నాడు. ♦ టాలీవుడ్ సొగ్గాడు శోభన్ బాబు కూడా రాముడి గెటప్‌లో ఆకట్టుకున్నాడు. బాపు దర్శకత్వంలోనే 1971లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో టాలీవుడ్ సోగ్గాడు శోభన్‌బాబు రాముడి పాత్రలో నటించి మెప్పించారు. ♦ 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’లో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించాడు. ఈ చిత్రం నేషనల్ అవార్డుని కూడా అందుకోవడం విశేషం. ♦ నాగార్జున నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమాలో సుమన్ రాముడిగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ♦ కోడిరామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్లు’ సినిమాలో ఒక పాటలో శ్రీకాంత్ కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు. ♦ నందమూరి బాలకృష్ణ సైతంగా రాముడిగా నటించి మెప్పించాడు. బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రను పోషించాడు. 2011లో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతాగా నటించింది. ♦శ్రీరామ రాజ్యం తర్వాత చాలా కాలంపాటు రామాయణం, రాముడి నేపథ్యంలో సినిమాలు రాలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రామాయణం నేపథ్యంలో వచ్చిన ‘ఆదిపురుష్’చిత్రంలో ప్రభాస్ రాముడిగా మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు.ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు.