
రేపటి నుంచి రాష్ట్ర స్థాయినాటకోత్సవాలు
మద్దిలపాలెం(విశాఖ): విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, కళాభారతి ఆధ్వర్యంలో ఏటా జరిపే రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలను ఈ నెల 12 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు వీఎండీఏ ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఎంఎస్‌ఎన్ రాజు, డాక్టర్ గుమ్మూలూరి రాంబాబులు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కళాభారతి ఆడిటోరియంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి పైడి కౌశిక్ నాటకోత్సవాలు పేరిట ఐదు రోజులపాటు ప్రదర్శనలు ఉంటాయన్నారు. 28 ఎంట్రీల్లో 9 నాటకాలను ఎంపిక చేశామన్నారు. పైడా కృష్ణ్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ నాటకోత్సవాలకు మహారాజపోషకులుగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. నాటకోత్సవాలకు ప్రవేశం ఉచితమన్నారు. కార్యక్రమంలో న్యాయనిర్ణేత బాబీవర్ధన్, జగత్ రావు, నాంచారయ్యలతో పాటు ఇతర కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.