
మన్యంలో భారీ వర్షం
సాక్షి, పాడేరు: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 7 గంటల నుంచి పాడేరు ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వర్షంతో పాడేరు పట్టణంలో రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో పలు చోట్ల పిడుగులు పడడంతో ముందస్తుగానే పాడేరు ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వర్షం తగ్గిన తరువాత పునరుద్ధరించారు.
ముంచంగిపుట్టులో పిడుగు పాటు
ముంచంగిపుట్టు: పనసపుట్టు పంచాయతీ కడుతుల గ్రామంలో భారీ వర్షం పడిండి. ఓ కొబ్బరి చెట్టుపై పిడు గు పడింది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. విద్యుత్ సరఫరాకు కూడా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది.