
గిడ్డంగుల లావాదేవీల్లో వృద్ధి.. సరఫరాలో క్షీణత
2025 క్యూ1లో 3 లక్షల చ.అ. స్థలం లీజుకు
ఇదే కాలంలో సరఫరా 2 లక్షల చ.అ.లే
50 శాతం పెరిగిన లీజులు, 67 శాతం తగ్గిన సప్లయి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పారిశ్రామిక గిడ్డంగుల(వేర్‌హౌస్) విపణిలో భిన్న వాతావరణం ఏర్పడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో నగరంలో 3 లక్షలు చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 2 లక్షల లావాదేవీలతో పోలిస్తే ఇది 50 శాతం అధికం.
ఇక, 2025 క్యూ1లో నగరంలో కొత్తగా 2 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం సరఫరా అయ్యింది. గతేడాది ఇదే కాలంలో సరఫరా అయిన 6 లక్షల చ.అ.లతో పోలిస్తే ఇది 67 శాతం తక్కువ.

ఈ ఏడాది క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగుల స్థల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 78 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఎక్కువగా ఇంజినీరింగ్ కంపెనీలు 25 శాతం, ఈ–కామర్స్ సంస్థలు 21 శాతం స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. అలాగే ఈ క్యూ1లో కొత్తగా 94 లక్షల చ.అ. స్పేస్ సరఫరా అయింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ.