
సోషల్ మీడియాలో పుణ్యమా అని క్షణాల్లో వైరల్ అయిపోతున్నారు. సరైన సామర్థ్యం ఉండాలేగానే డిజిటల్ మాద్యమంతో అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. డిజిటల్ ఎరా పవర్ అలాంటిది మరి. కన్నుమూసి తెరిచే లోపే వైరల్ కంటెంట్‌తో సోషల్ మీడియా సూపర్‌స్టార్లుగా మారిపోతున్నారు. చెన్నైసూపర్ కింగ్స్ వీరాభభిమాని 19 ఏళ్ల అమ్మాయి ఆర్యప్రియ భుయాన్ విషయంలో కూడా అదే జరిగింది. సీఎస్‌కే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ (IPL) మ్యాచ్ (RR vs CSK) లో ఈ అమ్మడి హావభావాలు, ఆమె రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని అవుట్‌కు ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. దెబ్బకి ఈ ఐపీఎల్ పాపులర్ గర్ల్ రాత్రికి రాత్రే లక్షల ఫాలోయర్లను సంపాదించుకుని సంచలనంగా మారింది. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
ఆర్యప్రియ తన హావభావాలతో మిలియన్లకొద్దీ అభిమానులను సంపాదించుంది. కొన్ని సెకన్ల క్లిప్‌తో సూపర్ వైరల్ అయిన ఐపీఎల్ అమ్మాయి ఎవరు? ఆర్యప్రియ భుయాన్ (Aaryapriya Bhuyan) గౌహతికి చెందిన 19 ఏళ్ల టీనేజర్. మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని. ఆర్యప్రియ సోదరి ఆమెను 9-10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సీఎస్‌కే, ధోనిని పరిచయం చేసింది. అంతే అప్పటినుంచి సీఎస్‌కే అన్నా, మన మిస్టర్ కూల్ అన్నా పిచ్చి అభిమానం అట.
చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో

ధోనీ ఔట్ : ఏం జరిగిందంటే?
చెన్నై-రాజస్థాన్ మ్యాచ్‌లో చెన్నై మాజీ కెప్టెన్ ధోనీ కొట్టిన షాట్ ను లాంగ్ఆన్ లో ఫీల్డర్ అద్భుతంగా క్యాచ్ చేశాడు. చెన్నై గెలుపునకు కీలకమైన సమయంలో ధోనీ ఔట్ కావడంతో అభిమానులను నిరాశపర్చింది. ఈక్రమంలో స్టేడియంలోని ఆర్యప్రియ కూడా నిర్ఘాంతపోయింది. ‘అరె ఏంట్రా ఇది’ అన్నట్టు ఫీలింగ్స్ ఇచ్చింది. క్యాచ్ పట్టుకున్న క్రికెటర్‌ని చంపేద్దామన్నంత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఈ మేరకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కె మ్యాచ్ సమయంలో తనను టీవీలో చూపించారని ఆర్యప్రియకు తెలియదు కానీ వైరల్ ఐపీఎల్ గర్ల్ అభిమానులు అమాంతం పెరిగారు. అప్పటివరకు 800 ఉన్న ఫాలోవర్ల సంఖ్య 1.72K లక్షలకు పెరిగింది. కొందరు ఈ వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేశారు. మరికొందరు క్రష్ అంటూ కమెంట్ చేశారు. వైరల్ వీడియోతో ఆమె సోషల్ మీడియా స్టార్‌గా, 'మీమ్ గర్ల్'గా మారిపోయింది.
#IPL cameramen supremacy 🤩🤩#Dhoni Fan Girl reaction when #dhoni got out 🥲
Chooo cute 🥰🥰🥰#CSKvsRR #RRvCSK #IPL2025 #IPL #IPLOnJioStar pic.twitter.com/7hbhMkh7hr— 𝑅𝒶𝓃𝓃𝒱𝒥💫 (@Rannvijju) March 31, 2025
ఆర్యప్రియ ఏమందంటే..
తాను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేనని, కొన్ని వందల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని, అప్పుడపుడు జస్ట్ ట్రావెల్ ఫోటోలు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎంఎస్ ధోని వికెట్‌పై తన స్పందనను చూపించే ఆమె వీడియో వైరల్ అయిన తర్వాత రాత్రికి రాత్రే లక్షలకు పెరిగిందని నేషనల్ మీడియాతో చెప్పింది. ధోని అవుట్ అవుతాడని అస్సలు ఊహించలేదు... ధోని క్యాచ్ అవుట్ అవ్వగానే షాక్ అయ్యా..అందుకే అలాంటి రియాక్షన్ వచ్చింది. ఇది యాదృచ్చికంగా వచ్చింది అంతే అది వైరల్ అయిందని ఆర్యప్రియ పేర్కొంది. ప్రస్తుతానికి దీనిపై తాను, తన కుటుంబం సంతోషంగా ఉన్నామని తెలిపింది.
