
ఉగ్ర దాడి మృతులకు ఉపాధ్యాయుల నివాళి
విద్యానగర్(కరీంనగర్): కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి గురువారం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాలి అర్పించారు. కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజిరెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చకినాల రామ్మోహన్, యూటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్టీయూ, టీపీటీఎఫ్, పీఆర్టీయూటీజీ, ఎస్సీ, ఎస్టీ సంఘం, ఎస్జీటీయూ సంఘాల బాధ్యులు ముల్కల కుమార్, ఎస్.రవీంద్రచారి, పీఆర్ శ్రీనివాస్, మర్రి జైపాల్‌రెడ్డి, అర్కాల శ్రీనివాస్, జె.రాంచంద్రారెడ్డి, గోనె శ్రీనివాస్, నాగరాజు, మీసాల మల్లిక్, కె.మహిపాల్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, బి.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.