
వీరివీరి గుమ్మడి పండు..
ఒకప్పుడు గ్రామాల్లో సందడి చేసిన ఆటలు కనుమరుగవుతున్నాయి. కాలం మారింది.. బాల్యం ఇంటర్‘నెట్’లో చిక్కుకుంది. ఉదయం లేచింది మొదలు చేతిలో సెల్‌ఫోన్ల సందడే. ఆన్‌లైన్ గేమ్స్.. రీల్స్.. షార్ట్స్.. ఫేస్‌బుక్.. షేర్‌చాట్.. స్నాప్‌చాట్.. ఇలా చెప్పుకుంటూ పోతే శారీరక శ్రమ లేని అనేక అంశాలతో కాలం గడిచిపోతోంది. చిన్న వయసులోనే పనికి రాని వాటికి బానిసవుతూ భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్నారు. ఒకప్పుడు ఆనందం.. ఆహ్లాదం.. విజ్ఞానం పంచిన ఆటలు ఇప్పుడు మచ్చుకై నా కనిపించడం లేదు. పట్నంలో ఎప్పుడో మాయమయ్యాయి.. గ్రామాలకు దూరమయ్యాయి. సెలవులు ప్రారంభమయ్యాయి.. అక్కడక్కడ పిల్లలు కొన్ని ఆటలు ఆడుతుండగా.. ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్స్
పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల
టగ్ ఆఫ్ వార్: టగ్ ఆఫ్ వార్.. మనిషి శారీకర శక్తిని తెలియపరిచే ఆట. కొంతమంది రెండు గ్రూపులుగా విడిపోయి.. ఇలా బలాబలాలను ప్రదర్శిస్తుంటారు. జూలపల్లి మండలం వడ్కాపూర్‌లో కొంతమంది చిన్నారులు ఇలా టగ్ ఆఫ్ వార్ ఆడుతూ కనిపించారు.
● పల్లీ: ఈ ఆట ఏకాగ్రతను పెంచుతుంది. చురుకుదనం ఉంటుంది. పెద్దపల్లిలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో చిన్నారులు పల్లీ ఆడుతూ కనిపించారు.

వీరివీరి గుమ్మడి పండు..

వీరివీరి గుమ్మడి పండు..