
నందుల పంట పండించిన కళాకారులు
కర్నూలు లలిత కళా సమితి, నంద్యాల కళారాధన సంస్థలు కొత్త తరహాలో నాటకాలను రూపొందించి ప్రదర్శిస్తూ నంది పురస్కారాలను కై వసం చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు రెండు సంస్థలు సుమారు 45 దాకా నంది పురస్కారాలు వరించి ఉంటాయి. ఇందులో 20 దాకా బంగారు నంది పురస్కారాలు ఉండటం విశేషం. లలిత కళా సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ముఠా కక్షలపై పులిస్వారి నాటకం 130 ప్రదర్శనలు ఇచ్చి సంచలనం సృష్టించింది. ఇదే సంస్థ అత్యధికంగా 38 నంది అవార్డులు సాధించింది. జిల్లా కళాకారులు అత్యుత్తమ నటనా ప్రతిభతో నంది అవార్డులతో పాటు జాతీయ స్థాయి గరుడ, కందుకూరి పురస్కారాలు కై వసం చేసుకున్నారు.