
అన్న కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కోసం తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎప్పుడూ అండగా ఉంటాడు. కల్యాణ్ రామ్ నటించిన పలు సినిమాల ఈవెంట్లకు తారక్ స్పెషల్ గెస్టుగా వెళ్లాడు. తాజాగా మరోసారి అన్న కోసం తమ్ముడు కదిలాడు. కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ (Arjun S/o Vyjayanthi Pre Release Event) శనివారం (ఏప్రిల్ 12) జరిగింది. ఈ కార్యక్రమానికి తారక్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు.
విజయశాంతిని మాట్లాడనివ్వని ఫ్యాన్స్
అతడిని చూసిన అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. అరుపులు, కేకలతో కార్యక్రమం దద్దరిల్లేలా చేశారు. అయితే స్టేజీపై ఎవరు మాట్లాడుతున్నా తన గురించే కేకలు వేస్తుండటంతో తారక్‌కు కోపమొచ్చింది. విజయశాంతి మైకు పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్టీఆర్‌ను కీర్తిస్తూ అభిమానులు కేకలేశారు. సీఎం.. సీఎం.. అని నినదిస్తూ ఆమెను మాట్లాడనివ్వలేదు.
తారక్ ఆగ్రహం
ఒక్క నిమిషం సైలెంట్‌గా ఉంటే మాట్లాడతాను అని విజయశాంతి అభ్యర్థించినా అభిమానులు వినిపించుకోలేదు. దీంతో తారక్‌కు కోపమొచ్చింది. మౌనంగా ఉండకపోతే నేను స్టేజీపై నుంచి వెళ్లిపోతాను అంటూ సైగ చేశారు. దీంతో విజయశాంతి ఆయన్ను వెళ్లకుండా ఆపింది. మీ అభిమానుల ఉత్సాహం భయంకరంగా ఉంది. కట్రోల్ చేయలేకపోతున్నాం అంటూనే తన స్పీచ్ కొనసాగింది.

సినిమా
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. కల్యాణ్ రామ్‌కు జంటగా సాయి మంజ్రేకర్ నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.