
పూనమ్ కౌర్.. సామాజిక బాధ్యతతో వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని చాలా క్లియర్‌గా స్పందించే హీరోయిన్. అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరపై నర్మగర్భ ట్వీట్‌లు కూడా వేస్తుంటుంది. అయితే తాజాగా డైరెక్ట్‌గానే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పూనమ్ కౌర్ ట్వీట్ చేసిందంటే చాలు కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు కారణం కూడా ఉంది. కొందరి గురించి తాను నోరు విప్పితే వారికి పుట్టగతులు కూడా ఉండవ్ అనేలా రియాక్షన్ ఇచ్చింది. తాజాగా ఆమె మాటల రచయిత త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది.

ఏం జరిగింది..?
డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో జల్సా సినిమాలో బ్రహ్మానందంతో పవన్ కల్యాణ్ మాట్లుడుతున్న సీన్స్‌లో రేప్ డైలాగ్స్ రన్ అవుతాయ్. ఆ వీడియో చాలామంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పూనం కౌర్ ఇలా కామెంట్ చేసింది. 'త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది' అని తెలిపింది. అయితే, విజయ్ నగేష్ అనే ఒక నెటిజన్ రియాక్ట్ ఇలా అయ్యాడు 'మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి' అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.

జీవితాలను నాశనం చేస్తాడు: పూనమ్
పూనమ్ కౌర్‌కు ఉచిత సలహా ఇచ్చిన సదరు వ్యక్తికి కౌంటర్ కూడా ఇచ్చింది. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని కూడా తెలుసు. నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే.. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు. అని పూనమ్ మరోసారి ఫైర్ అయింది.
Dialouges written by trivikram- don’t expect anything worthwhile .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 8, 2024