
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. చివరగా 'ఖుషి' చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీ చేస్తోంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో రక్త్ బ్రహ్మాండ్ అనే ప్రాజెక్ట్‌లోనూ భాగమైంది. ఇవి కాకుండా శుభం అనే సినిమా నిర్మిస్తోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆమె నటీనటుల మధ్య పారితోషికం వ్యత్యాసంపై పెదవి విప్పింది.
రెమ్యునరేషన్ వ్యత్యాసాలు
సమంత మాట్లాడుతూ.. నేను చాలా సినిమాల్లో హీరోతో పాటు సమాన పనిదినాల్లో వర్క్ చేశాను. కానీ మాకిచ్చే రెమ్యునరేషన్ మాత్రం ఒకేలా ఉండేది కాదు. కొన్ని పెద్ద సినిమాల్లో హీరో పాత్ర కీలకంగా ఉంటుంది. పైగా తనే జనాల్ని థియేటర్‌కు రప్పించగలడు... అలాంటివాటిని నేను అర్థం చేసుకోగలను. అలాంటి సినిమాల్లో ఇద్దరి మధ్య బేధం చూపించినా నేను తప్పుపట్టను.
సమానత్వం కనిపించదు
కానీ కొన్ని చిత్రాల్లో హీరోహీరోయిన్‌కు ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. పారితోషికం దగ్గర మాత్రం ఆ సమానత్వం కనిపించదు. అదెందుకో ఇప్పటికీ అర్థం కాదు. నా విషయానికి వస్తే.. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో నేను చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇప్పుడు సడన్‌గా అన్నీ మార్చలేనేమో కానీ భవిష్యత్తు గురించి మాత్రం ఏదో ఒకటి చేయగలను. అయినా నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎక్కడైతే నిందలు, బాధలు పడ్డామో అక్కడే పరిష్కారం వెతుక్కోవాలి. నేను ఈ సిద్ధాంతాన్నే నమ్ముతాను అని సమంత చెప్పుకొచ్చింది.
చదవండి: కారులో బాంబు పెట్టి లేపేస్తాం.. సల్మాన్‌కు వార్నింగ్