
సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకం
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
మాడ్గులపల్లి : పేదలకు సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మక నిర్ణయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో జానకమ్మ ఇంట్లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, జిల్లా పౌరసరఫరాల ఇన్‌చార్జి అధికారి హరీష్‌కుమార్‌తో కలిసి ఆమె ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యంతో వండిన భోజనం చేసి మాట్లాడారు. సన్నబియ్యం ఇవ్వడంపై లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారన్నారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా, లోపాలు లేకుండా సన్న బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేస్తున్నామన్నారు. అంతకుముందు ఆమె పాములపాడు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, ఓపీ, ఇన్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు, మోటార్ను మంజూరు చేశారు. పీహెచ్‌సీకి ఎదురుగా ఉన్న పాడుబడిన భవనాన్ని వెంటనే తొలగించాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ తిరుమలస్వామి, వైద్యాధికారులు సత్యనారాయణ, సంజయ్, మాజీ జెడ్పీటీసీ పుల్లెంల సైదులు, గడ్డం పురుషోత్తంరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మునుగోటి యాదగిరి, నాగరాజు, యాదయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.