
సాక్షి,నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌కు దిగారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని సీనియర్లు వేధించారు. విద్యార్థిపై బెల్ట్‌తో ముగ్గురు సీనియర్ల దాడి చేశారు. అనంతరం బాధితుడి నుంచి ఫోన్ లాక్కున్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన బాధిత విద్యార్థి పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.