
తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారు. వాళ్లలో ఒకడు బెల్లంకొండ శ్రీనివాస్. పదేళ్లకు పైనే ఇండస్ట్రీలో ఉన్నాడు కానీ చెప్పుకోదగ్గ సినిమాలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. చివరగా 2023లో ఛత్రపతి చిత్రాని హిందీలో రీమేక్ చేసి ఘోరంగా ఫెయిలయ్యాడు.
(ఇదీ చదవండి: మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా)
దీంతో చాలా గ్యాప్ తీసుకుని ఒకేసారి నాలుగు సినిమాల్ని రెడీ చేస్తున్నాడు. అందులో 'భైరవం' త్వరలో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 'కిష్కిందపురి' అని మరో మూవీ ప్రకటించాడు. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.
పాడుబడ్డ పెద్ద భవంతి, అందులో హీరో అండ్ గ్యాంగ్ వెళ్తారు. తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే అంశాలతో ఈ 'కిష్కిందపురి' తీసినట్లు అనిపిస్తుంది. గతంలో బెల్లంకొండ హీరోతో 'రాక్షసుడు' సినిమాలో నటించిన అనుపమ.. ఇందులో హీరోయిన్.
(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)
తొలిసారి హారర్ జానర్ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ రాబోతున్నాడు. ఈ వర్షాకాలంలోనే మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. మరి ఈసారైనా బెల్లంకొండ హిట్ కొడతాడా?
ఈ గ్లింప్స్ చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చివర్లో హీరో... అహం మృత్యు అని చెప్పిన డైలాగ్, ఆ టైంలో కళ్లు దెయ్యం కళ్లలా ఉండటం చూస్తుంటే ఈసారి ప్రేక్షకుల్ని భయపెడతారనిపిస్తోంది. గతంలో అనుపమతో థ్రిల్లర్ మూవీ చేయగా.. ఇప్పుడు హారర్ చేశాడు శ్రీనివాస్.
(ఇదీ చదవండి: అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్)