
ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను మరో భాషలో తెరకెక్కించేందుకు ముందుకు వస్తారు మేకర్స్. అయితే అలా ఒక చోట విజయం సాధించిన సినిమా.. మరో చోట సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ప్రస్తుతం తమిళ హిట్ మూవీ ‘రాక్షసన్’ను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరణ్‌ను ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికయ్యారని టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో ఈ చిత్రంలో రకుల్‌ను తీసుకున్నట్లు వార్తలు రాగా.. ప్రస్తుతం అనుపమా లైన్లోకి వచ్చారు. వీటిలో ఏది నిజమో తెలియాలంటే.. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ‘వీర’ ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.