
సెలబ్రిటీలు అనగానే వాళ్లకేంటి లక్షలు, కోట్లు సంపాదిస్తుంటారు. మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు అని అనుకుంటాం. కానీ ఇది అందరి విషయంలో నిజం కాదు. ఎందుకంటే సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఒకామె ఇప్పుడు ఆన్ లైన్ లో బట్టలు అమ్ముకుంటోంది. ఒకప్పటి హీరోయిన్ కి ఈమె మరదలు కావడం కావడం విశేషం.
నటి చారు అసోప(Charu Asopa).. గతంలో పలు హిందీ సీరియల్స్ లో నటించింది. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ (Sushmita Sen) సోదరుడు రాజీవ్ సేన్ ని 2019లో పెళ్లి చేసుకుంది. 2021లో వీళ్లకు ఓ కూతురు కూడా పుట్టింది. ఏమైందో ఏమో గానీ వీళ్లు 2023లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు చారుకి కూడా నటిగా అవకాశాలు తగ్గాయి. దీంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
(ఇదీ చదవండి: పవన్ సినిమా.. చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా?)
పూర్తిగా నటన పక్కనబెట్టేసిన చారు.. కూతురితో కలిసి తన సొంతూరు రాజస్థాన్ లోని బికనీర్ వెళ్లిపోయింది. మరోవైపు ఈమె ఆన్ లైన్ లో బట్టలమ్ముతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
బట్టలు విక్రయించడంపై స్పందించిన చారు.. ముంబైలో నెలవారీ ఖర్చులు రూ.లక్ష-లక్షన్నర వరకు అవుతున్నాయి, దీన్ని భరించలేకపోతున్నానని అందుకే పుట్టింటికి వెళ్లిపోతున్నానని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)