
ఇంద్రారెడ్డి ఆశయసాధనకు కృషి
చేవెళ్ల: స్వర్గీయ హోంశాఖ మంత్రి పి.ఇంద్రారెడ్డి ఆయశ సాధనకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. ఇంద్రారెడ్డి 25వ వర్థంతి సందర్భంగా మండలంలోని కౌకుంట్లలో మంగళవారం ఆయన సమాధి వద్ద ఆమె కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, కళ్యాణ్‌రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి వారసురాలిగా రాజకీయంలోకి వచ్చి న తనకు 25 ఏళ్లుగా అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, అభివృద్ధి, ఈప్రాంత సమస్యల పరిష్కారమే ఇంద్రారెడ్డి ఆశయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, శుభప్రద్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు.
నంబర్‌వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని జీరో చేశారు
ఇంద్రారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న సబితారెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణను కేసీఆర్ నంబర్ వన్ స్థానంలోకి తీసుకెళ్లారని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జీరోస్థాయికి దిగజార్చారని మండిపడ్డారు. పరిస్థితి ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మళ్లీ కేసీఆర్, బీఆర్‌ఎస్ పాలన రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ నెల 27 వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి