
వక్ఫ్ బోర్డు ఒక మతానికి సంబంధించింది కాదు
మొయినాబాద్‌రూరల్: వక్ఫ్ బోర్డు ఒక మతానికి సంబంధించింది కాదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. హిమాయత్‌నగర్ చౌరస్తాలోని బీజేపీ కార్యాలయంలో గురువారం వక్ఫ్ చట్ట సవరణ సదస్సు 2025 పేరుతో వక్ఫ్ చట్టసవరణ జిల్లా కన్వీనర్ అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ అధ్యక్షతన వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వక్ఫ్ అనేది 90 శాతం అన్ని మతాలకు సంబంధించిందని స్పష్టం చేశారు. 2024 వక్ఫ్ బిల్లు పాసైందన్నారు. దాదాపు పది లక్షల ఎకరాల ఆర్థిక సంపద ఉన్నా 2024లో కేవలం రూ.168 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. వక్ఫ్ బోర్డుపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్, అంజన్‌కుమార్‌గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కార్యదర్శి కవిత డిమాండ్ చేశారు. మే నెలంతా ఒకేసారి సెలవులపై వెంటనే నిర్ణయం చేయాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో పోషణ పక్వాడ కార్యక్రమం సందర్భంగా మేనెలంతా సెలవులు ఇచ్చేలా పరిశీలిస్తున్నామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. 40 డిగ్రీల ఎండలు మండుతున్నప్పటికీ సెలవులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అనంతరం డీఆర్‌ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాగమణి, బాలమణి, జయమ్మ, జ్యోతి, సుధ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
నేడు భూ భారతిపై
అవగాహన సదస్సు
ఆమనగల్లు: పట్టణంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ లలిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పలువురు అధికారులు హాజరు కానున్నట్టు తెలిపారు.
పారే నీటిని ఒడిసిపట్టాలి
మంచాల: గ్రామీణ ప్రాంతాల్లో పారే వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని, భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత అన్నారు. మండలంలోని చిత్తాపూర్, తిప్పాయిగూడ గ్రామాల్లో గురువారం వాటర్‌షెడ్ పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. భూ గర్భజలాలను పెంచడమే వాటర్ షెడ్ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. అవసరమైన చోట చెక్‌డ్యాం నిర్మాణాలు, చెక్ వాల్స్, గల్లీ కంట్రోల్ పనులు, పారే నీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాటర్‌షెడ్ కమిటీల ద్వారా పనులు ప్రణాళికా బద్ధంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ రంగారావు, మండల ప్రత్యేకాధికారి సుజాత, ఎంపీడీఓ బాలశంకర్, ఎంపీఓ ఉమారాణి, ఏపీఓ వీరాంజనేయులు, వాటర్‌షెడ్ పీఓ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్ బోర్డు ఒక మతానికి సంబంధించింది కాదు

వక్ఫ్ బోర్డు ఒక మతానికి సంబంధించింది కాదు